విద్యుత్ సబ్ స్టేషన్ లు పెంచండిః
మంత్రి గొట్టిపాటికి ఎమ్మెల్యే వినతి
తిరుపతి(నేటి ధాత్రి) జూలై 12:
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తిరుపతిలో నూతనంగా పది విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శనివారం ఉదయం కోరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతికి వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వినతి పత్రం ఇచ్చారు. జనభా పెరుగుదలతో విద్యుత్ వినయోగం పెరిగిందని భవిష్యత్ అవసరాల దృష్ఠ్యా విద్యుత్ సరఫరా మెరుగుదలకు 33 / 11 కేవి సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఆ వినతి పత్రంలో ఎమ్మెల్యే కోరారు. మహిళా యూనివర్శిటీ, ఆర్సీ రోడ్డు, కొరమేణుగుంట, తుడా టవర్స్ వద్ద తక్షిణం సబ్ స్టేషన్ లు ఏర్పాటుకు మంత్రి అంగీకరించారు.అలాగే బైరాగిపట్టెడ,జీవకోన, రామచంద్రపుష్కరిణి, శెట్టిపల్లి, కపిలతీర్థం, అర్బన్ తహశిల్దార్ కార్యాలయ సమీపంలో కూడా సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేయాలని కోరగా త్వరలోనే వీటి నిర్మాణానికి ఏపిఈఆర్సీ అనుమతి ఇస్తుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు మంత్రి స్పష్టం చేశారు.