హైదరాబాద్ రూపురేఖలు మార్చే ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

· మార్చి 31 నాటికి మెట్రో ఫేజ్`1 స్వాధీనం

· మెట్రో రెండోదశ పనులకు కేంద్రానికి డీపీఆర్ సమర్పణ

· రూ.722 కోట్లతో మంజీరా నీటి సరఫరా పథకం ఆధునికీకరణ

· జీహెచఎంసీ పరిధిలో 300కి.మి. రోడ్లకు మరమ్మతులు

· మెట్రో విస్తరణ పనుల ఖర్చు చెరి సగం భరించనున్న కేంద్రం, రాష్ట్రం

· కోకాపేటలో నియోపోలిస్ రిజర్వాయర్

· హెచఎండీఏ పరిధి మరో నాలుగు గ్రామాలకు విస్తరణ

· మెట్రోను ఎయిర్‌పోర్టు, ఫ్యూచర్ సిటీ వరకు విస్తరణకు ప్రణాళికలు

హైదరాబాద్, నేటిధాత్రి: 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతత్వంలోని తెలంగాణ మంత్రివర్గం తాజాగా కొన్ని అభివద్ధి ప్రాజె క్టులను ఆమోదించింది. వీటిల్లో హైదరాబాద్ మెట్రో ఫేజ్`1 స్వాధీనంతో పాటు, ఫేజ్`2 పనులు వేగిరం చేయడం కూడా వుండటం విశేషం. ఈ సేకరణ ప్రక్రియకు సుమారు రూ.15వేల కోట్లు అవసరం కానుంది. ఇందులో కంపెనీ చెల్లించాల్సిన అప్పు కూడా వుంది. ఇవికాకుండా రూ.722 కోట్లు ఖర్చయ్యే మంజీరా నీటిసరఫరా పథకం ఆధునికీకరణ, రూ.282కోట్ల విలువైనఉస్మాన్‌సాగర్ పైప్‌లైన్‌ల అప్‌గ్రే డింగ్‌లతో పాటు జీహెచఎంసీ పరిధిలో 300 కిలోమీటర్ల రోడ్లను రూ.3145కోట్ల వ్యయంతో Âరెండోదశ సమగ్ర మరమ్మతు పనులు చేపట్టే ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 

162.5 కిలోమీటర్ల పొడవున్న రెండోదశ మెట్రో పనుల విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్రం తుది అనుమతి కోసం ప్రభుత్వం సమర్పించింది. ఫేజ్‘2ఎ కింద 76.4 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ చేపడతారు. ఇందులో 36.6 కిలోమీటర్ల విమానాశ్రయ కనెక్టివిటీ (నాగోల్ నుంచి ఆర్‌జీఐఏ), పాతబస్తీని అనుసంధానించడంతో పాటు పటాన్‌చెరు, హయత్‌నగర్‌ల వరకు విస్తరణ ప్రతి పాదనలు కూడా ఇందులో వున్నాయి. ఫేజ్‘2బి కింద 86.1 కిలోమీటర్ల పొడవున్న ఫ్యూచర్‌సిటీ, షామీర్‌పేట్ విస్తరణ ప్రతిపాదనలు కూడా వున్నాయి. అంతేకాకుండా ఈ ఏడాది మార్చి 31 నాటికి ఎల్ అండ్ టి నుంచి పూర్తిగా మెట్రోను స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదనను కూడా మంత్రిమండలి ఆమోదించింది. మెట్రో విస్తరణ పనుల ఖర్చును 50:50 ని ష్పత్తి లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడతాయి. మంజీర ఫేజ్‘1,2 పథకాలను మరింత ఆధునికీకరించేందుకోసం రూ.722 కోట్లు మంజూరుకు కూడా కేబినెట్ ఓకే చెప్పింది. ప్రస్తుతం వున్న పైప్‌లైన్లు 1960 నుంచి 1980 మధ్యకాలంలో వేసినవి. ఉస్మాన్‌సాగర్‌నుంచి తాగునీటి సరఫ రా పైప్‌లైన్లను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం రూ.282కోట్లు కేటాయించింది. దీనివల్ల నీటి సరఫరాలో 30శాతం వర కు పంపిణీ నష్టాలను నివారించవచ్చు. ఇక మూసీనది పునరుద్ధరణ పథకం కింద మల్లన్నసాగర్ 2,3 దశల ఎత్తిపోతల పథకాలకోసం ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. దీనిద్వారా ముసీనది పునరుద్ధరణతో పాటు, జంటనగరాలకు తాగునీటిని సరఫరా చేయవ చ్చు. ఇక కోకాపేటలో నియోపోలిస్ రిజర్వాయర్ నిమిత్తం భూమిని ప్రభుత్వం కేటాయించింది.నియోపోలిస్ అభివద్ధికోసం ఈ రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. నగర పరిధిలో రోడ్ల విస్తరణ ప్రాజెక్టులకోసం రక్షణశాఖ నుంచి సేకరించనున్న 42 ఎకరాలకు ప్రతి గా 153 ఎకరాల భూమిని రక్షణ మంత్రిత్వశాఖకు బదలాయించడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటితో పాటు హెచఎండీఏ పరిధిని నాలుగు గ్రామాల పరిధికి విస్తరించనున్నారు. ఈ గ్రామాలు వరుసగా చిట్టిగూడ, యావ పూర్, టేకులపల్లి, ఎక్తల. కాగా జీహెచఎంసీ పరిధిలోని 300 కిలో మీటర్ల రోడ్ల అప్‌గ్రేడ్ మరియు నిర్వహణకోసం రూ.3145 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. 

2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దే లక్ష్యంతో చేపట్టిన “తెలంగాణ రైజింగ్ `2047” విజన్‌లో భాగంగా ప్రభుత్వం ఈ మెట్రో, నీటి ప్రాజెక్టులకు అ త్యంత ప్రాధాన్యతనిచిచ్చింది. ఈ ప్రాజెక్టులకోసం పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి…రాష్ట్ర జీడీపీనిపెంచే రీతిలో పెట్టుబడులు పెద్దఎత్తున ఆకర్షించేందుకు ఉపయోగపడగలదన్నది ప్రభుత్వ ఉద్దే శం. ఈ మౌలిక సదుపాయాల విస్తరణ వల్ల 2026లో హైదరాబాద్ జీడీపీ 7% నుంచి 8% వరకు పెరిగే అవకాశమున్నదని అంచనా. నగరానికి నిరంతర కనెక్టివిటీ వుండటం వల్లనే, ఫా ర్చూన్ 500 కంపెనీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) హైదరాబాద్‌ను తమ పెట్టుబడు లకు ఎంచుకున్నాయి. ఇప్పటికే నగరంలో 355 జీసీసీలు పనిచేస్తుండటం గమనార్హం. నీరు, రోడ్డు ప్రాజెక్టుల ఆధునికీకరణ వల్ల, ఫార్మా సిటీ, ఐటీ కారిడార్ల నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గనుంది. ఆవిధంగా రాష్ట్రం గ్లోబల్ తయారీ హబ్‌గా రూపొందడానికి మార్గం సుగమమవుతుంది. 

మెట్రో ఫేజ్`2 కారిడార్ల పనులు ప్రారంభానికి ముందే, ఈ ప్రాంతంలో ఆస్తుల విలువ 10% నుంచి 25% వరకు పెరగనున్నాయి. మెట్రోను ఫ్యూచర్‌సిటీ, ఎయిర్‌పోర్టుల వరకు విస్తరించ డం వల్ల నగర అభివద్ధి శంషాబాద్, మహేశ్వరం ప్రాంతాలకు విస్తరించగలదు. ఫలితంగా ప్ర స్తుతం నగరంపై పడుతున్న ఒత్తిడినుంచి ఉపశమనం లభించగలదు. అంతేకాదు మెట్రో విస్తరణ వల్ల రెసిడెన్షిల్ కాంప్లెక్స్‌ల కోసం 2026లో పదిశాతం డిమాండ్ పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంతేకాదు 5లక్షలమంది ప్రజలు ఇక మెట్రో ప్రయాణం చేయడం వల్ల, నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా, వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాల పరి మాణం కూడా గణనీయంగా తగ్గుముఖంపడుతుంది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు పాతబస్తీలో మెట్రో విస్తరణ కొనసాగించనుంది. నిజానికి ఈ విస్తరణకోసం 2025లోనే ప్ర త్యేక ఇంజినీరింగ్ నైపుణ్యతో ఈ ప్రాంతంలోని 103 వారసత్వ, మతపరమైన కట్టడాలకు ఎటువంటి నష్టం వాటిల్లని రీతిలో డిజైన్ తయారుచేశారు. ప్యూచర్ సిటీకి 40 కిలోమీటర్ల మేర విస్తరించే మెట్రో రైల్వే లైన్ నిర్మాణాన్ని 18 కిలోమీటర్ల మేర రోడ్డుపై చేపట్టనున్నారు. 300 అడుగల గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు పక్కనే దీని నిర్మాణం కొనసాగడం విశేషం. ఫ్యూచర్ సిటీనే, ముచ్చర్ల ఏఐ సిటీ అని కూడా వ్యవహరిస్తున్నారు. మొత్తం 30వేల ఎకరాల్లో పూర్తిగా కర్బన ఉద్గార రహితం గా దీన్ని నిర్మించనున్నారు. మెట్రో విస్తరణ వల్ల వేలాది మందికి ప్రత్యక్ష ఉద్యోగాల కల్పనతో పాటు మరో 5.6లక్షల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది. మెట్రో ఫేజ్‘2 నిర్మాణాన్ని దశýవారీ గా 2028 `30 మధ్యకాలం నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా పాతబస్తీకి విస్తరణ 2028 `29 నాటికి, ఎయిర్‌పోర్ట్ కారిడార్‌ను 2029 `30 నాటికి, రాయ్‌దుర్గ్ `కోకా పేట/మియాపూర్‘పటాన్‌చెరు మార్గాలను 2030 నాటికి, ఫ్యూచర్ సిటీ లింక్‌ను 2030 త ర్వాత కాలంలో పూర్తిచేయాలన్నది లక్ష్యం. ప్రభుత్వం తలపెట్టిన ఫ్యూచర్‌సిటీని పూర్తిగా కర్బన ఉద్గారాలు లేని స్వచ్ఛమైన రీతిలో అభివద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆవిధంగా దేశం లోనే మొట్టమొదటి గ్రీన్‌సిటీ ఏ ర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కేలా అడుగులుముందుకేస్తున్నది. ముఖ్యంగా ఇక్కడ 3600ల కనెక్టివి టీ సదుపాయం కల్పించనున్నది. 

ప్రభుత్వం చేపట్టే గోదావరి తాగునీటి ప్రాజెక్టు ఫేజ్ 2,3 కింద మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమయత్‌సాగర్‌లకు నీటిని ఎత్తిపోస్తుంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.7వేల కోట్లు. దీని వల్ల జంటనగరాలకు, ఫ్యూచర్ సిటీకి 24/7 గంటలు తాగునీటి సరఫరా సాధ్యం కాగలదు. రూ.8వేల కోట్ల వ్యయంతో 140 కిలోమీటర్ల మేర రింగ్ మెయిన్ పైప్‌లైన్ నిర్మాణాన్ని ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ చేపట్టనున్నారు. కష్ణా, గోదావరి, మంజీర నదుల నీటి సరఫరాను ఇంటర్ కనెక్ట్ చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో నీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు. అంతేకా దు ఫ్యూచర్ సిటీలో స్పాంజ్ పార్క్‌ల నిర్మాణం చేపట్టడం ద్వారా వర్షపు నీటిని సహజంగా భూ మిలో ఇంకిపోయేలా చేస్తున్నారు. దీనివల్ల నీటి నిలిచి వుండటం వంటి సమస్యలు ఉత్పన్నం కావు. రోడ్లు, నీటి సదుపాయాలను భవిష్యత్తులో నిర్మించబోయే ఏఐ సిటీకి అనుగుణంగా ప్రభు త్వం ఏర్పాటు చేయనుంది. ఇక ఫ్యూచర్ సిటీకి సమీపంలో వుండే కొండాపూర్, మహేశ్వరం, తుక్కుగూడ, షాద్‌నగర్ ప్రాంతాలు గ్రోత్ హాట్‌స్పాట్‌లుగా అభివద్ధి చెందనున్నాయి. ఈ అభివద్ధి వల్ల రీజినల్ రింగ్‌రోడ్డు ప్రాంతంలో రాబోయే ఐదేళ్ల కాలంలో మౌలిక సదుపాయాల కల్పన బాగా విస్తరిస్తుంది కనుక భూముల విలువలు కూడా బాగా పెరుగుతాయని అంచనా. అంతేకాదు ఫ్యూచర్ సిటీ ప్రణాళిక కారణంగా 2026 మధ్య నాటికి 25వేల ఉద్యోగాల సష్టి జరుగు తుందని కూడా ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్, తయారీ రంగాల్లో ఉద్యో గావకాశాలు పెరుగనున్నాయి. ముంబయి హైవే (సదాశివపేట/జహీరాబాద్), శ్రీశైలం హైవే (ఫ్యూచర్ సిటీ) బెల్ట్‌లను దీర్ఘకాలంలో గ్రోత్ కారిడార్లుగా అభివద్ధి పరచనున్నారు.

తగ్గేదే లేదన్న స్థితిలో బీఆరఎస్

· కాంగ్రెస్ పెద్దలు జాగ్రత్త పడకపోతే పుట్టిమునిగే ప్రమాదం

· కేవలం 50కంటే ఎక్కువ స్థానాల్లో గెలవడం ప్రజల పూర్తి మద్దతుకు సంకేతం కాదు

· 38 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడటం విపక్ష బలానికి సంకేతం· నెంబర్ గేమ్ కాదు “వోటింగ్ శాతం” ముఖ్యం

· రానున్న కాలం కాంగ్రెస్‌కు టైట్ రోప్ వాక్ అనే చెప్పాలి

· రేవంత్ సహా మంత్రులు హైకమాండ్ భజన తగ్గించుకోవాలి

· ఇది ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతుంది

· అధికారంలోకి వస్తేనే కదా హైకమాండ్ పెత్తనం

· ఓడిపోతే హైకమాండ్ పట్టించుకోదు

· ప్రజలే హైకమాండ్ అని గుర్తించి ప్రభుత్వం పనిచేయాలి

· ఇందిరమ్మ భజన “తెలంగాణ ఆత్మగౌరవం” నినాదానికి దారితీస్తుంది

· అధికారం ఇచ్చేది ప్రజలు మాత్రమే

హైదరాబాద్, నేటిధాత్రి:

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 1537 వార్డుల్లో విజయం సాధించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే బీఆరఎస్ చెక్కుచెదరలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవం కంటే రేవంత్ ప్రభుత్వంలో నెలకొన్న అవినీతిపై బీఆరఎస్ చేసిన విస్తత ప్ర చారం ఏస్థాయిలో పనిచేసిందో మనకు చాలా అర్థమవుతుంది. ఇక్కడ గుర్తించాల్సిన అంశ మేమంటే కాంగ్రెస్ 1537 వార్డుల్లో గెలిచినా, 1200 నుంచి 1400 వార్డుల్లో బీఆరఎస్ గట్టిపోటీ ఇచ్చిందంటే విపక్షంలో వున్నా, పార్టీ క్షేత్రస్థాయిలో బలీయమైన ఓటుబ్యాంకును కలిగివున్నదనే అర్థం. అంతేకాదు మొత్తం 116 మున్సిపాలిటీల్లో 38 హంగ్ ఏర్పడ్డాయంటే కాం గ్రెస్ బలం అనేదానికంటే, బీఆరఎస్ సత్తా అని గుర్తించాలి. ఎందుకంటే ప్రధానంగా స్థానిక ఎన్నికల్లో అధికారపార్టీకే అత్యధిక సానుకూలత వుంటుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలో వున్న బీఆరఎస్‌కు 90శాతం మున్సిపాలిటీలు స్వాధీనం కావడాన్ని పరిశీలిస్తే ఈసారి కాంగ్రెస్ పనితీరు “నెంబర్ గేమ”లో బాగుందనిపించినా, ఓటింగ్ పరంగా పరిశీలిస్తే పనితీరు ఆశించినస్థాయిలో లేదని చెప్పక తప్పదు. చాలా వార్డుల్లో పదికంటే తక్కువ ఓట్లతో గెలుపు సాధించిన సందర్భాల్లో రీకౌంటింగ్‌కు డిమాండ్లు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బీఆరఎస్, బీజేపీలు ఈవిధంగా స్వల్ప ఓట్ల మార్జిన్‌తో ఓటమి పాలైనప్పుడు రీకౌంటింగ్‌లు జరిగాయి. ఈ అంశాలను పరిశీలిస్తే రాష్ట్రంలో విపక్షాల బలహీనపడలేదన్న సత్యం కాంగ్రెస్ నేతలకు నిద్రలేని రాత్రులను మిగల్చవచ్చు. నెంబర్‌గేమ్ మాట అట్లా వుంచితే ఇంతటి బలమైన ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదంటే 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు రేవంత్ ప్రభుత్వం మరింత గట్టి పనితీరును ప్రదర్శించకపోతే పుట్టి మునగడం ఖాయమన్న సంకేతాలను ఈ ఎన్నికల ఫలితాలు ఇస్తున్నాయి. అంతేకాదు ఈ ఫలితాలు ప్రజల్లో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకు చిహ్నం కూడా! అందువల్ల ప్రభుత్వ పెద్దలు, ప్రతి దానికీ విపక్షాలను విమర్శించడం మాని తామేం చేస్తున్నదీ ప్రజలకు విడమరచి చెప్పి అభిమానాన్ని సంపాదించుకునే యత్నం చేయాలి. గత ప్రభుత్వంలో పనిచేసినవారిలో కొంతమంది రేవంత్ మంత్రివర్గంలో కూడా వుండటంతో, అదేపనిగా బీఆరఎస్‌పై చేస్తున్న విమర్శలు బూమరాంగ్ అయి, వీరే సమాధా నం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే బీఆరఎస్‌ను విమర్శించడమంటే తమను తా ము వేలెత్తిచూపుకున్నట్టే! ప్రజలు అమాయకులు కారు. అధికారపక్షం చేసే ప్రతి పనిని వారుపరిశీలించి, ఓటింగ్ రూపంలో మార్కులు వేస్తారన్నది గుర్తించాలి.
విశ్లేషిస్తే 38 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడిందంటే, విపక్షం చాలా బలంగా వున్నదనేగా అ ర్థం. కేసముద్రం మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆరఎస్‌లు చెరి 8 స్థానాలను గెలుచుకున్నాయి. వికారాబాద్‌జిల్లా పరిగి మున్సిపాలిటీలో మొత్తం 18 స్థానాల్లో కాంగ్రెస్, బీఆరఎస్‌లు చెరి 8 వార్డులను Âకైవసం చేసుకున్నాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో మొత్తం 77 స్థానాల్లో బీఆరఎస్‌కు 30, కాంగ్రెస్‌కు 29 వచ్చాయి. అంటే అధికారపార్టీ కంటే బీఆరఎస్‌కు ఒక్కస్థా నం ఎక్కువ. జనగాం 30 వార్డుల్లో, తొర్రూరు 16 వార్డుల్లో వచ్చిన ఫలితాల పుణ్యమాని ఛైర్‌పర్సన్ ఎన్నికకు ‘టై’ పరిస్థితి ఏర్పడింది. విచిత్రమేమంటే కాంగ్రెస్‌కు చెందిన ఎక్స్`అఫిసియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నప్పటికీ చెరిసమానం కావడంతో తప్పనిసరిపరిస్థితుల్లో లాటరీ ద్వారా విజేతను ప్రకటించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులునెలకొన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో చాలా స్థానాల్లో తక్కువ మార్జిన్లు వుండటంతో రీకౌం టింగ్ చేయాల్సి వచ్చింది. కరీంనగర్, సంగారెడ్డి, పరిగి ప్రాంతాల్లో కౌంటింగ్ జరుగుతున్నప్పుడు ప్రత్యర్థి పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగడం గమనార్హం. అసీఫాబాద్, దేవర కొండ, ఆలంపూర్, కోహిర్, కేసముద్రం, అమరచింత, క్యాతనపల్లి వార్డుల్లో ఏ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోయింది. ఒక్కో వార్డు గెలుపు, ఛైర్‌పర్సన్ స్థానానికి కీలకంగా మారడంతో ఎంతో ఉత్కంఠ నెలకొంది. కేసముద్రంలో 8`8 స్థానాల్లో గెలుపుతో రెండు పార్టీలుఢీ అంటే ఢీ అనే స్థాయిలో పోటీపడ్డాయి. అయితే జగిత్యాల పరిస్థితి భిన్నం. ఇక్కడ కాంగ్రెస్‌కు 12, బీఆరఎస్‌కు 4 స్థానాలు రాగా 14 వార్డులను ఇండిపెండెంట్లు గెలుచుకోవడంతో ఛైర్‌పర్సన్ ఎన్నికకు చాలా విచిత్ర పరిస్థితి నెలకొంది.
మొత్తం ఎన్నికలు పూర్తయ్యాక తెలంగాణ ఎన్నికల సంఘం ఒక ప్రకటన జారీచేస్తూ మొత్తం93 మున్సిపాలిటీలను కాంగ్రెస్, 19 బీఆరఎస్ గెలుచుకున్నాయని వెల్లడించింది. కానీ మొ త్తం 116 మున్సిపాలిటీల్లో 38 అంటే 1/3శాతం హంగ్ ఫలితాలన్నివ్వడాన్ని గమనిస్తే, కాం గ్రెస్, బీఆరఎస్‌లు ఇక్కడ సమాన బలంతో వున్నాయన్నది అర్థమవుతుంది. దేవరకొండ మున్సిపాలిటీని కేవలం ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతుతో మాత్రమే కాంగ్రస్ తన ఖాతాలోవేసుకోగలిగింది. అలంపూర్, కేసముద్రంలో కూడా ఇదే పరిస్థితి. ఇవన్నీ హంగ్ ఏర్పడిన 38 మున్సిపాలిటీల్లో కొన్ని. ఇంకా చాలా మున్సిపాలిటీను కాంగ్రెస్ చాలా తక్కువ మెజారిటీలేదా లాటరీల ద్వారా మాత్రమే స్వాధీనం చేసుకోగలగడాన్ని గమనిస్తే, బీఆరఎస్ ఎక్కడా బలహీన పడలేదన్న సంగతి స్పష్టమవుతోంది.
ఇక వార్డుల్లో కూడా కేవలం సింగిల్ ఓటు మెజారిటీలో కాంగ్రెస్ విజయం సాధించినవి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే వుండటం గమనార్హం. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కేవలం ఒకే ఒక్క ఓటుతో గెలిచాడు. జనగాం మున్సిపాలిటీలోని 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి, బీఆరఎస్‌పై కేవలం రెండు ఓట్ల తేడాతోనే గట్టెక్కడం గమనార్హం. తొర్రూరులోని 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ ఓట్లు కేవలం 3. దేవరకొండ మున్సిపాలిటీలోని 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి 4ఓట్ల మార్జిన్‌తో గెలిచాడు. ఆలంపూర్, క్యాతనపల్లిల్లో కూడా 3`4 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గెలిచిన స్థానాలు బాగానే వున్నాయి. అభ్యర్థి గెలుపు పది ఓట్లకంటే తక్కువ వున్నప్పుడు రీకౌంటింగ్ కోరడం సహజం. ఈ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది.
బద్ధవైరంగా వున్న కాంగ్రెస్, బీఆరఎస్‌ల మధ్య పరస్పర అవగాహన కూడా కొన్ని మున్సిపాలిటీల్లో కనిపించింది. ఇది స్థానిక నాయకత్వాల మధ్య వున్న అవగాహనే కారణమని చెప్పక తప్పదు. ఇక్కడ పార్టీల వైరుధ్యం కంటే, స్థానిక నాయకుల సమన్వయం ప్రాధాన్యత వహించా యని అర్థం చేసుకోవాలి. ఒక కోణంలో ఆలోచిస్తే దీన్కొక సానుకూల పరిణామంగా చెప్పవచ్చు. కామారెడ్డి మున్సిపాలిటీలో 11 మంది బీఆరఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ అభ్యర్థికిì మద్దతివ్వగా, కాంగ్రెస్ కౌన్సిలర్లు వైస్‌ఛైర్మన్‌గా బీఆరఎస్ అభ్యర్థికి సపోర్ట్ చేశారు. అమరచింత మున్సిపాలిటీలో మరో విచిత్రం జరిగింది. బీఆరఎస్ తరపున గెలిచిన కౌన్సిలర్ కాం గ్రెస్‌లో చేరడంతో, సీపీఎం మద్దతుతో పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇక ఆమనగల్ మున్సిపాలిటీలో బీఆరఎస్ కౌన్సిలర్, కాంగ్రెస్‌లోకి చేరగా, బీజేపీ మద్దతుతో మున్సిపా లిటీని గెలుచుకుంది. ఇక ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆరఎస్ కౌన్సిలర్ మరో ముగ్గురు ఇండిపెండెంట్లతో కలిసి కాంగ్రెస్‌లో చేరగా, మరో కాంగ్రెస్ కౌన్సిలర్‌ను బీఆరఎస్ చేర్చుకోవడం ‘తగ్గేదే లేదు’ రాజకీయం నడిచింది. రాయ్‌కల్‌లో కాంగ్రెస్ మద్దతులో బీఆరఎస్ కౌన్సిలర్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇక్కడ బీజేపీని దెబ్బకొట్టడానికి ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయన్న సంగతి సుస్పష్టం. ఇక నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీని అధికా రంలోకి రాకుండా చేయడానికి ఎంఐఎం, కాంగ్రెస్, బీఆరఎస్‌లు ఏకం కావడం మరో విచి త్రం. మొత్తంమీద పరిశీలిస్తే నాలుగు సందర్భాల్లో కాంగ్రెస్ మద్దతుతో బీఆరఎస్ కౌన్సిలర్లకు పోస్ట్‌లు (వైస్‌ఛైర్మన్) రావడం గమనార్హం.
మొత్తంమీద పరిశీలిస్తే కాంగ్రెస్ సొంతంగా గెలిచింది 66 మున్సిపాలిటీల్లో! మరో 25 ము న్సిపాలిటీలను అలయన్స్‌లు లేదా ప్రత్యర్థి పార్టీలనుంచి వలసనలను ప్రోత్సహించడం ద్వారా కైవసం చేసుకోగలిగింది. బీఆరఎస్ మొత్తం 18 ఛైర్‌పర్సన్ పోస్టులను సొంతంగా గెలుచు కుంది. ఇక వైస్‌ఛైర్‌పర్సన్ పోస్టులను కాంగ్రెస్ ఇతరపార్టీలతో జట్టు కట్టడం ద్వారా 84 వైస్‌ఛైర్‌పర్సన్/డిప్యూటీ మేయర్ పోస్టులను పొందగలిగాయి. వార్డుల విషయానికి వస్తే మొత్తం 2996 వార్డుల్లో, 1537 కాంగ్రెస్, బీఆరఎస్ 717, బీజేపీ 261 వార్డులను గెలుచుకున్నాయి. ఇక స్ట్రైక్‌రేట్ విషయానికి వస్తే కాంగ్రెస్ 51.3%, బీఆరఎస్‌కు 26.1%. మొత్తం 7 ము న్సిపల్ కార్పొరేషన్లలో ఐదింటిని కాంగ్రెస్ గెలుచుకున్నా, రామగుండం, మంచిర్యాల, నý£్గండ కార్పొరేషన్లను మాత్రం సొంతంగా గెలుచుకోగలిగింది. మిగతా రెండింటిలో ఇతరుల మద్దతు అవసరమైంది. నెంబర్ గేమ్‌లో 93‘94 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఆధీనంలోకి వెళ్లినా సొంతబలంలో గెలి చింది కేవలం 66 మున్సిపాలిటీల్లోనే అన్నది గమనార్హం. మిగిలిన స్థానాల్లో వలసలను ప్రో త్సహిచడం, మద్దతు కోసం రాజకీయాలు నడపడం, ఎక్స్‘అఫిసియో మెంబర్ల ఓట్ల ద్వారా గెలవగలిగిందనేది సత్యం. మొత్తంమీద ఈ గణాంకాల ఆధారంగా విశ్లేషించినప్పుడు కాంగ్రె స్‌కు పూర్తిస్థాయి మద్దతు లేదన్న సంగతి స్పష్టమవుతోంది. ఇదే సమయంలో బీఆరఎస్ బలహీన పడిందన్న వాదనలూ సరికాదు. ఇక ముందు కాంగ్రెస్ పాలన టైట్ రోప్ వాక్ అనే చెప్పాలి. ఏమాత్రం తప్పు జరిగినా క్యాష్ చేసుకోవడానికి బీఆరఎస్ అనుక్షణం పొంచి వుం టుందనేది సత్యం!

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా పూర్తి బాధ్యతలు చేపట్టిన గరిమా అగర్వాల్…

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా పూర్తి బాధ్యతలు చేపట్టిన గరిమా అగర్వాల్

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

 

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లాకు పూర్తిస్థాయి జిల్లా కలెక్టర్‌గా 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి గరీమా అగ్రవాల్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గరీమా అగ్రవాల్ ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌గా (స్థానిక సంస్థలు) విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా కూడా అదనపు బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించారు.ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో జిల్లాలోని పరిపాలనా వ్యవస్థపై, ప్రజా సమస్యలపై ఆమె మంచి పట్టు సాధించారు.జిల్లా యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న ఆమె పనితీరును గుర్తించిన ప్రభుత్వం, ఆమెను పూర్తిస్థాయి కలెక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.గరీమా అగ్రవాల్ నియామకం పట్ల జిల్లా అధికారులు మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టడం ద్వారా జిల్లా అభివృద్ధి పనులు మరింత వేగవంతం కానున్నాయి.

జహీరాబాద్ నియోజకవర్గంలో దారుణమైన రోడ్ల పరిస్థితుల గురించి అత్యవసర విజ్ఞప్తి

జహీరాబాద్ నియోజకవర్గంలో దారుణమైన రోడ్ల పరిస్థితుల గురించి అత్యవసర విజ్ఞప్తి

జహీరాబాద్ నేటి ధాత్రి:

గత 15 సంవత్సరాలుగా, ఈ రోడ్లు మరమ్మతులు చేయబడలేదు, దీనివల్ల ప్రయాణికులు, వాహన యజమానులు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా, ఝరాసంగం నుండి దిగ్వాల్ రోడ్డు మార్గం పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో ఉంది. పదే పదే అభ్యర్థనలు చేసినప్పటికీ, ఎటువంటి నిర్దిష్ట చర్యలు తీసుకోలేదు, ఇది ప్రజా సేవ మరియు పాలన గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతోంది.
భారత రాష్ట్ర సమితి పాలనలో గత 10 సంవత్సరాలలో మాత్రమే కాకుండా, ప్రస్తుత భారత జాతీయ కాంగ్రెస్ – తెలంగాణ ప్రభుత్వంలో కూడా, ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఎటువంటి పురోగతి కనిపించలేదు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది..

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండలంలోని నారక్క పేట, గుండ్లపాడు గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల వివాహాది కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మాజీ వైస్ ఎంపీపీ గందె శ్రీలత శ్రీనివాస్ గుప్తా, సర్పంచ్ దండేమ్ సంపత్, ఉప సర్పంచ్ సూరబోయిన రాంబాబు, మాజీ ఎంపిటిసిలు, సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జిఎస్సార్..

ఆలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జిఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల మండలం కేంద్రంలో భక్తుల ఆధ్యాత్మిక ఆకాంక్షలను నెరవేర్చే దిశగా శ్రీ శివ రామాంజనేయ స్వామి నూతన ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆలయ నిర్మాణం గ్రామ ప్రజల ఐక్యతకు, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఆలయానికి 30 లక్షల రూపాయల నిధులు మంజూరి చేయిస్తానని హమీ ఇచ్చారు.దేవాలయ అభివృద్ధికి తాము సంపూర్ణ సహకారం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఉపాధి కూలిలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిని :

ఉపాధి కూలిలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిని :

జహీరాబాద్ నేటి ధాత్రి:

కొల్లూరులో ఉపాధి కూలిలకు వైద్య సిబ్బంది మరియు గ్రామ పంచాయితీ పాలకవర్గం అధ్వర్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు మందులు పంపిని చెయ్యడం జరిగింది,ఎండలు తీవ్రత పెరుగుతున్న దృశ్యా ఉపాధి కూలిల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని వైద్య సిబ్బంది మరియు కొల్లూరు గ్రామ పాలకవర్గం అధ్వర్యం ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది మరియు అనారోగ్యం బారినపడకుండా తగు జాగ్రత్తలు వైద్య సిబ్బంధి తెలియచేయడము జరిగినది …ఈ కార్యక్రమములో గ్రామ పాలకవర్గం, వైద్య సిబ్బంధి మరియు గ్రామ పెద్దలు పాలుగొన్నారు..

శ్రీరామాంజనేయ ఆలయం భూమి పూజ…

శ్రీరామాంజనేయ ఆలయం భూమి పూజ

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి

టేకుమట్ల మండల కేంద్రంలో నిర్మించబడనున్న శ్రీరామాంజనేయ ఆలయం ఆలయ భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి హాజరై వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య భూమి పూజలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కీర్తీ రెడ్డి మాట్లాడుతూ దేవాలయాలు కేవలం ఆరాధన స్థలాలు మాత్రమే కాకుండా మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలని తెలిపారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆలయాలు కేంద్ర బిందువులుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఆలయ నిర్మాణానికి గ్రామ ప్రజలు అందిస్తున్న సహకారం అభినందనీయం అని, త్వరలోనే నిర్మాణ పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చదువు రామచంద్ర రెడ్డి మండల అధ్యక్షులు గుర్రపు నాగరాజు గౌడ్
మాజీ మండల అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ జిల్లా కోరసురేందర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి బండారి సమ్మయ్య సుబ్బక్కపల్లె సర్పంచ్ బొడ్డు రాజేందర్ చాటకూల్ల తిరుపతి మేకల వీరారెడ్డి పంజాల కుమార్ శ్రీపతి శివ నూనెటి అరుణ్ కుమార్ బండపల్లి ఉపసర్పంచ్ ఆర్ అశోక్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ నాగులమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ..

శ్రీ నాగులమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ

* మార్చి 3 వ తేదీ నుండి 7 వ తేదీ వరకు జాతర ఉత్సవాలు
* 5 వ తేదీన నిండు జాతర

మంగపేట నేటిధాత్రి

 

శ్రీ నాగులమ్మ జాతర పోస్టర్ ను మీడియా సమక్షంలో నాగులమ్మ గుడి ప్రధాన ధర్మకర్త, ఆలయ పూజారి, ఆలయ మేనేజింగ్
బాడిశ రామకృష్ణ స్వామీ
శ్రీ రామ కృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్
బి ఆర్ ఎస్ పార్టీ ములుగు జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగరమేష్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమం లో ఆలయ పూజారులు, సిబ్బంది, గ్రామస్తులు, సన్నిహితులు పాల్గొన్నారు

అసలు ఎవరు? నకిలీ ఎవరు…

అసలు ఎవరు? నకిలీ ఎవరు?

నగరంలో ‘పేరుకే జర్నలిస్టు’ల హడావిడి పెరుగుతోంది

నేటిధాత్రి, వరంగల్.

 

నగరంలో జర్నలిజం పేరుతో కొత్త ట్రెండ్ ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. వార్తలు రాయడమే తెలియని కొందరు వ్యక్తులు ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, కార్పొరేషన్ కార్యాలయాల వద్ద “రిపోర్టర్” అంటూ తిరుగుతూ హడావుడి సృష్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే వారు రాసిన ఒక్క వార్త కూడా ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.

ఒకప్పుడు వార్త అంటే బాధ్యత, నిజనిర్ధారణ, పోటీ భావన. ఆధారాలతో సమాచారాన్ని సేకరించి ప్రజలకు నిజాలను అందించడం జర్నలిస్టుల కర్తవ్యంగా భావించబడేది. కానీ ప్రస్తుతం ఐడీ కార్డు ఉంటే చాలు అనే పరిస్థితి నెలకొన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫీల్డ్‌లోకి వెళ్లి వాస్తవాలను వెలికి తీయాల్సిన సమయంలో, కొందరు కేవలం “పేరుకే జర్నలిస్టులు”గా మారిపోతున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

నిజమైన జర్నలిస్టులు ఎవరు?

ప్రతిరోజూ ఫీల్డ్‌లో తిరిగి, ప్రజల సమస్యలను గుర్తించి, ఆధారాలతో వార్తలు సేకరించి, పత్రికా ప్రమాణాలకు అనుగుణంగా రిపోర్టులు తయారు చేసే వారే నిజమైన జర్నలిస్టులని సీనియర్ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే వారి ధ్యేయమని అంటున్నారు.

ఇక మరోవైపు, ఒక్క వార్త కూడా రాయకుండా కేవలం పరిచయాలు పెంచుకోవడం, ప్రభావం చూపించడం కోసం జర్నలిస్టు ట్యాగ్ వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. కనీసం స్క్రోలింగ్ పెట్టే నైపుణ్యాలు లేకపోయినా “సీనియర్ జర్నలిస్టు”గా చెప్పుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అధికారులు గమనించాలి

ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో నిజంగా “వార్తలు సేకరించే వారిని”, కేవలం “హడావుడి చేసే వారిని” అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జర్నలిజం వృత్తిని నిజాయితీగా నిర్వర్తించే వారికి మాత్రమే గుర్తింపు, యాక్సెస్, సమాచార సహకారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

శిక్షణ అవసరం..!

వార్తలు రాయడంలో అనుభవం లేని వారు తగిన శిక్షణ తీసుకుని వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీనియర్ జర్నలిస్టులు సూచిస్తున్నారు. జర్నలిజం అంటే కేవలం కార్డు పెట్టుకొని, మైక్ పట్టుకోవడం కాదని, వాస్తవాల సేకరణ, భాషా ప్రావీణ్యం, ఎడిటింగ్ నైపుణ్యం, సామాజిక బాధ్యత, వార్తలు రాయడం ఇలా అన్ని అవసరమని పేర్కొంటున్నారు.

ముగింపు

జర్నలిజం ఒక బాధ్యతాయుతమైన వృత్తి. దీన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించే ధోరణి తగ్గితేనే మీడియా విశ్వసనీయత పెరుగుతుంది. వార్తలు రాసి ప్రజల ముందుకు తీసుకువచ్చేవారే అసలు జర్నలిస్టులు. పేరుకే తిరిగేవారు కాదన్న అభిప్రాయం బలపడుతోంది.

సిరిసిల్ల చిన్న బోనాలకు బాకీ ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్…

సిరిసిల్ల చిన్న బోనాలకు బాకీ ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పదవ10వ వార్డ్ చిన్న బోనాల లోని గ్రామ దేవత శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి పది లక్షలు ఇస్తాను అని, స్వయంగా నాతో, మా ప్రజలకు చెప్పమని మాట ఇచ్చారు. ఆ మాటను నమ్మి, మా ప్రజలు మీకు అఖండ మద్దతూ ఇచ్చారు లాస్ట్ టైం ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లలో చిన్న బోనాలకు మాటిచ్చాడని ఇప్పటివరకు ఆ మాటను నిలబెట్టుకోలేకపోయాడని మాజీ కౌన్సిలర్ బోల్గం నాగరాజుగౌడ్ విన్నవించాడు. అంతేకాకుండా
ముందు సిరిసిల్లలో ఉన్న 82 బూతుల్లో, నేను బాధ్యత వహించిన 3 బూతుల్లో 80% కంటే ఎక్కువ ఓట్లు బీజేపీ కీ వేసి, మీకు అత్యధిక మెజార్టీ అందించాము. మీరు గెలవడానికి మా వార్డ్ ప్రజలు తమ వంతు బాధ్యతను నెరవేర్చారు.కానీ మీరు
గెలిచిన తర్వాత రెండుసంవత్సరాలు
గడిచిపోయినా, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే చిత్తశుద్ధి కూడా చూపలేదు.హిందూ ధర్మం, హిందూ దేవతల పరిరక్షణ పేరుతో రాజకీయాలు చేసే మీరుఅదే హిందూ దేవత ఆలయ నిర్మాణానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారని , అది మీ వైఫల్యం కాదు అది మీ రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనం.మాటలు చెప్పడం సులువు…మాట నిలబెట్టుకోవడం,నాయకత్వం.ప్రజల ఓట్లతో గెలిచి, ప్రజల విశ్వాసాన్ని మర్చిపోవడం ప్రజాస్వామ్యానికి అవమానం దేవాలయం పేరుతో ఓట్లు తీసుకుని, దేవాలయం నిర్మాణాన్ని మర్చిపోవడం విశ్వాస గాతకం.కాబట్టి, మీరు ఇచ్చిన హామీ ప్రకారం ₹10 లక్షలను వెంటనే మంజూరు చేసి, పోచమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి సహకరించాలి.అని మాజీ చిన్నబోనాల కౌన్సిలర్ నాగరాజు గౌడ్ తెలిపారు అంతేకాకుండా చిన్న బోనాల గ్రామ ప్రజలు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు.

రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పెరుగుతున్న “డాక్యుమెంట్ రైటర్లు”..

రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పెరుగుతున్న “డాక్యుమెంట్ రైటర్లు”?

కాపీ–పేస్ట్ పొరపాట్లతో లక్షలు నష్టపోతున్న ప్రజలు..!

నేటిధాత్రి, వరంగల్.

 

 

 

నగరంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ, వారి పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “ఎవడు పడితే వాడు డాక్యుమెంట్ రైటర్ అవతారం ఎత్తుతున్నాడు” అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనుభవం, న్యాయపరమైన అవగాహన లేకుండానే కేవలం కాపీ–పేస్ట్ విధానంలో పత్రాలు తయారు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది జూనియర్ న్యాయవాదులు కూడా సీనియర్ న్యాయవాదులకు తెలియకుండా డాక్యుమెంట్ రైటర్లుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. అయితే పత్రాలు సక్రమంగా సిద్ధం చేస్తున్నారా అంటే అనుమానాలే ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల ఓ అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని మరుసటి రోజు గృహప్రవేశం నిర్వహించుకోవాలని భావించిన కుటుంబానికి భారీ షాక్ తగిలింది. డాక్యుమెంట్‌లో తీవ్రమైన తప్పిదం ఉండటంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పటికే రూ.3 లక్షల చలానా చెల్లించిన తర్వాత లోపం బయటపడటంతో కార్యాలయ సిబ్బంది సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.

చలానా డబ్బులు వృథా కావడంతో పాటు గృహప్రవేశం కూడా వాయిదా పడింది. “ఏమైంది సారు?” అని ప్రశ్నిస్తే “రేపు మాపు చూస్తాం” అంటూ ఫోన్ ద్వారా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

“ఎవరు చేసే పని వాళ్లే చేయాలి. చేయడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి” అని పలువురు అభిప్రాయపడుతున్నారు. సగం సగం తెలిసిన పరిజ్ఞానంతో కీలకమైన రిజిస్ట్రేషన్ పత్రాలు సిద్ధం చేయడం ప్రజలకు ప్రమాదకరమని న్యాయవర్గాలు సూచిస్తున్నాయి. సోషల్ మీడియాలో చురుకుగా మాట్లాడటం ఒకే కావొచ్చు కానీ, చట్టపరమైన పత్రాలు తయారు చేయడం అంత ఈజీ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్లపై పర్యవేక్షణ కఠినతరం చేయాలని, అనుభవం ఉన్నవారికే అనుమతి ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఇలాంటి తప్పిదాలు కొనసాగి మరింత మంది ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నేడు కోనాపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

నేడు కోనాపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

12వ వార్షిక కళ్యాణ మహోత్సవ జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన గ్రామ పెద్దలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో ఎంతో ప్రాచుర్యం పొందిన కోనాపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై నేడు శుక్రవారం 27 న కళ్యాణ మహోత్సవం జరగనుంది. కోనాపురం గ్రామంలోని గుట్టపై స్వయంభుగా వెలసిన శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవ జాతర ఉత్సవాలను గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ సంవత్సరం కూడా 12వ వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా 27 ఫిబ్రవరి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు గ్రామ అర్చకులు కసివొజ్జల శివకృష్ణచార్యులు వెల్లడించారు. గురువారం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ యువకుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవ జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.ఈ జాతర ఉత్సవాల్లో భాగంగా 27 ఫిబ్రవరి శుక్రవారం రోజు రాత్రి 8 గంటలకు స్వామివారి కళ్యాణం, 3 మార్చి మంగళవారం రోజున జాతర (ప్రభ బండ్లు), 7 మార్చి శనివారం రోజున స్వామి వారి రథోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. స్వయంభుగా వెలిసిన శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి, పాదాలు, పకృతి సాహసిద్ధంగా ఏర్పడిన కోనేరు మరెన్నో ప్రత్యేకలు కలిగిన ఈ దేవాలయాన్ని, జరగబోయే కళ్యాణ మహోత్సవాన్ని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం పొందాలని ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు కోరారు.

కోహిర్ నూతన మున్సిపల్ పాలకవర్గానికి సన్మానించిన TGIDC మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

కోహిర్ నూతన మున్సిపల్ పాలకవర్గానికి సన్మానించిన TGIDC మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన కోహిర్ మున్సిపల్ చైర్మన్ ఎం అశోక్ హనన్ జావిద్ వైస్ చైర్మన్ వారి బృందం ఈ సందర్భంగాలో వారికి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మొహమ్మద్ తన్వీర్ మాట్లాడుతూ కోహిర్ పట్టణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మౌలిక సదుపాయాల కల్పన లోను పట్టణ సుందరీకరణలో నూతన పాలకవర్గం ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాయకులు ముజఫర్ జమీల్ తదితరులు పాల్గొన్నారు,

పలు వార్డులల్లో పర్యటించిన మున్సిపల్ చైర్ పర్సన్…

పలు వార్డులల్లో పర్యటించిన మున్సిపల్ చైర్ పర్సన్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు, 30వ వార్డు, 6వ వార్డుల కౌన్సిలర్లు బాణాల ప్రసన్న-శ్రీనివాస్, మాదాసి రవి, పున్నం నరసింహారెడ్డి,వైస్ చైర్మన్ గంధం నరేందర్ లతో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ గురువారం పర్యటించారు.ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు 22వ వార్డు, 30వ వార్డు తోపాటు 6వ వార్డులో పర్యటించి వార్డుల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు.ఎండాకాలంలో నీటి కొరత రాకుండా అవసరమైన దగ్గర బోర్లు వేయించడం జరుగుతుందని, అసంపూర్తిగా ఉన్న మురుగునీటి కాలువలను నిర్మించి వార్డులలో ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.సీసీ రోడ్ల నిర్మాణాలు చేసి పారిశుధ్య సమస్య లేకుండా నిరంతరం వార్డులలో మున్సిపల్ కార్మిక సిబ్బందితో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు సంబంధించిన స్థలంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతోటి మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం త్వరలో చేయబట్టబోతున్నామని, అదేవిధంగా వార్డులకు అవసరమైన పనులను ముందుండి చేయించి వార్డుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, వార్డు ఆఫీసర్స్ చకిలం నాగరాజు, గుగులోతు శ్రీకాంత్, వేమా సూర్యనారాయణ, మున్సిపల్ జవాన్ డేగల కుమార్, బోడ మొగిలి, ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ గంట రామిరెడ్డి, వాటెన్ సెక్షన్ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్, వాటర్ లైన్మెన్ రంజిత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపెల్లి శ్రీనివాస్, కోల చరణ్, కోల వెంకటేశ్వర్లు, మైబు పాషా, కొప్పు అశోక్, పోతిరెడ్డి నరసింహారెడ్డి, గడ్డం శ్రీనివాస్, ధోని చేరాలు, కుచన రాజు, కొప్పు రాజు, పోగుల ప్రభుదాస్, బాణాల రమేష్, తాండ్ర అశోక్, మడికొండ రంజిత్, బోడ సునీల్, అనపర్తి సతీష్, గడ్డం ప్రవీణ్, అగరపు సారయ్య, తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ కి శుభాకాంక్షలుతెలిపిన జేఏసీ నాయకులు.

జహీరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ కి శుభాకాంక్షలుతెలిపిన జేఏసీ నాయకులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా (జహీరాబాద్ నియోజకవర్గ ము) జహీరాబాద్ మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన చైర్మన్ మొహమ్మద్ యునుస్ కి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ తాలూకా బీసీ జేఏసీ ఛైర్మన్ మరియు నాయకులు.ప్రజలు మీ నాయకత్వంపై ఉంచిన విశ్వాసానికి ఈ విజయమే నిదర్శనం అన్నారు. మీ మార్గదర్శకత్వంలో జహీరాబాద్ పట్టణం మరింత అభివృద్ధి చెందాలని, మౌలిక వసతులను మెరుగుపర్చుతూ, ఎన్నో అభివృద్ధి ,సంక్షేమ పథకాలతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాము అన్నారు. విజయవంతంగా , పారదర్శకతతో, నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాము.మీ భవిష్యత్తు కార్యాచరణను మరింత నిబద్దతో ముందుకు సాగాలన్నారు.ఈ కార్యక్రమంలో బేసి జేఏసీ జహీరాబాద్ చైర్మన్ డా.పెద్దగొల్ల నారాయణ. అధ్యక్షుడు కొండపురం నర్సిములు,ఉపాధ్యక్షులు శంకర్ సాగర్ ,మైనారిటీ యూత్ లీడర్ మొహమ్మద్ ఇమ్రాన్, భుడగజంగం యువ నాయకులు మాదినం శివ ప్రసాద్, వడ్డెర సంఘం యువ నాయకులు శేఖర్, జయ విజ్ఞాన భారతి సొసైటీ డైరెక్టర్లు బాలక్రిష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.

నిరుపేదలకు ఇల్లు మంజూరు…

నిరుపేదలకు ఇల్లు మంజూరు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తి మున్సిపాలిటీలోని 3,12వార్డులలో శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారం తో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ రత్నమాల ఆనంద్ కుమార్ పూజ చేశారు.ఈ సందర్బంగా బృంగి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో కల్వకుర్తి మున్సిపాలిటీలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు మంజూరు చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి, కుడుముల చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు లాలు నాయక్, రాజేష్,క్రాంతి,కార్తీక్ వార్డు ఆఫీసర్ శివ తదితరులు ఉన్నారు.

వనపర్తి లో శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత…

వనపర్తి లో శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత

ఉచిత క్యాన్సర్ వ్యాధి శిబిరం

వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీ సత్య సాయి సేవ సంస్థ ఆధ్వర్యంలో గురువారం నాడు హైదరాబాద్ ఎం ఎన్ జె క్యాన్సర్ హాస్పిటల్ కో ఆర్డినేటర్ సి ఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వ్యాధి క్యాంపు నిర్వహించామని శ్రీ సత్య సాయి సేవ సంస్థ జిల్లా అధ్యక్షులు నరహరి పుల్లయ్య జర్నలిస్ట్ సంస్థ కన్వీనర్ రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క పేషెంట్ కు దాదాపు 7000 రూపాయలు టెస్టులు ఉచితంగా నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు . డాక్టర్ సుష్మ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు దాదాపు 150 మంది వరకు పేషెంట్లు వచ్చారని వారు తెలిపారు పేషెంట్లకు క్యాన్సర్ అని నిర్ధారణ తెలిస్తే అవసరం ఉంటే పేషెంట్ల ను ఉచితంగా హైదరాబాద్ ఎం ఎన్ జె క్యాన్సర్ హాస్పిటల్ కు డాక్టర్ రెఫర్ చేస్తున్నామని వారు తెలిపారు . అక్కడ పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని వారు పేర్కొన్నారు ప్రతి గురువారం శ్రీ సత్య సాయి సేవ సంస్థ మందిరంలో హోమియోపతి డాక్టర్ చే ప్రజలకు ఉచితంగా పరీక్షించి ఉచిత హోమియోపతి మందులు పంపిణీ చేస్తున్నామని వారు పేర్కొన్నారు విశ్వ జ్యోతి రాష్ట్ర కోఆర్డినేటర్ రామకృష్ణ శ్రీ సత్య సాయి మెడికల్ కోఆర్డినేటర్ భాస్కర్ రావు శ్రీ సత్య సాయి సేవాదళ్ పాండురంగయ్య కోఆర్డినేటర్ శ్రీరామ్ రెడ్డి శ్రీ సత్య సాయి సేవ దళ్ భక్తులు పేషెంట్లకు సహకరిస్తున్నారు ఈ మేరకు పేషెంట్లు శ్రీ సత్యసాయి సేవా సంస్థకు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్….

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

భూపాలపల్లి నేటిధాత్రి

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు తీరును సమగ్రంగా పరిశీలించారు. వంటగది పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానం, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను స్వయంగా తనిఖీ చేసి, అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. పోషకాహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. వంట సిబ్బంది పరిశుభ్రతను పాటించడంతో పాటు, ఆహార పదార్థాలు తాజావిగా ఉండేలా చూడాలని, గడువు ముగిసిన పదార్థాలను వినియోగించొద్దని ఆదేశించారు. భోజనం బావుంది ప్రతి రోజు ఇలానే చేయాలని వంట సిబ్బందిని అభినందించారు..
పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పోషకాహారం అందించడంతో పాటు, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తరచుగా పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేలా సమతుల ఆహారం అందించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని,
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని, విద్యార్థులు మంచి అలవాట్లు అలవరచుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.
అనంతరం హాస్టల్ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, భద్రతా పరమైన చర్యలపై దృష్టి సారించాలని, సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు, ప్రహరీ గోడ పైభాగంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, పాఠశాల ప్రిన్సిపాల్ జీవరత్నం, పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ఇంటర్ వార్షిక పరీక్షలు…

ప్రశాంతంగా ఇంటర్ వార్షిక పరీక్షలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్ కల్,ఇంటర్ వార్షిక పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా కొనసాగాయి. న్యాల్ కల్, హద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగాయి. పరీక్షల పర్యవేక్షణాధికారులు వెంకన్న, యాదగిరిల పర్యవేక్షణ, ఎస్సై సుజిత్, పోలీస్ బృందం గట్టి భద్రతల మధ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. తొలిరోజు 586 విద్యార్థునులకు గాను 565 గురు విద్యార్థునులు హాజరవ్వగా 21 గురు విద్యార్థునులు పరీక్షలకు గైర్హాజరయ్యారని

error: Content is protected !!
Exit mobile version