ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి..

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి

చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ఆకస్మిక తనిఖీ

మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు

నడికూడ:నేటిధాత్రి

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్ధన సమయాని కంటే ముందుగానే పాఠశాలను సందర్శించి,విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ప్రార్థన చేశారు.అనంతరం మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా నిత్యం పాఠశాలలను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలోని ప్రార్థన జరుగుతున్న విధానాన్ని పరిశీలించి విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు.ఆ తర్వాత పాఠశాలలోనే మధ్యాహ్న భోజన రికార్డులను, విద్యార్థుల హాజరు పట్టికలను,ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు. ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయలు అచ్చ సుదర్శన్ ఉపాధ్యాయులు లకావత్ దేవా ఉన్నారు.

చిత్రపురి కార్మిక లోకానికి ఊపిరి తమ్మినేని.

`చిత్రపురి అక్షర పోరాటంలో ఎప్పుడూ ముందుంది నేటిధాత్రి.

`జౌర్‌ ఏక్‌ దక్కా చిత్రపురి కార్మికుల గెలుపు పక్కా!

`కార్మికపక్షాన పోరాటంలో తమ్మినేని.

`కార్మికుల పోరులో అక్షర సహకారం నేటిధాత్రి.

`పోరాడితే పోయేదేమీ లేదంటున్న తమ్మినేని.

`ఉద్యమానికి నిరంతర చేయూతనందిస్తున్న నేటిధాత్రి.

`అటు పోరు జెండాలు, ఇటు అక్షర గాండీవాలు తోడుగా వున్నాయి.

`కార్మికులు మరింత గట్టిగా గళం వినిపించాలి.

`చిత్రపురిలో జరిగిన అన్యాయన్ని ధైర్యంగా ఎదిరించాలి.

`హక్కుల సాధన కోసం పరిశ్రమించాలి.

`విశ్రమించకుండా కల సాకారం చేసుకోవాలి.

`దిక్కులన్నీ ఏకమయ్యేలా దీక్షలు చేయాలి.

`కార్మిక వాణి ప్రపంచానికంతటికీ తెలియాలి.

`ప్రభుత్వ దిగివచ్చి న్యాయం చేయాలి.

`ఇప్పటికీ మించి పోయింది లేదు.

`చిత్రపురిలో జొచ్చిన పాములను తరిమేయాలి.

`విషనాగుల కోరలు పీకేయాలి.

`సినిమా గద్దల పని పట్టాలి.

`ఇప్పుటి దాకా వేడుకున్నది చాలు.

`వేడుకోలుతోనే ఒక తరం చీకట్లో కలిసిపోతోంది.

`మలితరానికైనా వెలుగులు నిండాలంటే కార్మికులు పోరుబాట పట్టాలి.

`మీ ఇల్లు మీరు సొంతం చేసుకోవాలి.

`చిత్రపురి స్థలం మీది..

`సొసైటీ సొమ్ము మీది..

`ఆ ఇండ్లు మీవి.

`మీ ఆకలి కేకలేకాదు…ఆగ్రహం కూడా చూపించండి.

`అప్పుడు గాని పేదవాడి కోపం కనిపించదు.

`చిత్రపురిలోని గద్దలు పారిపోవు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 ఇంత కాలం అడిగింది చాలు..అడుక్నున్నదిచాలు. వేడుకున్నది చాలు. కన్నీళ్లతో కాలం గడిపింది చాలు. ఏడ్చిన కాలం తుడిచేయండి. ఏడ్చి ఏడ్చి ఎర్రగా మారిన కండ్లను తెరవండి. ఎరుపెక్కిన కళ్లతో నిలదీయండి. ప్రశ్నించండి. మా భూమి మాకేనంటే నినదించండి. చిత్రపురి మాదే అని గర్జించండి. చిత్రపురి మాది. స్ధలం మాది. సొసైటీ మాది. సొమ్ము మాది. అని తేల్చి చెప్పండి. ఇంకెంత కాలం మోసం చేస్తారని ఎదిరించండి. మీ స్ఠలాలు మీకు సొంతమయ్యేదాకా పోరాటంచేయండి. పోరాడితే పోయేదేమీ లేదన్నది తెలుసుకోండి. చేతులెత్తి మొక్కిన చేతులతో జెండాలు పట్టుకోండి. ఎవరో చెప్పిన జెండాలు, ఇప్పటిదాకా అనుసరించి ఎజెండాలు పక్కన పెట్టండి. పోరాటం చేసేవారు కార్మికులకోసం వున్నారు. పోరాటాలలో విజయాలుసాధించిన సిపిఎం. అగ్ర నాయకుడు తమ్మినేతి వీరభద్రం లాంటి వారు అండగా వున్నారు. నిరంతరం కార్మికుల హక్కుల కోసం అక్షర పోరు సాగిస్తున్న నేటిదాత్రి అండగావుంది. కార్మికులకు న్యాయం జరిగేదాక వుంటుంది. ప్రతి కార్మికుడికి ఇల్లు వచ్చేదాకా అక్షర గాండీవాలను ఎక్కు పెడుతూనే వుంటుంది. కార్మికుల పొట్టగొట్టిన వారిని కడిగేస్తూనే వుంటుంది. కార్మికుల గూడులో చేరిన వారి బైట ప్రపంచానికి చూపిస్తూనే వుంటుంది. ఇంకా మీకెందుకు అలసట. ఇంకెందుకు మీకు ఆవేదన. ఏడ్చే కన్నీళ్లను ఎవరూ తూడ్వలేరు. ఎరుపెక్కిన కళ్లనే అందరూ చూస్తారు. చిత్ర పురి మీది. చిత్రపురిలో హక్కు మీద. సినిమా చాన్స్‌ల కోసం పడిన మీ తపన మీ గూడు కోసం కూడా చూపించండి. చిత్రపురిలో ఇంటి కోసం కొట్లాడితే అవకాశాలు రావనే భయంలో బతక్కండి. సినిమాలో పని దొరకక్కదన్న అభద్రతలో వుండకండి. కార్మికులు లేకుండా సినిమా లేదు. కార్మికులులేకుండా సినిమా ఒక్క అడుగు ముందుకు పడదు. అసలు సినిమా నిర్మాణమే జరగదు. సినీ కార్మికులను కాదని సినిమా తీస్తే అడ్డు పడండి. అడ్డుకోండి. ఇతర ప్రాంతాల కార్మికులను తెచ్చుకొని సినిమా తీస్తామంటే తరిమేయండి. లేకుంటే మీకు ఇల్లు రాదు. సినిమా అవకాశాలు రావు. అర్ధించినంత కాలం మీరు బానిసలే..సనీ గద్దలకు బానిసలే. మీ కష్టం దోచుకొని కోట్లు సంపాదించుకుంటున్నారు. మీ కష్టాన్ని ఇటుకలు చేసుకొని ఇండ్లు లాక్కుంటున్నారు. ప్రతి మనిషికి కూడు, గూడు,గుడ్డ అవసరం. అవి తీరాలంటే పనులు కావాలి. ఆ బలహీనతే కార్మికులను రోడ్డున పడేస్తుంది. సినిమా పెద్దల చేతుల్లో కీలుబొమ్మలను చేస్తోంది. కార్మికులకు ఆకలే కాదు. ఆవేశం కూడ వుండాలి. ఆందోళన చేసి సాధించుకోవాలి. ప్రశ్నించి నిలదీయాలి. ఎదిరించి హక్కులు సాధించుకోవాలి. దేశ స్వాతంత్య్రం కూడా కొట్లాడితేనే వచ్చింది. పోరాటం చేస్తేనే వచ్చింది. అలుపెరగని ఉద్యమం సాగిస్తేనే వచ్చింది. ఒక్కసారి విశ్రమిస్తే ఇక ఎప్పుడైనా వెనుకడుగే..అప్పుడప్పుడూ చేసేది ఉద్యమం కాదు. విరామాలు ఇచ్చుకుంటూ పోరాడితే న్యాయం జరగదు. పోరాటమే కాదు ఆరాటం కూడా వుండాలి. అందుకు ఆచరణ కావాలి. ముందడుగు వేసే ధైర్యం కావాలి. ఆ శక్తి ప్రతి కార్మికుడిలోనూ వుండాలి. అప్పుడే చిత్రపురి కార్మికుల సొంతమౌతుంది. ఎవరో వస్తారని , ఏదో చేస్తారని ఎదురుచూడడం మానుకోండి. మీ కోసం కలిసి వచ్చే వారితో కలిసి పోరు బాట ఎంచుకోండి. సిపిఎం. అగ్రనేత ఎప్పటి నుంచో చెబుతున్నారు. మీకు అండగా కలిసి సాగారు. మీ కోసం ఉద్యమాలు చేశారు. కాని కార్మికులలో ఐక్యత ఇంకా పూర్తిగా లేదు. ప్రతి సమాజంలోనూ అవకాశవాదులుంటారు. అలాంటి వారు మీ సమూహంలోనే వుంటారు. అలాంటి అవకాశవాదులను గుర్తించండి. మీ కోసం కలిసి రాని కార్మికులను పక్కన పెట్టండి. ఎందుకంటే అవకాశవాదులు కలిసి రాదు. కార్మికులందరనీ ఏకం కానివ్వరు. సినీ పెద్దల జేబులుగా పనిచేసే వారు మీ పక్కనే వుంటారు. మీకు ఎప్పటికిప్పుడు వెన్ను పోటు పొడుస్తూనే వుంటారు. వెళ్లకున్న ఎంగిలి మెతుకులు మీకు విసిరేసి వడ్డించిన విస్తరి సుష్టుగా సినీ పెద్దలు బోంచేస్తున్నారు. వేల కోట్ల రూపాయల విలువైన భూములు సినీ గద్దలు సొంతం చేసుకొని కార్మికులకు పని కల్పిస్తున్నారు. ఎంగిలి మెతుకుల కార్మికుల మొహాన కొడుతున్నారు. ఇప్పటికైనా కార్మికులు కళ్లు తెరవండి. అమాయకపు ఆలోచనల నుంచి దూరంగా జరగడండి. కార్మికుల్లో వుండే కలతలు పక్కనపెట్టుకోండి. అంతా ఏకమైతే వేల కోట్ల రూపాయల విలువైన భూమిని సొంతం చేసుకోండి. చిత్రపురి సొసైటీలో సినీ పెద్దలెందుకు? కార్మికులకు చేతగాదా? కార్మికులు సొసైటీని నడుపుకోలేరా? చిత్రపురిలో కార్మికులకు చోటు లేకుండాపోవడానికి కారణమేమిటి? నటులందరికీ ఆస్ధులున్నాయి. నిర్మాతలకు, దర్శకులకు ఆస్దులున్నాయి. భూములున్నాయి. మీ భూముల మీదకు వస్తుంటే ఏం చేస్తున్నారు. కార్మికులకు మాయ మాటలు చెప్పి, ఎప్పుడో మోసం చేశారు. ఇంకా చేస్తూనే వున్నారు. అసలు చిత్ర పురిలో జరిగిన స్కామ్‌ అంత ఇంతా కాదు. 67 ఎకరాల భూమి విలువ వేల కోట్లు. సుమారు 3వేల కోట్ల విలువైన స్ధలం. ఆ స్థలమే మీ సొంతమైమతే ప్రతి కార్మికుడు ఒకసినిమా తీయొచ్చు. కార్మికులే నిర్మాతలు కావొచ్చు. లారీ డ్రైవర్లు ఓనర్లు కాలేదా? కార్మికులు నిర్మాతలు కాలేరా? ఇతర రంగాలలో రాణించలేరా? మీరే దర్శకులు కాలేరా? మీరే నటులై పాత్రలు పోషించలేరా? తరం మారుతోంది. నిన్నటి తరం హీరోల వారసులే హీరోలా…కార్మికులలో కళలేదా? కళాకారులు కాలేదు. ఇతర రంగాలలో వారికి ప్రతిభ లేదా? ముందు మీరు మేలుకోండి. చిత్రపురి సొంతం చేసుకొని, సొసైటీ పేరుతో సినిమాలు తీయండి. మీ ఇల్లు మీ సొంతం చేసుకొని గూడు సమకూర్చుకోండి. కార్మికులలో ఎంతో మంది ప్రతిభావంతులున్నారు. కార్మికుల సలహాలు తీసుకుంటూ సినిమాలు తీస్తున్నవారున్నారు. కార్మికులు చెప్పే కథలను సినిమాలకు అలులతున్నవారున్నారు. మొత్తం సినిమా అంతా కార్మికులచుట్టే తిరుగుతుంది. ఒక్కసారి ఇప్పుడున్న సినీ గద్దల సినిమాకు దూరంగా వుండండి. అప్పుడు సినీ లోకమంతా విలవిలలాడుతుంది. కాని ఎక్కడ కడుపు కాలుతుందో…ఆకలి దహిస్తుందో..అని వాళ్లకన్నాముందే కార్మికులు తమ అచేతనం చూపిస్తున్నారు. నిర్మాతులు లేకుంటే బతకలేమనుకుంటున్నారు. సినిమాలు రాకపోతే బువ్వ తినలేమనుకుంటున్నారు. అందుకే కార్మికులంతా గొడుగు పట్టుకోవడంతోనే ఆగిపోతున్నారు. కార్యవాన్‌ల తలుపులు తెరిచేందుకే పనికొస్తున్నారు. సినిమాలో ఓ మూలన నిలబడి ఒక్కసారి తెరమీద కనిపిస్తే చాలనుకుంటుకుంటున్నారు. తెలంగాణలో ఎంతో మంది స్వతహసిద్దితో కళాకారులౌతున్నవాళ్లున్నారు. తెలంగాణ మట్టిలో పాట వుంది. సంగీతంవుంది. తెలంగాణ జీవితమే ఒక కథలా వుంటుంది. వాటిని పట్టుకొని సినిమా తెరకెక్కించండి. అంతే కాని ఎవరి కాళ్లో పట్టుకుంటేనే బతుకుతామన్న భావన నుంచి బైటకు రండి. సమాజంలో ఏ రంగంలో చూసినా ఎదుగూ బొదుగూ వుంటుంది. కాని సినీ కార్మికుల జీవితాలు ఎందుకు అక్కడే వుంటున్నాయి. ఒక బట్టలషాపులో పనిచేసే వ్యక్తి కొంత కాలం తర్వాత చిన్నగా బట్టల దుకాణం పెట్టుకుంటాడు. కొంత కాలం టైలరింగ్‌ నేర్చుకున్నవ్యక్తి సొంతంగా టైలరింగ్‌ షాపు పెట్టుకుంటాడు. కాని ఒక్క సినీ రంగంలోనే జీవితాంతంకార్మికుడిగానే వుంటాడు. వయసైపోయిన తర్వాత ఎవరు సాయం చేస్తారా? అని ఎదురు చూస్తుంటాడు. అసంఘటిత కార్మికులకు వున్న వెసులుబాటు సినీ కార్మికులకు లేదు. అందువల్ల మీ చిత్రపురిని మీరు సొంతం చేసుకోవడమే అందుకు పరిష్కారం. కార్మికులకు చిత్రపురి విషయంలో తీరని అన్యాయం జరిగిందని అన్ని వర్గాలలో సానుభూతి వుంది. కాని కార్మికుల పోరాటంలోకొంత అలసత్వం వుంది. నిర్లక్ష్యం కూడా కనిపిస్తోందని చెప్పడంలో సందేహం లేదు. చిత్ర పురి విషయంలో నేటిధాత్రి లాంటి మీడియా ఎంతో ఆది నుంచి సపోర్టు చేస్తున్నప్పటికీ కార్మికుల విడతల వారీ పోరాటం వల్ల ప్రతిసారి మళ్లీ మొదటికొస్తోంది. ఇప్పటికైనా సరే కార్మికులు అందరూ ఒక్కతాటి మీదకు రావాల్సిన అవసరం వుంది. పాలకులు మారినప్పుడల్లా, ఎన్నికలు వచ్చినప్పుడల్లా మాత్రమే కార్మికులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. తర్వాత మర్చిపోతున్నారు. పూర్తి స్దాయి చిత్తశుద్దితో కూడా కార్మికులు పోరాటంచేయాల్సిన అవసరం వుందన్నది కూడా అంగీకరించాలి. విరామం లేని ఉద్యమం సాగిస్తే తప్ప సమస్య పరిష్కారం కాదన్నది తెలుసుకోవాలి.

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య..

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి నేటి ధాత్రి : 

తిరుపతి నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను సోమవారం ఉదయం అధికారులతో కలసి పరిశీలించారు. నగరంలోని 26 వ వార్డులో గల టి.పి. ఏరియా, నెహ్రూ వీధి, గ్రూప్ థియేటర్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, విష్ణు నివాసం తదితర ప్రాంతాల్లో ఉదయం ప్రజా మరుగుదొడ్లు, రోడ్లు, పారిశుద్ధ్యం తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్, తదితర ప్రాంతాల్లో ప్రజా మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని అన్నారు. రోడ్లపై ఉన్న చిన్న చిన్న గుంతలను కూడా వెంటనే పూడ్చాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. హోటల్స్ వద్ద తడి, పొడి చెత్త సేకరణను పరిశీలించి, క్రమం తప్పకుండా చెత్త సేకరణ మరింత మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న భవనాల అనుమతులు పరిశీలించాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి రవి, డి.ఈ. లలిత, ఏసిపి లు బాలాజి, మూర్తి, సర్వేయర్ కోటేశ్వర రావు, శానిటరీ సూపర్ వైజర్ సుమతి తదితరులు ఉన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా

2025 మార్చ్ 9వ తేదీన విజయవాడలో శ్రీ శ్రీ కళావేదిక నిర్వహిస్తున్న ఆమెకు వందనం కార్యక్రమంలో

నారీ రత్న అవార్డుకు ఎంపికైన
భద్రాచలవాసి ఎర్రంశెట్టి పూర్ణిమ.

భద్రాచలం నేటి ధాత్రి

మన భద్రాచల మహిళ..
తెలుగు పండిట్, మోటివేషనల్ స్పీకర్, సైకాలజీ కౌన్సిలర్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం జిల్లాకమిటీ మెంబర్,
పూర్ణిమ పార్లర్ కం లేడీస్ కార్నర్ నిర్వాహకురాలు అయిన ఎర్రంశెట్టి పూర్ణిమ
భద్రాచల పరిసర ప్రాంతాలలోని గిరిజన పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల యందు ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్ గా విద్యార్థులకు లైఫ్ సెట్టింగ్, లైఫ్ గోల్, టైం మేనేజ్మెంట్ వంటి విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉచిత సెమినార్లునిర్వహిస్తున్నారు.
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ( ఐద్వా) నందు జిల్లా కమిటీ మెంబర్ గా మహిళా ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ, మహిళాచట్టాలు, మహిళాసాధికారతలపై మహిళలకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు.
కుటుంబ నిర్వహణ బాధ్యతల్లో భాగంగా పూర్ణిమ పార్లర్ కం లేడీస్ కార్నర్ను నిర్వహిస్తున్నారు.
భద్రాచలపట్టణంలో శ్రీశ్రీ కళావేదిక జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టే లలిత నిర్వహించే సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటూ,
సాహిత్యాభిలాషతో తనవంతు సాహితీసేవలను అందిస్తున్నందుకుగానూ అభినందిస్తూ
శ్రీశ్రీ కళావేదిక నిర్వహించే ఆమెకు వందనం అనే ప్రతిష్టాత్మక కార్యక్రమంలో నారీరత్న అవార్డుకు ఎంపిక చేసారు.
ఈ అవార్డును స్వీకరించవలసినదిగా
శ్రీ శ్రీ కళావేదిక జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టే లలిత గారు పూర్ణిమకు ఆహ్వానాన్ని పంపించారు.
ఈ సందర్భంగా ఎర్రంశెట్టి పూర్ణిమను భద్రాచల పట్టణ ప్రముఖులు, సాహితీవేత్తలు అభినందించారు.
ఈ విషయంపై ఆమె హర్షాన్ని వ్యక్తం చేస్తూ..
వివిధ రంగాలలో విజయపథం వైపు దూసుకెళ్తున్న మహిళా మణులకు పట్టంకట్టే బృహత్తర కార్యక్రమంలో తనను ఎంపికచేసి నారీరత్నను అందిస్తున్నందుకు, జాతీయస్థాయిలో భద్రాచల పట్టణంలో సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలను ప్రోత్సహిస్తున్నందుకుగానూ..
శ్రీ శ్రీ కళావేదిక సి.ఈ.ఓ. డా. కత్తిమండ ప్రతాప్ కు, జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టే లలితకు ఎర్రంశెట్టి పూర్ణిమ ధన్యవాదాలు తెలియజేసారు.

అక్రమ కట్టడాలపై చర్యలేమయ్యాయి సార్లు?

అక్రమ కట్టడాలపై చర్యలేమయ్యాయి సార్లు?

నోటీసులకే పరిమితం అవుతున్న అధికారుల చర్యలు

పిర్యాదులు చేసిన పట్టింపు లేదాయే.

అస్తవ్యస్తంగా మున్సిపల్ పాలన?

నర్సంపేట,నేటిధాత్రి:

Actions have been taken on illegal constructions?

నర్సంపేట పట్టణంలో మున్సిపాలిటీ పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అధికారుల అలసత్వంతో అక్రమ కట్టడాలు, అక్రమ భూకబ్జాలు రోజురోజుకు ఒక మాఫియాల పేట్రేకి పోతున్నది. ప్రభుత్వ భూములను, చెరువు మొత్తానికి కాల్వలను గ్రీన్ ల్యాండ్లను అక్రమదారులు కబ్జా చేసిన, నిబంధనలకు విరుద్ధంగా భారీ భవనాలను అక్రమ కట్టడాలు చేపట్టిన సంబంధిత అధికారులకు పట్టింపు లేకుండా పోతున్నదని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నర్సంపేట పట్టణంలో ప్రధాన ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి.నర్సంపేట పట్టణం నెక్కొండ రోడ్డులో గ్రీన్ ల్యాండ్ పార్క్ వెనకాల మరియు నెక్కొండ రోడ్డులోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లే దారిలో , మరియు ద్వారకపేట రోడ్డులో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లే దారిలో అక్రమంగా నిబంధనలు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపణలతో నేటిధాత్రి దినపత్రిక వరుస కథనాలు ప్రచురించింది.కథనాలకు స్పందించిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సంబంధిత అక్రమ భవన నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.కాగా వాటిపై చర్యలకు వెనుకాడిన అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ
ఎంసిపిఐ[ యు ] రాష్ట్ర కమిటీ సభ్యులు వంగల రాగసుధ ,నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి మరోసారి మున్సిపల్ కమిషనర్ కు,టౌన్ ప్లానింగ్ అధికారులకు పిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో ఒక వైపు నేటిధాత్రి వరుస కథనాలకు,మరో వైపు ఎంసిపిఐ పార్టీ ఫిర్యాదులతో మూడు అక్రమ భవన నిర్మాణ యజమానులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపిస్తున్నారు.పట్టణ భౌగోళికల పట్ల

 

Actions have been taken on illegal constructions?

కాపాడాల్సిన మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలకు వత్తాసు పలుకుతున్నారని చర్చలు జరుగుతున్నాయి.అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులకు చేతులురావడం లేదా అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.గతంలో కూడా ఒక ప్రముఖ వైద్యునికి సంబంధించిన భవన నిర్మాణం పూర్తయిన తర్వాత అక్రమంగా కట్టారని మున్సిపల్ అధికారులు కూలగొట్టారని ప్రజలు గుర్తుకు చేస్తున్నారు.ఆ అక్రమ భవన నిర్మాణాల పట్ల నోటీసులు ఇచ్చిన అధికారులు చర్యలు తీసుకోకుండా ఆ నోటీసులకే పరిమితం చేయడం వెనక ఏమైన ముడుపులు ముట్టాయా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటికైనా అక్రమ భవన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన సిఐ సుబ్బారాయుడు.

రంగంపేట వద్ద
పి.జి హాస్టల్ యాజమాన్యం,
విద్యార్థులకు
మత్తు పదార్థాలపై

అవగాహన కల్పించిన సిఐ సుబ్బారాయుడు

తిరుపతి(నేటి ధాత్రి)

అసాంఘిక కార్యకలాపాలు నిర్మూలనలో భాగంగా జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్.
ఆదేశాల మేరకు రంగంపేట పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసి, తనిఖీ మరియు అవగాహన కార్యక్రమం చేపట్టారు.
విద్యార్థుల భవిష్యత్ తోపాటు భద్రత దృష్ట్యా పీ.జీ. ప్రైవేటు హాస్టల్ నందు తనిఖీలు నిర్వహించిచారు.
సైబర్ క్రైమ్ నార్కో ట్రిక్స్ మరియు గంజాయి పై సుబ్బరాయుడు సి.ఐ.అవగాహన కార్యక్రమం ఎర్పాటు చేశారు.
రంగంపేట లోని ప్రతి హాస్టల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు బ్యాకప్ 30 రోజు ఉండాలని సూచించడం అయినది.
రంగంపేట పరిసర ప్రాంతాలలో పి.జి హాస్టల్ యాజమాన్యల తోపాటు మత్తు పదార్థాలపై విద్యార్దులకు అవగాహన నిర్వహించారు..
గంజాయి సేవించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోతుందని, దానివల్ల జరిగే నష్టాలు అనర్ధాల గురించి విద్యార్థులకు వివరించారు..
దినితో పాటు విద్యార్థిని విద్యార్థులకు సైబర్ నేరాలు గురించి నార్కో ట్రిక్స్ డ్రగ్స్ గురించి, వాటి వల్ల జరిగే నష్టాలు గురించి తెలపడం అయింది..
రంగంపేట పరిసర ప్రాంతాలులో గల గంజాయి స్పాట్లను కూడా గుర్తించి వాటిని ద్వంసం చేశారు..

pg

అంతే కాకుండా ఈ ప్రదేశాలలో గంజాయి సేవించిన, లేదా ఇతరేతర కార్యక్రమాలు చేపట్టిన అలాంటి వారి పై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యాజమాన్యం కు మీకు ఏదైనా సమాచారం ఉంటే పోలీసు వారికి వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
నార్కోడ్ ట్రిక్స్ డ్రగ్ సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్1972 కు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు తెలిపారు.
గంజాయి పై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీస్ వారికి డయల్ 100/112/8099999977 సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీజీ హాస్టల్లో యాజమాన్యం ఆటో డ్రైవర్లు ఎస్టిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు..

పరకాల ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వాహనాల వేలం

పరకాల ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వాహనాల వేలం

 

పరకాల నేటిధాత్రి :

ఎక్సైజ్ స్టేషన్ పరకాల పరిధిలో వివిధ కేసులలో సీజ్ చేయబడిన టువంటి వాహనం లకు బుధవారం రోజున ఉదయం 11 గంటలకు డిస్టిక్ ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ వరంగల్ రూరల్ ఆధ్వర్యంలో పరకాల ఎక్సైజ్ స్టేషన్ నందు వేలం నిర్వహించబడునని ఆసక్తి కలవారు వాహనంలో వేలంలో పాల్గొనవలెనని పరకాల ఎక్సైజ్ సీఐ పి.తాతజీ తెలిపారు

ఆర్టిసి కార్మికులను వేధిస్తున్న డిఎం ను సస్పెండ్ చేయాలి.

ఆర్టిసి కార్మికులను వేధిస్తున్న డిఎం ను సస్పెండ్ చేయాలి.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు కార్మికుల మొర

బెల్లంపల్లి నేటిధాత్రి :

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆసిఫాబాద్ డిపోలో పని చేస్తున్న కార్మికులను వేధింపులకు గురి చేస్తున్న డిపో మేనేజర్ విశ్వనాథ్ ను సస్పెండ్ చేయాలని , కార్మికులపై పని భారాన్ని తగ్గించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి, జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి, ఆర్ టి సి కార్మిక సంఘం నాయకులు కె. ఎస్. రావు డిమాండు చేశారు. ఈ రోజు ఆర్ టి సి కార్మికులతో కలిసి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆసిఫాబాద్ డిపోలో పని చేస్తున్న కార్మికులపై భారం పెంచి వేధింపులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆసిఫాబాద్ నుండి హైదరాబాద్ వెళ్ళే సర్వీసులను నడిపితే మూడు రోజుల పని దినాలుగా ఉన్న దానిని రెండు రోజులకు కుదించే కుట్ర చేస్తున్నారని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పెరుతో పని చేయని మిశన్ ద్వారా టెస్ట్ చేసి కార్మికులపై తప్పుడు నివేదికలు ఇచ్చి సస్పెండ్ చేయడం, సర్వీస్ నుండి రిమూవల్ చేయడం చేస్తున్నారని విమర్శించారు. రెండు సంవత్సరాల్లో 216 మంది కార్మికులను సస్పెండ్, రిమూవల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్ సొలొమాన్, ఆసిఫాబాద్ డిపో మేనేజర్ విశ్వనాథ్ వేధింపులు ఆపాలని, ఆర్ ఎం ను ట్రాన్స్ఫర్ చేయాలని, డి ఎం విశ్వనాథ్ ను సస్పెండ్ చేయాలని విన్నవించగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సానుకూలంగా స్పందించారని, ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారని ఏమాజి తెలిపారు. కేంద్ర మంత్రినీకలిసిన వారిలో బిజెపి సీనియర్ నాయకులు కేశవరెడ్డి, ఆర్ టి సి కార్మికులు పాల్గొన్నారు.

కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆలయ చైర్మన్..

శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆలయ చైర్మన్
చిల్పూర్( జనగామ)నేటి ధాత్రి

చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం దిన దినాభివృద్ధి చెందుతూ భక్తుల కోరిన కోరికలను తీర్చుతూ విరాజిల్లుతున్న శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఈ నెలలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి.ఇందులో భాగంగా కళ్యాణ మహోత్సవానికి విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా
శ్రీ బుగ్గులు వెంకటేశ్వర దేవస్థాన కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు తోపాటు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగాచార్యులు మరియు
ఆలయ ధర్మకర్తల మండల సభ్యులు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు మాట్లాడుతూ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.దీనిలో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్లతో పాటు వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం ఇతర ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోరిన కోరికలు తీర్చే శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని చైర్మన్ శ్రీధర్ రావు కోరారు.

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో దరఖాస్తులు

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్
వనపర్తి నెటిదాత్రి;
వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో వివిధ ప్రాంతాలను నుండి వచ్చిన ఫిర్యాదులు దరఖాస్తులను ప్రజల నుండి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి స్వీకరించారు . ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా చట్టపరంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ 
 ఆదేశించారు

నిరుపేదలకు తయారైన ఇండ్లను వెంటనే పంచాలి

నిరుపేదలకు తయారైన ఇండ్లను వెంటనే పంచాలి

డీఎస్పీ నాయకులు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ తో జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి అది హర్షించదగిన విషయమే కానీ ఇంకా చాలా గ్రామాల్లో పూర్తి కాలేదు. వాటిని పూర్తి చేయాలని పూర్తి చేసినటువంటి ఇండ్లను అర్హులైన నిరుపేదలకు పంచిన తర్వాతనే ఇందిరమ్మ ఇండ్ల జాబితాను విడుదల చేయాలని ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం ఇత్తదని ఎదురు చూస్తే వాళ్లు ఇవ్వలేదు మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరన్నర కావస్తున్నా మీరు ఇవ్వలేదు పేదవారికి పూర్తిగా అన్యాయం జరుగుతుంది మీకు పంచడం ఇష్టం లేకపోతే అది మాకు అప్పగించండి వారం రోజుల్లో పూర్తిగా పారదర్శకంగా పంచి చూపెడతాం అని కలెక్టర్ ని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కుర్రి స్వామినాథన్ ఇంజపెల్లి విక్రమ్ పాల్గొన్నారు

పల్లెల్లో రాజ్యమేలుతున్న బెల్ట్ షాపులు..

*పల్లెల్లో రాజ్యమేలుతున్న బెల్ట్ షాపులు..

*అక్రమాలను ఆదరిస్తున్న ఎక్స్ంజ్,శాఖ..

పలమనేరు(నేటి ధాత్రి) 

ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలకు గత ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలను అందిస్తున్నారు లేదో కానీ గ్రామాల్లో మాత్రం మద్యం ప్రియులకు బెల్ట్ షాప్ రూపంలో తెగ మందు తాగిస్తున్నారు గడిచిన ప్రభుత్వంలో బ్రాంది షాపులను ప్రభుత్వం నడిపి బెల్ట్ షాపులను అరికడితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మద్యం షాపులను ప్రైవేటీకరణ చేసి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తుంది అనడంలో సందేహం లేదు గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు నిర్వహణ నిర్వహిస్తూ అధిక మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు.ఈ బెల్ట్ షాపులను అరికట్టాల్సిన ఎక్సైంజ్,
శాఖ వారికి సహకరిస్తూ అంధకారప్రాయంగా ముందుకు వెళ్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్, చంద్రబాబు నాయుడు,ముఖ్యమంత్రి.. డిప్యూటీ సీఎం గా జనసేన పార్టీ కొణిదల
పవన్ కళ్యాణ్ పదవిలో కూర్చున్న తర్వాత మద్యం బాబులకు పట్టణాల్లో గాని, మండలాల్లో గాని మద్యం షాపులు పెట్టుకోవాలని
సీఎం డిప్యూటీ సిఎం లు ఆదేశించిన
ఎక్స్ంజ్, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటే ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది, మద్యం దుకాణం దారులతో ఎక్స్ంజ్,
అధికారులు కుమ్మకై పల్లెల్లో బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి చేయి తడుపుతే షాపులు పెట్టుకోవడానికి
అనుమతి వచ్చినట్లేనని బెల్ షాపు విక్రయదారుల నుండి వేలాది రూపాయలు వీరు జేబులోకి నింపుకొని ప్రభుత్వ ఖజానాకు
గండి కొడుతున్నారు అని అనుమానాలు కూడా వస్తున్నాయి.. ప్రభుత్వం నియంత్రించిన ధరల కంటే
గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో ఒక్కొక్క మద్యం బాటిల్ మీద 20 నుండి 30 రూపాయలు దాకా అధికంగా వసూలు చేసి అటు అధికారులు
షాపు యజమానులు బెల్ట్ షాపు విక్రయ విక్రయదారులు జేబులు నింపుకుంటున్నారు. ప్రతినిత్యం
దినసరి కూలి పనికి పోతే రోజుకు
400 నుండి 500 రూపాయలు దాకా సంపాదించుకొని పల్లెల్లో సాయంత్రం అయితే బెల్ట్ షాప్ వద్దకు వెళ్లి 200 నుండి 250 దాకా ఖర్చుపెట్టుకొని కుటుంబాన్ని ‌ రోడ్డుపాలు చేస్తున్నారని వారి కుటుంబ సభ్యులు మనోవేదనకు
గురవుతున్నామని మా కుటుంబాన్ని ఎలా పోషించాలో అని ఆలోచనలో
పడ్డామని వారు ఆవేదన వ్యక్తం చెందారు.. ఇకనైనా పల్లెల్లో బెల్ట్ షాపులు తొలగించాలని సంబంధిత
ప్రభుత్వం గానీ సంబంధిత అధికార శాఖ కానీ చొరవ తీసుకొని
బెల్ట్ షాపులపై ప్రత్యేకంగా ఉంచకపోతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఈ మద్యం ద్వారానే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది అనడంలో సందేహం లేదు. మరి అధికారులు ఏం చేస్తారో చూడాల్సి ఉంది..

కోట గుళ్ళలో భూపాలపల్లి ఎస్ఐ దంపతుల పూజలు

కోట గుళ్ళలో భూపాలపల్లి ఎస్ఐ సాంబమూర్తి దంపతుల పూజలు

గణపురం నేటి ధాత్రి :

గణపురం మండలంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో సోమవారం భూపాలపల్లి ఎస్ఐ మచ్చ సాంబమూర్తి, సుచరిత దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ దంపతులను ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్ ఐ సాంబమూర్తి జన్మదిన సందర్భంగా అర్చకులు శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.

ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం

ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం

*నేడు హైవే రోడ్డు లో తన పల్లి క్రాస్
వద్ద వాహన తనిఖీలు..

తిరుపతి నేటి ధాత్రి :

జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీస్.ఆదేశాల మేరకు ట్రాఫిక్ డిఎస్పి
రామకృష్ణ చారి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు,
నేడు హైవే రోడ్డు లో తన పల్లి క్రాస్ నుంచి ఆర్.సి పురం జంక్షన్ వరకు వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది.
వాహన తనిఖీల్లో భాగంగా వాహనం నడిపేటప్పుడు వ్యతిరేక మార్గంలో వాహనం నడిపితే ప్రమాదాలు జరుగుతాయని, ఎవరూ కూడా వ్యతిరేక మార్గంలో వాహనాలు నడపరాదని సూచించడం అయింది.
ప్రతి ఒక్కరు కూడా ద్విచక్ర వాహనం నడిపినప్పుడు తప్పనిసరిగా ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ ధరించాలని సూచించడం అయింది.
వాహనం నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా సంబంధిత రికార్డులు కలిగి ఉండాలని సూచించడం అయినది.
రికార్డ్స్ లేనటువంటి 17 ద్విచక్ర వాహనాలు మరియు 06 కార్లు, 01,జెసిబి,
మొత్తం 24 వాహనాలను సీజ్ చేయడమైనది.
వాహనదారులకు కొత్త మోటర్ వెహికల్ చట్టం – 1998 (అమెండ్మెంట్ ఇన్ – 2019) వాటిపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో రామకృష్ణ చారి ట్రాఫిక్ డిఎస్పి, సంజీవ్ కుమార్ సిఐ షేక్క్షావల్లి ఎస్ఐ, పురుషోత్తం రెడ్డి ఎస్.ఐ. బాలాజీ ఎస్. ఐ. మరియు ట్రాఫిక్ ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు

తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్..

*తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్..

*ఏర్పాటు చేసిన హీరో ఫ్యూచర్ ఎనర్జీస్…

*రూ.1000 కోట్ల పెట్టుబడి, 2 వేల మందికి ఉపాధి..

*ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్ధ్యం..

*వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు..

తిరుపతి(నేటి ధాత్రి)

తిరుపతిలోని రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్‌లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్…పారిశ్రామిక అవరసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్‌కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సాంకేతికత కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని, భారతదేశ శక్తి పరివర్తనకు కొత్త బెంచ్‌మార్క్‌ను నిర్దేశిస్తుందని వివరించారు. తిరుపతిలో ప్రవేశపెట్టబడిన స్కేలబుల్ మోడల్‌ను ఆంధ్రప్రదేశ్‌లోనూఇంకా దేశవ్యాప్తంగా ఇతర పరిశ్రమల్లోనూ అనుకరించవచ్చని చెప్పారు.

*లక్ష్యానికి తొలి అడుగు ఇది..

స్వర్ణాంధ్ర విజన్-2047 సాధనలో పేర్కొన్నట్టుగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలిఅడుగు అవుతుందన్నారురాష్ట్ర ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ఐసిఈ)
పాలసీ 2024 కింద 160 గెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, క్లీన్ ఎనర్జీలో రూ.10 ట్రిలియన్ పెట్టుబడిని సాధిస్తామనే విశ్వాసం ఉందన్నారు. శిలాజ ఇంధనాలపై ఆంధ్రప్రదేశ్ ఆధారపడటం తగ్గించడానికి, 2070 నాటికి భారతదేశం యొక్క నెట్-జీరో లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి, ఇంధన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌తో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ జైత్రయాత్ర మొదలు కావాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో వాణిజ్యానికి ఉన్న అనుకూల విధానాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి హీరో ఫ్యూచర్ ఎనర్జీస్‌కు సహకారం అందిస్తాయి. అని ముఖ్యమంత్రి చెప్పారు.

*ఎన్నో వనరులు…వినియోగించుకోండి..

విస్తారమైన తీరప్రాంతం, లోతైన సముద్ర ఓడరేవులు, బలమైన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌తో ఆంధ్రప్రదేశ్… దేశీయ, ప్రపంచ మార్కెట్‌ అవసరాలను తీర్చడానికి, గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులకు కేంద్రంగా మారడానికి ఆంధ్రప్రదేశ్ అనువైందని ముఖ్యమంత్రి అన్నారు. రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో రెండు వేల మందికి ఉపాధి కల్పించేలా ప్లాంట్ నెలకొల్పడంతో తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని చెప్పారు.

ప్రాజెక్టుతో ఎన్నో లాభాలు..

రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ద్వారా రెండు వేల మందికి ఉపాధి కలుగుతుంది. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఏడాదికి 54 టన్నులకు పెంచుకునే అవకాశం ఉంది. ఏడాదికి 206 టన్నుల కార్బన్ ఢైఆక్సైడ్ ఉద్గారాల తగ్గింపుతో పాటు, వాతావరణంలోకి ఏడాదికి 190 నుచిం 195 టన్నుల ఆక్సిజన్ విడుదల అవుతుంది. మొత్తంమ్మీద 8 శాతం నుంచి 10 శాతం ఉద్గార తగ్గింపు సాధ్యమవుతుంది.

హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ..

2012లో స్థాపించిన హీరో గ్రూపు పునరుత్పాదక ఇంధన విభాగం హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ పవన, సౌర, హైబ్రిడ్ ఇంధన వనరుల ఉత్పత్తిపై దృష్టి పెట్టి పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నిస్తోంది. భారతదేశం, యుకె, ఉక్రెయిన్, వియత్నాం, బంగ్లాదేశ్‌లో 1.9
జి డబ్యూ,
సామర్థ్యంతో ప్రాజెక్టులను నిర్వహిస్తూ రూ.1,460 కోట్ల వార్షిక ఆదాయం సాధిస్తూ ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ప్రపంచ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా, 2030 నాటికి సామర్థ్యాన్ని 30,
(జి డబ్యూ,)
కి పెంచడానికి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధంగా ఉంది.

రాక్‌మాన్ ఇండస్ట్రీస్..

1960లో స్థాపించిన హీరో గ్రూప్‌లో భాగమైన రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్ అల్యూమినియం డై-కాస్టింగ్ భాగాలు, అధునాతన కార్బన్ సంబంధిత ఆటో భాగాల తయారీదారు. లుధియానా, హరిద్వార్, చెన్నై, బవాల్, సూరత్, వడోదర, తిరుపతి ప్లాంట్లతో రూ.2,390 కోట్ల వార్షిక ఆదాయం కలిగి ఉంది. ఏరోస్పేస్, హై-ఎండ్ ఆటోమోటివ్ రంగాల్లోకి ప్రవేశించింది. ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఎండీ, చైర్మన్ రాహుల్ ముంజల్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్ సీఈవో శ్రీవాత్సన్ అయ్యర్, రాక్‌మాన్ ఇండస్ట్రీస్ ఎండీ ఉజ్వల్ ముంజల్, రాక్‌మాన్ ఇండస్ట్రీస్ సీఈవో కౌసిక్ మన్నా, ఓహ్మియం సీఈవో ఆర్నే బాలంటైన్‌ పాల్గొన్నారు..

ఉపాధి లేక స్థానికులు ప్రజలు ఎదురుచూస్తున్న నిమ్స్ కొరిడార్

ఉపాధి లేక స్థానికులు ప్రజలు ఎదురుచూస్తున్న నిమ్స్ కొరిడార్ ను

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ లో నిమ్స్ కొరిడార్ దాదాపు 13 వేల ఎకరాలకు భూమి అలర్ట్ చేయడం జరిగింది గత 15 సంవత్సరాల నుండి ఇదిగో నిమ్స్ అదిగో నిమ్స్ అంటూ పప్పం గడపుడే అవుతుంది స్థానిక యువత చదువు పూర్తి చేసుకొని నాకు ఉద్యోగాలు వస్తాయని గత 15 సంవత్సరాల నుండి డిగ్రీలు పీజీలు పూర్తిచేసుకుని ముసలి వాళ్లు అయ్యే పరిస్థితికి వస్తున్నారు కానీ జహీరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ హోండై కి 400 ఎకరాలు కేటాయించామని ఐటీ ఫార్మా స్పోర్ట్స్ ఆటోమొబైల్ విత వివిధ ఇండస్ట్రీలో ఏర్పాటు చేస్తామని చెప్పడమే జరుగుతుంది గానీ ఏ పని ముందుకు సాగడం లేదు మరొకసారి ప్రభుత్వాన్ని గుర్తు చేయదలుచుకున్నాను తెలంగాణలో నిరుద్యోగం పెరుగుతుంది ముఖ్యంగా మా జహీరాబాద్ న్యాల్కల్ ఝరాసంగం లో యువత యువకులు ఎదురుచూస్తున్నారు ఎప్పుడు మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని. ప్రజలందరూ ఆశతో ఎదురు చేస్తున్నారు.

శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం 18 వ కళ్యాణ మహోత్సవం

శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం 18 వ కళ్యాణ మహోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కొల్లూర్ గ్రామంలో
శ్రీ రేణుక ఎల్లమ్మ 18 వ కళ్యాణ మహోత్సవం నిర్వాహకురాలు శ్రీమతి భ్రమరాంబ రాములు గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది . తేదీ 6 7 గురు శుక్రవారం రోజున అమ్మవారి కళ్యాణం బోనాల ఊరేగింపు పోతురాజుల విన్యాసాలు గొల్ల బిర్లా ఆటపాట ఒగ్గు కథ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారి కుమారుడు డా: కోట ధన్ రాజ్ గౌడ్ సామాజికవేత్త ఆలయ కమిటీ చైర్మన్ తెలియజేశారు ధన్ రాజ్ గౌడ్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలోని కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని రాజకీయ ప్రముఖులు ఉన్నతాధికారులు పాల్గొంటారని వారు తెలియజేశారు.

టిడిపి తీర్థం పుచ్చు కున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

టిడిపి తీర్థం పుచ్చు కున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

పుంగనూరు(నేటి ధాత్రి) మార్చి03:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మరియు అభివృద్ధికి అందులోని మంచిని గ్రహించి తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న అభివృద్ధిని మరియు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వర్యులు చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు రెడ్డి) ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న రొంపిచర్ల మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రొంపి చెర్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ ఇబ్రహీం ఖాన్ మండల వైస్ ఎంపీపీ నూలు రెడ్డప్ప మాజీ జెడ్పిటిసి చంద్రమ్మ భాస్కర్ రెడ్డి
రొంపిచెర్ల ఎంపీటీసీ రహిమాబీ , బండ కింద పల్లె సర్పంచ్ అన్సర్ బాష, రొంపిచర్ల వైస్ సర్పంచ్ శ్రీపతి,
జాండ్లా వారిపల్లి వైస్ సర్పంచ్ బాలాజీ,రొంపిచర్ల వార్డ్ మెంబర్లు నాగరాజా లక్ష్మయ్య మొదలైన వారు అనుచరులతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధికి ఆకర్షితులై ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ప్రజలను మరింత అభివృద్ధి చెందే విధంగా తమ వంతు కృషి చేస్తూ చల్లా రామచంద్రారెడ్డి నాయకత్వంలో పని చేస్తామని తెలియజేశారు..

వేతన జీవులను విస్మరించిన రాష్ట్ర బడ్జెట్‌..

వేతన జీవులను విస్మరించిన రాష్ట్ర బడ్జెట్‌
పలమనేరు(నేటి ధాత్రి) 
సాధారణంగా బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్నారంటే వేతనాలు పెరుగుతాయని ఎదురుచూసే వేతన జీవుల ఆశలను రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ అడియాసలు చేశారు. 2025`26 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ ప్రసంగంలో కొన్ని పథకాల అమలు కోసం కేటాయింపులు చేస్తామన్నారు తప్ప, జీతాల కోసం పనిచేస్తున్న కార్మికులకు బడ్జెట్‌లో చోటు ఇవ్వలేదు. ఎటువంటి జీఓ ఇవ్వకుండానే మానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ అమలు చేసిన ఘనత తమదేనని చెప్పుకోవడం చూస్తే గడ్డి చూపించి గుర్రాన్ని పరిగెత్తిం చడం వంటిదే. ఇతర వాగ్దానాలైన ఆశా వర్కర్ల జీతాల పెంపునకు ఎటువంటి ప్రస్తావన చేయలేదు. ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు హామీ గురించి ప్రస్తావించలేదు. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్‌బోర్డును పునరుద్ధరిస్తామన్న హామీకి అదే గతి పట్టించారు. కూటమి నాయకులు ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన విధంగా ప్రభుత్వం దొడ్డిదారిన వాడేసుకున్న బిల్డింగ్‌ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను ఈ బడ్జెట్‌లో జమ చేయలేదు. రాష్ట్రంలోని లక్షలాది మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు తమకు మినిమం టైంస్కేల్‌, ఉద్యోగాల పర్మినెంట్‌ అవుతాయని పెట్టుకున్న ఆశలపై తెలుగు దేశం కూటమి ప్రభుత్వం నీళ్లుజల్లింది.
రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు పీఆర్‌సీ, ఐఆర్‌ ఊసేలేదు. వారికి చెల్లించాల్సిన రూ వేలాది కోట్లు బకాయిల ప్రస్తావన, కేటాయింపుల్లేవు. ఓపీఎస్‌ పునరుద్ధరణ గురించీలేదు. లక్షలాది మంది పనిచేస్తున్న సమగ్రశిక్ష, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ తదితర ప్రభుత్వ పథకాల్లో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌కు, రెండు లక్షల మంది ఔట్‌సోర్సింగ్‌కు, మినిమం టైంస్కేల్‌ అమలు మధ్యాహ్నభోజన పథకం, వెలుగు కార్మికులకు కనీస వేతనాల అమలు, విద్యుత్‌, ఆర్టీసీ తదితర ప్రభుత్వరంగ సంస్థల కాంట్రాక్ట్‌ కార్మికులకు డైరెక్ట్‌ పేమెంట్‌, టైం స్కేల్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ గురించి కనీసం ప్రస్తావన, కేటాయింపులు లేవు. తక్కువ జీతాలు తీసుకునే ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ కార్మికులకు సంక్షేమ పథకాల హామీ ప్రస్తావనే బడ్జెట్‌లో లేకపోవడం శోచనీయం.
సామాన్యుల సంతోషమే రాజుల సంతోషమని బడ్జెట్‌ ప్రసంగంలో కూటమి ప్రభుత్వం చెప్పుకుంది. కానీ షాపులు, మాల్స్‌, ప్రైవేట్‌ ఆసుపత్రులు, విద్యా సంస్థలు, పెట్రోల్‌ బంకులు, హోటల్స్‌ తదితర వాటిల్లో పనిచేస్తున్న దాదాపు 50 లక్షల మంది కార్మికుల వేతనాలు 2006,07 తర్వాత ఇంత వరకూ పెంచలేదు.
ఈ బడ్జెట్‌లో కూడా వాటి పెంపు ప్రస్తావనలేదు. 
గత ప్రభుత్వ విచ్ఛిన్నం వలన అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా మిగిలిందని ప్రసంగంలో చెబుతూనే ఈ బడ్జెట్‌లో రూ. 80 వేల కోట్లు అప్పులను ప్రతిపాదించారు. వేతనాల కోసం, కూలి కోసం శ్రమ చేసి బతికేవారికెవ్వరికైనా  సంక్షేమ పథకాలు మాత్రమే సంతృప్తి పర్చలేవని 2024 రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో తేలింది. ఈ ఫలితాల నుండైనా కూటమి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదు.  కార్మికుల వేతనాల కోసం, సంక్షేమం కోసం తగిన విధంగా బడ్జెట్‌ ప్రతిపాదనల్లో తగిన మార్పులు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, డు జై గిరిధర్ గుప్తాఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు..

హనుమాన్ ఆలయ చైర్మన్ పరామర్శించిన రాము, రమేష్ యాదవ్..

హనుమాన్ ఆలయ చైర్మన్ పరామర్శించిన రాము, రమేష్ యాదవ్

నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ బెజ్జంకి వెంకటేశ్వర్లు తల్లి లక్ష్మీ అనారోగ్యంతో మృతిచెందగా నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము, కొమ్ము రమేష్ యాదవ్ లక్ష్మీ మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటేశ్వర్లుకు మారం రాము రమేష్ యాదవ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ ఈదునూరి యాకయ్య, నెక్కొండ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బిక్షపతి, నెక్కొండ మాజీ ఉపసర్పంచ్ వీర భద్రయ్య, బి ఆర్ ఎస్ నాయకులు వెంకన్న, శ్రీనివాస్, శ్రీనాథ్, బొడ్డుపల్లి రాజు, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version