అభివృద్ధి పనులకు సర్పంచ్ అమరేశ్వరి శ్రీకారం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం, ఝారసంఘం మండలం, జీర్ణపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన అమరేశ్వరి శివమణి,గ్రామంలోని సమస్యలపై దృష్టి సారించారు. వార్డు సభ్యులతో కలిసి మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం మెరుగుపరచడంపై ఆమె ప్రత్యేక శ్రద్ధ వహించారు. మొదటగా వీధి దీపాలను ఏర్పాటు చేసి, పలు వార్డులలో సింగిల్ పీస్ మోటార్లను బిగించి, మురికి కాలువలు పారిశుద్ధ్య పనులను త్రాగు నీటి సమస్యలను పరిష్కారిస్తూ రోడ్డు పక్కన ఉన్న పనికిరాని చెట్లను పొదలను జెసిబి ద్వారా శుభ్రం చేసి పనులను ప్రారంభించారు. గ్రామ శుభ్రత నా లక్ష్యం అని అన్ని విధాలుగా గ్రామ ప్రజలకు సహకరిస్తానని గ్రామ సర్పంచ్ అమరేశ్వరి శివమణి అన్నారు,
