మల్లన్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఆంజనేయులు
శేరిలింగంపల్లి , నేటి ధాత్రి
అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని సిద్ధిక్ నగర్‌లో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్మిస్తున్న మల్లన్న గుడి నిర్మాణ పనులను స్థానిక నాయకులు ఆంజనేయులు సాగర్ శనివారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన, ఆలయ ప్రాశస్త్యాన్ని కొనియాడారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆంజనేయులు సాగర్ ని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబాలని, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక విలువల కేంద్రాలని పేర్కొన్నారు. మన డివిజన్‌లో ఇంతటి గొప్ప ఆలయాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అని, ఆలయ నిర్మాణానికి తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లన్న గుడి కమిటీ అధ్యక్షులు బసవరాజు, సిద్దిక్ నగర్ కాలనీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, జనరల్ సెక్రటరీ రవీందర్ రెడ్డి, నాయకులు యాదయ్య గౌడ్, గోపాల్ గౌడ్, సంతోష్, రాము యాదవ్, రాము, సాగర్, ఆనంద్ మరియు కమిటీ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
