గౌడ పరపతి సంఘం అధ్యక్షులుగా మాదారపు రాజ గౌడ్ ఏడవసారి ఎన్నిక
నేటిధాత్రి, వరంగల్.
వరంగల్ మట్టేవాడ
గౌడ పరపతి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా మాదారపు రాజ గౌడ్‌ను ఏడవసారి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అదేవిధంగా కార్యదర్శిగా బత్తిని రవీందర్ గౌడ్, కోశాధికారిగా మడిపెళ్లి సతీష్ గౌడ్, సహాయ కార్యదర్శిగా మోడెం సతీష్ గౌడ్, ఆర్గనైజర్‌గా గట్టు శివకుమార్ గౌడ్‌లు ఎన్నికయ్యారు.
కమిటీ సభ్యులుగా కట్కూరి నాగరాజు గౌడ్, నాగపురి రవీందర్ గౌడ్, గోడిశాల వెంకటేశ్వర్లు గౌడ్, నాగపురి సంతోష్ గౌడ్‌లను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మాదారపు రాజ గౌడ్ మాట్లాడుతూ, సంఘం అభివృద్ధి, గౌడ సమాజ సంక్షేమం కోసం అందరినీ కలుపుకుని ముందుకు సాగుతామని తెలిపారు. సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
