ఈ కోతి మరీ ఫన్నీ గురూ.. కళ్లద్దాలను కొట్టేసి.. చివరకు..
ఓ వ్యక్తి పర్యాటక ప్రాంతంలో ఫొటో తీసుకుంటుంటే.. వెనుకే వెళ్లిన కోతి చటుక్కున అతడి కళ్లద్దాలను లాగేసుకుంటుంది. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడిపోతాడు. తర్వాత వెనక్కు తిరిగి కోతి నిర్వాకం చూసి అవాక్కవుతాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
కోతి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కళ్లు మూసి తెరిచేలోగా ఒక చోటు నుంచి మరో చోటుకు గెంతుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాయి. కొన్నిసార్లు ఇళ్లు, వాహనాల్లోకి దూరి మరీ.. ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తుంటాయి. ఇంకొన్నిసార్లు బెదిరించి మరీ తమకు కావాల్సిన ఆహారాన్ని తెప్పించుకుంటుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కళ్లద్దాలపై కన్నేసిన కోతి.. చివరకు ఏం చేసిందో చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పర్యాటక ప్రదేశంలో చాలా మంది ఫొటోలు దిగుతుంటారు. కొన్నిసార్లు ఇలాంటి ప్రదేశాల్లో కోతులు పర్యాటకుల వస్తువులు లాక్కెళ్తుంటాయి. అయితే తిరిగి వాటికి కావాల్సిన జ్యూస్ కానీ, ఆహారం కానీ ఇస్తే తిరిగి ఇచ్చేస్తుంటాయి. ఈ వీడియోలోని కోతి కూడా ఇలా అలవాటు పడిందో ఏమో గానీ.. ఓ వ్యక్తి అక్కడ ఫొటో తీసుకుంటుంటే.. వెనుకే వెళ్లి చటుక్కున అతడి కళ్లద్దాలను లాగేసుకుంటుంది. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడిపోతాడు.
తర్వాత వెనక్కు తిరిగి కోతి నిర్వాకం చూసి అవాక్కవుతాడు. కళ్లద్దాలను లాక్కున్న కోతి.. (monkey Steals glasses) అక్కడే అటూ, ఇటూ తిరుగుతూ తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది. అయినా అతను వదలకుండా ఎలాగైనా కోతి నుంచి తన కళ్లద్దాలను లాగేసుకోవాలని చూశాడు. ఈ క్రమంలో కోతి నుంచి కళ్లద్దాలను లాగేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే అతను చేయి దగ్గరికి పెట్టగానే.. కోతి ఒక్కసారిగా చెలరేగిపోతుంది. కరవడానికి మీదకు దూకేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో అతను భయంతో దూరంగా నిలబడిపోయాడు.
ఇలా చాలా సేపు ఆ వ్యక్తి వాటిని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించినా సాధ్యం కాదు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ కోతి కామెడీ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఇతను కోతి వీక్‌నెస్ కనుక్కోలేకపోయాడు.. కోతికి కావాల్సిన ఆహారం ఇచ్చి ఉంటే కళ్లద్దాలను తిరిగి ఇచ్చి ఉండేది’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8,900కి పైగా లైక్‌లు, 2.1 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.