ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం.

ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్

కోటగిరి సతీష్ గౌడ్ టేకుమట్ల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

భూపాలపల్లి నేటిధాత్రి

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు ప్రకారం నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ కేబినెట్ మంత్రి వర్గానికి స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో పాల సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే జిఎస్ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రాష్ట్ర ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు కు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం. ఈ సందర్భంలో ఇంత గొప్ప పార్టీలో ఒక బీసీ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని సతీష్ గౌడ్ తెలిపారు.గత అసెంబ్లీ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి,అన్ని పార్టీలతో మంతనాలు జరిపి రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపేలా చొరవ చూపిన మంత్రులు,ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.విద్యా, ఉద్యోగరంగం తో పాటు రాజకీయంగా,ఇతర అన్ని అంశాల్లో బీసీ రిజర్వేషన్ అందుబాటులోకి వస్తే ఎంతో ఉన్నతి చెందుతారని తెలిపారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వంతో బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర వేయించి ఫలాలను అందించేలా కృషి చేయాలని అన్ని పార్టీల నేతలను కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మీటింగ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసినందుకు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి మండలికి కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేయడంజరిగింది.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కట్కూరి శ్రీనివాస్ మాజీ మండల వైస్ చైర్మన్ విడిది నేని అశోక్ మాజీ ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భువన సుందర్ ఎండి చోటే మియా గ్రామ కమిటీ అధ్యక్షులు కృష్ణ, బత్తిని శివశంకర్ గౌడ్ పోశాల మహేష్ మామిళ్ల మల్లికార్జున్ మామిళ్ల మల్లేష్ అశోక్ రెడ్డి యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

స్విమ్స్ లో చనిపోయిన తల్లి నేత్రలు దానం..

స్విమ్స్ లో చనిపోయిన తల్లి నేత్రలు దానం –

కందారపు కుటుంబ సభ్యులు.

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 11:

ఎస్వీ వైద్య కళాశాల, స్విమ్స్ ఆసుపత్రి లో కందారపు. రాజమ్మ అనారోగ్యం తో చికిత్స పొందుతూ మరణించారు, చనిపోయిన కందారపు
రాజమ్మ సుమారు 80 సంవత్సరాలు , యశోద నగర్, తిరుపతి ప్రాంతానికి చెందిన వ్యక్తి. స్విమ్స్ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది.ఆమె కుమారులు కందారపు .మురళి, కందారపు
సురేంద్ర తన తల్లి నేత్రాలను దానం చేయడానికి ముందుకు రావడం జరిగినది.
రుయా కంటి విభాగము విభాగాధిపతి డాక్టర్. చలపతి రెడ్డి అధ్వర్యంలో నేత్రాలను సేకరించి నేత్ర విభాగ, నేత్ర నిధి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగినది,
నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులు, చనిపోయిన వ్యక్తి కుమారులు సమ్మతితో ఆమై నేత్ర లు తీసుకోవడం జరిగినది. వెంటనే నేత్ర విభాగ టెక్నీషియన్ ఎస్,రమేష్, నేత్రాలను సేకరించి, నేత్ర బ్యాంకులో భద్రపరచడం జరిగినది.తన తదనంతరం అవయవ దానాలకు, నేత్ర దానాలకు, ముందుకు రావడం,
కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నేత్రాలను సేకరించడం జరుగుతున్నదిఅని నేత్ర విభాగాధిపతి డాక్టర్ చలపతి రెడ్డి తెలిపారు. రుయా ఆసుపత్రి అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు సూపరిటెండెంట్ డాక్టర్ జే. రాధా మాట్లాడుతూ
వారి కుటుంబ సభ్యులు,ఈ విధంగా ప్రభుత్వ వైద్యశాలలకు నేత్రాలు, అవయవాలు దానం చేయడం వలన పేద రోగులకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఈ అవయవాలను వారికి ఉచితముగా అమర్చడానికి ఇలాంటి అవయవ దానాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పుర ప్రజలు ఎవరైనా నేత్ర దానం చేయాలంటే ఈ క్రిందిఫోను నెంబర్ కు సంప్రదించవచ్చును.
సెల్ నెంబర్: 8500880126,ఈ కార్యక్రమంలో ఎల్.వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ఎస్,
రమేష్,మరియు ఎస్ వి వైద్య కళాశాల పి.ఆర.ఓ.
వీర కిరణ్ పాల్గొన్నారు.

పేద విద్యార్థి రాము 20 వేలు ఆర్థిక సాయం

పేద విద్యార్థి రాము 20 వేలు ఆర్థిక సాయం

శ్రీ శ్రీనివాస లైన్స్ క్లబ్ సభ్యులు లయన్ శాంతి

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 11:

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఓ పేద విద్యార్థి రాము ఉన్నత చదువుల కోసం 20000 రూపాయలు శ్రీ శ్రీనివాస లయన్స్ క్లబ్ సభ్యురాలు శాంతి ఆర్థిక సాయం అందజేశారు. తిరుపతి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆర్కాడ్ కృష్ణ ప్రసాద్ వేలూరు జగన్నాథం ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాసా లయన్స్ క్లబ్ సభ్యురాలు శాంతి తన పుట్టినరోజు సందర్భంగా ఓ పేద విద్యార్థి ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ వారు మాట్లాడుతూ ఆ భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో శాంతి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని అలాగే ప్రతి సంవత్సరం ఇలాంటి పేదవారికి సహాయాన్ని అందించాలని ఆమెకు ఆసక్తిని భగవంతుడు ఇవ్వాలని ఆ విద్యార్థి మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలను నిర్వహించి తను కూడా ఇలాంటి సహాయ సహకారాలు మరి కొంతమందికే అందించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు,
ఈ కార్యక్రమంలో ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, వేలూరు జగన్నాథం, శంబోలా హరి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు .

గాంధారి మైసమ్మ ముఖ ద్వారం ఏర్పాటు..

గాంధారి మైసమ్మ ముఖ ద్వారం ఏర్పాటు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మందమర్రి ఏరియా సింగరేణి సహకారంతో క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గాంధారి మైసమ్మ ఆలయం సమీపంలో కమిటీ సభ్యులు ముఖ ద్వారాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు, ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ 2004 సంవత్సరంలో బొక్కలగుట్ట హైవే రోడ్డు అనుకోని అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందని, అప్పటి నుండి ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరగడంలేదన్నారు. ఈ నెల 20 తేదీన గాంధారి మైసమ్మ జాతర జరుగుతుందని భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ బోనాల జాతరకు సింగరేణి, ఫారెస్ట్ అధికారులతో పాటు క్యాతనపల్లి మున్సిపాలిటీ అధికారులు అన్ని రకాలుగా సహకారాలు అందిస్తున్నారని, ఈ సంవత్సరం కూడా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లకు సహకరించాలని కోరారు.

AITUC leaders

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గుర్తింపు సంఘం నాయకులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

గణపురం నేటి ధాత్రి

గణపురంమండలం గాంధీనగర్ గ్రామం లో పట్టుకున్న గంజాయి కేసు గురించి చిట్యాల సిఐ డి. మల్లేష్ పట్టుకున్న వ్యక్తులు వివరాలను గణపురంపోలీస్ స్టేషన్ లోవిలేకరుల సమావేశంలో తెలపడం జరిగింది.11.07.2025 వ రోజున ఉదయం 7 గంటలకు నమ్మదగిన సమాచారం మేరకు గణపురం ఎస్సై తమ సిబ్బందితో గాంధీనగర్ గ్రామం శివారులో ఒక వేపచెట్టు కింద అనుమానంగా ఉన్న వ్యక్తిని పట్టుకొనుటకు అతని వద్దకు వెళ్లగా అతడు పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకొని పంచుల సమక్ష్యం లో విచారించగా అతడు తన పేరు బెడ్డల శ్రీనివాస్ S/o రాజయ్య, వయసు 19 సంవత్సరాలు వెంకటేశ్వర్లపల్లి అని చెప్పి తను గతకొంతకాలంగాహైదరాబాద్‌లోని ఒక పబ్‌లో వర్కర్‌గా పని చేస్తూ,అదే క్రమంలో మహారాష్ట్ర రాష్ట్రం లోని బల్లర్శ ప్రాంతం నుండి వచ్చిన వ్యక్తి సల్మాన్ మాజీత్ ఖాన్ తో పరిచయం ఏర్పడి, ఆ తరువాత అతడు మహారాష్ట్ర లో గంజాయి తక్కువ ధరకు దొరుకుతుంది అని చెప్పగా, అట్టి వ్యక్తి తన పబ్ లో పని చేయడం కంటే ఆ ప్రాంతం లో తక్కువ ధరకు గంజాయి కొనుకొన్ని వచ్చి ఇక్కడ అమ్మితే ఎక్కువ లాభం వస్తుంది అని నిశ్చయించుకొని అట్టి విషయంను శ్రీనివాస్ తన గ్రామం లోని తన బాల్య మిత్రుడు అయిన జనగం ప్రేమ్ తేజ్ తో చెప్పగా అతడు నువ్వు తీసుకరా నేనుఇక్కడ భూపాలపల్లి ,రామప్ప కాలనీ , గణపురం లో అమ్మి పెడుతా వచ్చిన లాభం నీ చేరి సగం తీసుకుందాం అని అన్నాడు, శ్రీనివాస్ దీనికి అంగీకరించి మహారాష్ట్ర రాష్ట్రం లోని బల్లర్శ ప్రాంతం నుండి సల్మాన్ మాజీత్ ఖాన్ ద్వారా,గంజాయి ని గతం లో పలుమార్లు తీసుకొని వచ్చి భూపాలపల్లి,గణపురం పరిసర ప్రాంతం లో అమ్ముతున్నారు. అదే క్రమంలో తేదీ 09.07.2025 రోజున గంజాయి తేవడం కోసం రైలు ద్వారా మహారాష్ట్ర లోని బల్లర్శ కి వెళ్ళి సల్మాన్ మాజీత్ ఖాన్ దగ్గర ఒక కే‌జి గంజాయి కొని తిరిగి వస్తు గాంధీనగర్ క్రాస్ రోడ్డు వద్ద దిగి ఆ గ్రామ శివారులోని ఒక వేప చెట్టు కింద కూర్చోని ప్రేమ్ తేజ్ కోసం చూసే క్రమం లో గణపురం ఎస్సై తన సిబ్బంది తో వెళ్ళి పట్టుకున్నాడు.
పట్టుకున్న ఒకరిలోబెడ్డల శ్రీనివాస్ వెంకటేశ్వర్లపల్లి అదుపులోకి తీసుకోగా మిగతా ఇద్దరుజనగాం ప్రేమ్ తేజ్ వెంకటేశ్వర్లపల్లి,సల్మాన్ మజిత్ ఖాన్,బల్లర్శ ,మహారాష్ట్ర పరారీలో ఉన్నట్టు సమాచారం.

సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం ఇందారం గ్రామం లోని దొరగారి పల్లె ప్రాంతంలో గడ్డం వివేక్ వెంకటస్వామి సహకారంతో ఇందిరమ్మ ఇంటికి శనివారం ముగ్గు పోసే కార్యక్రమం చేపట్టడం జరిగింది.అలాగే గ్రామం లో ప్రతి పేదవారికి ఇండ్లు మంజూరు అయ్యేలా మంత్రి కృషి చేస్తున్నట్లు తెలిపారు.గతా పది సంవత్సరాల పాలనలో అందరిని కెసిఆర్ మోసం చేశారని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కు కట్టుబడి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టారు.రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి వివేక్ వెంకటస్వామికి,యువ నాయకుడు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.చెన్నూరు నియోజకవర్గంలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జైపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ ఫయాజుద్దీన్,సిహెచ్.సతీష్ కుర్మిల్లా సరస్వతి,రవి, భాగ్యరాజ్,గ్రామం పెద్దలు పాల్గొన్నారు.

పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

విద్యార్థుల బోధన విన్న.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్ /నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సంగర్భంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణకుమారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులను ఆయన పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుకొంటున్నారని అడిగారు. మంచిగా చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ బోర్డులో మీ టీచర్లు పాఠాలు బోధిస్తున్నారా.. అని అడిగారు. మీకు డిజిటల్ బోర్డు ఉపయోగించడం తెలుసా అని అడిగారు. కొందరు విద్యార్థులు డిజిటల్ బోర్డు మీద ఫిజిక్స్, బయాలజీ , సబ్జెక్టులను బోధించారు. ఎమ్మెల్యే ఆసక్తిగా విన్నారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సిఎంఓ బాలు యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్మత్ అలి, రామస్వామి, కృష్ణకాంత్ రెడ్డి, సంజీవరెడ్డి, దోమ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ…

నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ 21 వార్డు మాజీ కౌన్సిలర్ పార్వతి విజయ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు శనివారం చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రి అయిన సందర్భంగా పట్టణంలోని పేద మహిళలకు చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. నియోజకవర్గం అభివృదే ధ్యేయంగా మంత్రి వివేక్ పని చేస్తున్నారని పేర్కొన్నారు. రైల్వే ఫ్లై ఓవర్ వంతెనపై త్వరలోనే లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని,వంతెనకు ఇరువైపుల రోడ్డు విస్తరణకు కోటి యాబై లక్షల రూపాయల నిధులను మంత్రి వివేక్ మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేల్పుల సత్యనారాయణ,తదితర నాయకులు పాల్గొన్నారు.

బిసి రిజర్వేషన్ బిల్లు క్యాబినెట్ లో ఆమోదం

బిసి రిజర్వేషన్ బిల్లు క్యాబినెట్ లో ఆమోదం

వీణవంక, ( కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి :

 

వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, గురువారం రోజున జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో బీసీ బిల్లులకు 42 %శాతం మద్దతుగా స్వగదీసినందున మండల కేంద్రంలో బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ,దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని,ఎన్నికల ముందు ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ లకు 42% శాతం అమలు చేస్తుందని,బీసీ అభివృద్ధికి,వారి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని అన్నారు. ఈ బిల్లుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి వర్గానికి, ముఖ్యంగా బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీహరి,పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబుకు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.ఈ నిర్ణయాల్లో రాజకీయ,విద్య,ఉద్యోగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్ర భగవాన్ రెడ్డి,గంగాడి రాజి రెడ్డి,గంగాడి తిరుపతి రెడ్డి, ధర్మకర్త జున్ను తుల మధుకర్, రెడ్డి చదువు జైపాల్ రెడ్డి, ఈదునూరి పైడి కుమార్, పంజాల సతీష్, బిక్షపతి ఒరేం శ్రీనివాస్,ముసిపట్ల శశిధర్ రెడ్డి, మోటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలి.

‘ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ-జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మ్యాతారి మహేందర్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ప్రతి 30 మందికి ఒక బస్సు ఏర్పాటు చేసి స్కూలుకు తీసుకెళ్లాల్సిందిగా కోరారు.

ఐలయ్య చిత్రపటానికి నివాళులర్పించిన.

ఐలయ్య చిత్రపటానికి నివాళులర్పించిన జర్నలిస్టులు..

భూపాలపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని ముంజాల ఐలయ్య చిత్ర పటానికి శనివారం స్థానిక జర్నలిస్టులు నివాళులర్పించారు. భూపాలపల్లి మున్సిపాలిటి పరిధిలోని 22వ వార్డు లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తాజా మాజీ కౌన్సిలర్ ముంజాల రవీందర్ తండ్రి అయిన ముంజాల ఐలయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా దశదినకర్మ కు జర్నలిస్టులు తడక సుధాకర్, చంద్రమౌళి, శ్రీను, వర్తక సంఘం నాయకులు హాజరై నివాళులర్పించారు. మాజీ కౌన్సిలర్ ముంజాల రవీందర్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డాక్టర్ రవీంద్ర నాయక్

గణపురం నేటి ధాత్రి

గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డాక్టర్ రవీంద్రా నాయక్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆకస్మిక తనిఖీ చేశారుడైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నాయక్ ని భూపాలపల్లి జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు బూరుగు రవి కలిశారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నాయక్ ని సన్మానించినారు
రాష్ట్రంలో ఉన్న హెల్త్ అసిస్టెంట్ అందరినీ ఫార్మసిస్టులను ల్యాబ్ టెక్నీషియన్లను రెగ్యులర్ అయిన వారందరినీ సర్వీస్ రెగ్యులరైజేషన్ గురించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ
రెగ్యులర్ చేయాలని
సకాలంలో జీతాలు ఇవ్వాలని వారిని కోరడం జరిగింది మెమోరండం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు బూరుగు రవి టీఎన్జీవో జిల్లా కార్యదర్శి దశరధ రామారావు మురళీధర్ రెడ్డి టి సత్యనారాయణ శ్రీదేవి జమాలుద్దీన్ హెల్త్ అసిస్టెంట్లు కాపర్తి రాజు పరమేశ్వర్ గోపి సుధీర్ సతీష్ వేణు ల్యాబ్ టెక్నీషియన్ రజిత పాల్గొన్నారు

ఉత్సాహంగా సాగిన ఫ్రెండ్లి పోలీస్ & ప్రెస్ క్రికెట్.!

 

ఉత్సాహంగా సాగిన ఫ్రెండ్లి పోలీస్ & ప్రెస్ క్రికెట్ మ్యాచ్ లు

క్రికెట్ మ్యాచ్ లను ప్రారంభించి క్రికెట్ ఆడిన జిల్లా ఎస్పీ..

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెండ్లి క్రికెట్ మ్యాచ్ లలో పోలీస్ A టీమ్ vs సిరిసిల్ల ప్రెస్ టీమ్ మరియు పోలీస్ B టీమ్ vs వేములవాడ ప్రెస్ టీమ్ ల మద్య ఉత్సాహంగా కొనసాగిన క్రికెట్ పోటీలు.
శనివారం రోజున జిల్లాలోని స్థానిక కళాశాల మైదానంలో పోలీస్ మరియు ప్రెస్ మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లను జిల్లా ఎస్పీ ప్రారంభించారు.మొదటగా పోలీస్ A టీమ్ మరియు సిరిసిల్ల ప్రెస్ మధ్య జరిగిన మ్యాచ్ లో పోలీస్ A టీమ్ గెలుపొందగా ,రెండవ మ్యాచ్ లో పోలీస్ B టీమ్ మరియు వేములవాడ ప్రెస్ మధ్య జరుగగా వేములవాడ ప్రెస్ టీమ్ గెలుపొందగా ఫైనల్ మ్యాచ్ పోలీస్ A టీమ్ మరియు వేములవాడ ప్రెస్ టీమ్ అడగా మొదట బ్యాటింగ్ చేసిన పోలీస్ A టీమ్ నిర్ణిత 10 ఓవర్లలో 77 పరుగులు చేయగా వేములవాడ ప్రెస్ జట్టు నిర్ణిత 10.ఓవర్లలో 73 పరుగులు చేయగా పోలీస్ A టీమ్ 4 పరుగుల తేడాతో గెలుపొందడం జరిగినది.
మొదటి ప్లేస్ పోలీస్ A టీమ్.
రెండవ ప్లేస్ వేములవాడ ప్రెస్ టీమ్.
*మూడవ ప్లేస్ సిరిసిల్ల ప్రెస్ టీమ్
*అనంతరం జట్ల సభ్యులకు జిల్లా ఎస్పీ బహమతులు అందించారు.
ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…

 

 

 

క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని నిత్యం బిజీగా ఉండే పోలీసులు, జర్నలిస్టులు కొంత సేపు ఆహ్లాదకరంగా గడిపారు అని అన్నారు. ప్రెస్, పోలీసుల మధ్య మంచి సస్సబంధాలు ఉండడానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని. ప్రతి సంవత్సరం ఒక సారి ఈ విధంగా క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్కరికీ ఆటవిడుపుతో పాటు మంచి టీమ్ స్పిరిట్ వస్తుందని అభిప్రాయపడ్డారు.క్రికెట్ మ్యాచ్ ప్రారంభించే ముందు సిరిసిల్ల tv9 రిపోర్టర్ ప్రసాద్ ఇటీవల గుండెపోటుతో మరణించగా 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.ఈకార్యక్రమంలో పోలీస్ అధికారులు,పాత్రికేయులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మృత్యుంజయ హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.

మృత్యుంజయ హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో దత్తగిరి మహారాజ్ వారి ఆశ్రమంలో జరిగిన మృత్యుంజయ హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు ఝరాసంగం పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మొగుడంపల్లి మండల అధ్యక్షులు సంజీవ్ రెడ్డి మాజీ ఆలయ చైర్మన్ నీలా వెంకటేశం, నర్సింహా గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, గోవర్దన్ రెడ్డి, తదితరులు

రాతోడ్ భీమ్ రావు జన్మదిన వేడుకలు..

ఘనంగా జరుపుకున్న రాతోడ్ భీమ్ రావు జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

బంజారా యువ నాయకులు రాతోడ్ భీమ్ రావు నాయక్ గారి జన్మదిన సందర్బంగా కేక్ కట్ చేసి పూలమాలలు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు ఇటీ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, పాక్స్ చైర్మన్ మచ్చేందర్, మాజీ ఆలయ చైర్మన నర్సింహా గౌడ్, ఎస్సి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజీ పట్టణ అధ్యక్షులు యాకుబ్, మోహిద్దీన్, మాజీ సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్,జగదీష్, ఎస్టీ సెల్ అధ్యక్షులు హీరు రాతోడ్,చిన్న రెడ్డి, అమిత్, మోహన్ చౌహన్, విజయ్ రాతోడ్, సికండర్ తదితరులు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏఐఎఫ్ డిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మార్త నాగరాజు అన్నారు.గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ , ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.మార్త నాగరాజు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న విద్యాసంస్థల్లో సమస్యలు పేరుకుపోయాయని,విద్యాశాఖ అధికారులు , ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యల సాధన కోసం కృషి చేయాలని కోరారు.డివిజన్ కేంద్రంలో ఉన్న ఎస్సి,ఎస్టీ,బీసీ మైనారిటీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గర్ల్స్ కన్వీనర్ గణిపాక బిందు,జిల్లా కమిటీ సభ్యులు సాగర్ ,అజయ్ తదితరులు పాల్గొన్నారు.

మారుతీ గారి కుమారుడి మొదటి జన్మదిన.!

మల్గి మాజీ సర్పంచ్ మారుతీ గారి కుమారుడి మొదటి జన్మదిన వేడుకల్లో పాల్గొన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు జన్మదిన వేడుకలో పాల్గొని సుఖ సంతోషాలతో ఉండాలని చిన్నారిని ఆశీర్వదించారు అందరూ కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజా ప్రతినిధులు నాయకులు న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, పాక్స్ చైర్మన్ మచేందర్, రాజేందర్ రెడ్డి, సంఘరామ్ పాటిల్, రవి కుమార్, రాజ్ కుమార్, భూమా రెడ్డి,మైపాల్, చంద్రన్న,ఇస్మాయిల్, లోకేష్ పాటిల్,గొల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

స్నేహితురాలి కుటుంబానికి అండగా పాత మిత్రులు.

స్నేహితురాలి కుటుంబానికి అండగా పాత మిత్రులు.

కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయం.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

చిన్నతనంలో కలిసి చదువుకున్న తమ స్నేహితురాలు తల్లి లింగంపల్లి వినోద అనారోగ్య కారణంగా చనిపోవడం జరిగింది కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారుజయశంకర్ భూపాలపల్లి జిల్లా,మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో 2009-2010 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న బ్యాచ్కి చెందిన కోర్కిశాల గ్రామంలోని లింగంపల్లి అనిత అనే అమ్మాయి వాళ్ళ అమ్మ లింగంపల్లి వినోద ఈ నెల 02-07-2025 రోజున అనారోగ్యం కారణంగా చనిపోవడం జరిగింది 10వ తరగతి చదువుకున్న అప్పటి చిన్న నాటి స్నేహితులుకోర్కిశాల గ్రామంలోకి వెళ్ళి అనితని వాళ్ళ కుటుంబాన్ని పరమార్చించడం జరిగింది అనంతరం 11వరోజుకి(పెద్ధకర్మ)చేయవలసిన కార్యక్రమానికి అప్పటి చిన్న నాటి స్నేహితులు పదివేల రూపాయలు ఖర్చుల కోసం ఇవ్వడం జరిగింది..ఈ కార్యక్రమానికి వచ్చినవారు..దూడపాక.రాజు శెనిగరపు శ్రీనివాస్.దానబోయిన రామ్ కుమార్.దానబోయిన నరేందర్.శరత్ కుమార్.బండి అనిల్ కుమార్.సుప్రియ.శృతి సుమలత.సుజాత.మమత.నీలిమ.చామంతి పాల్గొనడం.జరిగింది

నేడు ఆషాఢం పోచమ్మ బోనాలు..

నేడు ఆషాఢం పోచమ్మ బోనాలు

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని 23వ వార్డులో ఆదివారం రోజున ఘనంగా అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాల పండగ నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవంతంగా ఈ వేడుకలు జరపడం తృతీయ సంవత్సరం అని,ప్రతి సంవత్సరం అమ్మవారిని అలంకరించి బోనాలతో అమ్మవారికి మొక్కులు చెల్లిస్తామని అన్నారు.అలాగే నస్పూర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి పోచమ్మ దేవాలయం వరకు ఆడపడుచులు ఎత్తుకున్న బోనాలతో,డప్పు చప్పులతో, ఆటపాటలతో,పోతరాజుల వేషధారణలో భక్తులు చేరుకొని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించడం జరుగుతుందని అన్నారు.మహిళలు,భక్తులు ఆషాడ బోనాల ఉత్సవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహంకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ కోరారు.

error: Content is protected !!
Exit mobile version