భవనం పైనుంచి పడిపోయిన పిల్లాడు.. క్యాచ్ పట్టుకున్న వ్యక్తి.. వీడియో వైరల్..
ఇంటి రెండో అంతస్తులో ఓ పిల్లాడు రెయిలింగ్ పట్టుకుని వేలాడుతున్నాడు. ఇలా చాలా సేపు రెయిలింగ్ పట్టుకున్న ఆ పిల్లాడు.. తర్వాత చేయి వదిలేశాడు. దీంతో నేరుగా కిందకు దూసుకొచ్చాడు. అయితే అదే సమయంలో ఓ వ్యక్తి కింద నడుస్తూ వెళ్తున్నారు. చివరకు ఏమైందో మీరే చూడండి..
కిందపడుతున్న పిల్లాడిని చేతులతో (Man Catch Falling Boy) పట్టుకున్నాడు. అప్పటికే ఆ పిల్లాడు నేలను తాకినా కూడా.. అతను చేతులు అడ్డుగా పెట్టడం వల్ల నేలకు బలంగా తాకలేదు. పిల్లాడిని కిందపడకుండా పట్టుకున్న ఆ వ్యక్తి.. తర్వాత బాలుడిని చేతుల్లోకి తీసుకున్నాడు. ఇంతలో ఓ మహిళ కొందరు వ్యక్తులు అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఇలా ఆ వ్యక్తి పిల్లాడిని ఎంతో చాకచక్యంగా రక్షించాడు. అయితే ఈ వీడియోపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇంకొందరు ఆ వ్యక్తి ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు ఇది ఏఐ క్రియేషన్‌లా ఉందని చెబుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పిల్లాడి పాలిట దేవుడిలా వచ్చి రక్షించాడు’.. అంటూ కొందరు, ‘ఇది ఏఐ వీడియో.. చూస్తుంటేనే అర్థమవుతోంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 730కి పైగా లైక్‌లు, 63 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
