ఈనెల 13న డబుల్ బెడ్ రూం ఇళ్ల అప్పగింత.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హోతి (కె)లో నిర్మించిన 660 డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంభందించిన తాళాలను ఈనెల 13న లబ్ధిదారులకు అప్పగించనున్నట్లు జహీరాబాద్ తహశీల్దార్ దశరథ్ తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కావున లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.