మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

నర్సంపేట, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

నర్సంపేట పట్టణం మున్సిపాలిటీ 10 వార్డులోని సాంబారి సత్యం బుధవారం మృతిచెందగా స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరిమర్శించి , ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం కుటుంబానికి ఆర్థికసహాయంగా రూ.5 వేలు రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎదరబోయిన రామస్వామి, మామిడాల బిక్షపతి, వలుస సత్యం, డాక్టర్ హరిబాబు, మూస్కు రాజేందర్, పసునూరి రమేష్, నాగిశెట్టి ప్రవీణ్, పస్తం కృష్ణ, ఆరేపల్లి కిరణ్ ,  కంప సమ్మయ్య, మల్యాల శ్రీనివాస్, అడెపు రవిందర్,చిటిమల్ల బ్రహ్మచారి, గోరంట్ల మహేందర్, మేడి నరేష్, గ్యార శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర నాయకులు…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర నాయకులు

మహాదేవపూర్ అక్టోబర్ 6 (నేటి ధాత్రి)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కుటుంబాన్ని సోమవారం రోజున రాష్ట్ర బిజెపి నాయకులు చల్ల నారాయణరెడ్డి పరామర్శించారు. బ్రాహ్మణపెళ్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మెషినేని మాధవరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని రాష్ట్ర బిజెపి నాయకులు చల్ల నారాయణరెడ్డి పరామర్శించి వారి కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు అనంతరం జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, బ్రాహ్మణ పెళ్లి గ్రామానికి సర్పంచిగా ఎనలేని సేవలు అందించారని ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సిరిపురం శ్రీమన్నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి బల్ల శ్రావణ్, మండల నాయకులు ఐలయ్యయాదవ్ రవీందర్, వెంకటేష్, కొక్కు రాకేష్, హరీష్, పలువురు నాయకులు, ప్రజల పాల్గొన్నారు.

మొగలయ్యకు ఎమ్మెల్యే మెరుగైన చికిత్స అందించమని సూచించారు…

పొట్ పల్లి గ్రామానికి మొగలయ్య మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల పొట్ పల్లి గ్రామానికి చెందిన
మొగలయ్య పాముగా కాటుకు గురై చికిత్స కొరకు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి లో చేరారు విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఆసుపత్రి కి చేరుకుని ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకుని, మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు, అండగా ఉంటాం అని కుటుంబసభ్యులకు మనోధైర్యన్ని కలుగజెసారు ఎమ్మెల్యే గారితో పాటుగా ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,కోహీర్ మండల మాజీ సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,గ్రామ నాయకులు సిద్దన్న పటేల్, శాంత్ కుమార్, బసప్ప,మాణిక్యప్ప,రామన్న తదితరులు ఉన్నారు.

ఆపద్బాంధవులు ఫౌండేషన్ తీవ్ర రోగంతో బాధపడుతున్న బాలుడికి సహాయం…

ఆపద్బాంధవులు ఫౌండేషన్ ద్వారా చిన్నప్పటి నుంచి అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న బాలుడి కుటుంబానికి సహాయం.

చందుర్తి, నేటిధాత్రి:

ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో జగదీష్ కుటుంబానికి కుటుంబానికి మన ఆపద్బాంధవుల ఫౌండేషన్ తరపున వెయ్యి మంది సహకారంతో ఈరోజు సహాయం చేయడం జరిగింది.
జగదీష్ కుమాడు పుట్టిన మూడు నెలల బేబీ అప్పటినుండి, ఇపుడు రెండు సంవత్సరాల వయస్సు వరకు కూడా నయం కాకపోవడం. విపరీతమైన జ్వరం మరియు విపరీతంగా ఏడుస్తూ ఉన్న సందర్భంలో హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత ప్రాబ్లం అలాగే ఉండడం వల్ల జ్వరం తగ్గకపోవడం వల్ల అనేక హాస్పిటల్స్ సిరిసిల్ల జిల్లాలోని హాస్పిటల్ మరియు కరీంనగర్ అలాగే హైదరాబాద్ టాటా హాస్పిటల్ లో బేబీకి వైద్యం అందిచడం జరిగింది అయినా జ్వరం తగ్గక ప్రతి 6 గంటలకు ఫీవర్ రావడం తో, బ్లడ్ టెస్ట్, బోన్మరో క్యాన్సర్ టెస్ట్ కూడా చేశారు, కానీ బాధపడుతున్న బాలుడికి తెల రక్త కణాలు 18000, 30000, అలా ఉండడం అధిక జ్వరంతో బాధపడుతూ ఉండడం జరుగుతుంది, ఇప్పటివరకు కూడా పరిస్థితులు అలాగే ఉండడం వల్ల ఆ కుటుంబం ఆర్ధికంగా చాలా దుర్పరస్థితికి వెళ్లిపోవడం జరిగింది.
ఇది తెలుసుకున్న మన అపద్బాంధవుల ఫౌండేషన్ తరపున ఆ యొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం మరియు 14 రకాల సరుకులు అందించడం జరిగింది ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆకలితో అలమట్టిస్తున్న వారి ముడుపోయిరాళ్లపైన నాలుగు అన్న మెతుకులై వారి కడుపు నింపడమే మా యొక్క ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం.

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్ కి పరామర్శ…

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్ కి పరామర్శ

#కలెక్టర్ ను పరామర్శించిన మహాజన జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా రమేష్ బాబు

హన్మకొండ, నేటిధాత్రి:

 

కొన్ని రోజుల కిందట అనారోగ్య కారణంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి ఐఏఎస్ అత్తయ్య విజయలక్ష్మి చనిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న మహాజన జర్నలిస్ట్ ఫోరం ఎం జె ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు టీ 9 న్యూస్ ఛానల్ సీఈఓ జిల్లా రమేష్ బాబు హైదరాబాద్ లో వారి ఇంటికి వెళ్లి కలెక్టర్ ని మరియు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. జిల్లా రమేష్ బాబు తో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడు జిల్లా రాకేష్ ఉన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

కొహీర్ పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు దినకర్ గారి మాతృమూర్తి గారు మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటీ మాణిక్ రావు వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి ,అండగా ఉంటాం అని మనోధైర్యాన్ని కల్పించారు.ఎమ్మెల్యే గారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,మాజీ సర్పంచ్ ఖళీమ్, సందీప్, వాజీద్ తదితరులు ఉన్నారు.

బాధిత కుటుంబాలను పరామర్శించిన..!

పలు కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలిపిన రాజా రమేష్…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని 14వ వార్డ్ మాజీ కౌన్సిలర్ గడ్డం రాజు_ విజయలక్ష్మి ల తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను శనివారం బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు పరామర్శించారు. అనంతరం రెండవ వార్డ్ మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్, మాజీ ఎంపిటిసి కళ్యాణ్ ల తల్లి భీమక్క ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను సైతం పరామర్శించారు. వారి తల్లి భీమక్క చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాలలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ కౌన్సిలర్లు పోగుల మల్లయ్య, రేవెల్లి ఓదెలు, నాయకులు బొమ్మ భూమయ్య గౌడ్, జక్కన బోయిన కుమార్, నందిపేట సదానందం, రామిడి లక్ష్మీకాంత్, ఆర్నె సతీష్, చంద్రమౌళి, పైథార్ ఓదెలు, కొండ కుమార్ ,మణి ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

రాజ్ కుమార్ మెరుగైన వైద్యం అందించాలని టీజీఐడిసి మాజీ చైర్మన్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T132826.542.wav?_=1

 

రాజ్ కుమార్ మెరుగైన వైద్యం అందించాలని టీజీఐడిసి మాజీ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x

 

కోహిర్ మండల్ మనియాలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రాజ్ కుమార్ అనారోగ్యంతో సంగారెడ్డి బాలాజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సందర్భంగా ఈరోజు వారికి పరామర్శించిన మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను సూచించిన టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యులతో మాట్లాడి తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం జరిగింది.

మోహన్ కుటుంబానికి ఆర్థిక సహాయం…

మోహన్ కుటుంబానికి ఆర్థిక సహాయం

టీటీడబ్ల్యఆర్ఎస్ పూర్వ విద్యార్థులు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

 

 

 

 

వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన బానోత్ మోహన్ కుటుంబానికి టీటీడబ్ల్యూఆర్ఎస్ పూర్వ విద్యార్థులు 27 వేల రూపాయల ఆర్థిక భరోసాను కల్పించారు. మోహన్ దశదినకర్మ మండల కేంద్రంలో మంగళవారం జరుగుతున్న నేపథ్యంలో పూర్వ విద్యార్థులు మోహన్ సతీమణికి అందజేశారు. ఈ ఆర్థిక సహాయం చేసిన వారిలో గుండాల మండల కేంద్రానికి చెందిన ఎస్సై గడ్డం సతీష్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నరేష్, రవీందర్, మంగీలాల్, అశోక్, సురేష్, మంగీలాల్, బిక్షపతి, రాము మిగతా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం ఇబ్రహీంపూర్ గ్రామా మాజి సర్పంచ్ వీర్శెట్టి పాటిల్ మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు వారి నివాసానికి చేరుకుని నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు అండగా ఉంటామని మనోధైర్యని కలగజేశారు ఎమ్మెల్యే గారితో పాటుగా మాజీ మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి ,మాజి సర్పంచ్ మాజి ఎంపీటీసీలు చంద్రన్న పటేల్, వెంకట్ శశి వర్ధన్ రెడ్డి,నాగన్న సయీద్ ఆనంద్ తదితరులు ఉన్నారు.

కాట్రియాల గ్రామంలో శ్రావణ్ కుమార్ మృతి..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T122515.833-1.wav?_=2

కాట్రియాల గ్రామంలో శ్రావణ్ కుమార్ మృతి..

యూత్ కాంగ్రెస్ నేత రమేష్ చారి పరామర్శ..

రామాయంపేట సెప్టెంబర్ 2 నేటి ధాత్రి (మెదక్)

కాట్రియాల గ్రామానికి చెందిన కట్ట శ్రావణ్ కుమార్ (25) అనారోగ్యంతో నాలుగు నెలలుగా హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో మృతి చెందాడు. గతంలోనే తండ్రి మరణించడంతో తల్లి నర్సవ్వ, తమ్ముడు శివతో కలిసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోంది.
శ్రావణ్ అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉన్న నాలుగు నెలల కాలంలో తల్లి అప్పులు చేసి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. కుటుంబం పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
ఈ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమ్మరి రమేష్ చారి గ్రామానికి వెళ్లి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి సొంతంగా 50 కిలోల బియ్యం అందజేసి, వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కట్ట చంద్రం, కిష్టయ్య, గ్రామ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గొల్ల నరేష్, నవీన్, రాజు, విజయ్, నరేష్, నిఖిల్, కమల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్లా

మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్లా

 

నడికూడ,‌నేటిధాత్రి:

 

మండలం లోని చౌటుపర్తి,నడికూడ, కౌకొండ గ్రామాలలో ఇటీవలే వివిధ కారణాలతో మృతిచెందిన ఎలుగటి రవీందర్ రెడ్డి,దుప్పటి మరియమ్మ,బూరం పెద్ద మల్లయ్య,గోల్కొండ శాంతమ్మ,దంచనాల కమలాకర్ కుటుంబాలను పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం వారి మృతికిగల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే వెంట పరామర్శించిన వారిలో మండల బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అంబేద్కర్ సంఘంనాయకులు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-60-1.wav?_=3

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అంబేద్కర్ సంఘంనాయకులు.

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పర్లపెల్లి భద్రమ్మ కుటుంబాన్ని అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ బుధవారం పరామర్శించారు అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నె యుగేందర్ వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు బాధిత కుటుంబం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆర్థిక సహాయంగా అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కట్కూరి నర్సయ్య, ఆరెపెల్లి అంకూస్, బోట్ల రాజయ్య,శీలపాక రాజేందర్,అంబేద్కర్ నాయకులు అభిమానులు గుర్రం శంకర్, గురుకుంట్ల కిరణ్, కట్కూరి, సునీల్, ఆరేపెల్లి రాజు, గుర్రం అశోక్, కట్కూరి హరీష్, ఏకు మల్లేష్, మొలుగూరి సందీప్, తదితరులు పాల్గొన్నారు

గణపురం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్

పలు మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
అధైర్యపడొద్దు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి, బుద్దారం గ్రామాలల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. ముందుగా లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మొగిలి కోమల కొంతకాలంగా అనారోగ్యం బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోమల అంతిమ యాత్ర లో పాల్గొని పార్ధీవ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం బుద్దారం గ్రామంలో పెరుమాండ్ల మొగిలి, బండి శాంతమ్మ ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కూడా ఎమ్మెల్యే వారి వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఎల్లవేళలా అండగా ఉంటానని, దైర్యంగా ఉండాలని బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ పరామర్శ కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు

అనారోగ్యంతో బాధపడుతున్న హోంగార్డ్ ను…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T161527.757-1.wav?_=4

 

అనారోగ్యంతో బాధపడుతున్న హోంగార్డ్ ను
ఆదుకున్న పోలీస్ శాఖ అధికారులు

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )

 

 

సిరిసిల్ల జిల్లాలో హోమ్ గార్డ్ గా విధులు నిర్వహిస్తూ,అనారోగ్యంతో బాధపడుతున్న శివకుమార్ కి జిల్లా పోలీస్ యంత్రాంగం బాసటగా నిలిచి స్వచ్ఛందంగా (55,000/- రూపాయలు) జమచేసి వారి కుటుంబా సభ్యులకు ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐ.పి.ఎస్ చేతుల మీదుగా శివకుమార్ కుటుంబ సభ్యులకు అందించడం జరిగినది.పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని,తోటి సిబ్బంది ఆపదలో ఉన్నప్పుడు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని ఎస్పీ అన్నారు.ఈ సందర్భంగా ఆర్.ఐ లు యాదగిరి,రమేష్, పోలీస్ శాఖ అధికారులు మరియు శివకుమార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

బౌతికాయనికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-16.wav?_=5

 

బౌతికాయనికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సీనియర్ మెథడిస్ట్ పాస్టర్ రేవ్ .జీవరత్నం,స్వర్గస్తులైనారు విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ లతో కలిసి వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి,వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపి అండగా ఉంటామని మనోధైర్యాన్ని కల్పించారు.ఎమ్మెల్యే గారితో పాటుగా మాజి సర్పంచ్ చిన్న రెడ్డి ,దీపక్ ,శ్రీనివాస్ ,ప్రవీణ్ మెస్సీ, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-06T130153.632-1.wav?_=6

క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలం ఏడాకులపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రె కంటి శంకరమ్మ అనే మహిళ బుధవారం ఉదయం ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలినట్లు తెలిసింది. ప్రమాదంలో శంకరమ్మ తో పాటు ఆమె కుమారులు ప్రభు, విట్టల్ లకు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో క్షతగాత్రులను జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ,విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు నాయకులతో కలిసి ఆసుపత్రి కి చేరుకుని , ప్రమాద వివరాలు కుటుంబ సభ్యులను ,గ్రామస్తులను అడిగి తెలుసుకునారు డాక్టర్ ల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు అంబులెన్స్ లలో జిల్లా ఆసుపత్రి కి తరలించారు ,ఎమ్మెల్యే డాక్టర్ లతో మాట్లాడుతూ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అన్నారు,త్వరగా కోలుకుంటారు అని అధైర్యపడొద్దు అని,అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని తెలిపారు* ….
అనంతరం ఆసుపత్రి లో అనారోగ్యంతో బాధపడుతున్నవారితో మాట్లాడుతూ వారికి అందుతున్న చికిత్స వివరాల్ని అడిగి తెలుసుకున్నారు.మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు మరియు సిబ్బంది సూచించారు .ఎమ్మెల్యే గారితో పాటుగా ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి సర్పంచ్ లు శ్రీనివాస్ రెడ్డి, ప్రభు పటేల్ ,నాయకులు నరేష్ రెడ్డి ,శంకర్,నవీన్ తదితరులు ఉన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version