ఓటు హక్కు ప్రతిఒక్కరి బాధ్యత…

ఓటు హక్కు ప్రతిఒక్కరి బాధ్యత

ఓటు హక్కు వినియోగించిన దేవస్థాన మాజీ ఛైర్మెన్ గందే వెంకన్న

పరకాల,నేటిధాత్రి

బుధవారం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 17వార్డులో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 34వ బూత్ నంబర్లో గల తమ ఓట్లను పరకాల పట్టణ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మెన్ గందే వెంకటేశ్వర్లు తన కుటుంబంతో కలిసి వినియోగించుకున్నారు.ఉదయం నుంచే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన ఓటర్లతో కలిసి క్యూలో నిలబడి తన ఓటు వేశారు. అనంతరం మాట్లాడిన ఆయన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు తమ ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.17వ వార్డులో ఉదయం నుంచే ఓటర్ల రాకపోకలు కొనసాగాయి.యువత, మహిళలు,వృద్ధులు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సిబ్బంది శాంతియుతంగా పోలింగ్ నిర్వహించారని అన్నారు.

 ములుగులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందడి…..

 ములుగులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందడి..

#తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు!

ములుగు, నేటిధాత్రి:

 

 

జిల్లా కేంద్రమైన ములుగులో తొలి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
ఉదయం నుండే ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం నెలకొంది.

మహిళలు, వృద్ధులు మరియు యువ ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పోలీస్ యంత్రాంగం భారీ భద్రతను ఏర్పాటు చేసింది.
మొదటి మున్సిపల్ ఎన్నికలు కావడంతో స్థానిక ప్రజల్లో భారీగా ఆసక్తి నెలకొంది.

సిద్దిపేట మెడికల్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కీలక మలుపు…

సిద్దిపేట మెడికల్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కీలక మలుపు

◆-: ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చిన పోలీసులు డాక్టర్ ప్రణయ్ అరెస్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం సిద్దిపేట మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని లావణ్య ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. లావణ్య ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ ప్రణయ్ తేజ్ను సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో లావణ్య, ప్రణయ్ తేజ్ గత ఏడాది నుంచి ప్రేమ సంబంధం కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. అయితే పెళ్లి విషయానికి వచ్చేసరికి కులం వేరని సాకుతో ప్రణయ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ విషయం లావణ్యను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసిందని పోలీసులు పేర్కొన్నారు. పాయిజన్ ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్ రికార్డులు, చాట్ వివరాలను పరిశీలించి ప్రణయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వైద్య విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యంపై మరోసారి చర్చకు దారి తీసింది. కేసుపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని సిద్దిపేట పోలీసులు తెలిపారు.

33 వ వార్డులో పోలింగ్ స్టేషన్ మార్చాలి..

33 వ వార్డులో పోలింగ్ స్టేషన్ మార్చాలి
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో 33 వ వార్డు లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ బాలుర పాఠశాల లో పోలింగ్ బూతు ను మార్చ లని మాజీ మున్సిపల్ తిరుమల్ ఒక ప్రకటనలో తెలిపారు.
33 వ వార్డులో వృద్ధులకు వికలాంగులకు మహిళలకు ఓటర్లకు ఇబ్బందు లకు గురి అవుతూన్నారని అయన తెలిపారు 2014 లోమున్సిపల్ ఎన్నికల్లో గౌతమ్ మాడల్ హై స్కూల్ లో పోలింగ్ స్టేషన్ ఉన్నదనిబ్ ఎన్నికల అధికారులు పరిశీలించి వృద్ధులకు వికలాంగులకు ఓటర్లకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చామని తిరుమల్ తెలిపారు వినతిపత్రం ఇచ్చిన వారిలో దండు యాదగిరి పాల్గొన్నారని తెలిపారు

ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే అనుకుంటున్నా: ప్రశాంత్ కిశోర్…

ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే అనుకుంటున్నా: ప్రశాంత్ కిశోర్

 

బిహార్ ఎన్నికల్లో అవకతవకలు జరిగే ఉంటాయని తనకు అనిపిస్తోందని జన్ సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. తమ పార్టీకి క్షేత్రస్థాయిలో లభించిన మద్దతుకు, పోలింగ్ సరళికి పొంతన లేదని తెలిపారు.

ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని జన్ సురాజ్ పార్టీ బిహార్ ఎలక్షన్లలో కనీసం ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ ఆదివారం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే తాను నమ్ముతున్నట్టు చెప్పారు. అయితే, ఇందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం తన వద్ద లేవని అన్నారు జన్ సురాజ్ పార్టీ తొలిసారిగా ఈ ఎన్నికల్లో బరిలోకి దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసింది. కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఇది భారీ పరాజయమేనని ప్రశాంత్ కిశోర్ అంగీకరించారు. కానీ క్షేత్రస్థాయిలో తమ ప్రచారానికి మంచి స్పందన వచ్చిందని అన్నారు. ఓటింగ్ సరళికి, పాదయాత్ర సమయంలో తమ టీమ్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌‌కు తేడా ఉందని అన్నారు. కాబట్టి ఏదో జరిగే ఉంటుందని తాను నమ్ముతున్నట్టు వ్యాఖ్యానించారు.

‘ఏవో అదృశ్య శక్తులు ఈ ఎన్నికల్లో పని చేశాయి. ప్రజలకు పెద్దగా పరిచయం లేని పార్టీలకు కూడా లక్షల కొద్దీ ఓట్లు వచ్చాయి. ఈ విషయంలో నేను స్పందించాలని కొందరు కోరుతున్నారు. ఈవీఎమ్‌ల విషయంలో అవకతవకలు జరిగాయని అంటున్నారు. అయితే, ఓడినప్పుడు ఇలాంటి ఆరోపణలు సహజం. కానీ నా వద్ద ఇందుకు సంబంధించిన ఆధారాలు ఏవీ లేవు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం పొంతన కుదరట్లేదు. ఏదో తేడా ఉందని మాత్రం ప్రాథమికంగా అనిపిస్తోంది. కానీ అదేంటో మాకు ప్రస్తుతానికి తెలియదు’ అని ప్రశాంత్ కిశోర్ అన్నారు.

‘ఎన్నికల ప్రకటన నాటి నుంచీ పోలింగ్ రోజు వరకూ మహిళలకు రూ.10 వేలు అందాయి. మొత్తం రూ.2 లక్షలు ఇస్తామన్న హామీలు వెళ్లాయి. ఆ పది వేలు మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ అట. ఎన్డీయేకు, నితీశ్ కుమార్‌కు ఓటేస్తే మిగిలిన మొత్తం వస్తుందట. ఇంత మంది మహిళలకు డబ్బు పంచడాన్ని నేను బిహార్‌తో సహా దేశంలో ఎక్కడా చూడలేదు’ అని ప్రశాంత్ కిశోర్ అన్నారు. తాము ఓడిపోయి ఆర్‌జేడీ గెలిస్తే జంగల్ రాజ్ వస్తుందని కూడా కొందరు భయపడ్డారని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ఇది కూడా తమ ఓటమికి ఒక కారణమని అన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version