కోట శ్రీనివాస రావు.. అందరికీ నచ్చడు..

కోట శ్రీనివాస రావు.. అందరికీ నచ్చడు

కోట శ్రీనివాస రావు మృతిపై విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాష్ రాజ్ త‌న సంతాపం తెలియ‌జేశాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..తెలుగు జాతి గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుడు కోట శ్రీనివాస రావు (Kota Srinivasa Rao) మృతిపై విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) త‌న సంతాపం తెలియ‌జేశాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కోట గారి సినిమాలు చూసి చాలా స్పూర్తి పొందాన‌ని, ఎన్నో సినిమాల్లో కలిసి నటించామ‌ని ఆయ‌న ఎంతో విశిష్డ మైన వ్యక్తి అని.. ‌అందరికీ నచ్చడు.. ఎవరిని మెప్పించటానికి ప్రయత్నం చేయడ‌ని, ఆయనది ఒక ప్రజెన్స్ అని.. తన మాట‌ల్లో ఓ వ్యంగ్యం ఉండేది అన్నారు.

తెలుగు ప్రతిభకు చాన్స్ దొరకటం లేదని అనగానే తొలుత నాకు భాద వేసిందని.. కానీ ఆ తరువాత వారి బాధ నిజమే అని అర్దమయిందన్నారు. ప్రకాష్ రాజ్ తెలుగు వారు కాదు కదా అంటే.. తెలుగు మాట్లాడతాడు.. పరాయివాడు కాదు అనేవారు, నాపై కూడా ఛలోక్తులు విసిరే వారని గుర్తు చేసుకున్నారు. ఈమధ్య ఫోన్ చేశాన‌ని, మాతో కలిసి ఓ సినిమా సెట్‌లో గడిపారని, వారి ఇంట్లో జరిగిన పెయిన్ ను బయట ఎక్కడా చూపే వారు కాదని వారి వ్యక్తిత్వం నాకు ఎంతో ఇష్డమ‌ని కొనియాడారు.

కమిటీలకు దిక్కు లేదు..కార్యకర్తలకు గుర్తింపు లేదు!

`వాళ్ల కష్టానికి ఫలితం లేదు.

`అన్ని పార్టీలది అదే తీరు.

`ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకొస్తారు.

`ఏళ్లకేళ్లు వెట్టి చాకిరి చేయించుకుంటారు.

`కడుపు కట్టుకొని పార్టీ కోసం కార్యకర్తలు పని చేస్తారు.

`జెండాలు కట్టడానికి, నాయకులకు సలాం కొట్టడానికి పనికొస్తారు.

`సభలు పెడితే జేజేలు కొట్టడానికి అవసరౌతారు.

`పథకాల అమలులో కూడా వివక్షకు గురౌతారు.

`సొంత పార్టీ వాళ్లకే ప్రయోజనమౌతుందని కార్యకర్తలను పక్కన పెడతారు.

`ఓట్లేయించేందుకు మాత్రమే కార్యకర్తలు అవసరమౌతారు.

`పార్టీ కోసం ఏం ఆశించకుండా పని చేస్తారని గొప్పలు చెప్పి నోరు మూయిస్తారు.

`అడుగడుగునా మాయ చేసి చెప్పు చేతుల్లో వుంచుకుంటారు.

`నాయకులు గ్రూపులు కట్టి కార్యకర్తలను విభజిస్తారు.

`సొంత పార్టీలలోనే కార్యకర్తలు శత్రులయ్యేలా చేస్తారు.

`నాయకులు మాత్రం చెట్టా పట్టాలేసుకొని తిరుగుతారు.

`గ్రామ, మండల కమిటీలు వేయకుండా కార్యకర్తలను ఆశల పల్లకిలో ఊరేగిస్తారు.

`కమిటీలెప్పుడు వేసినా పదవి నీకే అని అందరికీ చెప్పి కాలయాపన చేస్తారు.

`పై స్థాయిలో వున్న వాళ్లు ఒక్కొక్కరు నాలుగు పదవులు చేపడతారు

`కుటుంబంలో వున్న వాళ్లకు పదవులు పంచుకుంటారు.

………………………..

`పదేళ్లు అధికారంలో వున్నా ‘‘బిఆర్‌ఎస్‌’’ కార్యకర్తలు బతికింది లేదు.
`అప్పుల పాలై దివాళా తీసినా ఒక్కరినీ ఆదుకున్నది లేదు.
`నామినేటెడ్‌ పదవులిచ్చి గౌరవించింది లేదు.
`కనీసం పార్టీ కమిటీలు వేసి పదవులు అప్పగించింది లేదు.
`ఇప్పటికీ ‘‘బిఆర్‌ఎస్‌’’ కమిటీలు వేయాలన్న సోయి లేదు.
……………………….
`కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావొస్తోంది.
`పార్టీ కమిటీలకు దిక్కు లేదు..
`పూర్తి స్థాయిలో నామినేట్‌ పదవులు పంచింది లేదు.
…………………..
`బిజేపి ఇందుకు తీసిపోయిందేమీ లేదు.
`ఆ పార్టీ అనుసరిస్తున్నది అదే తీరు.
`మూడు పార్టీలలో కమిటీలకు దిక్కు లేదు.
`ఎన్నికల పేరు చెప్పుకొని నాయకులు ఎగేసుకొస్తారు.
`గెలిపించే బాధ్యత మీదే అని కార్యకర్తలను ఆకాశానికెత్తురు.
`మీరు లేకుండా పార్టీయే లేదని ఉబ్బిస్తారు.
`ఎన్నికలైపోయిన తర్వాత ముఖం చాటేస్తారు.
`కార్యకర్తలు కరివేపాకులు..రాజకీయాలలో గోలించి పడేస్తారు!

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాజకీయ నాయకులు, కార్యకర్తలు అనగానే ఖద్దరు చొక్కాలు. రేబాన్‌ కళ్లజోళ్లు. కాళ్లకు ఖరీదైన చెప్పులు. అయితే టూవీలర్‌, లేకుంటే కారు. కాలు తీసి బైట పెడితే చాలు గౌరవాలు. మర్యాదలు. పైరవీలు. ప్రజ సమస్యలు. అబ్బో ఆ సెటప్పే వేరు. కనిపించిన వాళ్లను పలకరించడం. వారికి టీలు తాగిపించడం. అవసరమైతే టిఫిన్లు చేయించడం. ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం అదో సంతర్పణ కార్యక్రమం. ఇదంతా ఎలా? అనుకుంటే సమాధానం చెప్పడానికి నోరు రాదు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడేంత దుఖం. కాని పైకి మాత్రం చెరగని చిరునవ్వు. నోరు తెరిస్తే కోట్ల రూపాయల రియల్‌ వ్యాపారం మాటలు విన పక్కవాళ్లు అబ్బో అనుకోవాలి. అంతే కాని అబ్బా..అనేలా వుండకూడదు. అలా మెంటైన్‌ చేయకపోతే నాయకుడే కాదు. కార్యకర్త కూడా కాదు. కాని ఇంత హడావుడి చేస్తున్నా ఆయా రాజకీయ పార్టీలలో వారి పదవులు ఏమిటని మాత్రం ఎవరూ అడగొద్దు. ఎందుకంటే కొంచెం వయసు చిన్నదైతే కార్యకర్త. కాస్త పెద్ద వయసైతే సీనియర్‌ కార్యకర్త. ఇక వాళ్లు పార్టీల కోసం పడే కష్టం అంతా ఇంత కాదు. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు కేక వేస్తే చాలు జీ హుజూర్‌ అని వాలిపోవాల్సిందే. చేతులు కట్టుకొని నిలడాల్సిందే. నోరు నొచ్చేదాకా ఆ పార్టీ నాయకులు జేజేలు కొట్టాల్సిందే. పార్టీ కండువాలు మెడలో వేసుకొని, జెండా కూడా మోయాల్సిందే. ఇంతగా పార్టీకి సేవ చేస్తున్నా పదవులు ఇస్తారా? ఇస్తాం..ఇస్తామంటూ ఊరిస్తారు. పుణ్యకాలం పూర్తయ్యేదాకా వాయిదా వేస్తూ వెళ్లాల్సిందే. అధికారంలో వున్నప్పుడు నాయకులు ఊడిగం చేయాలి. ప్రతిపక్షంలో వున్నప్పుడు పార్టీకి రక్షణ కవచాలు కావాలి. ఒక రకంగా చెప్పాలంటే మొత్తానికి పార్టీ కార్యకర్తలు వెట్టి చాకిరీ చేసే కూలీలుగా మారిపోవాలి. ఇంతకు మించి రాజకీయం అంటే చెప్పుకోవడానికి ఏదీ వుండదు. పార్టీ పేరు చెప్పి బతికే కొంత మంది లైక్యం తెలిసిన కారకర్తలుంటారు. చిన్నా చితక పైరవీలతో నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు. నాయకులు చెప్పి పనులు చేయించుకుంటారు. ఇది కూడా ఏ ఐదు శాతమో వుంటారేమో? కాని మిగతా నాయకులంతా జేజేలు కొట్టడం మాత్రం చేస్తుంటారు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పదవి రాకపోతుందా? అని జీవితాంతం ఎదురు చూస్తుంటారు. జీవితాంతం కార్యకర్తగానే మిగిలిపోయిన వాళ్లు కొన్ని లక్షల మంది వుంటారు. కడుపు కట్టుకొని పార్టీకి సేవ చేస్తుంటారు. అప్పులు చేసిన పార్టీ కోసం పనిచేస్తుంటారు. ఆస్ధులు అమ్ముకొని రాజకీయాల్లో సాగుతుంటారు. ఇంత చేస్తున్నా నాయకులకు సలాం కొట్టడానికి మాత్రమే వుంటారు. నాయకుడు ఫోన్‌ చేస్తే క్షణాల్లో వాలిపోతారు. నాయకుడు కదలమని చెప్పేదాకా అక్కడే పడిగాపులు కాస్తారు. నిజం చెప్పాలంటే ఇది రాజకీయం కాదు. నాయకులకు ఊడిగం చేయడం. సరే ఇంత చేస్తున్నా ప్రభుత్వ పథకాలనైనా కార్యకర్తలకు అందుతాయా? అదీ వుండదు. ఎందుకంటే అడుక్కుంటే చులకనౌతాడు. పట్టుబట్టి తీసుకుందామంటే నాయకుల ఆగ్రహానికి గురౌతారు. మనం పంచే స్దితిలో వున్నాం. అడుక్కుంటామా? అని చెప్పే నాయకుల మాటలకు తలవంచేవాళ్లుంటారు. సర్ధుకుపోయే మనస్తత్వమే అలవాటు చేసుకుంటారు. పథకాలు పార్టీ కార్యకర్తలకే పంచుకుంటున్నారన్న అవపాదు మోయొద్దని నాయకులు చెప్పే మాటలు విని ఆశలు చంపుకుంటారు. ఇది అన్ని పార్టీలలో వుండే కార్యకర్తల దీనస్ధితికి నిదర్శనం. కనీసం పార్టీ పదవులు ఇచ్చారా? అంటే అదీ లేదు. బిఆర్‌ఎస్‌ పార్టీ పదేళ్ల కాలం అదికారంలో వున్నా ఇప్పటి వరకు సంస్ధాగత నిర్మాణం ఎక్కడా జరగలేదు. మాటలకు మాత్రం 60లక్షల మంది కార్యకర్తలున్నారని గొప్పగా చెబుతారు. కాని ఎంత మంది కార్యకర్తలకు పదవులిచ్చారన్నది చెప్పరు. ఇప్పటికీ గ్రామస్దాయి నుంచి రాష్ట్ర స్దాయి వరకు పదవుల పంపకాలు లేవు. పదేళ్ల అదికారంలో నామినేటెడ్‌ పదువులు కొద్ది మందికి తప్ప పూర్తిగా ఇచ్చింది లేదు. నాయకుల ఇంట్లో ఒక్కొక్కరికి నాలుగు పదవులు పంచారు. అదే కుంటుంబంలో నలుగురున్నా పదవులు పంచారు. కాని పార్టీ కోసం పనిచేసిన ఎంతో మంది కార్యకర్తలకు ఆఖరులోకూడా పదవులు పంచలేదు. వారి జీవితాలను నిలబెట్టలేదు. కార్యకర్తలంటే ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకొచ్చే వాళ్లుగా మారిపోయారు. ఎన్నికల సమయంలో జనాన్ని పోగేసుకునేందుకు పడే అవస్దలు కార్యకర్తలతో తీర్చుకుంటున్నారు. వారిని కూరలో కరివేపాకులు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వచ్చిన కష్టాలు పగ వాడికి కూడా రాకూడదనుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన నాయకులకు కూడా పదవులు లేదు. గుర్తింపు లేదు. కొత్త నీరుకు పెద్దగా పని లేదు. పదేళ్ల తర్వాత అదికారంలోకి వచ్చామన్న సంతోషమే తప్ప, పదువులు అందక ఇబ్బందులు పడుతున్నారు. రేపు, మాపు అనుకుంటూ ఇప్పటికీ ఏడాదిన్న కాలం చూస్తుండగానే కరిగిపోయింది. పార్టీ అదికారంలోకి వస్తే అంతా ఇక మా కాలామే..మా రాజ్యమే అనుకున్న ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు పదవుల రాక యాతన పడుతున్నారు. కనీసం చెప్పుకోవడానికిపార్టీ పదవులు కూడా ఇంకా పూర్తి స్ధాయిలో పంపకాలు జరగలేదు. మాకు ఎప్పుడు అవకాశాలు వస్తాయో అని ఎదరుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే పదవులు అందుకుంటామనుకున్నారు. కాని రెండేళ్ల దగ్గర పడుతున్నా ఎదరు చూపులు తప్పడం లేదు. ..పదవులకోసం పడిగాపులు తప్పడం లేదు. అదికారంలోకి వచ్చి ఏడాదిన్నరౌతుంటే ఆశలు ఆవిరౌతాయేమోనన్న ఆందోళనలో వున్నారు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్ధితుల్లో రియల్‌ వ్యాపారం కూడా సాగడం లేదు. కాంగ్రెస్‌ నాయకులకు ఆ రకంగా కూడా కలిసి రావడం లేదు. రేవంత్‌ సర్కారు తీసుకొస్తున్న కొన్ని సంస్కరణల మూలంగా వున్న ఉపాధి కూడా పోయిందని రియల్‌ వ్యాపారం చేసే కాంగ్రెస్‌ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. హైడ్రా వల్ల హైదరాబాద్‌లో భూముల అమ్మకాలు,కొనుగోలు ఆగిపోయింది. భూములు కొనాలంటేనే జనం భయడిపోవాల్సి వస్తోంది. వారికి భరోసా ఇచ్చే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు. ఇక ధరణి పేరుతో బిఆర్‌ఎస్‌ నాయకులు, అధికారులు కొంత బాగు పడ్డారు. భూ భారతి వచ్చినా, కాంగ్రెస్‌ నాయకుల సమస్యలు తీరడం లేదు. వారికి ఏదీ కలిసి రావడం లేదు. దాంతో పార్టీపరమైన పదవులు వచ్చినా చెప్పుకోవడానికి ఒక హోదా వుంటుందని అనుకుంటున్నా అవీ రావడం లేదు.ద అన్ని స్దాయిలో నాయకులకు ఎప్పుడొస్తాయో పదవులు అని ఎదురుచూస్తున్నారు. పైగా తమకు వస్తాయా? లేక ఇతరులకు వస్తాయా? కూడా అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. అదే సమయంలో ఎక్కడిక్కడ నాయకులనే నిలదీసేంద ధైర్యం చేస్తున్నారు. ప్రభుత్వ పధకాలు అందక, పార్టీ పరమైన పదవులు అందక, ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేతికి రాక ఆర్ధికంగా నాయకులు చితికిపోతున్నారు. అప్పుల పాలౌతున్నారు. చిన్నా చితక కాంట్రాక్టులు వచ్చిన బాగుండని అనుకుంటున్నారు. పల్లెల్లో మొరం పనులు కూడా రాక సతమతమౌతున్నారు. రోడ్డెక్కితే వందలు ఖర్చవున్నాయి. నాయకులు చుట్టూ తిరిగేందుకు వేలకు వేలు ఖర్చవుతున్నాయి. నాయకులు మాటలు నమ్మి తిరిగాల్సిన పరిస్తితి ఎదురౌతోంది. ఇంట్లో కూర్చోలేరు. చేతిలో వున్న పైకం ఖర్చు చేసుకుంటూ సాగలేరు. ఇక పదవులు, పదువులు అని కలవరిస్తూ, ఏ కార్యక్రమం పెట్టినా పై స్దాయి కాంగ్రెస్‌ నాయకులకు ఎదురీతలు తప్పడం లేదు. కార్యకర్తల ప్రశ్నలు ఎదుర్కొ తప్పించుకునే పరిస్దితి లేదు. ఇక కాంగ్రెస్‌ అంటేనే గ్రూపులు. ఆ గ్రూపుల మధ్య సమన్వయం నాయకులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. పదేళ్ల తర్వాత అదికారంలోకి వచ్చినా కష్టాలు తీరడం లేదని కార్యకర్తలు మొత్తుకుంటున్నారు.. అధికార పార్టీలో నాయకులుగా వుంటూ కూలీ చేసుకోలేరు. ఊరికి పరిమితమై వుండలేరు. నాయకుల పర్యటనల్లో పాలు పంచుకోక వుండలేరు. ఎక్కడా పనులు లేవు…చేతికి పైకం అందింది లేదని మదనపడుతున్నారు. ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటూ ఓదార్చుకుంటున్నారు. అధికారంలోవున్నామన్న మాటే కాని అణా సంపాదన లేదంటూ నిట్టూర్చుతున్నారు. . ఖర్చులు మాత్రం ఆగడం లేదు..కార్యకర్తల పోషణ తప్పడం లేదు. ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంటికొచ్చి కార్యకర్తలు విసుక్కుంటున్నారు. మంత్రుల మందే నాయకులు తిట్టుకుంటున్నారు. కొన్నిచోట్ల నాయకులు కొట్లాడుకుంటున్నారు. సెక్యూటిరీని కూడా నెట్టేసుకుంటే కష్టాలు చెప్పుకుంటున్నారు. గందరగోళంలో పార్టీ శ్రేణులు. స్దానిక సంస్దల ఎన్నికలు రావడం లేదు..పదువుల అందుతాయా అన్నదిగులు. అధికారంలోవున్న మాటే గాని, సంతోషం ఎక్కడా కనిపించడం లేదు. బిజేపి నాయకులు, కార్యకరర్తల పరిస్ధితులు ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడ కూడా అదే పరిస్దితి. కార్యకర్తలకు పదవులు ఇచ్చింది లేదు. కేంద్రంలో పార్టీ అదికారంలోవున్నా గ్రామీణస్దాయి నాయకులకు నామినేటెడ్‌ పదవులు పంచింది లేదు. కార్యకర్తలు కూరలో కరివేపాకులు..రాజకీయాల్లో గోలించి పడేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా చుక్క రమేష్ గౌడ్.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా చుక్క రమేష్ గౌడ్.

నర్సంపేట,నేటిధాత్రి:

దుగ్గొండి మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లంపల్లి గ్రామానికి చెందిన చుక్క రమేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఎన్నిక చేశారు. మండల అధ్యక్షులుగా చుక్క రమేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా చెన్నూరి కిరణ్ రెడ్డి, ఒలిగె నరసింగారావు, ఇంగోలి రాజేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి అజ్మీర రవీందర్ నాయక్, ఉపాధ్యక్షులు కామశోభన్ బాబు, నల్ల వెంకటయ్య, కార్యదర్శి అమ్మ రోహిత్, ప్రచార కార్యదర్శి కూరతోట సురేష్, కోశాధికారి జంగిలి రవి, కార్యవర్గ సభ్యులు హుస్సేన్ పల్లి విరాట్, గిన్నె స్వామి,రేవూరి వెంకట్ రెడ్డి,యార రవి, నల్ల యాదవ రెడ్డి, ఎర్ర ఆదిరెడ్డి, వేములపల్లి ఓదేలు, పుపాల శ్రీను, పరుపాటి ప్రభాకర్ రెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రాజకీయ అనుభవంతో కాంగ్రెస్ పార్టీ గుర్తింపు..

గత 30 సంవత్సరాలుగా వివిధ పార్టీలకు మండల స్థాయి బాధ్యతలు చేపట్టి ఎంపీపీ,సర్పంచ్ పదవులను చేపట్టి సేవలను అనుభవం కలిగిన వ్యక్తిగా దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన చుక్క రమేష్ గౌడ్ కు గుర్తింపు పొందాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హాయంలో దుగ్గొండి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.అలాగే తెలుగుదేశం పార్టీ దుగ్గొండి మండలం అధ్యక్షుడిగా సుమారు 15 ఏళ్ల పాటు పనిచేశారు. అలాగే భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా భాజపాకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గెలుపు కృషి చేశారు. కాగా చుక్క రమేష్ గౌడ్ దుగ్గొండి మండలంలో అన్ని గ్రామాలలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు ప్రజలకు సన్నిహితంగా ఉంటారు. గత శాసనసభ ఎన్నికల్లో రమేష్ గౌడ్ చేసిన కృషి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పైస్థాయి సీట్లను సాధించగలిగే సత్తా ఉండడంతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
గుర్తించి దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షునిగా ఎంపిక చేసినట్లు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా..

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్..

అనతి కాలంలోనే తనపై నమ్మకంతో దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అవకాశం కల్పించారని,కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకుల సహకారంతో పార్టీని దుగ్గొండి మండలంలో పూర్తిస్థాయిలో బలోపేతం చేయడానికి
తన వంతుగా కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్ హామీ ఇచ్చారు. దేశంలోని ఎక్కడలేని విధంగా కులగనన చేపట్టి 42 శాతం బీసీ రిజర్వేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేసిందని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రల బాబు పలువురు నాయకులకు చుక్క రమేష్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.

జమ్మికుంట లో వరుస చోరీలు..

జమ్మికుంట లో వరుస చోరీలు

బంగారం షాప్ మరియు కిరాణం షాప్ లో చోరీ
జమ్మికుంట నేటిధాత్రి
జమ్మికుంట పట్టణంలోని ధనాల కొండయ్య కాంప్లెక్స్ లోని బ్రాండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ లో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు గడ్డపారతో షెటర్ ను లేపి షాప్ లో ఉన్న మూడు తులాల బంగారము, నాలుగు కేజీల వెండి ఆభరణాలను దొంగిలించారు. వాటి విలువ సుమారు ఏడు లక్షలు ఉంటుందని షాపు యజమాని భోగి వంశీకృష్ణ తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా బంగారం షాపును నడుపుతున్నా నని తెలిపారు. శనివారం ఉదయం కాంప్లెక్స్ లో పనిచేసే వర్కర్ చూసి షాపు యజమానికి తెలుపగా, పోలీసులకు సమాచారము అందించారు. జమ్మికుంట పట్టణ సీఐ ఎస్ రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. కరీంనగర్ నుండి వచ్చి న క్లూస్ టీం ఇన్స్పెక్టర్ స్వర్ణ జ్యోతి ఆధ్వర్యంలో ఆధారాలను సేకరించారు. డాగ్ స్క్వాడ్ వచ్చి దొంగలు ఎటువైపు నుండి వచ్చారో గుర్తించారు. షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దొంగలను త్వరలో పట్టుకుంటామని పట్టణ సీఐ తెలిపారు. హుజురాబాద్ ఏసిపి మాధవి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు . షాపు యజమాని వివరాలు అడిగి తెలుసుకున్నారు .అలాగే ఈ నెల 10 న రాత్రి కొండూరి కాంప్లెక్స్ లోని మహాలక్ష్మి కిరాణం షాపు షట్టర్ ను గడ్డపారతో పైకి లేపి షాపులో ఉన్న 20వేల రూపాయలను దొంగిలించారు. షాపు యజమాని కొలకాని గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి శ్రీకృష్ణ వైన్స్ షెటర్ ను గడ్డపారతో లేపడానికి ప్రయత్నం చేశారు. కానీ షట్టర్ పైకి పోకపోవడంతో దొంగలు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. గత పది రోజుల క్రితం మండలం లోని సైదాబాద్ గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంటిలో పట్టపగలే తాళం పగలగొట్టి ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. వరుస దొంగతనాలతో జమ్మికుంట పట్టణ ప్రజలు బెంబే లెత్తుతున్నారు. రాత్రిపూట పోలీస్ గస్తీ పెంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ప్రతి షాప్ లో సీసీ కెమెరాలు పెట్టుకోవాలని పట్టణ సీఐ ఎస్ రామకృష్ణ గౌడ్ తెలిపారు. ఇలాంటి దొంగతనాలు జరిగినప్పుడు దొంగలను పట్టుకోవడానికి కొంత ఈజీగా ఉంటుందన్నారు

కనిపించని నక్ష బాట.

కనిపించని నక్ష బాట.
– సమస్యలో పర్వేద- సంకేపల్లి మధ్య నక్షదారి.
– మా స్థలంలో వేశారు అంటే మా స్థలంలో వేశారు అని గొడవ.
– రైతులకు ఆగిపోయిన రాకపోకలు.
శంకర్ పల్లి, నేటిధాత్రి :
శంకర్పల్లి మండలం సంకేపల్లి గ్రామ పరిధిలో సరిహద్దు(పొలిమేర) దారి విషయంలో సంకేపల్లి గ్రామ రైతులు సమస్యను ఎదుర్కొంటున్నారు. తమ పొలాలకి వెళ్లడానికి దారి లేక అయోమయంలో పడ్డారు. పూర్తి వివరాలు పరిశీలిస్తే సంకేపల్లి పర్వేద మధ్యలో సరిహద్దు దారి గత 25 సంవత్సరాలుగా ఉన్నది. ఆ దారి నుంచే రైతులు రాకపోకలు చేస్తున్నారు తమ పొలానికి కావాల్సిన ఎరువులు, పండిన పంటలను తీసుకెళ్లడం ఇదే దారి వెంట కొనసాగిస్తున్నారు. అయితే రెండు సంవత్సరాల క్రితం పొలిమేర దారి వెంట పొలం ఉన్న రైతులు ప్రభుత్వ సర్వేయర్ తో సర్వే చేయించగా పర్వేద గ్రామానికి సంబంధించిన రైతు పొలంలో నుంచి రోడ్డు వేశారు అని సర్వేయర్ రిపోర్ట్ ఇచ్చాడు అని ఆయన తన పొలంలో నుంచి వేసిన రోడ్డు ను తవ్వేశారు. అయితే సంకేపల్లి గ్రామానికి చెందిన రైతులు మాత్రం గత 25, 30 సంవత్సరాల నుంచి ఇదే రోడ్డుపై మేము మా పొలాలకు వెళ్తున్నాము అని ఇప్పుడు రోడ్డును తవ్వి వేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని అన్నారు. అయితే పర్వేద రైతులు మాత్రం రోడ్డు మా పొలంలో వేశారు అని సర్వేయర్ చెప్పిన దాని ప్రకారం అయితే రోడ్డు సంకేపల్లి గ్రామస్తుల పొలంలో నుంచి వెళ్తుంది అని అంటున్నారు. ఏది ఏమైనా అధికారులు తొందరగా స్పందించి సమస్యను పరిష్కరించాలి అని రైతులు కోరుకుంటున్నారు. పంటల కాలం కాబట్టి తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి కాబట్టి అధికారులు స్పందించాలి అని రైతులు కోరుకుంటున్నారు.

లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి.

లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) చెక్కులు పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి;

జహీరాబాద్ టౌన్ : పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ నివాసంలో శనివారం జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులు
న్యాల్కల్ మండలం సంగమేశ్వర్ -న్యాల్కల్
(₹55,000/-) నర్సింహులు- కాకిజన్వాడ
(₹24,000/-) అశ్విని – హద్నూర్
(₹60,000/-) మాణిక్ – కాకిజన్వాడ
(₹60,000/-)మొత్తం ₹ 199,000 /- విలువగల సీఎం రిలీఫ్ ఫండ్(CMRF) చెక్కులను ఆయన స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.ఈ కార్యక్రమo లో అశ్విన్ పాటిల్,రాజేంద్ర,జగన్నాథ్ రెడ్డి,వేంకట్ రెడ్డి,వెంకట్, సందీప్,ఫయీమ్, ఇస్మాయిల్,సందీప్ రెడ్డి, సునీల్ రెడ్డి మరియు లబ్దిదారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ సబ్ స్టేష‌న్ లు పెంచండిః.

విద్యుత్ సబ్ స్టేష‌న్ లు పెంచండిః

మంత్రి గొట్టిపాటికి ఎమ్మెల్యే విన‌తి

తిరుప‌తి(నేటి ధాత్రి) జూలై 12:

పెరుగుతున్న జ‌నాభాకు అనుగుణంగా తిరుప‌తిలో నూత‌నంగా ప‌ది విద్యుత్ స‌బ్ స్టేష‌న్లు ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు శ‌నివారం ఉద‌యం కోరారు. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తిరుప‌తికి వ‌చ్చిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటికి ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు విన‌తి ప‌త్రం ఇచ్చారు. జ‌న‌భా పెరుగుద‌ల‌తో విద్యుత్ విన‌యోగం పెరిగింద‌ని భ‌విష్య‌త్ అవ‌స‌రాల దృష్ఠ్యా విద్యుత్ స‌ర‌ఫ‌రా మెరుగుద‌ల‌కు 33 / 11 కేవి స‌బ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆ విన‌తి ప‌త్రంలో ఎమ్మెల్యే కోరారు. మ‌హిళా యూనివ‌ర్శిటీ, ఆర్సీ రోడ్డు, కొర‌మేణుగుంట‌, తుడా ట‌వ‌ర్స్ వ‌ద్ద త‌క్షిణం స‌బ్ స్టేష‌న్ లు ఏర్పాటుకు మంత్రి అంగీక‌రించారు.అలాగే బైరాగిప‌ట్టెడ‌,జీవ‌కోన‌, రామ‌చంద్ర‌పుష్క‌రిణి, శెట్టిప‌ల్లి, క‌పిల‌తీర్థం, అర్బ‌న్ త‌హ‌శిల్దార్ కార్యాల‌య స‌మీపంలో కూడా స‌బ్ స్టేష‌న్ లు ఏర్పాటు చేయాల‌ని కోర‌గా త్వ‌ర‌లోనే వీటి నిర్మాణానికి ఏపిఈఆర్సీ అనుమ‌తి ఇస్తుంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులుకు మంత్రి స్ప‌ష్టం చేశారు.

42 శాతం రిజర్వేషన్ తోబీసీలకు సామాజిక న్యాయం

42 శాతం రిజర్వేషన్ తోబీసీలకు సామాజిక న్యాయం
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

42% శాతం రిజర్వేషన్ తో బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందని మొగుళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కాత్య రాజు రమేష్ తెలిపారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగుపెట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయం అని అన్నారు.

క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అమలు స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ అంశంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో చర్చించి బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించినది. విద్యా, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత మార్చి నెలలో జరిగిన సమావేశాల్లో బిల్లులకు శాసనసభ ఆమోదించి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి నివేదించిన విషయం తెలిసిందే 2018 చట్టాన్ని సవరించి బీసీలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం ఆనందించదగ్గ విషయమని ఆయన అన్నారు

కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చేసిన “జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి” అన్న డిమాండ్‌ను దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. బిసి డిక్లరేషన్ సభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని ఇచ్చిన మాట ప్రకారంగా మాట నిలబెట్టుకునేందుకు ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అమలు పరచేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క అలాగే మంత్రివర్గ వర్గ సభ్యులందరికీ మరియు మా స్థానిక గౌరవ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు, తెలంగాణ సమాజం, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం, సామజిక న్యాయం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు మంజూరు.

మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు మంజూరు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం స్థానిక ఎంపీడీవో ఆఫీస్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. చేతుల మీదుగా జిల్లెల్ల గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన 26 మందికి పత్రాలు మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. మండలంలో గృహ అవసరాల నిమిత్తం ఇసుక కొరత లేదని అలాగే గృహ నిర్మాణాల కొరకు తమకు సంబంధించి పంట పొలాల నుంచి ఊరి చెరువుల నుంచి గాని. సంబంధిత గ్రామ కార్యదర్శి ద్వారా మండల. ఎమ్మార్వో.ద్వారా గాని పర్మిషన్ తీసుకొని ఇంటి నిర్మాణానికి వినియోగించుకోవచ్చని ఈ సందర్భంగా ప్రజలు మట్టి విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే జిల్లెల్ల గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు చెప్పిన మా పేరు ఉన్నది అని తీరా సమయానికి వచ్చేసరికి మా పేరు లేకపోవడంతో జిల్లెల్ల.గ్రామ క్రాసింగ్ లో చౌరస్తాలో.నడిరోడ్డుపై నివసిస్తున్న మా ఇల్లు 70 శాతానికి . పైగా రోడ్డు వెడల్పు కార్యక్రమాల్లో. ప్రభుత్వ అధికారులు తీసుకున్నారని దానికి అనుగుణంగా మీకు డబుల్ బెడ్ రూమ్ లు మంజూరు చేయడం జరుగుతుందని మాట ఇచ్చి ఇప్పుడు మా పేరు లేదని చెప్పడం ఎంతవరకు న్యాయమని అటువంటి వారం చాలామంది ఉన్నామని మా పిల్లల ఆరోగ్యలు బాలేకున్న కొన్ని సంవత్సరాల నుండి కిరాయిల. ఇండ్లలోబతుకుతూ జీవనం గడుపుతున్నామని దయచేసి సరైన లబ్ధిదారులు గుర్తించి మాకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేవిధంగా. మాపై దయవుంచి మాకు తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా జిల్లెల్ల గ్రామస్తులు తెలిపారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా.రాళ్ల పేట గ్రామంలో డబుల్ బెడ్ రూమ్. తుది దశలో ఉన్నందున పిడి హౌసింగ్ ఎంపీడీవోను అభినందిస్తూ లబ్ధిదారులు పారదర్శకంగా ఎంపిక చేసి వారికి తగిన న్యాయం చేకూరుస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్. ఎంపీడీవో. ఎమ్మార్వో. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ సిబ్బంది. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి. ఏఎంసీ. మార్కెట్ చైర్మన్ స్వరూప తిరుపతిరెడ్డి. వైస్ చైర్మన్ నర్సింగ్ పిడి ఎంపీడీవో లక్ష్మీనారాయణ.తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. పూర్మాని లింగారెడ్డి. మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు లబ్ధిదారులు ప్రజలు పాల్గొన్నారు

వికలాంగుల హక్కుల కోసం పోరాటం ఆగదు.

వికలాంగుల హక్కుల కోసం పోరాటం ఆగదు
మహదేవపూర్ జులై 12 (నేటి ధాత్రి )
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్

మహాదేవపూర్ మండల కేంద్రంలో సోమవారం రోజున వికలాంగుల హక్కుల కోసం జిల్లా అధ్యక్షులు వంశి గౌడ్ రానున్న తరుణంలో మండలంలో ఉన్న వృద్ధులు వికలాంగులు వితంతువులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలపై ప్రభుత్వం ఇచ్చిన మాటను మార్చిన క్రమంలో మరో పోరాటంలో సిద్ధం కావడానికి ఆ రోజున మండల కమిటీ నిర్మాణం చేసి వికలాంగులకు 6000 వృద్ధులు వితంతువులకు 4వేల పింఛన్ ఇవ్వాలని మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండలంలోని వృద్ధులు వికలాంగులు వితంతువులు అధిక సంఖ్యలో హాజరై మన సమావేశాన్ని ఏర్పాటు చేసి మండల సమావేశాన్ని ఎన్నుకొని మనకోసం పోరాటం చేయాల్సిందిగా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పిలుపునిస్తున్నాం అని బెల్లంపల్లి సురేష్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పేర్కొన్నారు వికలాంగుల హక్కుల కోసం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు వారికి అండగా దండగా ఉంటారని పిలుపునిచ్చారు

గంగవరంలో శృతి మించిపోతున్న అక్రమ కట్టడాలు.

గంగవరంలో శృతి మించిపోతున్న అక్రమ కట్టడాలు

చోద్యం చూస్తున్న అధికారులు

గంగవరం(నేటి ధాత్రి) జూలై 12:

పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో మదనపల్లి పలమనేరు జాతీయ రహదారిని ఆనుకుని ప్రభుత్వ అనుమతులకు మించి అక్రమ కట్టడాల నిర్మాణం రోజు రోజుకు శృతి మించి పోతుంది, ప్రభుత్వ అనుమతులు ఉన్న లేకపోయినా రాజకీయ పలుకుబడితో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారా లేదా ప్రభుత్వ అధికారులు ఏదైనా ప్యాకేజీ తీసుకొని ఈ అక్రమ కట్టలు కట్టిస్తున్నారు అర్థం కావడం లేదు కానీ ప్రమాదకరస్థాయిలో అక్రమ కట్టాల నిర్మాణం రోజు రోజుకు జరుగుతూనే ఉంది జాతీయ రహదారిని ఆనుకొని ఈ విధంగా ప్రభుత్వ నియమాలు ఉల్లంఘిస్తూ అక్రమ కట్టడాలు నిర్మిస్తుంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ఇప్పటికే ఎంతోమంది మదిలో ఈ ప్రశ్న వెలిబడుతుంది, మరి ఇలాంటి
క్రమంలో అంతస్తులపై అంతస్తులు కట్టుకుంటూ వెళ్తున్నారు కొందరు మరి వీటి పట్ల గంగవరం అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఎందుకు ఇంత నిర్లక్ష్యప్రాయంగా ఉన్నారో అర్థం కావడం లేదు ఇప్పటికే గంగవరం మండలంలో ప్రభుత్వ భూములు సైతం పక్కదారి పట్టించి పెత్తందారి వ్యవస్థను తీసుకువచ్చిన ఘటనలు కూడా ఎన్నో వార్తా కథనంలో చూసాం అదేవిధంగా ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి అక్రమ ఇసుక రవాణా కూడా గంగవరం మండలంలోని అధికంగా ఉండడం కూడా చూశాం అక్రమ మట్టి మాఫియా కట్టి మాఫియా ఇంకా ఎన్నెన్నో అక్రమాలు గంగవరం మండలానికి పెట్టింది పేరుగా ముందుకెళ్తుంది అంటే అధికార వ్యవస్థ ఏ మాత్రం అక్రమాలకు అండగా ఉందో మనకు అర్థమవుతూనే ఉంది మరి ఇలాంటి తరుణంలో ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించి మరి అక్రమ కట్టడాలకు
సకరిస్తున్నారు,
అలాగే
అధికారులు రాజకీయ ఒత్తుల్లో ఉన్నారా లేక ప్యాకేజ్ తీసుకుని సైలెంట్ అయిపోతున్నారా అని అర్థం కావడం లేని పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి నిర్మిస్తున్న కట్టడాలపై చర్యలు తీసుకొని ప్రమాదాలను అరికట్టాల్సి ఉంది, ఇదే విషయంపై ఒక దినపత్రిక ఈ అక్రమాలపై వార్తా కథనాన్ని ప్రచురించగా అధికారుల స్పందన కూడా ఏమాత్రం లేదంటే మరి జిల్లా అధికారులు వీరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది..

సిపిఎస్ నుప్రభుత్వం రద్దు చేయాలి

సిపిఎస్ నుప్రభుత్వం రద్దు చేయాలి

తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్

వనపర్తి నేటిదాత్రి.

రాష్ట్ర తెలంగాణ ఉపాధ్యాయ సంఘం పానగల్ మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని బాలుర బాలికల ఉన్నత పాఠశాలల ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులతో తపస్ సభ్యత్వాన్ని చేయించుకోన్నారని తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలని పెండింగ్లో ఉన్న డీఎలను ప్రకటిస్తూ నూతన పిఆర్సిని అమలు చేయాలని ఎస్ జి టి లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిల్లా ఇంచార్జ్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరప్రసాద్ గౌడ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీరశేఖరాచారి రమేష్ గౌడ్ మండల కార్యదర్శి వెంకటేష్ రవికుమార్ సురేష్ చంద్రశేఖర్ రాజు మాట్లాడారు

ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేసి చట్టసభలోకి .

ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేసి చట్టసభలోకి వెళ్ళుటకు 42 శాతం రిజర్వేషన్ లుబీసీలకు కల్పించాలి

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వానికి డిమాండ్

వనపర్తి నేటిదాత్రి .

బీసీలకు ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేసి చట్టసభలోకి వెళ్ళుటకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి కాంగ్రెస్ ప్రభుత్వ ని కి చిత శుద్ది ఉంటే నిరూపించుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు .ఈ సందర్భంగా వనపర్తి లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షులు పలస రమేష్ గౌడ్ బీఆర్ఎస్ మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎంపిటిసి జెడ్పిటిసి లోగా పోటీ చేయుటకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఊరూరా సంబరాలు జరుపుకోవడం విడ్డూరమని వారు విమర్శించారు.

 

 

 

ఎంపీటీసీలు జెడ్పిటిసిలకు ఒక కార్యాలయం గానీ కూర్చోవడానికి కుర్చీ గాని ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేదని వారు విమర్శించారు కనీసం ఎంపీటీసీలకు ప్రభుత్వం నుండి వచ్చే నిధులు వాటి వివరాలు వారికి తెలియడం లేదని వారికి ప్రభుత్వం నుండి మర్యాదలు కూడా లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ స్థానిక సంస్థల ఎంపీటీసీలు సర్పంచులు జెడ్పిటిసిల ఓట్లు దండుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ రూపొందించిందని వారు ఘాటుగా విమర్శించారు . కాంగ్రెస్ పార్టీ వారి ప్లాన్లు ప్రజలు నమ్మేస్థితి లో లేరని వారు ఇచ్చిన హామీలు అన్ని గమనిస్తున్నారని వారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పెండం కురుమూర్తి యాదవ్ బొల్లెద్దుల బాలరాజ్ పృధ్వి నాథ్ పెబ్బేరు కర్రే స్వామి వడ్డే ఈశ్వర్ కడుకుంట్ల శ్రీను జోహేబ్ హుస్సేన్ చిట్యాల రాము టి సురేష్ గుండె కృష్ణ మెంటపల్లి రామకృష్ణ భగవంతు యాదవ్ రహీం బండారు కృష్ణ సవాయిగూడెం రాము కృష్ణ తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు

డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం లబ్దిదారులు ఆందోళన..

డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం లబ్దిదారులు ఆందోళన..

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం లబ్దిదారులు ఆందోళన చేపట్టారు. పట్టణ శివారు హోతి(కె)లో కేటాయించిన ఇళ్లను అప్పగించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో గృహ సముదాయాల వద్ద శనివారం బైఠాయించారు. ఇవాళ ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా తాళాల అప్పగింత ఉంటుందని ప్రకటించి మళ్లీ వాయిదా వేయడం ఏంటని ప్రశ్నించారు. వారం రోజుల్లో ఇళ్లు అప్పగించకపోతే తాళాలు పగలగొట్టి ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల సత్త.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల సత్త చాటుదాం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం లోని సంఘం శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయ ఆవరణలో జరిగిన బీసీ రాజకీయ చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికల్లో బీసీలు చైతన్యమై మెజార్టీ స్థానాల్లో గెలవాలని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యేలు కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు కావాలని చెప్పేసి వారు తెలియజేశారు రాష్ట్రంలో మెజార్టీ జనాభా బీసీలు ఉన్నప్పటికీ 70 ఏళ్లుగా oc మాత్రమే సీఎంలుగా ఉంటున్నారని వచ్చే 2028లో తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి బీసీనే ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు Dr. పెద్ద గొల్ల నారాయణ కొండాపూర్ నర్సింలు శంకర్ విశ్వనాథ్ యాదవ్ ధనరాజ్ గౌడ్ సంగన్న దత్తు సిద్దు నరసింహ గోపాల్ వేణు లక్షమన్ తదితరులు పాల్గొన్నారు అదే విదంగా వివిధ గ్రామాల నుండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు..

డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు.. కేసు నమోదు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎస్సై రామ్ లాల్ నాయక్.

చిన్న చింతకుంట/ నేటి ధాత్రి

సైబర్ నూతన విధానాలను అవలంబిస్తూ.. అమాయకుల బ్యాంకుల ఖాతాల నుంచి డబ్బులు ఖాళీ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని చిన్న చింతకుంట ఎస్సై రామ్ లాల్ నాయక్ శనివారం అన్నారు. పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఎక్కడో ఒకచోట సైబర్ నేరగాళ్ల వలలో కొంతమంది పడుతూనే ఉన్నారు. ఇలాగే.. కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామంలో ఒకరి ఖాతా నుంచి రూ.18,50,000 మాయం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్ల అంశానికి సంబంధించి గ్రామానికి చెందిన కల్వ కన్నయ్య అనే వ్యక్తికి సైబర్‌ నెరగాళ్లు నుంచి గత నెల 19న గుర్తుతెలియని ఫోన్‌ కాల్‌ వచ్చింది. మీ ఆధార్‌ కార్డు, మిస్ యాజ్ అయిందని, మీ ఖాతాలో డబ్బులు ఉండే విధంగా చూసుకోవాలంటూ.. ఫోన్స్‌ కాల్స్‌ రావడంతో పాటు వారు అతన్ని నమ్మించడంతో ఫోన్ కు వచ్చిన విలువైన సమాచారాన్ని సైబర్ నేరగాళ్లకు అందించారు. అక్కడితో ఆగకుండా వెంటనే బ్యాంకు వద్దకు వెళ్లి విడతలవారీగా రూ.18,50,000 వరకు అర్‌టీజీఎస్‌ రూపంలో అపరిచిత ఖాతాలోకి డబ్బులను బదిలీ చేశారు. కొన్ని రోజులు గడిచింది. అతను నేరగాళ్ల ద్వారా మోసపోయానని తెలుసుకొని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పనిగంటలు పెంచడమంటే కార్మికుల .!

పనిగంటలు పెంచడమంటే కార్మికుల వ్యక్తిగత జీవితాలను హరించడమే.

మందమర్రి నేటి ధాత్రి

పెట్టుబడిదారుల ఖజానా నింపడానికి కార్మికవర్గాన్ని బానిసలుగా మారుస్తారా?

రాష్ట్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని గంటలు పెంచుతు తెచ్చిన జీవో నెం 282 ను వెంటనే రద్దు చేయాలి.

జీవో రద్దు చేయాలని నల్లారిబ్బన్నలతో విధులు నిర్వహిస్తున్న సింగరేణి కాంట్రాక్టు కార్మికులు.

గందం రవి
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు మందమర్రి డివిజన్ అధ్యక్షుడు.

రాష్ట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టుబడిదారుల, కార్పొరేటర్ల ఖజానా నింపడానికే 10 నుంచి 12 గంటల పనిగంటలు పెంచుతు బిజెపి మోడీ ప్రభుత్వానికి తానేమి తక్కువ కాదన్నట్టు జీవో నెం 282 ను విడుదల చేశారు. కార్మికవర్గాన్ని బానిసలుగా మార్చే పని గంటల పెంపు జీవోను వెంటనే రద్దు చేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో మందమర్రి డివిజన్ పరిధిలోని రామకృష్ణపూర్ ఏ-జోన్ సివిక్ కాంట్రాక్టు కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా గందం రవి ఎస్సీ కేఎస్ సిఐటియు డివిజన్ అధ్యక్షులు మాట్లాడుతూ…
సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు ఇప్పటికే పనిభారం పెరుగుతుంది. చేసే పనికి వచ్చే వేతనాలకు గొర్రెతోక బెత్తెడు చందంగా మా వేతనాలు ఉన్నాయి. మరోవైపు రోజు రోజు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవ్వని కలిసి ఇప్పటికే కార్మికుల బతుకులు ఆగమ్యగోచరంగా మారి మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతుంటే, ఇవేవి పరిష్కరించకుండా, వేతనాలు పెంచకుండా పైగా 10 నుంచి 12 గంటల పని చేయాలని జీవో నెంబర్ 282 ను విడుదల చేయడమంటే కార్మిక వర్గంపై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత కర్కషంగా వ్యవహారిస్తుందో అర్థం అవుతుంది. మమ్మల్ని బానిసలు, మా వ్యక్తిగత స్వేచ్ఛ జీవితాలను హరిస్తామంటే కార్మికులంత ఐక్యంగా రైతాంగ పోరాట స్పూర్తితో మరో మహత్తర పోరాటానికి సైతం సిద్ధమైతాము.
ఈ కార్యక్రమంలో శారధ, లక్ష్మి, స్వరూప, రాజేశ్వరి, అంజలి, రవీందర్, సంపత్, రాజేందర్, వెంకటేశ్వర్ రావు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ ఎంల్ మండల కన్వీనర్ గా కుమారస్వామి.

 

సిపిఐ ఎంల్ మండల కన్వీనర్ గా కుమారస్వామి.

భూపాలపల్లి నేటిధాత్రి

సిపిఐ ఎంల్ లిబరేషన్ భూపాలపల్లి మండల కన్వీనర్ గా బుర్రి కుమారస్వామిని సిపిఐ ఎంల్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ శనివారం ప్రకటించారు. ఈసందర్బంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఐ ఎంల్ లిబరేషన్ ను బలోపేతం చేయడమే లక్ష్యం అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండకట్టే విధంగా ఉద్యమాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం నూతన భూపాలపల్లి మండల కన్వినర్ బుర్రి కుమారస్వామి మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పని చేస్తానని,తన ఎన్నికకు సహకరించిన జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ కి కృతజ్ఞతలు తెలిపారు..

విధేయుడు తిరుపతి రెడ్డికే పట్టం.

విధేయుడు తిరుపతి రెడ్డికే పట్టం.

నల్లబెల్లి, నేటిదాత్రి:

కాంగ్రెస్ పార్టీ విధేయుడుగా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడుతున్న వ్యక్తి చిట్యాల తిరుపతి రెడ్డికి మరోసారి మండల అధ్యక్షుడిగా ఎంపిక చేయడం పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా వైనాల అశోక్, ఇస్తారు శేఖర్ గౌడ్,, కర్దూరి కట్టయ్య ఎన్నికయ్యారు.

ఉనికి కోసమే పుట్ట మధు మంత్రిపై అర్ధరహిత.!

ఉనికి కోసమే పుట్ట మధు మంత్రిపై అర్ధరహిత ఆరోపణలు

చట్టం చేసిన పనిని మంత్రి శ్రీధర్ బాబుపై రుద్దడం సిగ్గుచేటు

మాజీ జడ్పీటీసీ చొప్పరి సధానందం

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు,ముత్తారం మండలం మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం మాట్లాడుతూ ఒక ప్రేమ జంట వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఎంక్వయిరీ లో భాగంగా వెళ్లిన ఘటనలో బిఆర్ఎస్ నాయకులు పోలీసు ఉన్నతాధికారులతో దురుసుగా ప్రవర్తించి వాగ్వాదానికి దిగగా అట్టి వ్యక్తులను పోలీసు అధికారులు చట్టరీత్యా అరెస్టు చేయగా ఆ వ్యవహారాన్ని కూడా మంత్రి శ్రీధర్ బాబు,టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబుపై రుద్దడం సిగ్గుచేటని అన్నారు.బి ఆర్ ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ఎందరో కాంగ్రెస్ కార్యకర్తలపై అక్కరకు రాని కేసులు పెట్టి హింసించిన చరిత్ర కమాన్పూర్ మాజీ జెడ్పిటిసి పుట్ట మధుకర్ ది ఎంతోమందిని క్రూరంగా హింసించి,భయభ్రాంతులకు గురిచేసి,సస్యశ్యామలంగా ఉన్న మంథని నియోజకవర్గంలో ఎన్నో హత్యలతో రక్తసిక్తం చేసిన నీ పాలనను మంథని ప్రజలు ఇంకా మరువలేదన్నారు.

 

నీ అనుచరుడు బిఆర్ఎస్ కార్యకర్త పోలీసులతో ప్రవర్తించిన వీడియోలు మంథని ప్రజలందరూ చూసి చీదర అయినా సిగ్గు లేకుండా కేవలం ఉనికి కోసమే మంత్రిపై,మంత్రి కుటుంబంపై అర్థరహిత ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకే మంథని ప్రజలకు నీ మేక వన్నె పులి వ్యవహారాలు తెలిసి నిన్ను వద్దనుకొని అభివృద్ధి కాంక్షించి మళ్లీ దుద్దిళ్ల కుటుంబానికి పట్టం కట్టిన చరిత్ర మంథని ప్రజలని,మంథని నియోజక వర్గ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు,24 గంటల్లో ఏ సమయంలో ఏ ఆపద వచ్చిన వెంటనే స్పందించి పరిష్కారం చేసే టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు గురించి మంథని ప్రజలందరికీ తెలుసన్నారు.మరో మారు దుద్దిళ్ల కుటుంబం పై ప్రజల్లో ఉనికి కోసం అర్థరహిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని మా నాయకుడు నేర్పిన సంస్కారంతోనే మీలాగా అడ్డగోలుగా మేము మాట్లాడలేకపోతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు వాజీద్ పాషా,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గాదం శ్రీనివాస్,ముత్తారం గ్రామ తాజా మాజీ సర్పంచ్ తూటి రజిత రఫీ,మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు బక్కతట్ల వినీత్ తదితరులు పాల్గొన్నారు

error: Content is protected !!
Exit mobile version