నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే.

నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే…

 

JC Prabhakar Reddy: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇద్దరు నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు.. ఇద్దరూ ఏం మాట్లాడారంటే..

Anantapuram: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Ex MLA Kethireddy Peddareddy) తాడిపత్రి (Tadipatri)కి రావడంతో ఉద్రిక్తత (Tension) పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పెద్దారెడ్డిని తిరిగి అనంతపురానికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ (Municipal Chairman) జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) మీడియాతో మాట్లాడారు. తమకు శత్రువు పెద్దారెడ్డి మాత్రమేనని, వైసీపీ కార్యకర్తలు కాదని అన్నారు. వైసీపీ కార్యకర్తలను ఇప్పటి వరకు ఏమీ అనలేదని ఆయన స్పష్టం చేశారు. పెద్దారెడ్డి ఇళ్ళు రిజిస్ట్రేషన్ తప్పని.. ఆ ఇంటికి ప్లాన్ లేదని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట వచ్చిన ఎవరెవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో… వారి ఫోటోలు తన దగ్గర ఉన్నాయన్నారు. పెద్దారెడ్డి వెంట వచ్చిన వైసీపీ కార్యకర్తలను రప్పా రప్పా ఆడిస్తామన్నారు. ఇక నుంచి తమ కార్యకర్తలు ఎలా ఉంటారో చూడాలన్నారు. రేపటి (సోమవారం) నుంచి పెద్దారెడ్డి ఇంటిదగ్గర,, వైసీపీ కార్యకర్తలు వుంటే మా కార్యకర్తలు రప్పా రప్పా అంటే ఎలా ఉంటుందో చూపిస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.చర్యకు ప్రతి చర్య ఉంటుంది.తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. తాను తాడిపత్రిలో ఉంటే ఆయన ఆగడాలు సాగవని టీడీపీ నేతలు భావిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కాళ్లు పట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందని, పోలీసులను అడ్డుపెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి హింసా, ముండమోపి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తన ఆస్తులను జేసీ ప్రభాకర్ రెడ్డి టార్గెట్ చేశారన్నారు. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా తాడిపత్రిలోని తన ఇంటికి కొలతలు వేయించారని, తాను మునిసిపల్ స్థలం ఆక్రమించలేదని అన్నారు. కొనుగోలు చేసిన స్థలంలోనే ఇంటి నిర్మాణం చేశానన్నారు. తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు.కాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసుల కళ్లుగప్పి తాడిపత్రిలోని భగత్‌సింగ్ నగర్‌లో ఉన్న తన నివాసానికి వచ్చారు. ఈ క్రమంలో తాడిపత్రిలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తడంతో కేతిరెడ్డిని తాడిపత్రికి రావద్దని పోలీసులు పలుమార్లు సూచించారు. అయితే తాను హైకోర్టు ఆదేశాలతో తన నివాసానికి వచ్చానని చెప్పారు. ఈ క్రమంలో తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండానికి వీల్లేదని.. గతంలోవైసీపీ హయాంలో పెద్దారెడ్డి తన ఇంట్లోకి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చేశారని, తాడిపత్రిలో సమస్యలకు పెద్దారెడ్డే కారణమని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడే అవకాశముందని ఆయన అన్నారు. దీంతో పోలీసులు పెద్దారెడ్డి నివాసానికి వెళ్లి ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెబుతూ ఆయనను అనంతపురంకు తరలించారు.

 

నా కంటే నా భార్యకు సంతోషంగా ఉంది.

నా కంటే నా భార్యకు సంతోషంగా ఉంది…

 

ప్రముఖ నటుడు విజయ్ సేతు పతి కుమారుడు హీరోగా ఓ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. 

సినిమా టైమింగ్స్ఏ విషయంలోనైనా తన కుమారుడు సూర్య స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలన్నదే తన కోరిక అని ప్రముఖ నటుడు విజయ్ సేతు పతి (Vijay Sethupathi) అన్నారు.
ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఫోనిక్స్ (Phoenix ). సూర్య విజయ్ సేతుపతి (Surya Sethupathi), అభినక్షత్ర, వర్ష హీరో, హీరోయిన్లుగా న‌టిస్తోండ‌గా వరలక్ష్మి కరణ్ కుమార్, సంపత్ ప్రధాన పాత్రలను పోషించగా శ్యామ్ సీఎస్ సంగీతం అందించాడు.
ఇలీవ‌ల జ‌రిగిన‌ ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ వేడుకకు విజయ్ సేతుపతి ముఖ్య అతిథిగా పాల్గొని ట్రైలర్‌ రిలీజ్ చేసి మాట్లాడుతూ.
‘దర్శకుడు ఆనల్ అరసుకు ప్రత్యేక దన్యవాదాలు. 2019లో ఈ కథ చెప్పిన‌ప్ప‌టికీ ఆ సమయంలో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు వీలుపడలేదు. ఆ తర్వాత ఈ స్టోరీలో నటిస్తే ఎలా ఉంటుందని సూర్వ అడిగాడు. ఒక వైపు సంతోషం, మరోవైపు భయం.
ఏ నిర్ణ‌యమైన నీవే స్వతంత్రంగా తీసుకోవాలని చెప్పా నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చిస్తా కానీ, సూర్య విష‌యంలో స్వతంత్రంగా నిర్ణ‌యం తీసుకోవాలని సూచించా.
నా బిడ్డకు ఇలాంటి అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది. నా కంటే నా భార్యకు సంతోషంగా ఉంది’ అన్నారు. 
సినిమా టైమింగ్స్

 

హీరో సూర్య మాట్లాడుతూ.. ‘ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు దన్యవాదాలు. కొన్ని సందర్యాల్లో నిరుత్సాహంగా ఉన్న సమయంలో చిత్ర యూనిట్ ఎంత‌గానో ప్రోత‌స‌హించారు.

సీనియ‌ర్ న‌టి దేవదర్శిని సినిమాలోనే కాదు నిజ జీవితంలోనూ అమ్మ‌లాంటిదే కూడా నామ వంటివారు.

దర్శకుడు ఆనల్ అరను అనేక విషయాలు నేర్పించారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుతున్నా’ అన్నాను. దర్శకుడు ఆనల్ అరను మాట్లాడుతూ.. ‘దాదాపు 200కు పైగా చిత్రాలకు స్టంట్ మాస్ట‌ర్‌గా పనిచేశా. కానీ దర్శకుడిగా నాకు ఇది తొలి చిత్రం ప్రతి ఒక్కరూ అశీర్వ‌దించాల‌ని కోరాడు.

 ఇటాలియన్‌ మోడల్‌లా కనిపిస్తావు అన్నారాయన అదే నా ధైర్యం…

 ఇటాలియన్‌ మోడల్‌లా కనిపిస్తావు అన్నారాయన అదే నా ధైర్యం…

 

ధనుష్‌ .. పక్కింటి కుర్రాడిలా ఉంటాడు.  రఘువరన్‌ బీటెక్‌తో తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకున్న ఈ తమిళస్టార్‌… శేఖర్‌ కమ్ముల ‘కుబేర’లో మరోసారి విభిన్నంగా కనిపించి, మెప్పించాడు.

ధనుష్‌(Dhanush)… పక్కింటి కుర్రాడిలా ఉంటాడు.  ‘రఘువరన్‌ బీటెక్‌’తో తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకున్న ఈ తమిళస్టార్‌… శేఖర్‌ కమ్ముల ‘కుబేర’లో (kubera) మరోసారి విభిన్నంగా కనిపించి, మెప్పించాడు. ఇటీవల ధనుష్‌ పంచుకున్న కొన్ని ఆసక్తికర కబుర్లివి…


అమ్మాయి కోసమే ట్యూషన్‌లో చేరా…

మమ్మల్ని చదివించేందుకు మా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో.. నా పిల్లలను చదివిస్తుంటే నాకు అర్థమవుతోంది. నేను చదువుకోవాల్సిన సమయంలో తెగ అల్లరి చేసేవాణ్ని. చదువు కోసం కాకుండా ఓ అమ్మాయి కోసమే ట్యూషన్‌లో చేరా.

ట్యూషన్‌ టీచర్‌ ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పలేకపోయేవాణ్ని. కొన్ని రోజులకు నాపై నాకే సిగ్గేసి ట్యూషన్‌ మానేశా. కానీ స్నేహితురాలిని కలుసుకునేందుకు బయట వేచి చూసేవాణ్ని. నేను వచ్చినట్టు ఆమెకు తెలియాలని బైక్‌తో సౌండ్‌ చేసేవాణ్ని. దాంతో టీచర్‌…

‘మీరంతా చదువుకుని ఉన్నత స్థాయిలో ఉంటారు. కానీ బయట బైక్‌ మీద ఉన్నవాడు మాత్రం పెద్దయ్యాక వీధుల్లో డ్యాన్స్‌ చేసుకోవాల్సిందే’ అని అన్నారట. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే… అప్పట్లో చదువు ఎందుకు అశ్రద్ధ చేశానా? అని బాధపడుతుంటా.

అందుకే ఆ పేరు…
నేను, అనిరుధ్‌ (సంగీత దర్శకుడు) కలసి ‘ఇన్‌గ్లోరియస్‌ బాస్టర్డ్స్‌’ అనే హాలీవుడ్‌ చిత్రం చూశాం. ఆ సినిమాలో అందరూ ‘వండర్‌బార్‌’ అనే పదం పదేపదే వాడుతుంటారు. నిజానికి అదొక జర్మన్‌ పదం.

ఎందుకోగానీ అది మైండ్‌లో బాగా రిజిస్టరైపోయింది. కట్‌చేస్తే కొన్ని రోజుల తర్వాత నేను ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాలనుకున్నా. రెండో ఆలోచన లేకుండా నా నిర్మాణ సంస్థకు ‘వండర్‌బార్‌ ఫిల్మ్స్‌’ అని పేరు పెట్టా.

సినిమా టైమింగ్స్

ఆయన ప్రేరణతో…
కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా. ‘హీరో మెటీరియల్‌ కాదు. లుక్స్‌ బాగాలేవు’ అని విమర్శలు గుప్పించారు. దాంతో ఆత్మన్యూనత భావన కలిగింది. సరిగ్గా అప్పుడే దర్శకుడు బాలు మహేంద్ర…

‘నువ్వు ఇటాలియన్‌ మోడల్‌లా కనిపిస్తావు. నిన్ను నువ్వు తక్కువగా చూసుకోకు’ అని చెప్పారు. ఆ మాటలు నన్ను ప్రేరేపించాయి.

జోక్‌ చేస్తున్నారనుకున్నా..
‘కుబేర’ తమిళ్‌లో నాకు 51వ సినిమా. తెలుగులో రెండో స్ట్రయిట్‌ చిత్రం. ‘సార్‌’ కన్నా ముందే నాకు శేఖర్‌ కమ్ముల ఈ కథ చెప్పారు. ఈ సినిమా కోసం నన్ను శేఖర్‌ సన్నబడమని చెప్పినప్పుడు మొదట నమ్మలేదు.

‘నిజంగానే చెబుతున్నారా? లేక జోక్‌ చేస్తున్నారా’ అని అడిగా. ఎందుకంటే నా పర్సనాలిటీ చూసి, నన్ను సన్నబడమని చెప్పిన డైరెక్టర్‌ ఇప్పటిదాకా లేరు. మొత్తానికి సన్నబడి యాచకుడిగా నటించా. డైరెక్టర్‌ చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోయానంతే.

7 గంటలపాటు డంప్‌యార్డ్‌లో మాస్క్‌ లేకుండా నటించా. నా మనసుకు చాలా దగ్గరైన చిత్రమిది.

సినిమా టైమింగ్స్

చెఫ్‌ అయ్యేవాడిని…
ఒకసారి మా నాన్నగారికి సరదాగా ఆమ్లెట్‌ వేసి పెట్టా. అది ఆయనకు బాగా నచ్చింది. ఆ తర్వాత రోజు వేరే వంటకం చేసి పెట్టా. దాన్ని కూడా ఆయన చాలా ఆస్వాదించారు. దాంతో నాకు చెఫ్‌ అవ్వాలనే కోరిక కలిగింది.

వంట చేసి, వడ్డించేటప్పుడు ఎదుటివారి కళ్లలో కనిపించే ఆనందం చాలా సంతృప్తినిస్తుంది. ఇప్పటికీ మా ఇంటికి ఎవరైనా వస్తే, నేను నా స్వహస్తాలతో వారికి వడ్డిస్తుంటా. హీరోని కాకపోయుంటే కచ్చితంగా చెఫ్‌ అయ్యేవాడిని.

నీలగిరి తో నా స్నేహం అవగాహన సదస్సు.

నీలగిరి తో నా స్నేహం అవగాహన సదస్సు

టీజీ ఎఫ్ డీసీ డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి

నెన్నల,(మంచిర్యాల) నేటి ధాత్రి:

 

 

నీలగిరి వనాలతో ఎన్నో లాభాలున్నాయని,వీటిపై అవగాహన పెంచుకోవాలని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీ ఎఫ్ డీసీ) కాగజ్ నగర్ డివిజనల్ మేనేజర్ శ్రీ శ్రావణి అన్నారు.తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నీలగిరి తో నా స్నేహం పేరిట నెన్నెల మండలంలోని బొప్పారం శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో పెంచుతున్న నీలగిరి వనంలో గురువారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డివిజనల్ మేనేజర్ మాట్లాడుతూ నీలగిరి వనాల ద్వారా కాగితం తయారీకి అవసరమయ్యే కలప లభ్యమవ్వడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదం చేస్తున్నాయన్నారు. ఒకే చోట వేలాదిగా పెంచే నీలగిరి చెట్ల ద్వారా అధిక మొత్తంలో ఆక్సిజన్ విడుదల చేస్తూ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలుష్యాన్ని నియంత్రిస్తున్నాయన్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులకు నీలగిరి చెట్లు పెంచే దశ నుంచి కోత వరకు,ఆ తర్వాత కాగితం తయారీకి అవసరమయ్యే కలపను రవాణా చేసే వివిధ దశల్లో జరిగే పనులను వివరించారు.ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి నీలగిరి వనాలను రక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్,బెల్లంపల్లి రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ వి. సునీత,డిప్యూటీ ప్లాంటేషన్ మేనేజర్ దుర్గం నరేష్,వాచర్లుమొండి,సత్తయ్య,రవి సిబ్బంది షాహిద్,సంజీవ్ లు పాల్గొన్నారు. ‎

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version