విద్యార్థులకు తల్లిదండ్రుల ప్రేమతో పాటు క్రమశిక్షణ అవసరం
భూపాలపల్లి నేటి ధాత్రి
https://youtu.be/rTUfmQNMqwg?si=xOj8JynoqGJa6sua
సింగరేణి హై స్కూల్‌లో తల్లిదండ్రుల సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ సి హెచ్ జాన్సీ రాణి అధ్యక్షత వహించారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.ప్రిన్సిపాల్ జాన్సీ రాణి మాట్లాడుతూ తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రవర్తన, చదువు పట్ల ఆసక్తి క్రమశిక్షణపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని వివరించారు.
“పిల్లలు పాఠశాలలో నేర్చుకున్న విషయాలను ఇంట్లో కూడా పునరావృతం చేసేలా ప్రోత్సహించలన్నారు . మొబైల్ ఫోన్ వినియోగాన్ని పరిమితం చేసి, టెలివిజన్ సోషల్ మీడియా వినియోగంపై తగిన నియంత్రణ వహించాలన్నారు . పిల్లలతో రోజూ కొంతసేపు మాట్లాడి, వారి సమస్యలు, అభిరుచులు తెలుసుకోవాల్న్నరు . తల్లిదండ్రుల ప్రేమతో పాటు క్రమశిక్షణ కూడా అవసరం, అని తెలిపారు. అలాగే విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, సమయపాలన పాఠశాల హాజరు విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
