బీసీలకు 42% రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలి’
జమ్మికుంట, నేటి ధాత్రి:
బీసీలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి, స్థానిక సంస్థలలో పెంచిన రిజర్వేషన్ల ప్రకారం అవకాశం కల్పించాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య డిమాండ్ చేశారు. జమ్మికుంట మండల కేంద్రం వావిలాల గ్రామంలో మంగళవారం వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
ఇదే నెల19న బుధవారం జమ్మికుంట దినేష్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే బీసీ సదస్సుకు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో గ్రామ బి సి నాయకులు కొండ అర్జున్,గొర్ల సతీష్,అందే నర్సయ్య, కనవేన సదానందం మామిడి మల్లయ్య మరియు నాయకులు పాల్గొన్నారు.
