నెక్కొండ మాంటిస్సోరి హై స్కూల్‌లో ఫుడ్ ఫెస్టివల్…

నెక్కొండ మాంటిస్సోరి హై స్కూల్‌లో ఫుడ్ ఫెస్టివల్

ఆహార అలవాట్లు ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన:
కరస్పాండెంట్ అంజన్ రెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

నెక్కొండ మండల కేంద్రంలోని మాంటిస్సోరి హై స్కూల్‌లో శనివారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నర్సరీ నుంచి 6వ తరగతి వరకు విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, పాఠశాల ఆవరణలో వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రదర్శించారు. చిన్నారులు తమ ఇళ్ల నుంచి తెచ్చిన వంటకాలను పరస్పరం పంచుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పంచుకునే భావన, మంచి అలవాట్లు మరియు ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమ అధ్యక్షులు ప్రిన్సిపాల్ కొత్త మధుకర్ రెడ్డి మాట్లాడుతూ ఫుడ్ ఫెస్టివల్‌ల ద్వారా విద్యార్థుల్లో సామాజిక విలువలు, సహకార భావం పెంపొందుతాయని అన్నారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న పాఠశాల కరస్పాండెంట్ తాటిపర్తి అంజన్ రెడ్డి విద్యార్థులకు పరిశుభ్రతపై దిశా నిర్దేశం చేశారు. ఆహారం తయారు చేసే ముందు, తినే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, శుభ్రమైన పాత్రలు ఉపయోగించాలని, ఆహారాన్ని కప్పి ఉంచాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను చెత్త బుట్టలో వేయాలని సూచించారు. ట్రెజరర్ డాక్టర్ ఆర్ ఆనందరావు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే పుష్టికరమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలి..

విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

ప్రభుత్వ విద్యా సంస్థలలో అభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని,విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పోషక విలువలు కలిగిన మెనూ అమలు చేస్తుందని తెలిపారు.విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడంతో పాటు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు.ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని,తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు.విద్యార్థులు చేసిన అల్లికలు,కళాకృతులను పరిశీలించారు.10వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని, ఏకాగ్రతతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version