రోటీ పిండిలో విషం..

రోటీ పిండిలో విషం.. భర్త సహా 8 మందిని లేపేయాలని ప్లాన్..

భర్త, అతడి కుటుంబీకులను చంపేందుకు ఓ కోడలు మహత్తరమైన స్కెచ్ వేసింది. విషం కలిపిన గోధుమ పిండితో చపాతీలు తయారుచేసి అత్తమామల కుటుంబాన్ని లేపేయాలని ప్లాన్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ దారుణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

ఇష్టం లేని పెళ్లి చేశారనో.. ప్రియుడి కోసమో.. భర్త నచ్చలేదనో.. ఇలా ఏదొక కారణంతో కట్టుకున్న మొగుణ్ని దారుణంగా మర్డర్ చేసే భార్యల గురించి ఈ మధ్య తరచూ వినే ఉంటారు. కానీ, ఈ మహిళ స్టైలే వేరు. భర్త తిట్టాడని కాదు.. తోడికోడలు నవ్విందని అన్నట్టుగా.. ఓ మహా ఇల్లాలు వదినతో గొడవ జరిగిందని భర్తను, అతడి తరపు ఫ్యామిలీని చంపేందుకు మహత్తరమైన ప్లాన్ వేసింది. ఒకే దెబ్బతో అందరినీ లేపేయాలనే కసితో విషం కలిపిన గోధుమపిండితో చపాతీలు తయారుచేసి అందరికీ తినిపించాలని కుట్ర పన్నింది.

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అత్తింట్లో గొడవలతో విసిగిపోయిన మాల్తీ దేవీ భర్త సహా అతడి కుటుంబం మొత్తాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నింది. ఒక రోజున సల్ఫోస్ అనే విషపూరిత రసాయనాన్ని గోధుమ పిండిలో కలిపి చపాతీలు తయారుచేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో మాల్తీ వదిన మంజూ దేవి పిండి నుంచి వింత వాసన రావడం గమనించింది. ఏదో చేస్తోందనే అనుమానంతో ఇంట్లో అందరికీ చెప్పింది. దీంతో అత్తమామలు మాల్తీ దేవిని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పేసింది. కుటుంబం మొత్తాన్ని ఒకేసారి చంపేందుకు పిండిలో విషం కలిపానని స్వయంగా అంగీకరించింది.

కరారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కియా బాజా ఖుర్రామ్ గ్రామంలో జరిగిన ఈ ఘటన జరిగింది. రోజువారీ తగాదాలు, మానసిక హింసతో విసిగిపోయిన మాల్తీ తండ్రి ప్రసాద్, సోదరుడు బజరంగీతో కలిసి ఈ కుట్ర పన్నింది. ఇంట్లో కలహాలు మొత్తం కుటుంబాన్నే చంపాలనే నిర్ణయానికి దారి తీస్తాయని తెలుసుకుని స్థానికుల ఆశ్చర్యపోతున్నారు. మాల్తీ దేవికి ఆమె వదిన, అత్తమామలతో తరచూ గొడవలయ్యేవని గ్రామస్థులు అంటున్నారు. ఈ మొత్తం ఘటన గురించి మాల్తీ భర్త బ్రిజేష్ కుమార్ వెంటనే కరారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మాల్తీతో పాటు ఆమె తండ్రి, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. విషం కలిపిన గోధుమ పిండిని స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ప్రణాళిక, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనే అభియోగాలతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తులో భాగంగా ముగ్గురినీ విచారణ చేస్తున్నారు. అయితే, ఇప్పటికే నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఫోరెన్సిక్ దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది.

టీమిండియా కోసం ఇంగ్లండ్ లెజెండ్ సొంతజట్టుకు వ్యతిరేకంగా ప్లాన్

టీమిండియా కోసం ఇంగ్లండ్ లెజెండ్ సొంతజట్టుకు వ్యతిరేకంగా ప్లాన్…

 

టీమిండియా ప్రతీకారంతో రగిలిపోతోంది. లీడ్స్ టెస్ట్‌లో జరిగిన పరాభవానికి రివేంజ్ తీర్చుకోవాలని చూస్తోంది. స్టోక్స్ సేన బెండు తీయాలని పట్టుదలతో కనిపిస్తోంది.

ఇంగ్లండ్ పర్యటనను పరాభవంతో మొదలుపెట్టిన టీమిండియా.. ఇప్పుడు ప్రతీకారంతో రగిలిపోతోంది. లీడ్స్ టెస్టులో ఓటమి గిల్ సేనను నిరాశలో ముంచేసింది. అయితే వెంటనే తేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టిన భారత జట్టు.. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్ట్ కోసం జోరుగా సన్నద్ధమవుతోంది. స్టోక్స్ సేన బెండు తీసి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని చూస్తోంది. ఈ తరుణంలో మెన్ ఇన్ బ్లూకు అండగా నిలబడుతున్నాడో ఇంగ్లండ్ స్టార్. సొంతజట్టుకు వ్యతిరేకంగా, గిల్ సేనకు అనుకూలంగా పని చేస్తున్నాడు. అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
మైండ్‌సెట్ ముఖ్యం..

భారత జట్టు ఆటగాళ్లకు సాయం చేస్తున్నాడు ఇంగ్లండ్ దిగ్గజం కెవిన్ పీటర్సన్. స్పిన్నర్లకు అంతగా అచ్చిరాని ఇంగ్లీష్ కండీషన్స్‌లో వికెట్లు ఎలా తీయాలో నేర్పిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ బయటపెట్టాడు. ‘కెవిన్ పీటర్సన్ నాకు కొన్ని సలహాలు ఇచ్చాడు. ఇంగ్లండ్‌లో ఎలా రాణించాలో చెప్పాడు. ఇక్కడి ఫీల్డింగ్ పొజిషన్స్, పిచ్‌ల గురించి అర్థం అయ్యేలా వివరించాడు. ఎలాంటి మైండ్‌సెట్‌తో బౌలింగ్ చేయాలో సూచించాడు అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.

 ఒక పథకం ప్రకారం  ​సన్ నెక్స్ట్ ఓటీటీలోనూ  అదరగొడుతోంది.

 ఒక పథకం ప్రకారం  ​సన్ నెక్స్ట్ ఓటీటీలోనూ  అదరగొడుతోంది…

ఒక పథకం ప్రకారం జూన్ 27 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.  ఓటీటీలో రికార్డ్ వ్యూస్ సాధిస్తూ వీక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటూ దూసుకు వెళుతోంది.

పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ (Sairam shankar) కథానాయకుడిగా నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఒక పథకం ప్రకారం’ (Oka Pathakam Prakaram) . వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. వినోద్ విజయన్ ఫిల్మ్స్ – విహారి సినిమా హౌస్ ప్రై.లి. సంస్థలపై గార్లపాటి రమేష్‌తో వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. ఫిబ్రవరి 7న సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఇంటర్వెల్ తర్వాత విలన్ ఎవరో చెబితే 10 వేలు ఇస్తామని యూనిట్ చేసిన ప్రకటనకు మంచి స్పందన వచ్చింది. థియేటర్‌కు ఒకరు చొప్పున 50 థియేటర్ల నుంచి 50 మంది విజేతలను ఎంపిక చేసి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చిత్ర బృందం పేర్కొంది. మీడియా ప్రతినిధులకు వేసిన షోతో పాటు మిగతా థియేటర్లలో విజేతలకు డబ్బులు అందజేసింది. సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో చక్కటి విజయాన్ని అందుకున్న ‘ఒక పథకం ప్రకారం’ జూన్ 27 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో రికార్డ్ వ్యూస్ సాధిస్తూ వీక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటూ దూసుకు వెళుతోంది. ‘ఒక పథకం ప్రకారం’ సినిమాతో సాయిరామ్ శంకర్ చక్కటి కమ్ బ్యాక్ ఇచ్చారని ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇందులో సిద్ధార్థ్ నీలకంఠ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రలో హీరో సాయిరామ్ శంకర్ నటించారు. విశాఖ నగరంలో జరిగిన వరుస హత్యల మీద అతని మీద పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తారు. నిజంగా ఆ హత్యలు సిద్ధార్థ్ చేశాడా? లేదంటే వాటి వెనుక వేరొకరు ఉన్నారా? అనేది సినిమా.  (Sun next ott) 

సినిమా థియేటర్‌లు

నిర్మాతలు గార్లపాటి రమేష్‌, వినోద్ విజయన్ మాట్లాడుతూ ”మంచి సినిమా తీస్తే ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉంటుందని మరోసారి రుజువైంది. థియేటర్లలో విడుదలైన తర్వాత మాత్రమే కాకుండా ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ప్రశంసలు రావడం సంతోషంగా ఉంది. ఓటీటీ రిలీజ్ ప్లానింగ్, ప్రొసీజర్స్ విషయంలో మాకు సహాయం చేసిన సన్ నెక్స్ట్ కంటెంట్ హెడ్ శశి కిరణ్ నారాయణ గారికి చాలా థాంక్స్. ఈ సినిమా దర్శక నిర్మాణంలో నాకు అండగా నిలబడిన మా హీరో సాయిరామ్ శంకర్ గారితో పాటు చిత్ర బృందం అందరికీ థాంక్స్” అని చెప్పారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version