గుడిలో గోమాత పూజలు, బయట చెత్త తింటున్న ఆవులు: భక్తిపై ప్రశ్నలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలో గోమాత పట్ల భక్తి, నిర్లక్ష్యం విరుద్ధంగా కనిపిస్తున్నాయి. నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో గుడుల్లో గోమాతకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతుండగా, అదే సమయంలో వీధుల్లో ఆవులు చెత్త కుప్పల వద్ద ప్లాస్టిక్ కవర్లు తింటూ దర్శనమిస్తున్నాయి. గుడిలో రాయిని పూజించే భక్తి బయట జీవుల పట్ల కరుణగా మారడం లేదని, భక్తి కేవలం గుడి గడపకే పరిమితం కాకుండా, బయట జీవుల పట్ల కరుణ, బాధ్యతగా మారాలని, పరిశుభ్రత, కరుణ, బాధ్యతలే నిజమైన ఆచరణాత్మక భక్తి అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
