నేడు కోనాపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

నేడు కోనాపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

12వ వార్షిక కళ్యాణ మహోత్సవ జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన గ్రామ పెద్దలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో ఎంతో ప్రాచుర్యం పొందిన కోనాపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై నేడు శుక్రవారం 27 న కళ్యాణ మహోత్సవం జరగనుంది. కోనాపురం గ్రామంలోని గుట్టపై స్వయంభుగా వెలసిన శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవ జాతర ఉత్సవాలను గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ సంవత్సరం కూడా 12వ వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా 27 ఫిబ్రవరి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు గ్రామ అర్చకులు కసివొజ్జల శివకృష్ణచార్యులు వెల్లడించారు. గురువారం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ యువకుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవ జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.ఈ జాతర ఉత్సవాల్లో భాగంగా 27 ఫిబ్రవరి శుక్రవారం రోజు రాత్రి 8 గంటలకు స్వామివారి కళ్యాణం, 3 మార్చి మంగళవారం రోజున జాతర (ప్రభ బండ్లు), 7 మార్చి శనివారం రోజున స్వామి వారి రథోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. స్వయంభుగా వెలిసిన శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి, పాదాలు, పకృతి సాహసిద్ధంగా ఏర్పడిన కోనేరు మరెన్నో ప్రత్యేకలు కలిగిన ఈ దేవాలయాన్ని, జరగబోయే కళ్యాణ మహోత్సవాన్ని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం పొందాలని ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version