కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా చుక్క రమేష్ గౌడ్.
నర్సంపేట,నేటిధాత్రి:
దుగ్గొండి మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లంపల్లి గ్రామానికి చెందిన చుక్క రమేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఎన్నిక చేశారు. మండల అధ్యక్షులుగా చుక్క రమేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా చెన్నూరి కిరణ్ రెడ్డి, ఒలిగె నరసింగారావు, ఇంగోలి రాజేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి అజ్మీర రవీందర్ నాయక్, ఉపాధ్యక్షులు కామశోభన్ బాబు, నల్ల వెంకటయ్య, కార్యదర్శి అమ్మ రోహిత్, ప్రచార కార్యదర్శి కూరతోట సురేష్, కోశాధికారి జంగిలి రవి, కార్యవర్గ సభ్యులు హుస్సేన్ పల్లి విరాట్, గిన్నె స్వామి,రేవూరి వెంకట్ రెడ్డి,యార రవి, నల్ల యాదవ రెడ్డి, ఎర్ర ఆదిరెడ్డి, వేములపల్లి ఓదేలు, పుపాల శ్రీను, పరుపాటి ప్రభాకర్ రెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాజకీయ అనుభవంతో కాంగ్రెస్ పార్టీ గుర్తింపు..
గత 30 సంవత్సరాలుగా వివిధ పార్టీలకు మండల స్థాయి బాధ్యతలు చేపట్టి ఎంపీపీ,సర్పంచ్ పదవులను చేపట్టి సేవలను అనుభవం కలిగిన వ్యక్తిగా దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన చుక్క రమేష్ గౌడ్ కు గుర్తింపు పొందాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హాయంలో దుగ్గొండి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.అలాగే తెలుగుదేశం పార్టీ దుగ్గొండి మండలం అధ్యక్షుడిగా సుమారు 15 ఏళ్ల పాటు పనిచేశారు. అలాగే భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా భాజపాకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గెలుపు కృషి చేశారు. కాగా చుక్క రమేష్ గౌడ్ దుగ్గొండి మండలంలో అన్ని గ్రామాలలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు ప్రజలకు సన్నిహితంగా ఉంటారు. గత శాసనసభ ఎన్నికల్లో రమేష్ గౌడ్ చేసిన కృషి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పైస్థాయి సీట్లను సాధించగలిగే సత్తా ఉండడంతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
గుర్తించి దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షునిగా ఎంపిక చేసినట్లు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా..
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్..
అనతి కాలంలోనే తనపై నమ్మకంతో దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అవకాశం కల్పించారని,కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకుల సహకారంతో పార్టీని దుగ్గొండి మండలంలో పూర్తిస్థాయిలో బలోపేతం చేయడానికి
తన వంతుగా కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్ హామీ ఇచ్చారు. దేశంలోని ఎక్కడలేని విధంగా కులగనన చేపట్టి 42 శాతం బీసీ రిజర్వేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేసిందని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రల బాబు పలువురు నాయకులకు చుక్క రమేష్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.