విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనపై కలెక్టర్ స్పష్టత

విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలు,సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో గల ఆదర్శ పాఠశాలలు సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు,అందిస్తున్న మధ్యాహ్న భోజనం ఆహారం నాణ్యత,తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారాన్ని అందించాలని, విద్యార్థుల ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు.బాలికల వసతి గృహంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.అనంతరం హాజీపూర్ మండలం గుడిపేట లోని చందనాపూర్ లో గల పట్టణ ఆవాస పాఠశాలను సందర్శించి పాఠశాలలో చేపట్టిన అదనపు గదులు,ఇతర అభివృద్ధి పనులను పరిశీలించి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.వంటశాలను సందర్శించి విద్యార్థుల ఆహారం తయారీలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని, ఆహారం తయారీ సమయంలో సిబ్బంది శుభ్రత నిబంధనలు పాటించాలని తెలిపారు.ప్రభుత్వం విద్యారంగా అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని,ఈ నేపథ్యంలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కల్తీ కార తయారీ కేంద్రాలపై దాడులు.. రెండు కేంద్రాలు మూసివేత…

కల్తీ కార తయారీ కేంద్రాలపై దాడులు.. రెండు కేంద్రాలు మూసివేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలో కల్తీ కారతయారీ కేంద్రాలపై పోలీసులు మంగళవారం భారీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెండు కల్తీ కార తయారీ కేంద్రాలను మూసివేసి, ఇద్దరు యజమానులను రిమాండ్ చేశారు. ఎలాంటి భద్రతా నియమాలు పాటించకుండానే, పాడైన ఆహార పదార్థాలు, నాసిరక ముడిసరుకుతో పిండి
వంటలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడుల్లో ప్రగతి నగర్ కాలనీలోని “పరస్ కార తయారీ కేంద్రం” యజమాని పరాస్ నాథ్, అలాగే హమాలి కాలనీలోని “అభినయ శ్రీ స్పెషల్ కార తయారీ కేంద్రం” యజమాని ఆయెన పేరుమల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు, జహీరాబాద్ టౌన్ ఎస్ఐలు కే.వినయ్ కుమార్, రాజేందర్ రెడ్డి, కే.సంగమేశ్వర్ లు తమ సిబ్బందితో కలిసి ఈ రెండు కేంద్రాలపై ఆకస్మిక దాడులు చేశారు. పరిశీలనలో, ఆ కేంద్రాల్లో అగ్ని భద్రతా నియమాలు, పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకుండానే కొంతమంది పని మనుషులతో కల్తీ పిండి వంటలు తయారు చేస్తున్నట్లు తేలింది. ఈ విధంగా తయారు చేసిన పదార్థాలను జహీరాబాద్, పరిసర ప్రాంతాల్లో విక్రయించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతోందని పోలీసులు తెలిపారు. పోలీసులు కార తయారీకి వాడిన పదార్థాలు, యంత్రాలు, ముడిసరుకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు టౌన్ ఎస్ఐ కే.వినయ్ కుమార్ పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version