ఇందిరమ్మ రాజ్యంలో.. పసిపిల్లల ప్రాణాలు తీయడమేనా…

ఇందిరమ్మ రాజ్యంలో.. పసిపిల్లల ప్రాణాలు తీయడమేనా?

నిందితులను కఠినంగా శిక్షించాలి

బాలానగర్ మండల బీజేపీ అధ్యక్షులు గోపాల్ నాయక్.

బాలానగర్ నేటి దాత్రి

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో రెండు నెలల పసికందు మృతి చెందడం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట అని బాలానగర్ మండల బీజేపీ అధ్యక్షుడు గోపాల్ నాయక్ మంగళవారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కులం పేరుతో దాడి చేసి, పసిపాప ప్రాణం పోవడానికి కారణమైన వారిని కాపాడటం సిగ్గుచేటు
ఢిల్లీలో రాహుల్ గాంధీ, సామాజిక న్యాయం’ అని క్లాసులు చెప్తారు. కానీ.. తెలంగాణలో ఆయన పార్టీ సర్పంచ్ ఆధ్వర్యంలోనే వెనుకబడిన వర్గాలపై దాడులు జరుగుతున్నాయి. గుడికి వెళ్తే దాడులా? ఇదేనా మీ ప్రజా పాలన.. రేవంత్ రెడ్డి నిందితులను వదిలేస్తారు… ప్రశ్నించే నాయకులను అరెస్ట్ చేస్తారు! నాగర్ కర్నూల్ ఘటనపై గళం ఎత్తినందుకు నాయకులపై ఆంక్షలు విధించడం సబబు కాదన్నారు. పాప మృతికి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

హైకోర్టు కు కృతజ్ఞతలు టీయూజేఏసీ ఉమ్మడి జిల్లా నాయకులు పెండ్యాల సుమన్…

హైకోర్టు కు కృతజ్ఞతలు టీయూజేఏసీ ఉమ్మడి జిల్లా నాయకులు పెండ్యాల సుమన్

పరకాల,నేటిధాత్రి

 

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అర్హుడైన ప్రతి ఉద్యమ కారునికి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో ప్రకటించిన ఇంటి స్థలాలను ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ (టియూజేఏసీ) ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు పెండ్యాల సుమన్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులపై కేసులుఉండి జైలు పాలైన ఉద్యమకారులకి మొదటి ప్రాధాన్యత గా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వారికి రెండవ ప్రాధాన్యత గా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సోమవారం ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు,పెన్షన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా హామీల అమలుకు 8 వారాలు సమయమిచ్చిన హైకోర్టు అందుకు ఉద్యమకారులు హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.అభయహస్తం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు,పెన్షన్లు మంజూరు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఫ్రీడం ఫైటర్ శాఖ అధికారులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఉద్యమ జేఏసీ నాయకులు దీనిపై విచారణ జరిపి అర్హులైన ఉద్యమకారులకు 8 వారాల్లోగా హామీలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు
ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా టీయూజేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలలో అమలు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని సుమన్ కోరారు.

ఉద్యమకారుల మహాసభ విజయవంతం చేద్దాంవిద్యార్థి ఉద్యమ నేతల పిలుపు….

ఉద్యమకారుల మహాసభ విజయవంతం చేద్దాంవిద్యార్థి ఉద్యమ నేతల పిలుపు

పరకాల,నేటిధాత్రి

 

పట్టణంలోని అమరదామం వద్ద తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక, తెలంగాణ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో చలో సూర్యపేట, జనవరి 10న జరిగే ఉద్యమకారుల బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ విద్యార్థి ఉద్యమ నాయకులు కంచర్ల బద్రి,టియుజేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చార్వాక, రంజిత్ మరియు వివిధ సంఘాల ప్రతినిధులు,ఉద్యమ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గత పాలకులు 10 సంవత్సరాలు ఉద్యమకారులను విస్మరించారని,అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు.నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా రెండు సంవత్సరాలు గడిచిందని, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విపలమయ్యారని,ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని,విద్యార్థి సంఘాల ఉద్యమ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.దానిలో భాగంగానే తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టియుజేఏసీ చేపట్టిన సూర్యపేట బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కోడెపాక భాస్కర్,పెండ్యాల రవీందర్, పవన్ కుమార్,రమేష్, చిన్నికృష్ణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version