రేవంత్ పాలనలో గురుకులాలు నిర్వీర్యం హరీష్‌రావు ఫైర్.

 రేవంత్ పాలనలో గురుకులాలు నిర్వీర్యం హరీష్‌రావు ఫైర్…

 

రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటం శోచనీయమని మాజీమంత్రి హరీష్‌రావు అన్నారు.

జనవరి నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్లు, మాంసం, అరటి పండ్ల సరఫరా నిలిచిపోయాయని చెప్పారు.

హైదరాబాద్:
బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు.. రేవంత్ ప్రభుత్వ (Revanth Government) పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (BRS MLA HarishRao) ఆరోపించారు.
విద్యావ్యవస్థపై కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరితో లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల భవిష్యత్త్‌ని ప్రశ్నార్థకం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా హరీష్‌రావు ట్వీట్ చేశారు.
రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటం శోచనీయమని హరీష్‌రావు అన్నారు.
జనవరి నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్లు, మాంసం, అరటిపండ్ల సరఫరా నిలిచిపోయాయని చెప్పారు.
బకాయిలు చెల్లించకుంటే జులై ఒకటోవ తేదీ నుంచి అన్నిరకాల ఆహార పదార్థాలు, ఇతర సామాగ్రి సరఫరాను నిలిపి వేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు.
మరోవైపు 13 నెలలుగా రూ. 450 కోట్లకు పైగా అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో ఆయా భవనాల యజమానులు తాళాలు వేస్తున్న దుస్థితి ఉందని చెప్పారు.
విద్యాసంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటి వరకు యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, స్కూల్ బ్యాగులు ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు హరీష్‌రావు.
దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని నిలబెట్టాలని, ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేదపిల్లల భవిష్యత్‌ను కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకుల కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆహార పదార్థాలు, ఇతర సామగ్రి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అన్నారు. యూనిఫామ్, బూట్లు, స్కూల్ బ్యాగులు తక్షణమే పంపిణీ చేయాలని హరీష్‌రావు కోరారు.

కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ చిత్రపటానికి నివాళులర్పించిన.

కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ చిత్రపటానికి నివాళులర్పించిన

కామ్రేడ్ చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి ఆలియాస్ గణేష్ ఉదయ్ ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందాడు విషయం తెలుసుకున్న కామ్రేడ్ చంద్రగిరి శంకర్ గాజర్ల అశోక్ తో కలిసి గాజర్ల రవి గణేష్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన ప్రజల కోసం తన జీవితం అంకితం చేసిన విప్లవ యోధుడు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ ప్రత్యేక జోన్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన గాజర్ల రవి అలియాస్ గణేష్ ఉదయ్ మారేడుమిల్లి అల్లూరు సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో మృతి మృతి చెందడం జరిగింది 40 సంవత్సరాలు మావోయిస్టు పార్టీలో పనిచేసే వీర మరణం పొందాడు అని కామ్రేడ్ చంద్రగిరి శంకర్ అన్నారు

విజయవంతంగా ముగిసిన దివ్యాంగుల ఫిజియోథెరపీ

కామారెడ్డి జిల్లా /పిట్లం నేటిధాత్రి :

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని భవిత సెంటర్లో శుక్రవారం ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ సారిక ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఫిజియో థెరపీ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు 8 మంది విద్యార్థులకు గాను పరీక్షలు నిర్వహించారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
దివ్యాంగులకు ఫిజియోథెరపీ చేయడం వల్ల చాలా లాభాలున్నాయని, ఇది శారీరక శక్తి మరియు చలనం మెరుగుపరచడం ద్వారా వారి రోజువారీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనే అవకాశాన్ని ఇస్తుందని,అలాగే శరీరంలోని నొప్పి తగ్గించడం, సంయుక్త పునరుద్ధరణ, మరియు శారీరక సమతుల్యతను మెరుగుపరచడంలో ఫిజియోథెరపీ కీలక పాత్ర పోషిస్తుంది అని వివరించారు. కావున ప్రతి ఒక్క విద్యార్థి ఇంటి వద్ద తప్పకుండా వ్యాయామాలు చేయాలని వారిని సూచించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల ఉపాధ్యాయులు కమల్ కిషోర్, గంగాధర్, అంబయ్య, తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ బిల్లుల విడుదలకు కార్యదర్శుల విజ్ఞప్తి

కామారెడ్డి జిల్లా/ పిట్లం నేటిధాత్రి:

కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో గ్రామ పంచాయతీ కార్యకలాపాల నిర్వాహణ కోసం పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కార్యదర్శులు కోరుతున్నారు. మార్చి నుండి నిర్వహణ సాధ్యం కాదని వారు పేర్కొన్నారు.ఈ మేరకు మంగళవారం మండలంలో ఎంపీడీవో కమలాకర్ కు, ఎంపీవో రాములుకు వినతిపత్రాలు అందజేశారు. గతేడాది ఆగస్ట్ నుండి పెండింగ్లో ఉన్న చెక్కుల చెల్లింపులు మరియు జీపీ నిర్వహణ నిధులు విడుదల చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీల కార్యదర్శులు వినోద్, రాము, లక్ష్మణ్ బాలరాజ్, కృష్ణ, సునీల్, సాయిబాబా, గులాబ్, హుస్సేన్, భాస్కర్, రవి, అంబయ్య, శేఖర్, వాగ్దేవి తదితరులు పాల్గొన్నారు.

జమ్మికుంట పట్టణంలోని లోటస్పాండ్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నిలువు దోపిడి

జమ్మికుంట: నేటిధాత్రి
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద అధిక పీసులు వసూలు చేస్తున్నారని విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కంప్లైంట్ మెరకి విద్యార్థి సంఘాలు స్కూల్ యొక్క యజమాన్యాన్ని అడగగా వారితో దురుసుగా ప్రవర్తించడంతోపాటు ఇష్టానుసారంగా మాట్లాడుతూ విద్యార్థి సంఘాలపై కేసు పెట్టానని పోలీసులతో విద్యార్థి సంఘాలను బెదిరిస్తూ రాజకీయ వ్యవస్థను స్కూల్ పై తీసుకొచ్చి స్కూల్ యొక్క వ్యవస్థా బ్రస్ట్ పట్టిస్తున్నారని విద్యార్థి సంఘాల పోరాటం విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల కష్టార్జితం దోపిడీ చేస్తున్నారని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి విద్యార్థి సంఘాలు లోటస్పాండ్ స్కూల్ ముందు నిరసనకు దిగి ఆందోళన చేపట్టారు లోటస్పాండ్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి వద్ద స్కూల్ యొక్క ఫీజు హాస్టల్ యొక్క ఫీజుకి 35 వేలకి మాట్లాడుకోగా విద్యార్థి యొక్క తల్లిదండ్రుల వద్ద 46 వేల రూపాయలు వసూలు చేయడం పట్ల నిరసిస్తూ ధర్నా చేపట్టారు దీనిపై లోటస్పాండ్ ఒక యజమాన్యంకి పోలీసులకు 100 డయల్ చేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థి సంఘాలని అదుపులోకి తీసుకున్నారు తదనానంతరం యాజమాన్యాన్ని పోలీస్ స్టేషన్కు పిలిపించగా యజమాన్యం విద్యార్థి సంఘాలకు క్షమాపణ కోరారు విద్యార్థి సంఘాలు మాట్లాడుతూ ఇలా అధిక ఫీజులు వసూలు చేస్తే ఊరుకునేది లేదని మళ్లీ పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు ఏదైతే విద్యార్థి తల్లిదండ్రుల వద్ద అధిక ఫీజు తీసుకున్నారు 10000 రూపాయలు విద్యార్థి యొక్క తండ్రికి అప్పజెప్పడం జరిగింది విద్యార్థి సంఘాల పోరాటం విద్యార్థుల తల్లిదండ్రులకు దక్కుతుందని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version