అంకుషాపుర్ గ్రామంలో లోక్ అదాలత్ అవగాహన కార్యక్రమం..

అంకుషాపుర్ గ్రామంలో లోక్ అదాలత్ అవగాహన కార్యక్రమం

సత్వర న్యాయం కావాలంటే లోక్ అదాలత్ ఒకటే మార్గం

పారా లీగల్ వాలంటర్ అంబాల నరేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

టేకుమట్ల మండలం అంకుషాపుర్ గ్రామంలో పారా లీగల్ వాలంటర్ అంబాల నరేందర్ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ పై గ్రామ ప్రజలకు అవగాహన సదస్సును నిర్వహించారు. మండలంలోని అంకుషాపుర్ గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద గ్రామ పెద్దలు గ్రామ ప్రజల తో కలిసి లోక్ అదాలత్ పై గ్రామ ప్రజలు కు అవగాహన కార్యక్రమం నిర్వహించి అందులో భాగంగా అంకుషాపుర్ గ్రామంలో పారా లీగల్ వాలంటర్ అంబాల నరేందర్ మాట్లాడుతూ
మాట్లాడుతూ లోక్ అదాలత్ ను వినియోగించుకోండి సమస్యలను పరిష్కరించుకోవాలని, సత్వర న్యాయం కావాలంటే లోక్ అదాలత్ ఒక్కటే మార్గమని, చిరకాలంగా కోర్టు నందు పరిష్కారం కానీ నిలిచిపోయిన మీ కేసులను లోక్ అదాలత్ ద్వారా తక్కువ వ్యవధిలో ఖర్చు లేకుండా మీ కేసులను పరిష్కరించుకోవచ్చని మార్చి 28 రోజున జిల్లా కోర్టులో లోక్ అదాలత్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

జిల్లా కోర్టులో వర్క్‌షాప్‌ ప్రారంభం…

జిల్లా కోర్టులో వర్క్‌షాప్‌ ప్రారంభం

నేరారోపణల రిమాండ్‌.. జీవిత రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన చట్టాలపై నగరంలోని జిల్లా కోర్టులో శనివారం వర్క్‌షాప్‌ను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భానుమతి ప్రారంభించారు.

ప్రసంగిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భానుమతి
నేరారోపణల రిమాండ్‌.. జీవిత రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన చట్టాలపై నగరంలోని జిల్లా కోర్టులో శనివారం వర్క్‌షాప్‌ను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భానుమతి ప్రారంభించారు. వ్యక్తిగత స్వేచ్ఛకు, నేరారోపణలపై అరెస్టయి ఖైదీల రిమాండ్‌కు సంబంధించిన ప్రొసీజర్లపై ఈ వర్క్‌షాప్‌ నిర్వహించారు. న్యాయాధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ప్రొసీజర్లపై హైకోర్టు న్యాయమూర్తి జిల్లాలోని న్యాయాధికారులకు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హరిహరనాథ శర్మ, కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ది, న్యాయాధికారులు లక్ష్మీరాజ్యం, శ్రీవిద్య, ఎం.శోభారాణి, రాజేంద్రబాబు, శాశ్వత లోక్‌ అదాలత్‌ అధ్యక్షుడు వెంకట హరినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version