రాజీవ్ నగర్ తాగునీటి కష్టాలు తీర్చాలి: అధికారులకు ఆంజనేయులు సాగర్ వినతి…

రాజీవ్ నగర్ తాగునీటి కష్టాలు తీర్చాలి: అధికారులకు ఆంజనేయులు సాగర్ వినతి

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్ బస్తీలో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ డివిజన్ నాయకులు ఆంజనేయులు సాగర్ సోమవారం జలమండలి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. బస్తీలోని పలువురు నాయకులతో కలిసి ఆయన జనరల్ మేనేజర్ హరి శంకర్ గారిని కలిసి సమస్య తీవ్రతను వివరించారు.
​ఈ సందర్భంగా ఆంజనేయులు సాగర్ మాట్లాడుతూ.. రాజీవ్ నగర్ బస్తీలో కొన్ని ఇళ్లు ఎత్తైన ప్రదేశంలో ఉండటం వల్ల తాగునీరు సరిగ్గా చేరడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుత వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో నీటి సరఫరా అందక బస్తీ ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఎత్తైన ప్రాంతాలకు నీరు సక్రమంగా చేరడానికి ప్రత్యేకంగా బూస్టర్సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యే వరకు బస్తీ ప్రజల అవసరాల కోసం తాత్కాలికంగా తాగునీటి సరఫరాను మెరుగుపరచాలి. మోటార్‌ను ఏర్పాటు చేయాలి.జీఎం హరి శంకర్ సానుకూలంగా స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్న సాగర్, నరసింహ, వెంకటేష్, రోహిత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

మల్లన్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఆంజనేయులు…

మల్లన్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఆంజనేయులు

శేరిలింగంపల్లి , నేటి ధాత్రి

 

అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని సిద్ధిక్ నగర్‌లో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్మిస్తున్న మల్లన్న గుడి నిర్మాణ పనులను స్థానిక నాయకులు ఆంజనేయులు సాగర్ శనివారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన, ఆలయ ప్రాశస్త్యాన్ని కొనియాడారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆంజనేయులు సాగర్ ని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబాలని, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక విలువల కేంద్రాలని పేర్కొన్నారు. మన డివిజన్‌లో ఇంతటి గొప్ప ఆలయాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అని, ఆలయ నిర్మాణానికి తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లన్న గుడి కమిటీ అధ్యక్షులు బసవరాజు, సిద్దిక్ నగర్ కాలనీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, జనరల్ సెక్రటరీ రవీందర్ రెడ్డి, నాయకులు యాదయ్య గౌడ్, గోపాల్ గౌడ్, సంతోష్, రాము యాదవ్, రాము, సాగర్, ఆనంద్ మరియు కమిటీ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version