· కాంగ్రెస్ పెద్దలు జాగ్రత్త పడకపోతే పుట్టిమునిగే ప్రమాదం
· కేవలం 50కంటే ఎక్కువ స్థానాల్లో గెలవడం ప్రజల పూర్తి మద్దతుకు సంకేతం కాదు
· 38 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడటం విపక్ష బలానికి సంకేతం
· నెంబర్ గేమ్ కాదు “వోటింగ్ శాతం” ముఖ్యం
· రానున్న కాలం కాంగ్రెస్‌కు టైట్ రోప్ వాక్ అనే చెప్పాలి
· రేవంత్ సహా మంత్రులు హైకమాండ్ భజన తగ్గించుకోవాలి
· ఇది ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతుంది
· అధికారంలోకి వస్తేనే కదా హైకమాండ్ పెత్తనం
· ఓడిపోతే హైకమాండ్ పట్టించుకోదు
· ప్రజలే హైకమాండ్ అని గుర్తించి ప్రభుత్వం పనిచేయాలి
· ఇందిరమ్మ భజన “తెలంగాణ ఆత్మగౌరవం” నినాదానికి దారితీస్తుంది
· అధికారం ఇచ్చేది ప్రజలు మాత్రమే
హైదరాబాద్, నేటిధాత్రి:
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 1537 వార్డుల్లో విజయం సాధించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే బీఆరఎస్ చెక్కుచెదరలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవం కంటే రేవంత్ ప్రభుత్వంలో నెలకొన్న అవినీతిపై బీఆరఎస్ చేసిన విస్తత ప్ర చారం ఏస్థాయిలో పనిచేసిందో మనకు చాలా అర్థమవుతుంది. ఇక్కడ గుర్తించాల్సిన అంశ మేమంటే కాంగ్రెస్ 1537 వార్డుల్లో గెలిచినా, 1200 నుంచి 1400 వార్డుల్లో బీఆరఎస్ గట్టిపోటీ ఇచ్చిందంటే విపక్షంలో వున్నా, పార్టీ క్షేత్రస్థాయిలో బలీయమైన ఓటుబ్యాంకును కలిగివున్నదనే అర్థం. అంతేకాదు మొత్తం 116 మున్సిపాలిటీల్లో 38 హంగ్ ఏర్పడ్డాయంటే కాం గ్రెస్ బలం అనేదానికంటే, బీఆరఎస్ సత్తా అని గుర్తించాలి. ఎందుకంటే ప్రధానంగా స్థానిక ఎన్నికల్లో అధికారపార్టీకే అత్యధిక సానుకూలత వుంటుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలో వున్న బీఆరఎస్‌కు 90శాతం మున్సిపాలిటీలు స్వాధీనం కావడాన్ని పరిశీలిస్తే ఈసారి కాంగ్రెస్ పనితీరు “నెంబర్ గేమ”లో బాగుందనిపించినా, ఓటింగ్ పరంగా పరిశీలిస్తే పనితీరు ఆశించినస్థాయిలో లేదని చెప్పక తప్పదు. చాలా వార్డుల్లో పదికంటే తక్కువ ఓట్లతో గెలుపు సాధించిన సందర్భాల్లో రీకౌంటింగ్‌కు డిమాండ్లు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బీఆరఎస్, బీజేపీలు ఈవిధంగా స్వల్ప ఓట్ల మార్జిన్‌తో ఓటమి పాలైనప్పుడు రీకౌంటింగ్‌లు జరిగాయి. ఈ అంశాలను పరిశీలిస్తే రాష్ట్రంలో విపక్షాల బలహీనపడలేదన్న సత్యం కాంగ్రెస్ నేతలకు నిద్రలేని రాత్రులను మిగల్చవచ్చు. నెంబర్‌గేమ్ మాట అట్లా వుంచితే ఇంతటి బలమైన ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదంటే 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు రేవంత్ ప్రభుత్వం మరింత గట్టి పనితీరును ప్రదర్శించకపోతే పుట్టి మునగడం ఖాయమన్న సంకేతాలను ఈ ఎన్నికల ఫలితాలు ఇస్తున్నాయి. అంతేకాదు ఈ ఫలితాలు ప్రజల్లో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకు చిహ్నం కూడా! అందువల్ల ప్రభుత్వ పెద్దలు, ప్రతి దానికీ విపక్షాలను విమర్శించడం మాని తామేం చేస్తున్నదీ ప్రజలకు విడమరచి చెప్పి అభిమానాన్ని సంపాదించుకునే యత్నం చేయాలి. గత ప్రభుత్వంలో పనిచేసినవారిలో కొంతమంది రేవంత్ మంత్రివర్గంలో కూడా వుండటంతో, అదేపనిగా బీఆరఎస్‌పై చేస్తున్న విమర్శలు బూమరాంగ్ అయి, వీరే సమాధా నం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే బీఆరఎస్‌ను విమర్శించడమంటే తమను తా ము వేలెత్తిచూపుకున్నట్టే! ప్రజలు అమాయకులు కారు. అధికారపక్షం చేసే ప్రతి పనిని వారుపరిశీలించి, ఓటింగ్ రూపంలో మార్కులు వేస్తారన్నది గుర్తించాలి.
విశ్లేషిస్తే 38 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడిందంటే, విపక్షం చాలా బలంగా వున్నదనేగా అ ర్థం. కేసముద్రం మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆరఎస్‌లు చెరి 8 స్థానాలను గెలుచుకున్నాయి. వికారాబాద్‌జిల్లా పరిగి మున్సిపాలిటీలో మొత్తం 18 స్థానాల్లో కాంగ్రెస్, బీఆరఎస్‌లు చెరి 8 వార్డులను Âకైవసం చేసుకున్నాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో మొత్తం 77 స్థానాల్లో బీఆరఎస్‌కు 30, కాంగ్రెస్‌కు 29 వచ్చాయి. అంటే అధికారపార్టీ కంటే బీఆరఎస్‌కు ఒక్కస్థా నం ఎక్కువ. జనగాం 30 వార్డుల్లో, తొర్రూరు 16 వార్డుల్లో వచ్చిన ఫలితాల పుణ్యమాని ఛైర్‌పర్సన్ ఎన్నికకు ‘టై’ పరిస్థితి ఏర్పడింది. విచిత్రమేమంటే కాంగ్రెస్‌కు చెందిన ఎక్స్`అఫిసియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నప్పటికీ చెరిసమానం కావడంతో తప్పనిసరిపరిస్థితుల్లో లాటరీ ద్వారా విజేతను ప్రకటించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులునెలకొన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో చాలా స్థానాల్లో తక్కువ మార్జిన్లు వుండటంతో రీకౌం టింగ్ చేయాల్సి వచ్చింది. కరీంనగర్, సంగారెడ్డి, పరిగి ప్రాంతాల్లో కౌంటింగ్ జరుగుతున్నప్పుడు ప్రత్యర్థి పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగడం గమనార్హం. అసీఫాబాద్, దేవర కొండ, ఆలంపూర్, కోహిర్, కేసముద్రం, అమరచింత, క్యాతనపల్లి వార్డుల్లో ఏ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోయింది. ఒక్కో వార్డు గెలుపు, ఛైర్‌పర్సన్ స్థానానికి కీలకంగా మారడంతో ఎంతో ఉత్కంఠ నెలకొంది. కేసముద్రంలో 8`8 స్థానాల్లో గెలుపుతో రెండు పార్టీలుఢీ అంటే ఢీ అనే స్థాయిలో పోటీపడ్డాయి. అయితే జగిత్యాల పరిస్థితి భిన్నం. ఇక్కడ కాంగ్రెస్‌కు 12, బీఆరఎస్‌కు 4 స్థానాలు రాగా 14 వార్డులను ఇండిపెండెంట్లు గెలుచుకోవడంతో ఛైర్‌పర్సన్ ఎన్నికకు చాలా విచిత్ర పరిస్థితి నెలకొంది.
మొత్తం ఎన్నికలు పూర్తయ్యాక తెలంగాణ ఎన్నికల సంఘం ఒక ప్రకటన జారీచేస్తూ మొత్తం93 మున్సిపాలిటీలను కాంగ్రెస్, 19 బీఆరఎస్ గెలుచుకున్నాయని వెల్లడించింది. కానీ మొ త్తం 116 మున్సిపాలిటీల్లో 38 అంటే 1/3శాతం హంగ్ ఫలితాలన్నివ్వడాన్ని గమనిస్తే, కాం గ్రెస్, బీఆరఎస్‌లు ఇక్కడ సమాన బలంతో వున్నాయన్నది అర్థమవుతుంది. దేవరకొండ మున్సిపాలిటీని కేవలం ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతుతో మాత్రమే కాంగ్రస్ తన ఖాతాలోవేసుకోగలిగింది. అలంపూర్, కేసముద్రంలో కూడా ఇదే పరిస్థితి. ఇవన్నీ హంగ్ ఏర్పడిన 38 మున్సిపాలిటీల్లో కొన్ని. ఇంకా చాలా మున్సిపాలిటీను కాంగ్రెస్ చాలా తక్కువ మెజారిటీలేదా లాటరీల ద్వారా మాత్రమే స్వాధీనం చేసుకోగలగడాన్ని గమనిస్తే, బీఆరఎస్ ఎక్కడా బలహీన పడలేదన్న సంగతి స్పష్టమవుతోంది.
ఇక వార్డుల్లో కూడా కేవలం సింగిల్ ఓటు మెజారిటీలో కాంగ్రెస్ విజయం సాధించినవి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే వుండటం గమనార్హం. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కేవలం ఒకే ఒక్క ఓటుతో గెలిచాడు. జనగాం మున్సిపాలిటీలోని 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి, బీఆరఎస్‌పై కేవలం రెండు ఓట్ల తేడాతోనే గట్టెక్కడం గమనార్హం. తొర్రూరులోని 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ ఓట్లు కేవలం 3. దేవరకొండ మున్సిపాలిటీలోని 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి 4ఓట్ల మార్జిన్‌తో గెలిచాడు. ఆలంపూర్, క్యాతనపల్లిల్లో కూడా 3`4 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గెలిచిన స్థానాలు బాగానే వున్నాయి. అభ్యర్థి గెలుపు పది ఓట్లకంటే తక్కువ వున్నప్పుడు రీకౌంటింగ్ కోరడం సహజం. ఈ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది.
బద్ధవైరంగా వున్న కాంగ్రెస్, బీఆరఎస్‌ల మధ్య పరస్పర అవగాహన కూడా కొన్ని మున్సిపాలిటీల్లో కనిపించింది. ఇది స్థానిక నాయకత్వాల మధ్య వున్న అవగాహనే కారణమని చెప్పక తప్పదు. ఇక్కడ పార్టీల వైరుధ్యం కంటే, స్థానిక నాయకుల సమన్వయం ప్రాధాన్యత వహించా యని అర్థం చేసుకోవాలి. ఒక కోణంలో ఆలోచిస్తే దీన్కొక సానుకూల పరిణామంగా చెప్పవచ్చు. కామారెడ్డి మున్సిపాలిటీలో 11 మంది బీఆరఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ అభ్యర్థికిì మద్దతివ్వగా, కాంగ్రెస్ కౌన్సిలర్లు వైస్‌ఛైర్మన్‌గా బీఆరఎస్ అభ్యర్థికి సపోర్ట్ చేశారు. అమరచింత మున్సిపాలిటీలో మరో విచిత్రం జరిగింది. బీఆరఎస్ తరపున గెలిచిన కౌన్సిలర్ కాం గ్రెస్‌లో చేరడంతో, సీపీఎం మద్దతుతో పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇక ఆమనగల్ మున్సిపాలిటీలో బీఆరఎస్ కౌన్సిలర్, కాంగ్రెస్‌లోకి చేరగా, బీజేపీ మద్దతుతో మున్సిపా లిటీని గెలుచుకుంది. ఇక ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆరఎస్ కౌన్సిలర్ మరో ముగ్గురు ఇండిపెండెంట్లతో కలిసి కాంగ్రెస్‌లో చేరగా, మరో కాంగ్రెస్ కౌన్సిలర్‌ను బీఆరఎస్ చేర్చుకోవడం ‘తగ్గేదే లేదు’ రాజకీయం నడిచింది. రాయ్‌కల్‌లో కాంగ్రెస్ మద్దతులో బీఆరఎస్ కౌన్సిలర్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇక్కడ బీజేపీని దెబ్బకొట్టడానికి ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయన్న సంగతి సుస్పష్టం. ఇక నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీని అధికా రంలోకి రాకుండా చేయడానికి ఎంఐఎం, కాంగ్రెస్, బీఆరఎస్‌లు ఏకం కావడం మరో విచి త్రం. మొత్తంమీద పరిశీలిస్తే నాలుగు సందర్భాల్లో కాంగ్రెస్ మద్దతుతో బీఆరఎస్ కౌన్సిలర్లకు పోస్ట్‌లు (వైస్‌ఛైర్మన్) రావడం గమనార్హం.
మొత్తంమీద పరిశీలిస్తే కాంగ్రెస్ సొంతంగా గెలిచింది 66 మున్సిపాలిటీల్లో! మరో 25 ము న్సిపాలిటీలను అలయన్స్‌లు లేదా ప్రత్యర్థి పార్టీలనుంచి వలసనలను ప్రోత్సహించడం ద్వారా కైవసం చేసుకోగలిగింది. బీఆరఎస్ మొత్తం 18 ఛైర్‌పర్సన్ పోస్టులను సొంతంగా గెలుచు కుంది. ఇక వైస్‌ఛైర్‌పర్సన్ పోస్టులను కాంగ్రెస్ ఇతరపార్టీలతో జట్టు కట్టడం ద్వారా 84 వైస్‌ఛైర్‌పర్సన్/డిప్యూటీ మేయర్ పోస్టులను పొందగలిగాయి. వార్డుల విషయానికి వస్తే మొత్తం 2996 వార్డుల్లో, 1537 కాంగ్రెస్, బీఆరఎస్ 717, బీజేపీ 261 వార్డులను గెలుచుకున్నాయి. ఇక స్ట్రైక్‌రేట్ విషయానికి వస్తే కాంగ్రెస్ 51.3%, బీఆరఎస్‌కు 26.1%. మొత్తం 7 ము న్సిపల్ కార్పొరేషన్లలో ఐదింటిని కాంగ్రెస్ గెలుచుకున్నా, రామగుండం, మంచిర్యాల, నý£్గండ కార్పొరేషన్లను మాత్రం సొంతంగా గెలుచుకోగలిగింది. మిగతా రెండింటిలో ఇతరుల మద్దతు అవసరమైంది. నెంబర్ గేమ్‌లో 93‘94 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఆధీనంలోకి వెళ్లినా సొంతబలంలో గెలి చింది కేవలం 66 మున్సిపాలిటీల్లోనే అన్నది గమనార్హం. మిగిలిన స్థానాల్లో వలసలను ప్రో త్సహిచడం, మద్దతు కోసం రాజకీయాలు నడపడం, ఎక్స్‘అఫిసియో మెంబర్ల ఓట్ల ద్వారా గెలవగలిగిందనేది సత్యం. మొత్తంమీద ఈ గణాంకాల ఆధారంగా విశ్లేషించినప్పుడు కాంగ్రె స్‌కు పూర్తిస్థాయి మద్దతు లేదన్న సంగతి స్పష్టమవుతోంది. ఇదే సమయంలో బీఆరఎస్ బలహీన పడిందన్న వాదనలూ సరికాదు. ఇక ముందు కాంగ్రెస్ పాలన టైట్ రోప్ వాక్ అనే చెప్పాలి. ఏమాత్రం తప్పు జరిగినా క్యాష్ చేసుకోవడానికి బీఆరఎస్ అనుక్షణం పొంచి వుం టుందనేది సత్యం!
