వనపర్తలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవాలి…

వనపర్తలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి జిల్లా కేంద్రంలో పాత మార్కెట్ యార్డ్ గణపతి దేవాలయం దగ్గర ఇంటి గ్రేటడ్ మార్కెట్ లో ప్రభుత్వం నిర్మించిన దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఒక ప్రకటన లో కోరారు
సూపర్ మార్కెట్ బ్యాంక్వెట్ హాల్‌ లను, లాటరీ పద్ధతి ద్వారా కేటాయించనున్నట్లు కలెక్టర్ తెలిపారు లాటరీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పరిపాలన అధికారులు చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారుగ్రౌండ్ ఫ్లోర్‌లో మొత్తం 32 షాపులు అందుబాటులో ఉన్నాయని, బ్యాంక్, సూపర్ మార్కెట్‌ ఫస్ట్ ఫ్లోర్‌లో బ్యాంక్వెట్ హాల్ కూడా లాటరి ద్వారా కేటాయింపు ఉంటుందని కలెక్టర్ తెలిపారు.దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు 18-04-2026 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు ఫారం పొందడానికి ఫీజు .2,500 రూపాయలు నిర్ణయించబడిందిదరఖాస్తు ఫారం పొంది అప్లై చేసుకునేవారు దరఖాస్తు ఫారం తో పాటు డీ డీ ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు దుకాణాలకు రూ.15,000/-గా ఉండగా, బ్యాంక్వెట్ హాల్‌కు ఈఎండీ రూ.50,000/ బ్యాంక్ సూపర్ మార్కెట్‌కు ఈఎండీ రూ.25,000-గా నిర్ణయించబడిందని కలెక్టర్ తెలిపారు లాటరీ 21-04-2026 ఉదయం 11.00 గంటలకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రాంగణంలో నిర్వహించబడుతుందని ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
డిమాండ్ డ్రాఫ్ట్ సెక్రటరీ ఏ ఎం సి వనపర్తి పేరున తీసుకుని రావాలని కోరారు. షాపుల కేటాయింపు 32 షాపులలో జనరల్ కేటగిరి 16షాపులు, బి.సి కేటగిరి 08షాపులు, యస్.సి.కేటగిరి 05 షాపులు, యస్.టి కేటగిరి 02షాపు, మరియు పి.హెచ్.సీ కేటగిరి 1 మొత్తం 32 షాపులు కలవు లాటరీ పద్ధతి ద్వారాఉంటుందని కేటాయింపులో నిబంధనలు షరతుల ఇతర వివరముల కొరకు కార్యాలయపు పనివేలలో నేరుగా కాని లేదా సెల్ నెంబర్లు 7330733292 7893633678 ఫోన్ చేసి తెలిసుకొవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

దళిత పథకాల ఆలస్యంపై విమర్శలు…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయ హస్తం పథకం అమలు చేయని ప్రభుత్వం కేటీఆర్ యువసేన మండల అధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్

మొగుళ్లపల్లి నేటి ధాత్రి

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కేటీఆర్ యువసేన మండల అధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు అంబేద్కర్ అభయ హస్తం పథకం కింద 12 లక్షలు ఇస్తామంటూ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం చేసి గద్దెనెక్కి రెండున్నర ఏండ్లు గడిచిన ఆ పథకాన్ని అమలు చేయకుండా దళితులను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వమని హా మీలను నెరవేర్చకపోవడంపై దళిత సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది ముఖ్యంగా ఉద్యోగ భృతి మహిళలకు 2500 వంటి పథకాలు అమలు కూడా ప్రశ్నార్థకంగా మారాయని అన్నారు దళిత బంధు యూనిట్లను వెంటనే విడుదల చేయాలని గత ప్రభుత్వం లో మంజూరైన దళిత బంధు నిలిచిపోయిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు తక్షణ నిధులు విడుదల చేయాలని కలెక్టర్ ఖాతాలో నిలిచిపోయిన దళిత బంధు నిధులను వెంటనే లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని దళిత బంధు ఖాతాలపై ఉన్న ఫీజింగ్ ను తొలగించి యూనిట్ల గ్రేడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు

అక్షర స్కూల్ లో జేరిగిన సంఘటనపై జిల్లా మంత్రి ఎమ్మెల్యే స్పందించ లేదు

అక్షర స్కూల్ లో జేరిగిన సంఘటనపై జిల్లా మంత్రి ఎమ్మెల్యే స్పందించ లేదు

రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతీయాజ్ ఇసాక్

వనపర్తి నేటిదాత్రి .

 

అక్షర స్కూల్ జరిగిన పై అధికార పార్టీ మాజీ కౌన్సిలర్ బేర సారాలు కుదరక పోవడంతో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలేదని తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా స్కూల్ లో జేరిగిన సంఘటన గురించి ఎమ్మెల్యే రెస్పాన్స్ కాలేదని స్కూల్ యజమాన్యాన్ని కాపాడడానికి ఎమ్మెల్యే టిఆర్ఎస్ నేతలపై స్కూల్ యాజమాన్యంతో ఫిర్యాదు చేయించారని చెప్పారు ఇంత సంఘటన జరిగితే కూడా పోలీస్ అధికారులు కనీసం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి జరిగిన సంఘటన గురించి విలేకరులకు తెలుపలేదని ఆవేదన వ్యక్తం చేశారు మైనారిటీ ప్రజల ఓట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ముస్లిం మైనారిటీలు హిందువుల పండుగలు కలిసి ఐకమత్యంగా జరుపుకుంటారని అన్నారు నాలుగు రోజుల తర్వాత అక్షర స్కూల్లో జరిగిన సంఘటన బయటకు వచ్చిందని అన్నారు వనపర్తి లో రాజకీయాలకతీతంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు సంఘాలు ఐక్యతతో అక్షర స్కూల్ అనుమతులు రద్దు చేయించాలని పిలుపునిచ్చారు అక్షర స్కూల్ సంఘటనపై జిల్లా మంత్రి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి స్పందించలేదని కనీసం జరిగిన సంఘటనపై కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయలేదని అన్నారు అక్షర స్కూల్ రిజిస్ట్రేషన్ పర్మిషన్ రద్దు చేయుటకు విద్యాశాఖ ఉన్నతాధికారులకు హైదరాబాదులో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి టిఆర్ఎస్ నేతల మైనారిటీల సహకారంతో ఫిర్యాదు చేస్తామని చెప్పారు ఇటువంటి స్కూల్లో తమ పిల్లలను అడ్మిషన్లు చేయవద్దని వనపర్తి ప్రజలను కోరారు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో మైనారిటీలకు 102 గల్స్ కళాశాలలో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు అక్షర స్కూల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయుటకు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి విద్యాశాఖ అధికారులకు లెటర్ రాయాలని ఆయన డిమాండ్ చేశారు వనపర్తి నియోజకవర్గం లో ప్రజల ఓట్లతో ఎమ్మెల్యే గెలిచారని పదవులు శాశ్వతం కాద విలువలు ముఖ్యమని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో జిల్లా టిఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మైనారిటీ నేతలు అమర్ రహిమాన్ జోహెబ్ హుస్సేన్ సయ్యద్ జెమీల్ ఇమ్రాన్ వాజీద్ ఇంతీయా
జ్ పేపర్ బాయ్ షేక్ బిక్కన్ బీ ఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు

సిరిసిల్ల చిన్న బోనాలకు బాకీ ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్…

సిరిసిల్ల చిన్న బోనాలకు బాకీ ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పదవ10వ వార్డ్ చిన్న బోనాల లోని గ్రామ దేవత శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి పది లక్షలు ఇస్తాను అని, స్వయంగా నాతో, మా ప్రజలకు చెప్పమని మాట ఇచ్చారు. ఆ మాటను నమ్మి, మా ప్రజలు మీకు అఖండ మద్దతూ ఇచ్చారు లాస్ట్ టైం ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లలో చిన్న బోనాలకు మాటిచ్చాడని ఇప్పటివరకు ఆ మాటను నిలబెట్టుకోలేకపోయాడని మాజీ కౌన్సిలర్ బోల్గం నాగరాజుగౌడ్ విన్నవించాడు. అంతేకాకుండా
ముందు సిరిసిల్లలో ఉన్న 82 బూతుల్లో, నేను బాధ్యత వహించిన 3 బూతుల్లో 80% కంటే ఎక్కువ ఓట్లు బీజేపీ కీ వేసి, మీకు అత్యధిక మెజార్టీ అందించాము. మీరు గెలవడానికి మా వార్డ్ ప్రజలు తమ వంతు బాధ్యతను నెరవేర్చారు.కానీ మీరు
గెలిచిన తర్వాత రెండుసంవత్సరాలు
గడిచిపోయినా, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే చిత్తశుద్ధి కూడా చూపలేదు.హిందూ ధర్మం, హిందూ దేవతల పరిరక్షణ పేరుతో రాజకీయాలు చేసే మీరుఅదే హిందూ దేవత ఆలయ నిర్మాణానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారని , అది మీ వైఫల్యం కాదు అది మీ రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనం.మాటలు చెప్పడం సులువు…మాట నిలబెట్టుకోవడం,నాయకత్వం.ప్రజల ఓట్లతో గెలిచి, ప్రజల విశ్వాసాన్ని మర్చిపోవడం ప్రజాస్వామ్యానికి అవమానం దేవాలయం పేరుతో ఓట్లు తీసుకుని, దేవాలయం నిర్మాణాన్ని మర్చిపోవడం విశ్వాస గాతకం.కాబట్టి, మీరు ఇచ్చిన హామీ ప్రకారం ₹10 లక్షలను వెంటనే మంజూరు చేసి, పోచమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి సహకరించాలి.అని మాజీ చిన్నబోనాల కౌన్సిలర్ నాగరాజు గౌడ్ తెలిపారు అంతేకాకుండా చిన్న బోనాల గ్రామ ప్రజలు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version