సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్…
ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ఆ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు.
ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ఆ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు.
పూరీలో జగన్నాథ రథయాత్ర (Puri Rath Yatra 2025) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతూ, భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసి స్పందించారు. ఈ ఘటనను ప్రభుత్వ అసమర్థతగా అభివర్ణించారు. రథయాత్రలో జన సమూహం నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ దుర్ఘటన భక్తులకు శాంతియుత పండుగను అందించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టం చేస్తుందన్నారు. రథయాత్ర రోజున నందీఘోష రథాన్ని లాగడంలో జాప్యం జరిగిందని, దీనిని ప్రభుత్వం మహాప్రభు ఇచ్ఛ అని సమర్థించుకుందని నవీన్ పట్నాయక్ ఆరోపించారు. ఈ జాప్యం ప్రభుత్వం బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుందన్నారు.
వచ్చే వారం భారత స్టాక్ మార్కెట్ (Stock Market Outlook) ఎలా ఉంటుందోనని అనేక మంది ఇన్వెస్టర్లు ఆసక్తితో ఉన్నారు. లాభాల వైపు వెళ్తుందా, లేదంటే మళ్లీ నష్టాల బాట పడుతుందా అని ఆలోచిస్తున్నారు. అయితే నిపుణులు ఏం చెబుతున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు గత కొన్ని నెలలుగా ప్రపంచ మార్కెట్లను గందరగోళంలోకి నెట్టాయి. కెనడా, మెక్సికో, చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25%, 10% సుంకాలు విధించినట్లు ట్రంప్ ప్రకటించడంతో గత వారాల్లో భారత మార్కెట్లు కూడా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అయితే, ఈ సుంకాలను 30 రోజుల పాటు వాయిదా వేసినట్లు ఇటీవల ప్రకటించడంతో మార్కెట్లలో తాత్కాలిక ఉపశమనం కనిపిస్తోంది.
జనవరి 2025లో ప్రవేశపెట్టిన బడ్జెట్ మార్కెట్లపై గణనీయమైన ప్రభావం చూపింది. ఆర్థిక సర్వే ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.3-6.8% వృద్ధి సాధించవచ్చని అంచనా వేయడం మార్కెట్లలో ఆశావాదాన్ని పెంచింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలు ఈ వారం కూడా మరింత రాణించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ వారం సూచీలు సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ, మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల (బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $75.83 వద్ద ఉంది) మార్కెట్లలో అస్థిరతను కొనసాగించవచ్చని ఆక్షయ్ చించాల్కర్ వంటి విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఈ వారం బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఐటీ రంగాలు దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. జనవరిలో కార్ల విక్రయాలు స్థిరమైన వృద్ధిని నమోదు చేయడంతో టాటా మోటార్స్, మారుతి సుజుకీ వంటి ఆటో కంపెనీల షేర్లు లాభాల్లో ఉండవచ్చు. ఇక బ్యాంకింగ్ రంగంలో కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి సంస్థలు సానుకూల ట్రెండ్‌ను చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే RBI రేట్ కట్ సూచనలు రుణ వృద్ధిని పెంచుతాయి.
ఐటీ రంగంలో ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి కంపెనీలు గత వారం లాభాలతో ప్రారంభించాయి. ఈ జోరు కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాల్సిన రంగాలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరగడం వల్ల ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ సెక్టార్లలో అస్థిరత కనిపించవచ్చు. ఈ రంగాల్లో పెట్టుబడి పెట్టే ముందు మరింత విశ్లేషణ అవసరం.
నిపుణుల సూచనలు
నిపుణులు ఈ వారం మార్కెట్‌లో ఆశావాదాన్ని అంచనా వేస్తున్నప్పటికీ, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. గత వారం సెన్సెక్స్ 511 పాయింట్లు, నిఫ్టీ 140 పాయింట్లు నష్టపోయాయి. ఇది అంతర్జాతీయ ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదలకు సంకేతం. అయితే, ట్రంప్ టారిఫ్‌ల వాయిదా, RBI రేట్ కట్‌లు, బడ్జెట్ ఆశలు మార్కెట్‌ను లాభాల బాటలో నడిపే అవకాశం ఉంది. ఈ వారం బ్యాంకింగ్, ఆటో రంగాలు రాణించే అవకాశం ఉంది. కానీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
గమనిక: స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు చేయాలని ఆంధ్రజ్యోతి సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. మీకు ఇన్వెస్ట్ చేయాలని ఆసక్తి ఉంటే, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
‘సలాడ్’ అనే లాటిన్ పదంలో ‘సాల్’అంటే ఉప్పు. వండకుండా పండ్లు, ఆకుకూరలు, కాయగూరల్ని ఉప్పు, వెన్నతో కలిపి తినటాన్ని వాళ్లు ‘సలాడ్’ అనీ, మనవాళ్లు ‘హరితం’ లేదా ‘హరితకం’ అనీ అన్నారు.
ఆమ్ర హరితం (మామిడిపండు సలాడ్): రుచికరం. వాతాన్ని తగ్గిస్తుంది. కఫాన్ని, వేడినీ పెంచుతుంది. జీర్ణశక్తిని తగ్గిస్తుంది.
బింబీ హరితం (దొండపండు సలాడ్): శరీరం బరువుని పెంచుతుంది. కాంతినిస్తుంది. వాతాన్ని వేడినీ తగ్గిస్తుంది.
మూలక హరితం (ముల్లంగి సలాడ్): తేలికగా అరుగుతుంది. జీర్ణకోశ వ్యాధుల్ని తగ్గిస్తుంది. త్రిదోషాల్ని సమంగా ఉంచుతుంది కారవేల్లక హరితం (కాకరకాయ సలాడ్): జాఠరాగ్ని పెరుగుతుంది. షుగరు వ్యాధిలో తినదగింది. నులిపురుగులు పోతాయి.
రంభాకాండ హరితం: (అరటిదూట – కాం డం, ఊచ): శరీరంలో వేడి, మంటలు, రక్త స్రావం తగ్గుతాయి. ఆలస్యంగా అరుగుతుంది.
కైదర్య హరితం (కరివేపాకు సలాడ్): రుచి, సుగంధ భరితం, త్రిదోషాల్ని హరిస్తుంది. క్షయ కుష్టు, జీర్ణకోశ వ్యాధుల్ని తగ్గిస్తుంది.
శృంగవేర హరితం (అల్లం సలాడ్): ఉప్పుతో నూరిన అల్లంముద్దని మొదటిముద్దగా తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. నాలుకపైన జిగురు పోతుంది. త్రిదోషనివారకం, వాపు, ఉబ్బరం, క్షయ, నిమ్ము తగ్గుతాయి. బలకరం. శుక్ర వర్ధకం. నిమ్మరసంలో ఊరబెట్టిన అల్లంసలాడ్ కఫాన్ని వేడినీ తగ్గిస్తుంది కంఠరోగాలు పోతాయి. లివర్, స్లీ ్పన్ వ్యాధుల్లో మంచిది. అల్లం+బెల్లం సలాడ్ బలకరం. వాతం కఫం తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. చింతపండు రసంతో అల్లం సలాడ్ కఫాన్ని పెంచుతుంది.
గజకర్ణీకందమూల సలాడ్ (సారచేమదుంప సలాడ్): ఏనుగు చెవి లాగా పెద్దపెద్ద ఆకులుండే మొక్క దుంప వేడి చేస్తుంది. కఫాన్ని వాతాల్ని, పాము విషాన్ని హరిస్తుంది. కుష్ఠు, రక్త హీనతల్ని తగ్గిస్తుంది.
కూష్మాండ హరితం (బూడిద గుమ్మడి సలాడ్): జలుబు, పడిశభారం, వేడి వీటిని తగ్గిస్తుంది. బలకరం. లైంగిక శక్తిపెరుగుతుంది.
అసిశింబి హరితం (చెమ్మకాయ – స్వోర్డ్ బీన్) సలాడ్: ఆలస్యంగా అరుగుతుంది. వాతాన్ని తగ్గిస్తుంది
వృంతాక హరితం (వంకాయ సలాడ్): వంకాయ ముక్కలు అల్లం, నిమ్మరసం,ఇంగువ, మిరియాలు కలిపిన సలాద్ కఫహరం.
మాకందికా హరితం (నల్ల ఆవాల మొక్క ఆకులతో సలాడ్): కఫవ్యాధుల్ని, అజీర్ణ వ్యాధుల్ని వాత వ్యాధుల్ని తగ్గిస్తుంది.బలకరం.
పారేవత హరితం (జామపండు సలాడ్): జామపండు ముక్కల్ని మసాలాలతో చేసిన సలాడ్ బలకరం, జీర్ణశక్తిని పెంచుతుంది.
తోయమాగధిక హరితం (జలపిప్పలి – బొక్కెన సలాడ్):దీని ఆకులు, ఫలాలు, ఫూలుసలాడ్‌కు అనుకూలంగా ఉంటాయి. కారంగా ఉంటుంది. దప్పికని కలిగిస్తుంది. జఠరాగ్నిని ఉత్తేజితం చేస్తుంది. విరేచనాల వ్యాధిని తగ్గిస్తుంది.
కదళీఫ లహరితం (అరటిపండు సలాడ్): తగిన మసాలాలతో అరటిపండు ముక్కల సలాడ్ వాతాన్ని వేడినీ తగ్గిస్తుంది. బలకరం.
శారిబ హరితం (సుగంధిపాల వేళ్ళ సలాడ్): కఫ వ్యాఽధులు, వేడివలన కలిగే వ్యాధులు, అజీర్తివ్యాధులు చర్మవ్యాధుల్ని తగ్గిస్తుంది.
త్రపుస హరితకం (కీరదోస సలాడ్): తగిన మసాలాలతో తీసుకుంటే మూత్ర వ్యాధుల్ని నివారిస్తుంది. వేడిని తగ్గిస్తుంది.
మహాబదర హరితకం (యాపిల్ సలాడ్): రుచికరం, బలకరం, శిరో రోగాలను తగ్గిస్తుంది.
కోశాతకీ హరితకం (బీరకాయ సలాడ్): హృదయానికి మంచిది. అన్ని వ్యాధుల్లో హితకరం.
పటోలా హరితకం (తియ్యపొట్ల సలాడ్): తగిన సంబారాలతో పొట్లముక్కల సలాడ్ వాత కఫ దోషాల్ని హరించి చలవనిస్తుంది.
సలాడ్ కోసం బ్రొకోలీ లాంటి ఖరీదైనవే కావాలని లేదు. వండనవసరం లేకుండా, కొన్ని నేరుగా, కొన్ని అన్నంలో ఆధరవుగా, కొన్ని పచ్చళ్లుగా, కొన్ని మసాలాలతో, కొన్ని పెరుగుతో తినదగినవి మన కూరగాయల్లో ఉన్నాయి. తాలింపు అదనపు రుచినిస్తుంది!
– డా. జి వి పూర్ణచందు, 94401 72642
మసాలా పనియారం
కావలసిన పదార్థాలు: రవ్వ – కప్పు, పెరుగు – ముప్పావు కప్పు, శనగలు- అర స్పూను, మినప్పప్పు-అర స్పూను, ఆవాలు – స్పూను, జీలకర్ర – అర స్పూను, కరివేపాకు రెబ్బలు-రెండు, స్వీట్ కార్న్ – రెండు స్పూన్లు, క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లి ముక్కలు- ముప్పావు కప్పు, కొత్తిమీర – రెండు స్పూన్లు, అల్లం – ముక్క, పచ్చి కొబ్బరి తురుము – రెండు స్పూన్లు, ఈనో ఫ్రూట్ సాల్ట్ – అర స్పూను, నీళ్లు, నూనె – తగినంత.
తయారుచేసే విధానం: ఓ గిన్నెలో రవ్వ, పెరుగు, కాస్త నీళ్లు కలిపి పావుగంట పాటు నానబెట్టాలి. ఓ ప్యాన్‌లో కాస్త నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, శనగలు, మినప్పప్పు వేసి చిటపటలాడించాలి. కరివేపాకునూ చేర్చాలి. ఇంకా ఉల్లి, మిగతా కూరగాయల ముక్కలు, కొత్తిమీర, అల్లం, కొబ్బరి తురుము చేర్చాలి. ఈనో ఫ్రూట్ సాల్ట్, తగినంత నీళ్లని కలిపి కాస్త జారు పిండిలా చేసుకోవాలి. గుంత పెనంలో నూనె వేసి రవ్వ పిండిని వేసి అటూ ఇటూ దోరగా ఉడికిస్తే మసాలా పనియారం తయారు.
అలసందల వడ
కావలసిన పదార్థాలు: అలసందలు – కప్పు, అల్లం – చిన్న ముక్క, పచ్చి మిర్చి-మూడు, జీలకర్ర – స్పూను, ఉల్లి -అర కప్పు, ఉల్లి కాడలు – రెండు స్పూన్లు, కరివేపాకు రెబ్బలు- కొన్ని, ఇంగువ-కాస్త, కారం-పావు స్పూను, ఉప్పు, నీళ్లు – తగినంత.
తయారుచేసే విధానం: అయిదు గంటల పాటు నీళ్లలో నానబెట్టిన అలసందలను మిక్సీలోకి తీసుకోవాలి. పచ్చి మిర్చి. అల్లం, జీలకర్రను కూడా చేర్చి రుబ్బాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త గరకుగా రుబ్బు ఉండేలా చూసుకోవాలి. ఈ రుబ్బును ఓ గిన్నెలోకి తీసుకుని ఉల్లి, కరివేపాకు, ఉల్లి కాడలు, ఉప్పు, ఇంగువ, కారం వేసి బాగా కలపాలి. చేతికి నూనె పూసుకుని ఈ మిశ్రమాన్ని ముద్దలుగా చేసి నూనెలో వేయిస్తే అలసందల వడలు సిద్ధం. అయితే తక్కువ మంటమీదే కాల్చడం ఉత్తమం.
CM Chandrababu: 2019 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ గెలిచి ఉంటే.. రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన ఉండేదని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. డబ్బులతోనే గెలుపు సాధ్యం కాదని, ఎన్నికల్లో మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టినవాళ్లకు.. కేవలం 11 సీట్లే వచ్చాయని అన్నారు.
2019 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ గెలిచి ఉంటే.. రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన ఉండేదని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. డబ్బులతోనే గెలుపు సాధ్యం కాదని, ఎన్నికల్లో మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టినవాళ్లకు.. కేవలం 11 సీట్లే వచ్చాయని వైసీపీని ఉద్దేశించి అన్నారు. డబ్బులతో ఎన్నికల్లో గెలవలేమనే విషయం స్పష్టమైందన్నారు. అభివృద్ధితో, ఆదర్శంతో రాజకీయాలు చేద్దామని పిలుపిచ్చారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ఎన్నికల ముందు కాదని.. నిత్యం ప్రజల్లో చర్చనీయాంశం చేయాలన్నారు. ఎన్నికల ముందు మాట్లాడితే.. ఓట్ల కోసం మాట్లాడారని అంటారని, గత ప్రభుత్వం తెచ్చిన బ్యాడ్ ఇమేజ్ పొగొట్టాలంటే చాలా సమయం పడుతుందన్నారు. కానీ టీడీపీకి ఉన్న బ్రాండుతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
కేంద్ర సహకారం లేనిదే వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఏడాదిలో బయటకు తెచ్చే వాళ్లం కాదని, మనం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయమని సీఎం చంద్రబాబు అన్నారు. మనకు అధికారం ముఖ్యం కాదని.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. కేంద్రంలో మనకు ఎప్పుడు అవకాశం వచ్చినా.. రాష్ట్రాభివృద్ధికే సహకరిస్తున్నామని చెప్పారు. ఏ రాజకీయ పార్టీకి రానన్ని అవకాశాలు.. టీడీపీకి వచ్చాయన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలు వివరించడం.. ఏమైనా తప్పులు జరిగాయనుకుంటే సరిదిద్దుకోవడం వంటివి చేయాలని సూచించారు. చేసిన ప్రతి పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. అందుకే నెల రోజులు ప్రచారం చేసే కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు.
గత ఐదేళ్లలో విధ్వంసం చూశాం..
గత ఐదేళ్లల్లో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, వ్యవస్థలను నాశనం చేశారని, కేంద్ర నిధులను పక్కదారి పట్టించారని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీని అగ్రగామిగా తీసుకురావాలనే సంకల్పంతో పని చేస్తున్నామని, ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని మనకు సహకరించారన్నారు. దక్షిణ భారత దేశంలో ఏపీది విభిన్నమైన పరిస్థితి అని, రాష్ట్ర ఆదాయంలో సర్వీస్ సెక్టార్ కీలకమని అన్నారు. సేవల రంగాలకు, పరిశ్రమలకు ప్రాధాన్యమివ్వాలని, వ్యవసాయాన్ని మరిచిపోకుండా.. అభివృద్ధి చేయాలన్నారు. చెప్పిన హామీలను అమలు చేస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నామన్నారు. పాలసీలు మంచివి అయితే సరిపోదని.. అమలులో తప్పులు జరగకూడదని చంద్రబాబు అన్నారు.
నేరస్తుల్ని నేరస్థులుగానే చూస్తాం..
నేరస్తులను నేరస్థులుగానే చూస్తామని, తప్పులు చేసిన వారు.. ప్రత్యర్థి పార్టీలో ఉంటే అరెస్టు చేయకూడదా.. చర్యలు తీసుకోకూడదా.. అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. సత్తెనపల్లి హిట్ అండ్ రన్ వ్యవహారంలో ఏం జరిగిందో అందరం చూశామన్నారు. ఎవరికైనా ప్రమాదం జరిగితే.. వారిని కాపాడి..ఆస్పత్రికి పంపుతామని, కానీ జగన్ కారు కింద కార్యకర్త పడిపోతే.. పక్కకు పడేసి వెళ్లిపోయారని విమర్శించారు. దీనికి సంబంధించిన ఆధారాలు లభ్యమైన తర్వాత కూడా సొంత మీడియా ఉందని తప్పుడు ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. పరామర్శల పేరుతో గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్‌ల వద్దకు వెళ్తారా అని ప్రశ్నించారు. చేస్తున్న మంచి పనులతో పాటు, మారుతున్న రాజకీయాలను ప్రజలకు వివరించాలన్నారు. ఆర్ధిక ఉగ్రవాదం దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరమని అన్నారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుల్ని ఏరి పారేయాలన్నారు. రాజకీయ ముసుగులో ఉన్న రౌడీలు ఏం చేశారో జనానికి అర్థమయ్యేలా వివరించాలన్నారు. వివేకా హత్యను ఎలా ఏమార్చారో ప్రజలకు వివరించాలని, వివేకా హత్య విషయంలో ప్రజల్నే కాదు.. తననూ ఏమార్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఆనాడే వివేకా హంతకులను పట్టుకుని ఉంటే.. 2019 ఎన్నికల్లో ఓడిపోయేవాళ్లం కాదని, ఎన్నికల హడావుడి పక్కన పెట్టి 2 గంటలు వివేకా హత్యపై శ్రద్ధ పెట్టి రికార్డులు సీజ్ చేసి ఉంటే 2019లో మనమే గెలిచేవాళ్ళమని అన్నారు. మళ్లీ ఇప్పుడు మరిన్ని డ్రామాలకు వైసీపీ నేతలు తెరలేపుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు.
తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మరింత అడ్వాన్స్‌డ్‌గా ఆలోచిస్తూ మానవులకే ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. అమెరికా ఎలక్ట్రానిక్ కార్ల సంస్థ అయిన టెస్లా మరో కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తాజాగా ఓ కొత్త టెస్లా కారు తనను తాను స్వయంగా డెలివరీ చేసుకుంది.టెక్నాలజీ (Technology) రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీ సహాయంతో ఎన్నో పనులు సునాయాసంగా అయిపోతున్నాయి. షాపింగ్ కోసం వెళ్లే పని లేకుండా ఏ వస్తువు కావాలంటే అది మన ఇంటి గుమ్మం ముందుకే వచ్చేస్తోంది. తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరింత అడ్వాన్స్‌డ్‌గా ఆలోచిస్తూ మానవులకే ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. అమెరికా ఎలక్ట్రానిక్ కార్ల సంస్థ అయిన టెస్లా (Tesla) మరో కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది (Tesla car Makes Driverless Delivery).తాజాగా ఓ కొత్త టెస్లా కారు తనను తాను స్వయంగా డెలివరీ చేసుకుంది. కార్ల ఫ్యాక్టరీ నుంచి స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ గరిష్టంగా 115 కిలో మీటర్ల వేగంతో నేరుగా తన యజమాని ఇంటికి వెళ్లిపోయింది. టెస్లా సంస్థకు చెందిన ‘మోడల్ వై’ కారు టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓనర్ ఇంటికి భద్రంగా చేరుకుంది. మార్గమధ్యంలో సిగ్నళ్లు, హైవేలు, ఫ్లై ఓవర్లను కూడా సునాయాసంగా దాటేసింది. ఈ ప్రయాణం మొత్తాన్ని ఆ కారులోని డ్యాష్ కామ్ రికార్డు చేసింది.కాగా, ప్రపంచ కుభేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా కార్ల తయారీ సంస్థ ప్రపంచంలోనే తొలిసారి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ప్రవేశపెట్టింది. అలాగే తాజాగా ఏమాత్రం మానవ ప్రమేయం లేకుండా, రిమోట్ ఆపరేటింగ్ కూడా లేకుండా పబ్లిక్ హైవేపై ప్రయాణించిన తొలి అటానమస్ కారు కూడా టెస్లా సంస్థకు చెందినదే. ఆ కారు జర్నీ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన మస్క్ సంస్థ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.
Pawan Kalyan on Kamal Haasan: వైవిధ్యమైన నటనకు మారుపేరుగా సినీ అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ భారతీయ నటుడు కమల్ హాసన్‌కు.. ఆస్కార్ అకాడమీ కమిటీలో చోటు దక్కడంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నామినేషన్ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. అనంతరం నామినేషన్ ఉప సంహరించే అవకాశాన్ని అభ్యర్థులకు కల్పిస్తారు.
అయితే ప్రస్తుతం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేసి.. బీజేపీ ఘన విజయం సాధించిన విషయం విదితమే. కాగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి.. ఎంపీగా ఎన్నికైన నేపథ్యంలో పార్టీ సారథిని మార్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఈ క్రమంలో అధ్యక్ష రేసులో పలువురు కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తదితరులు పేర్లు తెర మీదకు వచ్చాయి.
అదీకాక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో బీజేపీ అధ్యక్షుడు ఎవరు ఎన్నికవుతారనే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈ పదవి పీవీఎన్ మాధవ్‌కు దక్కే అవకాముందనే చర్చ సైతం బలంగా సాగుతుంది. ఎందుకంటే.. ఇటీవల రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఒక ఎమ్మెల్యే స్థానాన్ని సీఎం చంద్రబాబు కేటాయించారు. ఈ స్థానానికి తొలుత పీవీఎన్ మాధవ్ పేరును బీజేపీ అగ్రనాయకత్వం ఖరారు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ కొద్ది సేపటికి ఈ ఎమ్మెల్సీ పదవికి బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేరును ఖరారు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రకు చెందిన పీవీఎన్ మాధవ్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఓ చర్చ సైతం బలంగా వినిపిస్తోంది.
ఘనంగా కొనసాగుతున్న గోల్కొండ బోనాల జాతర
గోల్కొండ బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది.
రెండో పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది.
దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.
గోల్కొండలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
Hyderabad: తెలంగాణ సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస (Aashada Masam) బోనాల సందడి (Bonala Festival) మొదలైంది.
చారిత్రాత్మక గోల్కొండ కోట (Golconda Fort)లో బోనాల సమర్పణ ప్రారంభమయ్యాయి.
దీంతో ఆదివారం (Sunday) తెల్లవారుజామునుంచే భక్తులు (Devotees) గోల్కొండకు చేరుకుని ముక్కులు చెల్లించుకుంటున్నారు.
ఈ సందర్భంగా గోల్కొండ కోట పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
గోల్కొండ బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది.
రెండో పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది.
దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
పోతురాజుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో గోల్కొండలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
ఈ నెల 26వ తేదీ గురువారం నుంచి ఆషాడ మాస బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి.
గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో బోనాల జాతర మొదలైంది.
ప్రతి గురు, ఆదివారాల్లో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించనున్నారు.
అమ్మవార్లకు 9 పూజలతో గోల్కొండ బోనాలు జరుగుతాయి.
గోల్కొండ కోటలో నెలరోజుల పాటు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి.
గోల్కొండ కోటాలో మొదలైన బోనాలు జులై 24న తిరిగి గోల్కొండ కోటలో వేడుకలు ముగియనున్నాయి.
లష్కర్ బోనాల జాతరకు అంకురార్పణ..
కాగా తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాల జాతరకు ఆదివారం అంకురార్పణ జరగనుంది.
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళీ బోనాల జాతరలో తొలి ఘట్టమైన అమ్మవారి ఘటం ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి గుత్తా మనోహర్ రెడ్డి, ఆలయ ఫ్యామిలీ ట్రస్టు చైర్మన్ సురిటి రామేశ్వర్, కామేశ్వర్లు తెలిపారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారి ఆభరణాలను అప్పగించడం ద్వారా ఘటం ఎదుర్కోలు ప్రారంభమవుతుందన్నారు.
వచ్చే నెల 13వ తేదీన బోనాలు జరుగుతాయని, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, పూజలు చేస్తారని వారు తెలిపారు.
14న ఉదయం 8.30 గంటలకు రంగం (భవిష్యవాణి) కార్యక్రమం జరుగుతుందని వివరించారు.
విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో కొందరు దుండగులు చోరీకి యత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో దుండగులు రైల్లో నుంచి దూకి పారిపోయారు.
వారంలో రొయ్యలు ఎన్నిసార్లు తినొచ్చు..
తక్కువ క్యాలరీలతో ఎక్కువ పోషకాలను అందించే ఆహారాల్లో రొయ్యలు ఒకటి..
వంద గ్రాముల రొయ్యల్లో క్యాలరీలు వంద కన్నా తక్కువే ఉంటాయి. .
పైగా ఇరవై గ్రాముల ప్రోటీన్ కూడా లభిస్తుంది.
రొయ్యల్లో పోషకాలు తెలపండి. వారంలో ఎన్నిసార్లు తినొచ్చు?
తక్కువ క్యాలరీలతో ఎక్కువ పోషకాలను అందించే ఆహారాల్లో రొయ్యలు ఒకటి.
వంద గ్రాముల రొయ్యల్లో క్యాలరీలు వంద కన్నా తక్కువే ఉంటాయి.
పైగా ఇరవై గ్రాముల ప్రోటీన్ కూడా లభిస్తుంది. ముఖ్యంగా సముద్రపు రొయ్యల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, అయోడిన్, సెలీనియం, ఫాస్ఫరస్, జింక్, అస్స్టాజాన్టిన్ వంటి పోషకాలెన్నో ఉంటాయి.
ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ గుండె, మెదడు, జీర్ణవ్యవస్థల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి.
రొయ్యల్లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
రొయ్యల్లో కొలెస్ట్రాల్ కూడా అధికంగా ఉంటుంది.
ఆకుకూరలన్నింటిలోనూ, ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే వాటిలో పోషకాలు ఎక్కువని విన్నాను, నిజమేనా?
– సుమతి, హైదరాబాద్
ఏడాది పొడవునా, అందుబాటు ధరలకే లభించే ఆకుకూరలు మంచి పోషకాలందించే ఆహారం.
ఆకుకూరలన్నింటిలో సూక్ష్మ పోషకాలైన విటమిన్ ’సి‘, నియాసిన్, విటమిన్ ’కె‘ లతో పాటు క్యాల్షియం, ఐరన్ లాంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.
ఆకుకూరలు తినే అలవాటు అధిక రక్తపోటును తగ్గించేందుకు, నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది.
వీటిలో ఎక్కువగా ఉండే పీచుపదార్థాలు రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్‌ను నియంత్రించేందుకు…
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి.
ఐరన్, మెగ్నీషియం, పొటాషియం తదితర ఖనిజాలను కలిగి ఉండటం వల్ల ఆకుకూరలు ఎదిగే వయసులో ఉన్న పిల్లలకూ శారీరక శ్రమ చేసేవారికీ కూడా ప్రయోజనకరం.
ఆకుకూరల్లోని ఐరన్, ఫోలేట్ మహిళల్లో, మరీ ముఖ్యంగా గర్భిణుల్లో రక్తహీనత నివారించడానికి, తగ్గించడానికి అత్యుత్తమంగా పనిచేస్తుంది.
ముదురు ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు కొంచెం అధిక మొత్తంలో ఉంటాయి కానీ ఆకుకూరలేవైనా వివిధ రకాల్లో వివిధ మోతాదుల్లో పోషకాలుంటాయి.
తాజాగా దొరికే వాటిని అవకాశాన్ని బట్టి ఎంచుకుంటే మంచిది.
ఎప్పుడైనా బయటకెళ్ళి రెస్టారెంట్లో తిన్నప్పుడు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా ఎంచుకోవాలి?
– మధుసూదన్, విశాఖపట్టణం
ఆరోగ్యమైన ఆహారపు అలవాట్లు ఎవరికైనా చాలా మంచిది.
ఎప్పుడైనా రెస్టారెంట్లలో లేదా బయటి ఆహారం తినేప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రుచిని ఆస్వాదిస్తూనే ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు.
బయటి ఆహారంలో కల్తీ పదార్థాలు, నిల్వ పదార్థాలు వాడే అవకాశం ఎక్కువ.
అందుకే నాణ్యతా ప్రమాణాలు సక్రమంగా పాటించే రెస్టారెంట్లలో మాత్రమే తినాలి.
కృత్రిమ రంగులు వాడే పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది.
కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసిన పదార్థాలను అందరూ పంచుకున్నట్టయితే, అన్నింటి రుచి చూస్తూనే మితంగా తినవచ్చు.
బఫెట్ భోజనం అయినట్లయితే మీకు నచ్చిన పదార్థాలు నాలుగైదు ఎంచుకొని వాటి వరకే తిని, తిరిగి ఇంట్లో అందుబాటులో ఉండే ఆహారాన్ని తినకుండా ఉంటే క్యాలరీలు కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు..
ఇలా బయటి ఆహారం తినడం అనేది ప్రతీ వారాంతం కాకుండా…
ఏవైనా ప్రత్యేకమైన సందర్భాలకు మాత్రమే పరిమితం చేసుకొంటే ఎటువంటి ఇబ్బందీ ఉండదు.
సోషియో ఫాంటసీ ప్రేమకథతో రూపుదిద్దుకున్న ‘దీర్ఘాయుష్మాన్ భవ’ చిత్రం జులై 11న విడుదల కానుంది. కార్తీక్‌రాజు, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన ఈ చిత్రానికి…
కాంటా లగా సాంగ్ ఫేమ్ షఫాలీ జరివాలా(42) ఆకస్మికంగా మరణించారు. శుక్రవారం రాత్రి అస్వస్థతతో ఉన్న షఫాలీని తన భర్త పరాగ్ త్యాగి ఆస్పత్రికి తీసుకెళ్లగా..
వచ్చే వారం ఏకంగా 7 ఐపీఓలు రాబోతున్నాయ్.. దీంతోపాటు లిస్టింగ్ కంపెనీలు కూడా..
ప్రతి వారం మాదిరిగానే ఈసారి కూడా ఐపీఓల వీక్ రానే వచ్చేసింది.
అయితే ఈసారి స్టాక్ మార్కెట్లోకి ఏకంగా ఏడు ఐపీఓలు (Next Week IPOs) రాబోతున్నాయి.
దీంతోపాటు మరికొన్ని కంపెనీలు కూడా లిస్ట్ కానున్నాయి.
ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
2025 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మార్కెట్‌లో ఐపీఓల (Next Week IPOs) జోరు పెరిగింది.
ఈ క్రమంలో జూన్ 30 నుంచి ప్రారంభమయ్యే వారంలో మొత్తం 7 కొత్త IPOలు రానున్నాయి.
వాటిలో 3 మెయిన్‌బోర్డ్ విభాగం నుంచి వస్తుండగా, 7 కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానున్నాయి.
కొత్తగా రానున్న IPOలు
పుష్ప జ్యువెలర్స్ IPO: ఇది జూన్ 30న ప్రారంభమై, జూలై 2న ముగుస్తుంది.
ఈ కంపెనీ రూ. 98.65 కోట్లు సేకరించాలనుకుంటోంది.
జూలై 3న కేటాయింపు ఖరారు అవుతుంది.
జూలై 7న NSE SMEలో షేర్లు జాబితా చేయబడతాయని భావిస్తున్నారు.
ఈ IPOలో బిడ్డింగ్ కోసం ధర బ్యాండ్ షేరుకు రూ. 143-147, లాట్ సైజు 1000 షేర్లు.
సెడార్ టెక్స్‌టైల్ ఐపీఓ: రూ.60.90 కోట్ల విలువైన ఈ ఇష్యూ జూన్ 30న ప్రారంభమవుతుంది.
దీని ధర బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.130-140. లాట్ సైజు 1000 షేర్లు.
జూలై 2న ఇష్యూ ముగిసిన తర్వాత, జూలై 3న కేటాయింపు జరుగుతుంది.
షేర్లు జూలై 7న NSE SMEలో లిస్ట్ కానున్నాయి.
మార్క్ లోయిర్ ఐపీఓ: రూ.21 కోట్లు సేకరించే లక్ష్యంతో ఈ కంపెనీ జూన్ 30న ఇష్యూను ప్రారంభిస్తోంది.
దీనిలో, జూలై 2 వరకు రూ. 100 ధరతో 1200 షేర్ల లాట్లలో డబ్బును పెట్టుబడిగా పెట్టవచ్చు.
కేటాయింపు జూలై 3న ఖరారు అవుతుంది.
షేర్లు జూలై 7న BSE SMEలో జాబితా చేయబడతాయి.
వందన్ ఫుడ్స్ IPO: రూ. 30.36 కోట్ల ఈ ఇష్యూ జూన్ 30న ప్రారంభమై, జూలై 2న ముగుస్తుంది.
దీని బిడ్డింగ్ ధర ఒక్కో షేరుకు రూ. 115. లాట్ సైజు 1200 షేర్లు. IPO ముగిసిన తర్వాత, జూలై 3న కేటాయింపును ఖరారు చేస్తారు. జూలై 7న షేర్లు BSE SMEలో జాబితా చేయబడతాయి.
క్రిజాక్ IPO: మెయిన్‌బోర్డ్ విభాగంలో రూ. 860 కోట్ల ఇష్యూ జూలై 2న ప్రారంభమవుతుంది.
దీని ముగింపు తేదీ జూలై 4. ఒక్కో షేరుకు రూ. 233-245 ధరల బ్యాండ్‌లో 61 షేర్ల లాట్లలో చేయవచ్చు. జూలై 7న కేటాయింపు ఖరారు అవుతుంది.
జూలై 9న షేర్లు BSE, NSEలో లిస్ట్ చేయబడతాయి.
ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ IPO: ఇది జూలై 3న ప్రారంభమై, జూలై 7న ముగుస్తుంది.
జూలై 8న కేటాయింపు ఖరారు అవుతుంది.
జూలై 10న షేర్లు BSE, NSEలో లిస్ట్ చేయబడతాయి.
IPO ధరల శ్రేణి ఇంకా ప్రకటించబడలేదు.
ఈ కంపెనీల లిస్టింగ్..
కొత్త వారంలో జూలై 1న కల్పతరు, గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్, ఎల్లెన్‌బారీ ఇండస్ట్రియల్ గ్యాస్‌ల షేర్లు BSE, NSEలో మెయిన్‌బోర్డ్ విభాగంలో లిస్ట్ కానున్నాయి.
అదే రోజు AJC జ్యువెల్, అబ్రమ్ ఫుడ్, ఐకాన్ ఫెసిలిటేటర్స్ షేర్లు BSE SMEలో జాబితా చేయబడతాయి.
అలాగే శ్రీ హరే-కృష్ణ స్పాంజ్ ఐరన్ షేర్లు NSE SMEలో అరంగేట్రం చేస్తాయి.
మహిళతో ప్రయాణికుడు అసభ్య ప్రవర్తన.. ఆ తర్వాత ఏమైందంటే..
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన ఇటీవల చోటు చేసుకుంది. ఆ తర్వాత పలు విమాన సర్వీసుల్లో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అలాంటి వేళ.. ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడు.. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
న్యూఢిల్లీ, జూన్ 29: విమానంలో మహిళా సిబ్బందితో ఒక ప్రయాణికుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో మహిళా సిబ్బంది ఫిర్యాదుతో అతడిపై ఎయిర్‌పోర్ట్‌లో కేసు నమోదయింది. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో శనివారం చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. దుబాయ్ నుంచి జైపూర్‌కు వచ్చే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఒక ప్రయాణికుడు పీకల దాక మద్యం సేవించాడు. అనంతరం విమాన సిబ్బందిలోని ఒక మహిళతో అతడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళ.. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లింది. ఈ విమానం గమ్యస్థానం చేరుకున్న తర్వాత.. అంటే జైపూర్ ఎయిర్‌పోర్టులో పోలీసులకు ఎయిర్ ఇండియా అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు.
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో భార్యాభర్తల ఫైట్.. మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడంతో..
శనివారం ఓ ఎయిర్ ఇండియా విమానంలో భార్యాభర్తలు తగవు పడ్డారు.
ఈ క్రమంలో మహిళ భర్త మరో ప్యాసెంజర్‌తో కూడా దురుసుగా వ్యవహరించడంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అమృత్‌సర్-ఢిల్లీ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్ ఇండియా విమానంలో భార్యాభర్తలు తగవు పడ్డ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
మరో ప్యాసెంజర్ ఫిర్యాదు మేరకు..
భార్యతో గొడవ పడ్డ వ్యక్తిని ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అమృత్‌సర్-ఢిల్లీ విమానంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఏఐ 454 ఫ్లైట్‌లో ఈ ఘటన జరిగింది.
విమానంలో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ప్రవర్తనను తాము అస్సలు సహించబోమని ఎయిర్ ఇండియా పేర్కొంది.
ప్రయాణికులు, సిబ్బంది భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని పేర్కొంది.
ఈ విషయంలో దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని వెల్లడించింది.
రామ్ వంటి ఒక దర్శకుడు. తమిళ చిత్రపరిశ్రమకు అవసరమని ప్రముఖ దర్శకుడు బాలా అన్నారు.రామ్ (Director Ram) వంటి ఒక దర్శకుడు. తమిళ చిత్రపరిశ్రమకు అవసరమని ప్రముఖ దర్శకుడు బాలా అన్నారు. జియో హాట్ స్టార్, జీజేఎస్ ప్రొడక్షన్స్ సెవన్ సీస్ అండ్ సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో రామ్ దర్శకత్వంలో రూపొందిన పీల్ గుడ్ మూవీ పరందు పో (Paranthu Po). వచ్చే నెల 4న థియేటర్లలోవిడుదల కానుంది. శివ,క్రేజ్ ఆంటోని, మాస్టర్ మిథన్ రియాన్, అంజలి, అజు వర్గీష్, విజయ్ యేసుదాస్ తదితరులు నటించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ యశ్ దయాల్‌పై ఆరోపణలు చేసింది. తనను మోసం చేసిన యశ్ దయాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ సీఎం ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) క్రికెటర్ యశ్ దయాల్ (Yash Dayal) తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఆరోపించింది. ఉత్తరప్రదేశ్ (UttarPradesh)లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి ఈ ఆరోపణలు చేసింది. తనను మోసం చేసిన యశ్ దయాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ సీఎం ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది.
ఈ నెల 14వ తేదీన మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశానని, కానీ, వారు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలిపింది. తాను యశ్ దయాల్‌తో ఐదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతడి ఇంటికి కూడా తీసుకెళ్లాడని తెలిపింది. కాబోయే కోడలు అంటూ ఇంట్లో కూడా పరిచయం చేశాడని, ఆ తర్వాత తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని ఫిర్యాదులో పేర్కొంది. అతడికి ఇతర మహిళలతో కూడా సంబంధాలున్నాయని తెలిసిందని తెలిపింది.
యశ్ దయాల్‌తో తాను దిగిన ఫొటోలను, తీసుకున్న వీడియోలను, వీడియో కాల్స్, ఛాటింగ్ స్క్రీన్ షాట్స్‌ను కూడా ఆ ఫిర్యాదుతో పాటు ఆధారాలుగా ఆ యువతి జత చేసింది. యశ్ దయాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్పందించిన సీఎం కార్యాలయం సంబంధిత పోలీస్ అధికారుల నుంచి నివేదిక కోరినట్టు తెలుస్తోంది.