కుక్కపిల్ల బైకర్‌ను రోడ్డు ప్రమాదానికి దారితీశింది..

కుక్క పిల్లే కదా అనుకుంటే ఎంత పని చేసింది.. బైకర్‌కు ఏమైందో చూడండి..

 

 

రోడ్డు పక్కన ఆగి ఉన్న బైకర్.. కాసేపటి తర్వాత బండి స్టార్ట్ చేసి ముందుకు కదిలాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ కుక్క పిల్ల బైకర్‌ను చూసి వెంటపడింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

వీధి కుక్కల వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వీటి బారిన పడుతుంటారు. తాజాగా, వీధి కుక్కల కేసు సుప్రీం కోర్టు వరకూ వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కుక్క పిల్ల కారణంగా ప్రమాదానికి గురైన బైకర్ వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న బైకర్.. కాసేపటి తర్వాత బండి స్టార్ట్ చేసి ముందుకు కదిలాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ కుక్క పిల్ల (Puppy Chasing the Biker) బైకర్‌ను చూసి వెంటపడింది. కరవకున్నా కూడా బండితో పాటే వేగంగా వెళ్తూ అతడిని తికమకపెట్టింది.

బైకర్ ఆ కుక్కపిల్లను చూస్తూ ముందుకు వెళ్లాడు. ఈ క్రమంలో బండి రోడ్డు పక్కకు దూసుకెళ్లి.. ఓ దుకాణాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో (biker fell down) ఆ బైకర్ ఎగిరి పక్కన పడిపోయాడు. హెల్మెట్ కూడా ఎగిరి దూరంగా పడిపోయింది. చూస్తుంటే ఈ ప్రమాదంలో అతడికి గాయాలైనట్లు తెలుస్తోంది. బైకర్ కిందపడిపోగానే ఆ కుక్క పిల్ల.. ‘వచ్చిన పని అయిపోయింది’.. అన్నట్లుగా మళ్లీ వెనక్కు పరుగెత్తుకుంటూ వచ్చింది. అయితే ఈ ప్రమాద తీవ్రత తక్కువగా ఉండడంతో ప్రాణాలతో బయటపట్టాడు.

ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అనుకున్న పని పూర్తి చేసిందిగా’.. అంటూ కొందరు, ‘ఈ కుక్క పిల్ల ఎంత పని చేసింది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, 67 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

తల్లిని అత్యాచారం చేసిన ఢిల్లీ వ్యక్తి అరెస్టు..

ఢిల్లీలో ఒక షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. 39 ఏళ్ల మద్ ఫిరోజ్, అలియాస్ సుహెల్, తన తల్లిని అత్యాచారం చేసిన ఆరోపణలతో అరెస్టు అయ్యాడు. తల్లి ఇటీవల సౌదీ అరేబియాకు యాత్ర చేసి తిరిగి వచ్చారు. అతను ఆమెను ఒక గదిలో లాక్ చేసి, చాకూ మరియు కత్తులతో కొట్టడం తో పాటు గత conduct కోసం శిక్షగా అత్యాచారం చేశాడని ఆరోపణ. భయంతో ఆమె మొదట పోలీసులు దగ్గరకు వెళ్లలేదు, కానీ తర్వాత ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదంటే.. కవిత షాకింగ్ కామెంట్స్

 కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదంటే.. కవిత షాకింగ్ కామెంట్స్

 

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి తాను గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రాబోయే రోజుల్లో లెఫ్ట్ సంఘాలతో కలసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఈసారి సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ను 37శాతం ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లాభాలను ఎందుకు తక్కువ చేసి చూపిస్తోందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్‌తో (KTR) గ్యాప్‌పై మాట్లాడటానికి ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఇష్టపడలేదు. కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదనే మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆమె దాటవేశారు. బీఆర్ఎస్‌పైనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి ఒక మాట, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోమాట మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. ఇవాళ(ఆదివారం) బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చినా.. బీజేపీ హై కమాండ్ ఎందుకు చర్చించలేదని నిలదీశారు. దసరా తర్వాత సింగరేణి యాత్ర చేస్తాననని ప్రకటించారు ఎమ్మెల్సీ కవిత.

సింగరేణి కార్మికులకు భరోసా కల్పించేందుకే ఈ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు కార్మికుల‌ సమస్యలపై HMSతో కలసి అలయన్స్‌గా పనిచేస్తామని వెల్లడించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి తాను గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నానని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో లెఫ్ట్ సంఘాలతో కలసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఈసారి సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ను 37శాతం ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లాభాలను ఎందుకు తక్కువ చేసి చూపిస్తోందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత.

యాంకర్‌ స్వేచ్ఛ సూసైడ్‌పై పూర్ణచందర్‌ భార్య షాకింగ్ కామెంట్స్.

యాంకర్‌ స్వేచ్ఛ సూసైడ్‌పై పూర్ణచందర్‌ భార్య షాకింగ్ కామెంట్స్…

 

ప్రముఖ టీవీ చానల్‌ న్యూస్‌ యాంకర్‌ స్వేచ్ఛ వొటార్కర్‌ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో నిందితుడు పూర్ణచందర్‌ భార్య స్వప్న తెరపైకి వచ్చారు.

Anchor Swetcha Votarkar Case: ప్రముఖ టీవీ చానల్‌ న్యూస్‌ యాంకర్‌ స్వేచ్ఛ వొటార్కర్‌ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో నిందితుడు పూర్ణచందర్‌ భార్య స్వప్న తెరపైకి వచ్చారు. పూర్ణ చందర్‌ ద్వారానే స్వేచ్ఛ తనకు పరిచయం అయిందన్నారు. అయితే, వారిద్దరి మధ్య సంబంధం గురించి ముందు తనకు తెలియదన్నారు. వారిద్దరి వ్యవహారం తెలిశాక పూర్ణను వదిలేశానని పేర్కొన్నారు.
పూర్ణచందర్‌పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యమని, అరణ్యను పూర్ణచందర్‌ సొంత కూతురిలా చూసుకున్నాడని స్వప్న వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ నన్ను మానసికంగా టార్చర్‌ చేసిందని, స్వేచ్ఛ పూర్ణచందర్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసిందని స్వప్న షాకింగ్ కామెంట్స్ చేశారు. నా పిల్లలను కూడా అమ్మా అని పిలవాలని బయపెట్టిందని స్వప్న వివరించారు. నా భర్త పూర్ణచందర్‌ నిర్దోషి, అమాయకుడని స్వప్న సంచలన చేశారు.

కాగా, స్వేచ్ఛ వోటార్కర్‌ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్‌ను పోలీసులు నిన్న అరెస్ట్‌ చేశారు. అతడి వేధింపుల కారణంగానే తమ కూతురు స్వేచ్ఛ మరణించినట్టు చిక్కడపల్లి పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే నిందితుడు పూర్ణచందర్‌ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వేచ్ఛ, నేను స్నేహితులుగా ఉండేవాళ్లం. ఐదేళ్లుగా ఆమె మానసికంగా ఆందోళన చెందుతూ చికిత్స పొందుతుంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. స్వేచ్ఛ ఆత్మహత్యతో నాకు ఏలాంటి సంబంధం లేదని లేఖలో పూర్ణచందర్‌ పేర్కొన్నారు.

 ఇదేక్క‌డి టీజ‌ర్‌రా ఇంత షాకింగ్‌గా ఉంది బిగ్‌బాస్ ఫృథ్వీ అద‌ర‌గొట్టావ్‌

 ఇదేక్క‌డి టీజ‌ర్‌రా ఇంత షాకింగ్‌గా ఉంది బిగ్‌బాస్ ఫృథ్వీ అద‌ర‌గొట్టావ్‌…

 

తెలుగు బిగ్‌బాస్‌8 ఫేమ్ ఫృథ్వీ షెట్టి హీరోగా తెలుగు క‌న్న‌డ భాష‌ల్లో తెర‌కెక్కిన చిత్రం అనంత‌కాలం

తెలుగు బిగ్‌బాస్‌8 ఫేమ్ ఫృథ్వీ షెట్టి (Prithviraj Shetty) హీరోగా తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో తెర‌కెక్కిన చిత్రం అనంత‌కాలం (Anantha Kaalam). వాలియంట్ విజన్ క్రియేషన్స్ (Valiant Vision Creations) నిర్మించిన.
ఈ సినిమాకు విజ‌య్ మంజునాథ్ (Vijay Manjunath) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తాజాగా శ‌నివారం ఈ మూవీ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌ను చూస్తే ప్ర‌తి ఒక్క‌రికీ గూస్‌బంప్స్ వ‌చ్చేలా ఉంది.
హీరో ఓ సిటీలో మిడ్‌నైట్ ఓ ప్రాంతంలో సిగ‌రేట్ తాగుతూ ఉండ‌గా ఓ వింత ఆకారంలో ఉన్న మ‌నిష‌ఙ బెలూన్ తీసుకోండి సార్ అంటూ గంభీరంగా చెప్ప‌డం.. ఆపై ఈ ప్ర‌పంచం బ‌య‌ట ఉన్న జ‌నాల‌ను త‌న‌లో బందీ చేసుకుంటే నువ్వు మాత్రం ఓ చోట ఇరుక్కుంటావ్..
దానిని నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినా నువ్వు మ‌ళ్లీ మ‌ళ్లీ అదే చోట‌కు వెళ్లి ఇరుక్కుంటావ్‌ నువ్వు చ‌చ్చే రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయ్ అంటూ చెప్పి వెళుతుంటాడు.

అప్పుడేగా స‌డ‌న్‌గా ఓ వాహానం వ‌చ్చి గుద్ద‌డంతో హీరోను రోడ్డుపై ప‌డిపోయి చావుతో కొట్టు మిట్టాడుతుంటాడు. అప్పుడు బెలూన్ వ్య‌క్తి వ‌చ్చి ఆ బాడీ ప‌క్క‌నే ప‌డుకుని ఇక క‌థ మొద‌లు పెడ‌దామా అంటుండ‌గానే…

హీరో చేతికి ఉన్న కంక‌ణం ప్ర‌కాశంతంగా మారి హీరో లేచి నిల‌బ‌డి.. నువ్వు కాదురా నేను మొద‌లు పెడ‌తా క‌థ‌ అని షాక్ ఇస్తాడు. అదే స‌మ‌యంలో ఓ భారీ వాహానం అ బెలూన్ వ్య‌క్తిని రోడ్డుపై ఢీ కొట్టి వెళ్లి పోతుంది.

ఇలా టీజ‌ర్ అద్యంతం ఆస‌క్తి క‌రంగా క‌ట్ చేశారు కాగా ఈ అనంత‌కాలం (Anantha Kaalam) సినిమాకు సంబంధించిన పూర్తి విష‌యాలు త్వ‌ర‌లోనే మేక‌ర్స్ వెల్ల‌డించ‌నున్న‌ట్లు స‌మాచారం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version