ఏమ్మా.. ఇదెక్కడి డ్రైవింగ్.. బైక్ మీద స్పీడ్‌గా వెళ్తున్న అమ్మాయికి ఏం జరిగిందో చూడండి..

ఏమ్మా.. ఇదెక్కడి డ్రైవింగ్.. బైక్ మీద స్పీడ్‌గా వెళ్తున్న అమ్మాయికి ఏం జరిగిందో చూడండి..

 

అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా స్పీడ్ డ్రైవింగ్ విషయంలో ఏ మాత్రం తక్కువ కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది. ఆ వీడియోలో ఓ యువతి పల్లెటూరి రోడ్లపై అతి వేగంగా స్కూటీ నడిపి అందుకు తగ్గ మూల్యం చెల్లించింది.

అతి వేగం (Speed) అత్యంత ప్రమాదకరం అని అందరికీ తెలిసిందే. అయినా యువకులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. బిజీగా ఉన్న రోడ్డు మీద వెళ్లినా, సందుల్లో నడుపుతున్నా వేగాన్ని మాత్రం తగ్గించరు. అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా ఆ విషయంలో ఏ మాత్రం తక్కువ కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది. ఆ వీడియోలో ఓ యువతి (Girl) పల్లెటూరి రోడ్లపై అతి వేగంగా స్కూటీ (Scooty) నడిపి అందుకు తగ్గ మూల్యం చెల్లించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ యువతి ఓ గ్రామంలోని రోడ్లపై స్కూటీ మీద ప్రయాణం చేస్తోంది. ఆమె స్కూటీ మీద వెళ్తుండగా వెనుక బైక్ మీద వెళ్తున్న వ్యక్తులు వీడియో తీశారు. ఆ యువతి క్రమంగా తన స్కూటీ స్పీడ్ పెంచింది. గడ్డి పై నుంచి కూడా అంతే స్పీడ్‌గా వెళ్లింది. ఆ సమయంలో ఆమె స్కూటీ బ్యాలెన్స్ తప్పినా నిలదొక్కుకుంది. ఆ తర్వాత టర్నింగ్ వచ్చినపుడు మాత్రం ఆ స్పీడ్‌లో ఆమె నియంత్రించుకోలేకపోయింది. దీంతో బైక్‌తో సహా కింద పడిపోయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version