ఘనంగా ప్రారంభమైన అయినవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు
నేటి ధాత్రి అయినవోలు
అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు 2026 సంవత్సరం జాతర బ్రహ్మోత్సవాలు సందర్భంగా మంగళవారం స్వామివారికి నూతన వస్త్రాలంకరణ విఘ్నేశ్వర పూజ పుణ్యా వచనము ధ్వజారోహణము మహాన్యాస పూక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మహనివేదన నీరాజన మంత్రపుష్పం తీర్థపర ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. తద్వారా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్, చైర్మన్ కమ్మగొని ప్రభాకర్, ఎస్.ఐ శ్రీనివాస్,ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్ ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ, వేదపండితులు గట్టు పురుషోత్తం శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నందనం భాను ప్రసాద్ శర్మ నందనం మధు, ఉప్పుల శ్రీనివాస్,పాతర్లపాటి నరేష్ శర్మ, మడికొండ దేవేందర్ అర్చక సిబ్బంది ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
