మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రజలను ఆదుకోవాలి
ఎం సిపిఐ(యు )పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనె కుమార్ స్వామి డిమాండ్
కేసముద్రం/ నేటి ధాత్రి
శనివారం కేసముద్రం మండల కేంద్రంలో ఎం సిపిఐ యు పార్టీ మహబూబాబాద్ జిల్లా కమిటీ సమావేశం కామ్రేడ్ బొల్లోజు రామ్మోహన చారి, అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో కామ్రేడ్ గోనె కుమారస్వామి ,మాట్లాడుతూ ఇటీవల కురిసిన మొంథా తుఫాను భారీ వర్షాలు వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు వేసిన వరి మొక్కజొన్న పత్తి మిర్చి తదితర వాణిజ్య పంటలు మరియు గొర్రెలు మేకలు ఇతర పశువులు ఇండ్లు కూలిపోయిన కుటుంబాలను మరియు మరణించిన కుటుంబాలను తక్షణమే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. రైతులకు గత యాసంగి పంటలకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి నాలుగు నెలలు దాటిన ఇవ్వకపోవడం రైతులను మోసం చేసిన ప్రభుత్వం అవి ఇవ్వకుండానే ఖరీఫ్ వానకాలపు పంటలకు బోనసిస్తామని ప్రగల్బాల్ పలుకుతున్నారని రైతులు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపినారు. ఇప్పటికైనా వెంటనే బోనస్ రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తడిసిన ధాన్యం మొక్కలు తదితర వాటిని కొనుగోలు చేయుటకు ముందుకు వచ్చి పంటలకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వలన గ్రామపంచాయతీ పాలకవర్గాలకు ఎన్నికలు జరగకపోవడం వలన గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందని కేంద్రం నుంచి గ్రామాలకు రావలసిన నిధులు సుమారు 2,800 కోట్ల రూపాయలు రాకుండా పోయినాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే ప్రభుత్వం స్థానిక ఎన్నికలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో తక్షణమే జరపాలని డిమాండ్ చేశారు,
నవంబర్ 19న ఇందిరా పార్కు దగ్గర జరిగే ధర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.నల్గొండ జిల్లాకు చెందిన మాజీ పార్లమెంటు సభ్యులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి పోరాటం వలన సాధించిన శ్రీరాంసాగర్ రెండవ దశ కాలువ కు బి.యన్.రెడ్డి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ, ఎం సిపిఐ యూ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరినారు.
ఈ కార్యక్రమంలో ఎం సి పి( యు) పార్టీ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న, జిల్లా నాయకులు నూకల ఉపేందర్, కటకం బుచ్చిరామయ్య, బొల్లోజు రామ్మోహనాచారి, తదితరులు పాల్గొన్నారు.
