బీసీ రిజర్వేషన్లపై ద్వంద వైఖరి విడనాడాలి…

బీసీ రిజర్వేషన్లపై ద్వంద వైఖరి విడనాడాలి

బీసీ బందుకు బిజెపి మద్దతు సిగ్గుచేటు

బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి

వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ జయప్రదం

వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో భారీ నిరసన

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

 

బీసీ రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలను వాడుకుంటూ వారిని అణచివేస్తూ ఆ రిజర్వేషన్లు అడ్డుకుంటున్న పాలక పార్టీలు తమ ద్వంద విధానాలను విడనాడాలని ఎంసిపిఐ (యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్,సిపిఐ ఎంఎల్ (మాస్ లైన్) ఉమ్మడి జిల్లా కార్యదర్శి కొత్తపెళ్లి రవి, సిపిఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, రఘుసాల సుమన్, సిపిఐ ఎంఎల్ (లిబరేషన్) జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి యాదగిరి డిమాండ్ చేశారు.42 శాతం బీసీ రిజర్వేషన్లపై అగ్రవర్ణ ఆధిపత్య పాలక పార్టీల వైఖరిని నిరసిస్తూ రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలని కోరుతూ చేపట్టిన రాష్ట్ర బందులో భాగంగా వరంగల్ పట్టణంలో ఎం సి పి ఐ (యు), సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్, న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ గ్రేటర్ కార్యదర్శి రాచర్ల బాలరాజు అధ్యక్షతన జరిగిన ఆందోళనలో ఆయా పార్టీల జిల్లా కార్యదర్శులు పెద్దారపు రమేష్,కొత్తపెళ్లి రవి, ఎలకంటి రాజేందర్,అక్కనపెల్లి యాదగిరి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్రంలోని బిజెపి బీసీల బందుకు మద్దతు తెలపడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు ఉన్నప్పటికీ కేవలం 42 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వటానికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్డినెన్స్, జీవో నెంబర్ 9 లు తీసుకువచ్చి చట్ట పరిధిలో అమలు చేయకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నదని ఇలాంటి పరిస్థితుల్లో బీసీ ప్రజలు పాలక పార్టీల ద్వంద విధానాలను గమనించి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం జరిగిన బందును జయప్రదం చేసిన అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీలపై వివక్షతను విడనాడి తక్షణమే పార్లమెంటులో చట్టం చేసి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చిత్తశుద్ధిని ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణ అగ్రకుల ఆధిపత్య పార్టీలకు పాలకులకు తగిన బుద్ధి చెప్పే విధంగా బిసి ఓటర్లు ప్రజలు చైతన్యవంతం కావాలని మేము ఎంతో మాకు అంత వాటా కావాలని నినదిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ(యు) జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్ నగర కార్యదర్శి మాలోత్ సాగర్ నగర నాయకులు సుంచు జగదీశ్వర్ ముక్కెర రామస్వామి న్యూ డెమోక్రసీ నాయకులు గంగుల దయాకర్ బండి కోటేశ్వర్ జన్నారం రాజేందర్ మాస్ లైన్ జిల్లా నాయకులు చిర్ర సూరి మైదంపాని లిబరేషన్ నాయకులు రవిరాకుల ప్రసంగి జన్ను ప్రవీణ్ అప్పల శంకరాచారి ప్రజా సంఘాల నాయకులు ఐతం నాగేష్ ఎగ్గెని మల్లికార్జున్ మహమ్మద్ మహబూబ్ పాషా అప్పనపురి నర్సయ్య మాలి ప్రభాకర్ నలివెల రవి దామెర రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version