సీక్వెల్‌ రాబోతోంది.

సీక్వెల్‌ రాబోతోంది

 

 

 

యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది ఒకటి. విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా తరుణ్‌ భాస్కర్‌ దాస్యం దర్శకత్వంలో 2018లో విడుదలైన ఈ…

యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ ఒకటి. విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా తరుణ్‌ భాస్కర్‌ దాస్యం దర్శకత్వంలో 2018లో విడుదలైన ఈ చిత్రానికి కొనసాగింపు భాగం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆదివారం ఈ సినిమాకు సీక్వెల్‌ రాబోతుందని ప్రకటించారు మేకర్స్‌. ‘ఈఎన్‌ఈ రిపీట్‌’ అనేది టైటిల్‌. ‘ఏలినాటి శనిపోయింది. కన్యారాశి టైమ్‌ వచ్చింది’ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉందీ చిత్రం. మొదటి పార్ట్‌కు పనిచేసిన చిత్రబృందమే ఈ సీక్వెల్‌లోనూ భాగమవుతున్నారు. తరుణ్‌భాస్కర్‌ దాస్యం దర్శకత్వంలో డి.సురేశ్‌బాబు, సృజన్‌ యరబోలు, సందీప్‌ నాగిరెడ్డి నిర్మించనున్నారు. విశ్వక్‌ సేన్‌, సాయి సుశాంత్‌ రెడ్డి, అభినవ్‌ గోమతం, వెంకటేశ్‌ కాకుమాను ప్రధాన పాత్రలు పోషించనున్నారు.

 రేవంత్ పాలనలో గురుకులాలు నిర్వీర్యం హరీష్‌రావు ఫైర్.

 రేవంత్ పాలనలో గురుకులాలు నిర్వీర్యం హరీష్‌రావు ఫైర్…

 

రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటం శోచనీయమని మాజీమంత్రి హరీష్‌రావు అన్నారు.

జనవరి నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్లు, మాంసం, అరటి పండ్ల సరఫరా నిలిచిపోయాయని చెప్పారు.

హైదరాబాద్:
బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు.. రేవంత్ ప్రభుత్వ (Revanth Government) పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (BRS MLA HarishRao) ఆరోపించారు.
విద్యావ్యవస్థపై కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరితో లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల భవిష్యత్త్‌ని ప్రశ్నార్థకం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా హరీష్‌రావు ట్వీట్ చేశారు.
రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటం శోచనీయమని హరీష్‌రావు అన్నారు.
జనవరి నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్లు, మాంసం, అరటిపండ్ల సరఫరా నిలిచిపోయాయని చెప్పారు.
బకాయిలు చెల్లించకుంటే జులై ఒకటోవ తేదీ నుంచి అన్నిరకాల ఆహార పదార్థాలు, ఇతర సామాగ్రి సరఫరాను నిలిపి వేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు.
మరోవైపు 13 నెలలుగా రూ. 450 కోట్లకు పైగా అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో ఆయా భవనాల యజమానులు తాళాలు వేస్తున్న దుస్థితి ఉందని చెప్పారు.
విద్యాసంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటి వరకు యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, స్కూల్ బ్యాగులు ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు హరీష్‌రావు.
దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని నిలబెట్టాలని, ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేదపిల్లల భవిష్యత్‌ను కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకుల కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆహార పదార్థాలు, ఇతర సామగ్రి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అన్నారు. యూనిఫామ్, బూట్లు, స్కూల్ బ్యాగులు తక్షణమే పంపిణీ చేయాలని హరీష్‌రావు కోరారు.

టీమిండియా కోసం ఇంగ్లండ్ లెజెండ్ సొంతజట్టుకు వ్యతిరేకంగా ప్లాన్

టీమిండియా కోసం ఇంగ్లండ్ లెజెండ్ సొంతజట్టుకు వ్యతిరేకంగా ప్లాన్…

 

టీమిండియా ప్రతీకారంతో రగిలిపోతోంది. లీడ్స్ టెస్ట్‌లో జరిగిన పరాభవానికి రివేంజ్ తీర్చుకోవాలని చూస్తోంది. స్టోక్స్ సేన బెండు తీయాలని పట్టుదలతో కనిపిస్తోంది.

ఇంగ్లండ్ పర్యటనను పరాభవంతో మొదలుపెట్టిన టీమిండియా.. ఇప్పుడు ప్రతీకారంతో రగిలిపోతోంది. లీడ్స్ టెస్టులో ఓటమి గిల్ సేనను నిరాశలో ముంచేసింది. అయితే వెంటనే తేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టిన భారత జట్టు.. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్ట్ కోసం జోరుగా సన్నద్ధమవుతోంది. స్టోక్స్ సేన బెండు తీసి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని చూస్తోంది. ఈ తరుణంలో మెన్ ఇన్ బ్లూకు అండగా నిలబడుతున్నాడో ఇంగ్లండ్ స్టార్. సొంతజట్టుకు వ్యతిరేకంగా, గిల్ సేనకు అనుకూలంగా పని చేస్తున్నాడు. అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
మైండ్‌సెట్ ముఖ్యం..

భారత జట్టు ఆటగాళ్లకు సాయం చేస్తున్నాడు ఇంగ్లండ్ దిగ్గజం కెవిన్ పీటర్సన్. స్పిన్నర్లకు అంతగా అచ్చిరాని ఇంగ్లీష్ కండీషన్స్‌లో వికెట్లు ఎలా తీయాలో నేర్పిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ బయటపెట్టాడు. ‘కెవిన్ పీటర్సన్ నాకు కొన్ని సలహాలు ఇచ్చాడు. ఇంగ్లండ్‌లో ఎలా రాణించాలో చెప్పాడు. ఇక్కడి ఫీల్డింగ్ పొజిషన్స్, పిచ్‌ల గురించి అర్థం అయ్యేలా వివరించాడు. ఎలాంటి మైండ్‌సెట్‌తో బౌలింగ్ చేయాలో సూచించాడు అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.

ఏపీ బీజేపీ కొత్త బాస్ మాజీ ఎమ్మెల్సీ మాధవ్.

ఏపీ బీజేపీ కొత్త బాస్ మాజీ ఎమ్మెల్సీ మాధవ్…

 

AP BJP Chief: ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడి పేరు ఖరారైందని ఎమ్మెల్సీ సోమువీర్రాజు తెలిపారు. కార్యకర్తలు, నాయకుల అభీష్టం మేరకు పేరు ఖరారైందన్నారు.

విజయవాడ, జూన్ 30: ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా (AP BJP New Chief) మాజీ ఎమ్మెల్సీ మాధవ్ (Former MLC Madhav) పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. అందరి అభిప్రాయాల మేరకు మాధవ్ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. అయితే అధికారికంగా వెల్లడించే వరకు పేరు చెప్పవద్దని కమలం పార్టీ నాయకులకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ బీజేపీ చీఫ్‌ ఎంపిక నేపథ్యంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కొత్త బాస్‌పై మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నేడు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యిందన్నారు.రాష్ట్ర రాజకీయ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అధ్యక్ష పదవికి పేరు నిర్ణయం జరిగిపోయిందని చెప్పారు. కార్యకర్తలు, నాయకుల అభీష్టం మేరకు పేరు ఖరారైందన్నారు. అధికారికంగా అధ్యక్షుడి పేరు ప్రకటించడమే మిగిలి ఉందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు.బీజేపీ ఎన్నికల నియమావళికి అనుగుణంగా అధ్యక్ష ఎంపిక జరుగుతుందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు నామినేషన్లు వేయడం, సాయంత్రం ఉపసంహరణ జరుగుతుందన్నారు. రేపు అధికారికంగా అధ్యక్షుని పేరు ప్రకటిస్తారన్నారు. రెండేళ్ల పదవీ కాలం ముగియడంతో ఈ ఎన్నిక జరుగుతోందని చెప్పారు. అధిష్టానం నిర్ణయాలను అందరూ గౌరవిస్తారని..స్వాగతిస్తారని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ వెల్లడించారు.

మాజీమంత్రి సబితా సంచలన కామెంట్స్ ఆమె ఏమన్నారో తెలిస్తే.

మాజీమంత్రి సబితా సంచలన కామెంట్స్ ఆమె ఏమన్నారో తెలిస్తే..

 

రాష్ట్రంలో ప్లానింగ్‌లేని పాలన నడుస్తోందని, కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇళ్లు వచ్చే దుస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ధ్వజమెత్తారు.హైదరాబాద్: రాష్ట్రంలో ప్లానింగ్‌లేని పాలన నడుస్తోందని, కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇళ్లు వచ్చే దుస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే పి.సబితారెడ్డి(MLA Sabitha Reddy) ధ్వజమెత్తారు. ఒక కాలనీని ఎంత ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామో రాష్ట్రాన్ని సైతం అదే తరహాలో అభివృద్ధి చేయాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో తలాతోకాలేని పాలన కొనసాగుతున్నదని ఆమె ఎద్దేవా చేశారు.ఆదివా రం బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ నాదర్‌గుల్‌ 31వ డివిజన్‌లోని గ్రీన్‌రిచ్‌కాలనీలో ఎమ్మెల్యే పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం కాలనీవాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజా సంక్షేమం కన్నా రాజకీయమే ప్రధానంగా మారిందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, అధికారులను వేధించడం మంచి పద్ధతి కాదని ఆమె హితవు పలికారు. ప్రజలు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాల ని, ప్రభుత్వంతో కొట్లాడైనా సరే నిధులు తీసుకువచ్చి పనులు చేయిస్తానని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో కౌన్సిల్‌ బీఆర్‌ఎస్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ సూర్ణగంటి అర్జున్‌, మాజీ కార్పొరేటర్లు పెద్దబావి శోభాఆనంద్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, లిక్కి మమతాకృష్ణారెడ్డి, బోయపల్లి దీపికాశేఖర్‌రెడ్డి, నాయకులు శ్రీనివాసరాజు, కర్రె బల్వంత్‌, నరేశ్‌, సాయి పాల్గొన్నారు.

ఆషాడ మాసం కొత్త కోడలిని పుట్టింటికి ఎందుకు పంపిస్తారో తెలుసా.

ఆషాడ మాసం కొత్త కోడలిని పుట్టింటికి ఎందుకు పంపిస్తారో తెలుసా…

ఆషాడ మాసంలో కొత్త కోడలిని పుట్టింటికి పంపించే సంప్రదాయం ఉంది. అయితే, అలా ఎందుకు పంపిస్తారో తెలుసా? ఈ నియమం వెనుక అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Ashada Masam: ఆషాడ మాసం ప్రాధాన్యత గురించి మన పూర్వికులు ఎన్నో సంప్రదాయాలు, నమ్మకాలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆషాడ మాసంలో కొత్త కోడలిని పుట్టింటికి పంపించే సంప్రదాయం ఉంది. అయితే, అలా ఎందుకు పంపిస్తారో తెలుసా? ఈ నియమం వెనుక అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మానసిక విశ్రాంతి కోసం

హిందూ ధర్మం ప్రకారం, కొత్త కోడలు ఈ మాసంలో అత్త ముఖం చూడకూడదు. ఈ నిబంధన వెనుక ఉన్న భావం ఏమిటంటే, కొత్తగా పెళ్లైన వధువులకి అత్తింట్లో కొంత ఒత్తిడి, ఆందోళనగా ఉంటుంది. కాబట్టి, వారికి మానసిక విశ్రాంతి కల్పించేందుకు, స్వేచ్ఛగా కొన్ని రోజులు గడిపేందుకు, అత్తింటి నుంచి తాత్కాలికంగా విరామం ఇవ్వడం కోసం ఆషాడ మాసంలో కొత్త కోడలిని పుట్టింటికి పంపించే సంప్రదాయం ఏర్పడింది.

పూర్వం ఆషాడ మాసం అనేది వ్యవసాయ పనులకు చాలా కీలకమైన కాలం. అప్పట్లో పురుషులు పొలం పనుల్లో నిమగ్నమవుతూ ఇంటి విషయాలకు తక్కువ సమయం కేటాయించేవారు. అయితే, భార్య, భర్త కలసి ఉంటే ఆ వ్యక్తికి పనులపై దృష్టి తగ్గవచ్చని భావించి, తాత్కాలికంగా ఆషాడ మాసంలో భార్యను పుట్టింటికి పంపించే ఆచారం మొదలైంది.

ఆరోగ్య సమస్యలు

అలాగే, ఆషాడ మాసంలో గర్భం దాల్చినట్లయితే ప్రసవం వేసవికాలంలో జరుగుతుంది. వేసవిలో తల్లీ బిడ్డలకు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని భావించి, ఈ మాసంలో దంపతులను వేరు వేరు ఉంచే సంప్రదాయాన్ని కొనసాగించారని చెబుతారు. ఆధునిక సమాజంలో ఈ నిబంధనలు, ఆచారాలు తక్కువగా పాటిస్తున్నారు. అయితే, దీని వెనుక ఉన్న కారణాలు తెలుసుకోవడం వల్ల మన పూర్వికుల దూరదృష్టిని అర్థం చేసుకోవచ్చు

యాంకర్‌ స్వేచ్ఛ సూసైడ్‌పై పూర్ణచందర్‌ భార్య షాకింగ్ కామెంట్స్.

యాంకర్‌ స్వేచ్ఛ సూసైడ్‌పై పూర్ణచందర్‌ భార్య షాకింగ్ కామెంట్స్…

 

ప్రముఖ టీవీ చానల్‌ న్యూస్‌ యాంకర్‌ స్వేచ్ఛ వొటార్కర్‌ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో నిందితుడు పూర్ణచందర్‌ భార్య స్వప్న తెరపైకి వచ్చారు.

Anchor Swetcha Votarkar Case: ప్రముఖ టీవీ చానల్‌ న్యూస్‌ యాంకర్‌ స్వేచ్ఛ వొటార్కర్‌ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో నిందితుడు పూర్ణచందర్‌ భార్య స్వప్న తెరపైకి వచ్చారు. పూర్ణ చందర్‌ ద్వారానే స్వేచ్ఛ తనకు పరిచయం అయిందన్నారు. అయితే, వారిద్దరి మధ్య సంబంధం గురించి ముందు తనకు తెలియదన్నారు. వారిద్దరి వ్యవహారం తెలిశాక పూర్ణను వదిలేశానని పేర్కొన్నారు.
పూర్ణచందర్‌పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యమని, అరణ్యను పూర్ణచందర్‌ సొంత కూతురిలా చూసుకున్నాడని స్వప్న వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ నన్ను మానసికంగా టార్చర్‌ చేసిందని, స్వేచ్ఛ పూర్ణచందర్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసిందని స్వప్న షాకింగ్ కామెంట్స్ చేశారు. నా పిల్లలను కూడా అమ్మా అని పిలవాలని బయపెట్టిందని స్వప్న వివరించారు. నా భర్త పూర్ణచందర్‌ నిర్దోషి, అమాయకుడని స్వప్న సంచలన చేశారు.

కాగా, స్వేచ్ఛ వోటార్కర్‌ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్‌ను పోలీసులు నిన్న అరెస్ట్‌ చేశారు. అతడి వేధింపుల కారణంగానే తమ కూతురు స్వేచ్ఛ మరణించినట్టు చిక్కడపల్లి పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే నిందితుడు పూర్ణచందర్‌ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వేచ్ఛ, నేను స్నేహితులుగా ఉండేవాళ్లం. ఐదేళ్లుగా ఆమె మానసికంగా ఆందోళన చెందుతూ చికిత్స పొందుతుంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. స్వేచ్ఛ ఆత్మహత్యతో నాకు ఏలాంటి సంబంధం లేదని లేఖలో పూర్ణచందర్‌ పేర్కొన్నారు.

10 వ తరగతి విద్యార్థుల అపూర్వ సమ్మేళనం.

“నేటిధాత్రి”,మహబూబాబాద్.

మహాభూభాబాద్…… ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలుసుకొన్నాం చదువులమ్మ తల్లి నీడలో అంటూ…..33 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు ఒక్క దగ్గర కలుసుకొన్నారు 1992… సంవత్సరం లో 10 వ తరగతి… అరవింద విద్యాలయంలో  చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ  సమ్మేళనం  మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హల్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ పూర్వ విద్యార్థులు చిన్న నాటి స్కూల్ డ్రెస్ లతో 50 మంది పాల్గొని తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని, ఉత్సాహంగా నృత్యాలు చేసి ఉల్లాసంగా గడిపారు. ఉద్యోగ, వ్యాపారారీత్యా ఎక్కడెక్కడో స్థిరపడి ఇతరదేశాల నుంచి ఐర్లాండ్, లండన్,అమెరికా బహ్రెయిన్ నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు 33 ఏళ్ల తర్వాత ఒకే వేదిక పై కలుసుకొని ఒకరినొకరు గుర్తు చేసుకొని ఆలింగనం చేసుకొని తన్మయత్వంలో మునిగి తేలి భావోద్వేగబరితంగా గడిపీ తమ స్నేహాన్ని ఆత్మీయతను చాటుకున్నారు.

పూర్వ విద్యార్థులు ఆటపాటలు అందరిని అలరించాయి.
పాఠశాలలో విద్యాబోధన చేసిన ఆ నాటి ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సమ్మేళనంలో నాటి ఉపాధ్యాయులు…చంద్ర దేవ్,కుమార స్వామి, సలీం,కుమార్ నాగేశ్వర్ రావు శ్రీరామరావు ఫజల్ లక్ష్మి నారాయణ వీరాస్వామి ఇతర దేశాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు తో పాటు ఇతర ప్రాంతాలలో సెటిల్ అయినా.. ఓం ప్రకాష్, ప్రమోద్, కటికరెడ్డి ఆదిత్య, మీనా. దర్మేందర్..రాజు శివరాం.. శ్రీను. వేణు. స్వామి నిరంజన్ సౌజన్య లు పాల్గొన్నారు.

గుండె బలహీనంగా ఉంటే ముఖంలో ఈ 4 సంకేతాలు..!

గుండె బలహీనంగా ఉంటే ముఖంలో ఈ 4 సంకేతాలు..!

 

 

 

 

Facial Signs of Heart Problems: గుండె బలహీనపడితే శరీరంలోని ఏ అవయవమూ సరిగ్గా పనిచేయద్దు.

మొత్తం శరీర పనితీరు లయ తప్పుతుంది.

ముఖ్యంగా ముఖంపై ఈ సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి.

వీటిని సకాలంలో గుర్తిస్తే తీవ్రమైన గుండె జబ్బులను నివారించవచ్చు.

గుండె ఎందుకు బలహీనపడటానికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు.

ముఖ్యంగా అధిక రక్తపోటు. హఠాత్తుగా పెరిగే రక్తపోటు గుండె కండరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది.

దీని కారణంగా గుండె పనితీరు క్రమంగా బలహీనపడుతుంది. అలాగే డయాబెటిస్ కూడా గుండె ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రించుకోవడంలో విఫలమైతే గుండె రక్త నాళాలను దెబ్బతీస్తుంది.

ఇంకా క్రమరహిత జీవనశైలి, ధూమపానం, అధిక మద్యం, ఫాస్ట్ ఫుడ్, ఒత్తిడి, నిద్ర లేకపోవడం కూడా గుండెను బలహీనపరుస్తాయి.

గుండె మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవం.
ఇది మొత్తం శరీరానికి రక్తం, ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు మన జీవితాంతం విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది.
కానీ గుండె బలహీనపడటం ప్రారంభించినప్పుడు లేదా సామర్థ్యం తగ్గడం మొదలైతే..
దాని ప్రభావం అంతర్గత అవయవాలపై మాత్రమే కాకుండా ముఖంపై కూడా కనిపిస్తుంది.
వైద్యులు, కార్డియాలజిస్టుల ప్రకారం ముఖంపై ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి.
వీటిని సకాలంలో గుర్తిస్తే గుండె జబ్బులు తీవ్రంగా మారకుండా నిరోధించవచ్చు.

గుండె బలహీనంగా ఉంటే ముఖంలో ఈ 4 సంకేతాలు

పాలిపోయిన లేదా పాలిపోయిన ముఖం

గుండె పనితీరు సరిగాలేకపోతే ముఖం పాలిపోవడమనే లక్షణం అత్యంత సాధారణంగా కనిపిస్తుంది.

గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేనప్పుడు శరీర భాగాలకు తగినంత ఆక్సిజన్ అందదు.

ఇది ముఖ చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

దీని వలన ముఖం నిస్తేజంగా లేదా అనారోగ్యంగా కనిపిస్తుంది.

కొన్నిసార్లు కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడి ముదురు రంగులోకి మారుతాయి.

సైనోసిస్ (ముఖం లేదా పెదవులు నీలి రంగులోకి మారడం)

మరో ముఖ్యమైన సంకేతం ముఖం లేదా పెదవులు నీలిరంగులోకి మారడం (సైనోసిస్).

శరీరానికి తగినంత ఆక్సిజన్ అందనప్పుడు పెదవులు, గోళ్లు, ముఖం నీలం లేదా బూడిద రంగులోకి మారడం ప్రారంభిస్తాయి.

ఈ పరిస్థితి ముఖ్యంగా గుండె వైఫల్యం లేదా తీవ్రమైన గుండె సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులలో కనిపిస్తుంది.

ముఖం మీద నిరంతర వాపు

మూడవ లక్షణం ముఖం మీద నిరంతరం వాపు.

గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేనప్పుడు శరీరంలో ద్రవాలు పేరుకుపోవడం మొదలవుతుంది.

దీని ప్రభావం ముఖ చర్మంపై వాపు రూపంలో కనిపిస్తుంది, ముఖ్యంగా ఉదయం నిద్ర మేల్కొన్నప్పుడు.

అధిక చెమట లేదా తరచుగా ముఖం తడిగా ఉండటం

నాల్గవ లక్షణం అధిక చెమట లేదా ముఖం తరచుగా తడిగా ఉండటం.

బలహీనమైన గుండె సాధారణ విధులను నిర్వహించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది.

దీని వలన శరీరం అధిక చెమట ఉత్పత్తి చేస్తుంది.

భారీగా కష్టపడకున్నా ముఖం పదే పదే చెమటతో తడిసిపోతే ఇది గుండె సమస్యకు సంబంధించిన సంకేతం కావచ్చు.

పై లక్షణాలను ఎప్పుడూ విస్మరించకూడదు.

ముఖ్యంగా అలసట, ఊపిరి ఆడకపోవడం లేదా ఛాతీ నొప్పితో ఉంటే వెంటనే కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి ECG, ఎకో, రక్త పరీక్షలు వంటి అవసరమైన పరీక్షలు చేయించుకోండి.

గుర్తుంచుకోండి. గుండె జబ్బులు నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి.

కానీ ముఖంపై కనిపించే సంకేతాలు గుర్తించారంటే సకాలంలో చికిత్స తీసుకోవడం సాధ్యమవుతుంది.

అయితే ప్రతి రోగిలో ఇవి కనిపించాల్సిన అవసరం లేదు.

కానీ, మీకు పై లక్షణాల్లో ఏది కనిపించినా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

 

ఆరోగ్య బీమా జాగ్రత్తలతో మరింత ధీమా

ఆరోగ్య బీమా జాగ్రత్తలతో మరింత ధీమా…

 

వయసుతో పాటు ఆరోగ్య సమస్యలూ పెరిగిపోతున్నాయి. ఈ ఖర్చుల భారం తప్పించుకోవాలంటే ఆరోగ్య బీమానే గతి. లేకపోతే ఇల్లూ,ఒళ్లూ గుల్లే. అలా అని ఏజెంట్లు చెప్పే మాటలు నమ్మి ఎడాపెడా…

వయసుతో పాటు ఆరోగ్య సమస్యలూ పెరిగిపోతున్నాయి. ఈ ఖర్చుల భారం తప్పించుకోవాలంటే ఆరోగ్య బీమానే గతి. లేకపోతే ఇల్లూ,ఒళ్లూ గుల్లే. అలా అని ఏజెంట్లు చెప్పే మాటలు నమ్మి ఎడాపెడా ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోకూడదు. అలా చేస్తే కష్ట సమయాల్లో అక్కరకు రాకపోగా మన జేబుకే చిల్లు పడే ప్రమాదం ఉంది.

దీంతో చాలా మంది స్విగ్గీ, జొమాటాలో బిర్యానీ లేదా ఇతర తినుబండారాలు ఆర్డర్‌ చేసినంత ఈజీగా ఆరోగ్య బీమా పాలసీలు కొనేస్తున్నారు. ఆ పాలసీ షరతులు ఏంటి? కవరేజీ పరిమితులు, మినహాయింపుల గురించి ఏమాత్రం అర్థం చేసుకోవడం లేదు. దీంతో ఆరోగ్యం దెబ్బతిని ఆస్పత్రిలో చేరేటప్పుడు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిమితులు, మినహాయింపులను అడ్డుపెట్టుకుని బీమా కంపెనీలూ క్లెయిమ్స్‌కు సారీ చెబుతున్నాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. అవేమిటంటే..

అవగాహన

ఆరోగ్య బీమా అనేది ఒక భరోసా. అయితే వ్యాపారం పెంచుకునేందుకు కంపెనీల ఏజెంట్లు ఇప్పుడు దీన్ని కూడా వస్తువులను అమ్మినట్టు అమ్మేస్తున్నారు. పాలసీ తీసుకునే వ్యక్తికి పెద్దగా అవగాహన లేకపోతే లేని ప్రయోజనాలను ఉన్నట్టు చెప్పి మరీ అంటగడుతున్నారు. కాబట్టి కొత్తగా ఆరోగ్య బీమా తీసుకునే వ్యక్తి లేదా వ్యక్తులు పాలసీ గురించి పూర్తిగా అవగాహన చేసుకున్నాకే పాలసీ తీసుకోవడం మంచిది. ఇందుకోసం పాలసీ షరతులు, కవరేజీ పరిమితులు, మినహాయింపులను ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థంగాకపోతే ఎవరైనా ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.

ఇప్పటికే ఉన్న వ్యాధులు

దాదాపు అన్ని బీమా కంపెనీలు ఇప్పటికే ఉన్న వ్యాధులకు వెంటనే కవరేజీ అనుమతించవు. కనీసం రెండు మూడేళ్ల తర్వాతే ఇందుకు అనుమతిస్తాయి. ఒకవేళ ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలకు కూడా వెంటనే కవరేజీ కావాలంటే ప్రీమియం కొద్దిగా ఎక్కువ చెల్లించాలి.

మెటర్నిటీ ట్రీట్‌మెంట్లు

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడే మెటర్నిటీ ట్రీట్‌మెంట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. లేకపోతే బీమా కంపెనీలు ఇందుకు అనుమతించవు. ఒకవేళ అనుమతించినా అందుకు సవాలక్ష పరిమితులు, ఆంక్షలు పెడుతుంటాయి.

ఆధునిక ట్రీట్‌మెంట్లు

ఆరోగ్య సమస్యలతో పాటు ట్రీట్‌మెంట్లు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. టెక్నాలజీ అభివృద్ధితో ఇప్పుడు అధునాతన రోబోటిక్‌ సర్జరీలు, జన్యు (జెనెటిక్‌) పరీక్షలూ అందుబాటులోకి వచ్చాయి. పాలసీ తీసుకునేటప్పుడే ఇవి కూడా కవరయ్యేలా జాగ్రత్త పడాలి.

మానసిక రుగ్మతలు

మానసిక రుగ్మతలకు కూడా ఆరోగ్య బీమా వర్తింప చేయాలని బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) ఆదేశాలు జారీ చేసింది. అయినా ఈ ఆప్షన్‌ ఒకటి ఉందనే విషయాన్ని బీమా కంపెనీలు పెద్దగా పాలసీదారులకు చెప్పడం లేదు. మానసిక ఒత్లిళ్లు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఆరోగ్య బీమా పాలసీ కింద ఈ రుగ్మతలకు కూడా కవరేజీ ఉండేలా చూసుకోవాలి.

గదుల అద్దె

కొన్ని ఆరోగ్య సమస్యలకు ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్‌గా చేరక తప్పదు. అయితే ఇందుకు అయ్యే రూమ్‌ రెంట్‌పై బీమా కంపెనీలు అనేక పరిమితులు పెడుతుంటాయి. ఆ పరిమితికి మించి రూమ్‌ రెంట్‌ ఉంటే ఆ అదనపు మొత్తాన్ని పాలసీదారులే భరించాలి. కొన్ని బీమా కంపెనీలు రూమ్‌ రెంట్‌ ఎంత ఉన్నా, అది పాలసీ కవరేజీకి లోబడి ఉంటే చాలని చెబుతున్నాయి. పాలసీ తీసుకునేటప్పుడే పాలసీదారులు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. లేకపోతే జేబుకు చిల్లు పడుతుంది.

ఓపీడీ, వ్యాధి నిర్ధారణ

ఇవాళ ఔట్‌ పేషెంట్‌ సేవలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా పెద్దభారంగా మారాయి. పెద్దపెద్ద ఆస్పత్రుల్లో డాక్టర్‌ కన్సల్టేషన్‌, వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడే ఈ ఖర్చులకూ కవరేజీ ఉండేలా జాగ్రత్త పడాలి. అయితే బీమా కంపెనీలు ఒక పరిమితి వరకే ఈ ఖర్చులను అనుమతిస్తాయి.

ఇతర జాగ్రత్తలు

  • పాలసీ తీసుకునే ముందే పాలసీ బ్రోచర్‌ను కాకుండా పాలసీ పూర్తి డాక్యుమెంట్‌ తీసుకుని చదివి పూర్తిగా అర్థం చేసుకోవాలి.
  • పాలసీ ద్వారా ఏయే సమస్యలకు కవరేజీ లభించదో ముందుగానే పూర్తిగా తెలుసుకోవాలి.
  • బీమా కంపెనీల పరిభాష అందరికీ అర్థం కాదు. పాలసీలో పేర్కొనే సబ్‌ లిమిట్స్‌, కో-పే, వెయిటింగ్‌ పీరియడ్‌ అంటే ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
  • వివాహం, పిల్లలు పుట్టినప్పుడు, వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నప్పుడు మీరు తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీ మీ అవసరాలకు సరిపోతుందా? లేదా? అనే విషయాన్ని సమీక్షించుకోవాలి.
  • మీ ఆరోగ్య బీమా పాలసీ కంపెనీ, పాలసీ వివరాలపై కుటుంబసభ్యులకు ముందుగానే పూర్తిగా తెలియజేయాలి. ఎందుకంటే ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే అన్ని విషయాలు చక్కబెట్టాల్సిందే వారే.

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే ముందే ఈ జాగ్రత్తలు తీసుకుంటే, అవసరమైనప్పుడు జేబులో పైసా ఖర్చు చేయకుండా ఆరోగ్య సమస్యల నుంచి తేలిగ్గా గట్టెక్కవచ్చు. లేకపోతే ఆరోగ్య పరంగానే కాకుండా ఆర్థికంగానూ దెబ్బతినే ప్రమాదం ఉంది

అప్పు కావాలంటూ మేనేజర్ వేధింపులు..

అప్పు కావాలంటూ మేనేజర్ వేధింపులు.. లబోదిబోమంటున్న ఉద్యోగి

 

 

 

 

 

 

 

 

అప్పు కోసం తన మేనేజర్ నిత్యం వేధిస్తున్నాడంటూ ఓ కిందిస్థాయి ఉద్యోగి నెట్టింట పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. ఇలాంటి ప్రవర్తనను అస్సలు సహించొద్దని నెటిజన్లు అతడికి సూచించారు. హెచ్ఆర్ విభాగంలో వెంటనే ఫిర్యాదు చేయాలని అన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: అప్పు కావాలంటూ సీనియర్ మేనేజర్ కిందిస్థాయి ఉద్యోగిని నిత్యం వేధిస్తున్న వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. బాధిత ఉద్యోగి ఈ విషయాన్ని నెట్టింట పంచుకున్నారు. ఈ పరిస్థితుల్లోంచి ఎలా బయటపడాలో చెప్పాలంటూ నెటిజన్లను అభ్యర్ధించారు. దీంతో, ఈ ఉదంతంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

‘అప్పు ఇవ్వాలంటూ మా మేనేజర్ నిత్యం నన్ను వేధిస్తుంటారు. నేను సంస్థలో చేరి నాలుగేళ్లు అవుతోంది. ఫ్రెషర్‌గా అప్పట్లో జాబ్‌లో చేరా. నా శాలరీ ఎంతో ఆయనకు తెలుసు. నా ఆఫ్‌షోర్ టీం సభ్యులందరి కంటే నా శాలరీ ఎక్కువని తరచూ మేనేజర్ అంటుంటారు. నేను టాప్ కాలేజీలో చదువుకున్నా. అందుకే నా స్టార్టింగ్ ప్యాకేజీ ఎక్కువగా ఉంది. మేనేజర్ అప్పులు అడగడం ప్రారంభించాక నాకు చిక్కులు ఎక్కువయ్యాయి. ఇటీవల ఓసారి రూ.25 వేలు ఇమ్మన్నారు’

‘ఆ తరువాత 15 వేల అప్పు అడిగారు. నేను కుదరదన్నాను. వారం క్రితం రూ.17 వేలు కావాలని డిమాండ్ చేశారు. నిన్న నేరుగా నాకు కాల్ చేసి తన క్యూఆర్ కోడ్ పంపిస్తున్నట్టు చెప్పారు. రూ.2 వేలు వెంటనే పంపించాలని అన్నారు. నీకేమీ అభ్యంతరం లేదుగా అని మాటవరుసకు కూడా అడగలేదు. ఇలా ప్రతిసారీ కుదరదని చెప్పడం నాకు చిరాకు తెప్పిస్తోంది. కానీ ఆయన మాత్రం నిస్సిగ్గుగా అప్పు అడుగుతూనే ఉన్నాడు’ అని వాపోయాడు.

ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ‘ ఈ ఘటనతో కార్పొరేట్ రంగంలో దాదాపుగా అన్ని దారుణాలు చూసినట్టైంది. ఇక మిగిలిందల్లా ఉద్యోగులపై రివ్యూల కోసం మేనేజర్‌లు లంచాలు డిమాండ్ చేయడమే. ఈ వేధింపులు ఎక్కువ కాలం భరించొద్దు. వెంటనే హెచ్ఆర్‌కు ఎస్కలేట్ చేయాలి’ అని అన్నారు. ‘నువ్వే మేనేజర్‌ను రూ.50 వేల అప్పు అడుగు. ఎమర్జెన్సీ వచ్చిందని చెప్పు. ఆ తరువాత మేనేజర్ నీ జోలికే రాడు’ అని మరొకరు భరోసా ఇచ్చారు.

విజిలెన్స్ చర్యను నిలదీసిన ఎమ్మెల్యేపై ఐదేళ్ల సస్పెన్షన్.

విజిలెన్స్ చర్యను నిలదీసిన ఎమ్మెల్యేపై ఐదేళ్ల సస్పెన్షన్ వేటు

 

 

 

 

అకాలీదళ్ సీనియర్ నేత బిక్రమ్ మజిథియాపై విజిలెన్స్ కేసు వ్యవహారంలో ఆప్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విజయ్ ప్రతాప్ బహిరంగ విమర్శలు చేసిన క్రమంలో ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. దాడుల సమయంలో మజిథియా భార్య విలిజెన్స్ టీమ్‌తో గొడవ పడుతున్న వీడియోను సోషల్ మీడియాలో విజయ్ ప్రతాప్ పోస్ట్ చేశారు.

అమృత్‌సర్: మాజీ ఐపీఎస్ అధికారి, అమృత్‌సర్ నార్త్ ఎమ్మెల్యే కున్వర్ విజయ్ ప్రతాప్‌ సింగ్‌పై ఆప్ ఆద్మీ పార్టీ (AAP) కీలక క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి ఐదేళ్ల పాటు సస్పెండ్ చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంగా పార్టీ పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

విజిలెన్స్ చర్యలను ప్రశ్నించినందుకే

అకాలీదళ్ సీనియర్ నేత బిక్రమ్ మజిథియాపై విజిలెన్స్ కేసు వ్యవహారంలో ఆప్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విజయ్ ప్రతాప్ బహిరంగ విమర్శలు చేసిన క్రమంలో ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. దాడుల సమయంలో మజిథియా భార్య విలిజెన్స్ టీమ్‌తో గొడవ పడుతున్న వీడియోను సోషల్ మీడియాలో విజయ్ ప్రతాప్ పోస్ట్ చేశారు. విజిలెన్స్ ఆపరేషన్ తీరుపై విమర్శలు గుప్పించారు. ‘మజిథియా జైలులో ఉన్నారు. ఆయనపై ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేపట్టలేదు. ఆయనను ప్రశ్నించడం కూడా జరగలేదు. ఆయన బెయిల్ పొందేందుకు అనుమతించాలి’ అని అన్నారు. మజిథియా నివాసంపై తెల్లవారుజామున దాడులు జరగడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. రాజకీయ వేత్త అయినా, నటుడయినా, డబ్బున్న వాడు, పేదవాడు, మిత్రుడు, శత్రువు ఇలా ఎవరైనా కావచ్చు… ప్రతి కుటుంబానికి ఒక గౌరవం అంటూ ఉంటుంది. ఉదయమే ఇంంటిలోకి చొరబడం తప్పు, అనైతికం..అని ఆయన తన ట్వీట్‌లో ఖండించారు.

శతక్కొట్టిన మంధాన.

శతక్కొట్టిన మంధాన…

 

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు ఘనంగా బోణీ చేసింది. తాత్కాలిక కెప్టెన్‌, స్టార్‌ ఓపెనర్‌ స్మృతీ మంధాన (62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 112) తన టీ20 కెరీర్‌లో

తొలి టీ20లో ఇంగ్లండ్‌పై భారత్‌ ఘన విజయం

51 బంతుల్లోనే సెంచరీ

నాటింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు ఘనంగా బోణీ చేసింది. తాత్కాలిక కెప్టెన్‌, స్టార్‌ ఓపెనర్‌ స్మృతీ మంధాన (62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 112) తన టీ20 కెరీర్‌లో తొలి సెంచరీతో అదరగొట్టింది. ప్రత్యర్థి బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చూపిన స్మృతి ఆఖరి ఓవర్‌లో వెనుదిరగగా, హర్లీన్‌ డియోల్‌ (23 బంతుల్లో 7 ఫోర్లతో 43) అద్భుత సహకారం అందించింది. ఇక, తెలుగమ్మాయి, కడప జిల్లాకు చెందిన శ్రీచరణి తన అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తా చాటుతూ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టింది. ఫలితంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 97 రన్స్‌తో ఘన విజయం సాధించింది. టీ20ల్లో ఇంగ్లండ్‌కిదే అతిపెద్ద ఓటమి. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ 1-0తో పైచేయి సాధించింది. రెండో మ్యాచ్‌ మంగళవారం జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. లారెన్‌ బెల్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఇంగ్లండ్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. తొలి అంతర్జాతీయ టీ20 ఆడిన యువ స్పిన్నర్‌ శ్రీచరణి (3.5-0-12-4) అద్భుత గణాంకాలు నమోదు చేయడంతో ఇంగ్లండ్‌ 14.5 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ జట్టులో కెప్టెన్‌ సివర్‌ బ్రంట్‌ (42 బంతుల్లో 10 ఫోర్లతో 66) మినహా ఎవరూ రాణించలేదు. రాధా యాదవ్‌, దీప్తి శర్మలకు రెండేసి వికెట్లు లభించాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా మంధాన నిలిచింది. వామప్‌ మ్యాచ్‌లో తలకు గాయం కావడంతో ముందు జాగ్రత్తగా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌కు విశ్రాంతినిచ్చారు.మంధాన, హర్లీన్‌ జోరు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్‌ మంధాన, వన్‌డౌన్‌ బ్యాటర్‌ హర్లీన్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో భారీ స్కోరును అందించారు. అయితే చివర్లో పుంజుకున్న ఇంగ్లండ్‌ బౌలర్లు కాస్త కట్టడి చేయగలిగారు. ఆరంభంలో మరో ఓపెనర్‌ షఫాలీ (20) తడబడినా.. మంధాన సహజశైలిలో బ్యాట్‌ ఝుళిపించింది. మైదానం నలువైపులా భారీ షాట్లు ఆడేస్తూ చకచకా స్కోరును పెంచింది. తొలి వికెట్‌కు షఫాలీతో కలిసి 77 పరుగులు అందించింది. ఆ తర్వాత హర్లీన్‌ రాకతో భారత్‌ స్కోరు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. పదో ఓవర్‌లో ఆమె మూడు ఫోర్లు సాధించింది. అలాగే మంధాన సిక్సర్‌తో స్కోరు 11వ ఓవర్‌లోనే వందకి చేరింది. అయితే హర్లీన్‌ 26 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను వ్యాట్‌ హాడ్జ్‌ వదిలేసింది. అటు అవలీలగా బౌండరీలు బాదేసిన మంధాన 51 బంతుల్లోనే టీ20 కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేసుకుంది. 16వ ఓవర్‌లో హర్లీన్‌ను పేసర్‌ లారెన్‌ బెల్‌ అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 94 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. అనంతరం భారత్‌ వేగంగా వికెట్లను కోల్పోయింది. రిచా (12), జెమీమా (0) 18వ ఓవర్‌లో వెనుదిరిగారు. ఆఖరి ఓవర్‌లో ఫోర్‌తో స్కోరును 200కి చేర్చిన స్మృతి మంధాన ఆ వెంటనే అవుటైంది. మొత్తంగా చివరి మూడు ఓవర్లలో జట్టు 26 పరుగులే సాధించింది.

వరల్డ్ కప్ ఫైనల్‌లో పంత్ నాటకం నిజం బయటపెట్టిన రోహిత్.

 వరల్డ్ కప్ ఫైనల్‌లో పంత్ నాటకం నిజం బయటపెట్టిన రోహిత్…

 

జూన్ 29. టీమిండియా చరిత్రలో ఇది మర్చిపోలేని రోజు. సరిగ్గా ఏడాది కింద ఇదే తేదీ నాడు టీ20 ప్రపంచ కప్-2024ను కైవసం చేసుకుంది భారత జట్టు. కప్పు కలను తీర్చుకొని కోట్లాది మంది అభిమానుల్ని సంతోషంలో ముంచెత్తింది.

జూన్ 29, 2024.. ఈ తేదీ భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేనిది. ఈ రోజునే టీ20 వరల్డ్ కప్-2024ను గెలుచుకుంది టీమిండియా. సరిగ్గా ఏడాది కింద జరిగిన ఫైనల్ సమరంలో సౌతాఫ్రికాను 7 పరుగుల తేడాతో మట్టికరిపించింది రోహిత్ సేన. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు, ఫీల్డర్లు సమష్టిగా రాణించడంతో అద్భుతమైన విజయం అందుకుంది. అయితే మ్యాచ్‌ను మలుపు తిప్పిన క్షణం మాత్రం వికెట్ కీపర్ రిషబ్ పంత్ తీసుకున్న బ్రేక్ అనే చెప్పాలి. దీనిపై తాజాగా స్పందించాడు భారత వన్డే సారథి రోహిత్ శర్మ. పంత్ నాటకం వెనుక అసలు నిజం ఏంటో అతడు బయటపెట్టాడు. ఇంతకీ హిట్‌మ్యాన్ ఏం అన్నాడంటే. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో అప్పటికి 30 బంతుల్లో 30 పరుగులు కావాలి. అప్పుడే చిన్న విరామం దొరికింది. పంత్ తన బుర్రను వాడి కాసేపు మ్యాచ్‌ను ఆపేశాడు. మోకాలి గాయం ఇబ్బంది పెడుతుండటంతో ట్రీట్‌మెంట్ తీసుకొని ఆడాడు. దీని వల్ల మ్యాచ్ కాస్త నెమ్మదించింది. అప్పటికి ఊపు మీదున్న ప్రొటీస్ బ్యాటర్ల రిథమ్ దెబ్బతింది. క్లాసెన్ గేమ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూశాడు. మ్యాచ్ షురూ అయ్యాక అతడు ఔట్ అయ్యాడు. ఆ తర్వాత విక్టరీ కొట్టాం. అయితే పంత్ చేసిన పని వల్లే గెలిచామని అనడం లేదు. కానీ అతడు బుర్ర వాడటం జట్టుకు చాలా మంచి చేసింది’ అని రోహిత్ బయటపెట్టాడు. మ్యాచ్‌ను స్లో చేయాలనే ఉద్దేశంతో కావాలనే పంత్ గాయం పేరుతో నాటకం ఆడాడని హిట్‌మ్యాన్ తెలిపాడు. ఈ బ్రేక్ వల్ల మూమెంటమ్ మొత్తం సౌతాఫ్రికా నుంచి టీమిండియా వైపు తిరిగిందన్నాడు.

డంప్‌యార్డ్‌లో… మాస్క్‌ లేకుండా…

డంప్‌యార్డ్‌లో… మాస్క్‌ లేకుండా…

 

 

 

 

ధనుష్‌… పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. ‘రఘువరన్‌ బీటెక్‌’తో తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకున్న ఈ తమిళస్టార్‌… శేఖర్‌ కమ్ముల ‘కుబేర’లో మరోసారి విభిన్నంగా కనిపించి, మెప్పించాడు.

 

ధనుష్‌… పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. ‘రఘువరన్‌ బీటెక్‌’తో తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకున్న ఈ తమిళస్టార్‌… శేఖర్‌ కమ్ముల ‘కుబేర’లో మరోసారి విభిన్నంగా కనిపించి, మెప్పించాడు. ఇటీవల ధనుష్‌ పంచుకున్న కొన్ని ఆసక్తికర కబుర్లివి…

 

అమ్మాయి కోసమే ట్యూషన్‌లో చేరా…

మమ్మల్ని చదివించేందుకు మా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో.. నా పిల్లలను చదివిస్తుంటే నాకు అర్థమవుతోంది. నేను చదువుకోవాల్సిన సమయంలో తెగ అల్లరి చేసేవాణ్ని. చదువు కోసం కాకుండా ఓ అమ్మాయి కోసమే ట్యూషన్‌లో చేరా. ట్యూషన్‌ టీచర్‌ ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పలేకపోయేవాణ్ని. కొన్ని రోజులకు నాపై నాకే సిగ్గేసి ట్యూషన్‌ మానేశా. కానీ స్నేహితురాలిని కలుసుకునేందుకు బయట వేచి చూసేవాణ్ని. నేను వచ్చినట్టు ఆమెకు తెలియాలని బైక్‌తో సౌండ్‌ చేసేవాణ్ని. దాంతో టీచర్‌… ‘మీరంతా చదువుకుని ఉన్నత స్థాయిలో ఉంటారు. కానీ బయట బైక్‌ మీద ఉన్నవాడు మాత్రం పెద్దయ్యాక వీధుల్లో డ్యాన్స్‌ చేసుకోవాల్సిందే’ అని అన్నారట. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే… అప్పట్లో చదువు ఎందుకు అశ్రద్ధ చేశానా? అని బాధపడుతుంటా.

 

అందుకే ఆ పేరు…

నేను, అనిరుధ్‌ (సంగీత దర్శకుడు) కలసి ‘ఇన్‌గ్లోరియస్‌ బాస్టర్డ్స్‌’ అనే హాలీవుడ్‌ చిత్రం చూశాం. ఆ సినిమాలో అందరూ ‘వండర్‌బార్‌’ అనే పదం పదేపదే వాడుతుంటారు. నిజానికి అదొక జర్మన్‌ పదం. ఎందుకోగానీ అది మైండ్‌లో బాగా రిజిస్టరైపోయింది. కట్‌చేస్తే కొన్ని రోజుల తర్వాత నేను ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాలనుకున్నా. రెండో ఆలోచన లేకుండా నా నిర్మాణ సంస్థకు ‘వండర్‌బార్‌ ఫిల్మ్స్‌’ అని పేరు పెట్టా.

ఆయన ప్రేరణతో…

కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా. ‘హీరో మెటీరియల్‌ కాదు. లుక్స్‌ బాగాలేవు’ అని విమర్శలు గుప్పించారు. దాంతో ఆత్మన్యూనత భావన కలిగింది. సరిగ్గా అప్పుడే దర్శకుడు బాలు మహేంద్ర.. ‘నువ్వు ఇటాలియన్‌ మోడల్‌లా కనిపిస్తావు. నిన్ను నువ్వు తక్కువగా చూసుకోకు’ అని చెప్పారు. ఆ మాటలు నన్ను ప్రేరేపించాయి.

 

కుబేర మహిళా విజయం.

కుబేర మహిళా విజయం

 

 

 

ఈ మధ్య విడుదలై… విజయం సాధించిన ‘కుబేర’ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది.

ఈ సినిమాలో దాదాపు ప్రతి విభాగంలో అనేకమంది మహిళలు పనిచేశారు.

వారిలో ఎక్కువ మంది…

ఈ మధ్య విడుదలై…

విజయం సాధించిన ‘కుబేర’ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది.

ఈ సినిమాలో దాదాపు ప్రతి విభాగంలో అనేకమంది మహిళలు పనిచేశారు.

వారిలో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు వారు కావటం విశేషం.

వారిని ‘నవ్య’ పలకరించినప్పుడు పంచుకున్న అనుభవాలు మీ కోసం…

ప్రజాస్వామిక వాతావరణంలో…

నా పేరు అమూల్య. డైరక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పనిచేశా.

ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. శేఖర్‌ కమ్ముల ‘హ్యాపీడేస్‌’ విడుదలయినప్పుడు నాకు 12 ఏళ్లు.

ఆ సినిమా చూసి డైరక్టర్‌ కావాలనుకున్నా. పెద్దయిన తర్వాత ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేయటం ఒక గొప్ప అనుభవం.

నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లో.

ముంబాయిలోని సుభాష్‌ ఘాయ్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో రైటింగ్‌, డైరెక్షన్‌లలో డిగ్రీ చేశా.

ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయానికి నాకు ఎవరూ తెలీదు.

పరిచయస్తులు ఇచ్చే సమాచారం ఆధారంగా అవకాశాలు వెతుక్కోవాల్సి వచ్చింది.

అయితే అవకాశాలు త్వరగానే వచ్చాయి. ‘పరంపర’ వెబ్‌ సిరీస్‌ డైరక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశా.

ఆ తర్వాత శేఖర్‌గారి దగ్గర చేరాను. షూటింగ్‌ సమయాల్లో రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేయాల్సి ఉంటుంది.

ఒక విధంగా చూస్తే మహిళలకు అది కష్టమే! కానీ అదృష్టవశాత్తు నేను చేసిన ప్రాజెక్టులలో నాకు పెద్ద కష్టం కాలేదు.

‘కుబేర’ టీమ్‌లో చాలామంది అమ్మాయిలు ఉండటం దీనికి ఒక కారణం.

రెండోది శేఖర్‌ సార్‌ అనుసరించే విలువలు.

ఆయన దగ్గర మన అభిప్రాయాలను సూటిగా చెప్పవచ్చు.

ప్రతి వ్యక్తి అభిప్రాయానికి గౌరవం లభిస్తుంది.

ఇలాంటి ప్రజాస్వామిక వాతావరణంలో పనిచేస్తున్నప్పుడు పెద్దగా ఒత్తిడి అనిపించదు.

ఇక ఆయన ఎవరిపైనా చిరాకు పడటం చూడలేదు.

డైరక్షన్‌ అనేది చాలా ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం.

అంత ఒత్తిడిలోను ఎప్పుడూ ఎవరిపైనా చిరాకు పడేవారు కాదు.

ఆయన దగ్గర నుంచి నేను తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన విషయం అది.

ఇక ‘కుబేర’ షూటింగ్‌ సమయంలో నేను మరచిపోలేని సంఘటన ఒకటి ఉంది.

ధనుష్‌ పాటను 800 మంది జూనియర్‌ ఆర్టిస్టులతో చిత్రీకరించాం.

మా అందరిపైనా విపరీతమైన ఒత్తిడి ఉంది. షూటింగ్‌ పూర్తయ్యాక…

ధనుష్‌ సర్‌ వెళ్లిపోయిన వెంటనే అందరం రిలాక్స్‌ అయిపోయాం.

బ్యాండ్‌ వాళ్లు వాయించటం ఆపలేదు.

దాంతో అందరూ డ్యాన్స్‌ చేయటం మొదలుపెట్టారు.

లైట్‌ బాయ్‌ నుంచి డైరక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్ల వరకూ అందరూ దాదాపు గంట డ్యాన్స్‌ చేశారు.

నా జీవితంలో మరచిపోలేని సంఘటన అది.

మీ కళ్లు షార్ప్ అయితే ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 19 సెకెన్లలో కనిపెట్టండి.

 మీ కళ్లు షార్ప్ అయితే ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 19 సెకెన్లలో కనిపెట్టండి…

 

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ కుర్రాడి చేతికి ఉన్న రిస్ట్ వాచ్ కనబడుతోంది. పక్క పక్కనే ఉన్న రెండు ఫొటోల్లోనూ అదే దృశ్యం ఉంది. అయితే ఆ రెండు ఫొటోల్లో మూడు చిన్న తేడాలున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే ఆ రెండు ఫొటోల మధ్యనున్న తేడాలు కనబడతాయి. 19 సెకెన్ల వ్యవధిలో ఆ తేడాలను కనిపెడితే మీ బ్రెయిన్ స్పీడ్‌గా పని చేస్తున్నట్టు లెక్క. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ రెండు ఫొటోల మధ్యనున్న తేడాలేంటో తెలుస్తుంది.

ప్రైవేట్‌ స్కూళ్లలో ఉచిత ప్రవేశాల గడువు పొడిగింపు.

ప్రైవేట్‌ స్కూళ్లలో ఉచిత ప్రవేశాల గడువు పొడిగింపు

 

 

 

 

విద్యా హక్కు చట్టం కింద ఈ విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల కోసం లాటరీ ద్వారా ఎంపిక చేసిన రెండో విడత జాబితాలోని విద్యార్థులు తమ ప్రవేశాలను నిర్ధారణ చేసుకోవడానికి ప్రభుత్వం జూలై 2వ తేదీ వరకు గడువు పొడిగించింది.

 

  • అడ్మిషన్లు నిరాకరిస్తే శాఖాపరమైన చర్యలు: సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు
  • విద్యా హక్కు చట్టం కింద ఈ విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల కోసం లాటరీ ద్వారా ఎంపిక చేసిన రెండో విడత జాబితాలోని విద్యార్థులు తమ ప్రవేశాలను నిర్ధారణ చేసుకోవడానికి ప్రభుత్వం జూలై 2వ తేదీ వరకు గడువు పొడిగించింది. సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు బి.శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ సమాచారాన్ని ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్‌ నెంబర్లకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేయడంతోపాటు వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

పూర్తి వివరాల కోసం టోల్‌ ఫ్రీ నెంబరు 18004258599లో సంప్రదించాలని సూచించారు. రెండో విడత లాటరీలో 8,583 మంది విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు సీట్లు కేటాయించారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి వారికి ఉచిత ప్రవేశాలు కల్పించాలని, సరైన కారణం లేకుండా అడ్మిషన్లు నిరాకరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విద్యా రంగంలో మార్పు మొదలైంది నారా లోకేశ్.

విద్యా రంగంలో మార్పు మొదలైంది నారా లోకేశ్…

 

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ఈ ఘటనపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.అమరావతి, జూన్ 29: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యారంగంలో మార్పు మొదలైందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన కోసం ఏడాది కాలంగా తాను చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. నక్కపల్లి మండలం దేవవరంలో ఒకే రోజు 32 మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాలకు మారడం హర్షణీయమని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం తాను చేస్తున్న కృషిలో భాగస్వాములుగా నిలుస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తలిదండ్రులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు.. కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆయన కేబినెట్‌లో విద్య శాఖ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలో విద్యా రంగంలో సమూల మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. గత నెలలో విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదవిన విద్యార్థులు మంచి ర్యాంకులు పొందారు.దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు తీవ్ర ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. మరోవైపు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు. అదే విధంగా తల్లికి వందనం కింద వారి ఖాతాల్లో రూ.15వేలు సైతం ప్రభుత్వం వేస్తోంది. దీంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి చిన్నారుల తల్లిదండ్రులు వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుతున్నారు.

నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే.

నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే…

 

JC Prabhakar Reddy: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇద్దరు నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు.. ఇద్దరూ ఏం మాట్లాడారంటే..

Anantapuram: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Ex MLA Kethireddy Peddareddy) తాడిపత్రి (Tadipatri)కి రావడంతో ఉద్రిక్తత (Tension) పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పెద్దారెడ్డిని తిరిగి అనంతపురానికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ (Municipal Chairman) జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) మీడియాతో మాట్లాడారు. తమకు శత్రువు పెద్దారెడ్డి మాత్రమేనని, వైసీపీ కార్యకర్తలు కాదని అన్నారు. వైసీపీ కార్యకర్తలను ఇప్పటి వరకు ఏమీ అనలేదని ఆయన స్పష్టం చేశారు. పెద్దారెడ్డి ఇళ్ళు రిజిస్ట్రేషన్ తప్పని.. ఆ ఇంటికి ప్లాన్ లేదని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట వచ్చిన ఎవరెవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో… వారి ఫోటోలు తన దగ్గర ఉన్నాయన్నారు. పెద్దారెడ్డి వెంట వచ్చిన వైసీపీ కార్యకర్తలను రప్పా రప్పా ఆడిస్తామన్నారు. ఇక నుంచి తమ కార్యకర్తలు ఎలా ఉంటారో చూడాలన్నారు. రేపటి (సోమవారం) నుంచి పెద్దారెడ్డి ఇంటిదగ్గర,, వైసీపీ కార్యకర్తలు వుంటే మా కార్యకర్తలు రప్పా రప్పా అంటే ఎలా ఉంటుందో చూపిస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.చర్యకు ప్రతి చర్య ఉంటుంది.తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. తాను తాడిపత్రిలో ఉంటే ఆయన ఆగడాలు సాగవని టీడీపీ నేతలు భావిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కాళ్లు పట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందని, పోలీసులను అడ్డుపెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి హింసా, ముండమోపి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తన ఆస్తులను జేసీ ప్రభాకర్ రెడ్డి టార్గెట్ చేశారన్నారు. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా తాడిపత్రిలోని తన ఇంటికి కొలతలు వేయించారని, తాను మునిసిపల్ స్థలం ఆక్రమించలేదని అన్నారు. కొనుగోలు చేసిన స్థలంలోనే ఇంటి నిర్మాణం చేశానన్నారు. తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు.కాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసుల కళ్లుగప్పి తాడిపత్రిలోని భగత్‌సింగ్ నగర్‌లో ఉన్న తన నివాసానికి వచ్చారు. ఈ క్రమంలో తాడిపత్రిలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తడంతో కేతిరెడ్డిని తాడిపత్రికి రావద్దని పోలీసులు పలుమార్లు సూచించారు. అయితే తాను హైకోర్టు ఆదేశాలతో తన నివాసానికి వచ్చానని చెప్పారు. ఈ క్రమంలో తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండానికి వీల్లేదని.. గతంలోవైసీపీ హయాంలో పెద్దారెడ్డి తన ఇంట్లోకి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చేశారని, తాడిపత్రిలో సమస్యలకు పెద్దారెడ్డే కారణమని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడే అవకాశముందని ఆయన అన్నారు. దీంతో పోలీసులు పెద్దారెడ్డి నివాసానికి వెళ్లి ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెబుతూ ఆయనను అనంతపురంకు తరలించారు.

 

error: Content is protected !!
Exit mobile version