డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు.. కేసు నమోదు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎస్సై రామ్ లాల్ నాయక్.
చిన్న చింతకుంట/ నేటి ధాత్రి
సైబర్ నూతన విధానాలను అవలంబిస్తూ.. అమాయకుల బ్యాంకుల ఖాతాల నుంచి డబ్బులు ఖాళీ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని చిన్న చింతకుంట ఎస్సై రామ్ లాల్ నాయక్ శనివారం అన్నారు. పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఎక్కడో ఒకచోట సైబర్ నేరగాళ్ల వలలో కొంతమంది పడుతూనే ఉన్నారు. ఇలాగే.. కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామంలో ఒకరి ఖాతా నుంచి రూ.18,50,000 మాయం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్ల అంశానికి సంబంధించి గ్రామానికి చెందిన కల్వ కన్నయ్య అనే వ్యక్తికి సైబర్ నెరగాళ్లు నుంచి గత నెల 19న గుర్తుతెలియని ఫోన్ కాల్ వచ్చింది. మీ ఆధార్ కార్డు, మిస్ యాజ్ అయిందని, మీ ఖాతాలో డబ్బులు ఉండే విధంగా చూసుకోవాలంటూ.. ఫోన్స్ కాల్స్ రావడంతో పాటు వారు అతన్ని నమ్మించడంతో ఫోన్ కు వచ్చిన విలువైన సమాచారాన్ని సైబర్ నేరగాళ్లకు అందించారు. అక్కడితో ఆగకుండా వెంటనే బ్యాంకు వద్దకు వెళ్లి విడతలవారీగా రూ.18,50,000 వరకు అర్‌టీజీఎస్ రూపంలో అపరిచిత ఖాతాలోకి డబ్బులను బదిలీ చేశారు. కొన్ని రోజులు గడిచింది. అతను నేరగాళ్ల ద్వారా మోసపోయానని తెలుసుకొని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.