మోహన్ కుటుంబానికి ఆర్థిక సహాయం
టీటీడబ్ల్యఆర్ఎస్ పూర్వ విద్యార్థులు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన బానోత్ మోహన్ కుటుంబానికి టీటీడబ్ల్యూఆర్ఎస్ పూర్వ విద్యార్థులు 27 వేల రూపాయల ఆర్థిక భరోసాను కల్పించారు. మోహన్ దశదినకర్మ మండల కేంద్రంలో మంగళవారం జరుగుతున్న నేపథ్యంలో పూర్వ విద్యార్థులు మోహన్ సతీమణికి అందజేశారు. ఈ ఆర్థిక సహాయం చేసిన వారిలో గుండాల మండల కేంద్రానికి చెందిన ఎస్సై గడ్డం సతీష్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నరేష్, రవీందర్, మంగీలాల్, అశోక్, సురేష్, మంగీలాల్, బిక్షపతి, రాము మిగతా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.