వార్షిక పరీక్షలకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచన

వార్షిక పరీక్షలకు..
విద్యార్థులను సిద్ధం చేయాలి..

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

నిజాంపేట: నేటి ధాత్రి

వార్షిక పరీక్షలు త్వరలో జరగనున్న నేపథ్యం లో ఉపాధ్యాయులు విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చెయ్యాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. నిజాంపేట లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వార్షిక పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచే లక్ష్యంతో, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, అదనపు తరగతులు నిర్వహించాలన్నారు. ప్రత్యేక తరగతుల వల్ల నాణ్యమైన విద్య అందుతుందని దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నారు. అనంతరం ఉపాధ్యాయుల బోధన శైలిని పరిశీలిస్తూ.. విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version