ఇఫ్తార్ విందులో పాల్గొన్న నాయకులు….

ఇఫ్తార్ విందులో పాల్గొన్న నాయకులు….

◆-: మాజీ ఎంపీటీసీ హఫీజ్ నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీనియర్ నాయకుడు

జహీరాబాద్ నేటి ధాత్రి:

చీలేపల్లి మాజీ ఎంపీటీసీ హఫీజ్ నిర్వహించిన ఇఫ్తార్ విందులో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షెట్కార్, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ హనుమంతరావు పాటిల్, ఉజ్వల్ రెడ్డితో పాటు వివిధ మండల పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్ లు, గ్రామ అధ్యక్షులు, నాయకులు మరియు పత్రికా మిత్రులు పాల్గొన్నారు. 
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఖజూర్ పండును తినిపిస్తూ ఇఫ్తార్ విరమించారు. ఈ సందర్భంగా

జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షెట్కార్,మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.మత సామరస్యాన్ని కాపాడుతూ అందరం కలిసి ముందుకు సాగితేనే సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు.అల్లా దయ అన్ని వర్గాల ప్రజలపై ఉండాలని,రాష్ట్ర ప్రజలు మరియు జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల ప్రజలు సుఖసంతోషాలతో,సుభిక్షంగా ఉండాలని
వరితో ప్రార్థనలలో పాల్గొని, ముస్లిం సోదరులతో కలిసి ప్రేమ విందులో ప్రార్థించారు పాల్గొన్నారు.

మాజీ మంత్రి హరీష్ రావు ను ఖురాన్ తెలుగు అనువాద ప్రతిని అందజేసిన నాజిముద్దీన్ ఘోరీ…

మాజీ మంత్రి హరీష్ రావు ను ఖురాన్ తెలుగు అనువాద ప్రతిని అందజేసిన నాజిముద్దీన్ ఘోరీ,

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ ప్రాంతానికి చెందిన జమాతే ఇస్లామీ జిల్లా నాజిమ్, ముహమ్మద్ నాజిముద్దీన్ ఘోరీ,జహీరాబాద్‌లోని ‘ఘోరీ ప్యాలెస్’లో బి. ఆర్. ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి హరీష్ రావుకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు ఖురాన్ తెలుగు అనువాద ప్రతిని అందజేశారు. ఖురాన్ ప్రతిని స్వీకరిస్తూ హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు; దేశంలో ఇటువంటి ఇఫ్తార్ విందులు ఎంతో అవసరమని పేర్కొంటూ, ప్రపంచంలో శాంతి భద్రతలు నెలకొనేలా ముస్లిం ఉమ్మత్ (ముస్లిం సమాజం) ప్రార్థించాలని ఆకాంక్షించారు.

కోటంచ నరసింహస్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర…

కోటంచ నరసింహస్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

రేగొండ మండలం,కొడవటంచ్చ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అడిషనల్ కలెక్టర్ కుమారుడు అభినవ్ ప్రణవి వివాహ వేడుకలలోమాజీ చీఫ్ విప్ రావుల..

అడిషనల్ కలెక్టర్ కుమారుడు అభినవ్ ప్రణవి వివాహ వేడుకలలోమాజీ చీఫ్ విప్ రావుల
వనపర్తి నేటిదాత్రి .

 

అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ కుమారుడు అభినవ్ వివాహం డాక్టర్ ప్రణవి ఎస్.పి.ఆర్ శ్రీరస్తు కన్విక్షన్ హైదరాబాద్ జెరిగిన వివాహ వేడుకలలో మాజీ చీఫ్ విప్ రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారని జిల్లా బీ ఆర్ ఎస్ మీడియా సెల్ ఇంచార్జి నందిమల్ల అశోక్ ఒక ప్రకటన లో తెలిపారు
వివాహా వేడుకలలో , వనపర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ పలస రమేష్ గౌడ్ , మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ కౌన్సిలర్ తిరుమల్ నాయుడు, రంగాపురం కృష్ణారెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారని అశోక్ తెలిపారు .

అసెంబ్లీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలలో కలెక్టర్ చైర్మన్..

అసెంబ్లీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలలో కలెక్టర్ చైర్మన్

వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ దివంగత శ్రీపాదరావు జయంతి వేడుకలలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మున్సిపల్ చైర్మన్ మీడిదొడ్డి మాదవి జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
ప్రజల సమస్యలపై పోరాడిన వ్యక్తి అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావుఅని అన్నారు
కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి న వారిలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ మున్సిపల్ చైర్మన్ మీడీదొడ్డి మాదవి రమేష్ జిల్లా అధికారులు ఉన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ యాదయ్య,, క్రీడలు యువజన శాఖ అధికారి సుధీర్ రెడ్డి ఏ ఓ భాను ప్రకాష్, డిపిఆర్ఓ సీతారాం, అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

వివాహ వేడుకల్లో పాల్గొన్న టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్…

వివాహ వేడుకల్లో పాల్గొన్న టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ
ఝరాసంగం గ్రామ వాసవి కళ్యాణ మండపంలో రాచన్న స్వామి అన్న కూతురి వివాహ వేడుకలు పాల్గొని నూతన వధూవరులకు అక్షంతలు వేసి వివాహ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్ శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో బీడెక్నే సర్పంచ్ రవి ఆజ్ బాబా బిజీ సందీప్ మొహమ్మద్ మోహిన్ పాండు సంగమేష్ సద్దాం తదితరులు ఉన్నారు,

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది..

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండలంలోని నారక్క పేట, గుండ్లపాడు గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల వివాహాది కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మాజీ వైస్ ఎంపీపీ గందె శ్రీలత శ్రీనివాస్ గుప్తా, సర్పంచ్ దండేమ్ సంపత్, ఉప సర్పంచ్ సూరబోయిన రాంబాబు, మాజీ ఎంపిటిసిలు, సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుక లో పాల్గొన్న TGIDC మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్..

వివాహ వేడుక లో పాల్గొన్న TGIDC మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని ఎస్వి కన్వెన్షన్ హాల్లో హద్దునూర్ మాజీ సర్పంచ్ రాజ్ కుమార్ గారి అన్న కూతురి వివాహ శుభకార్యంలో పాల్గొని నూతన వధూవరులకు అక్షింతలు వేసి వివాహ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్ వారితోపాటు ఈ కార్యక్రమంలో హద్నూర్ సర్పంచ్ ప్రవీణ్ బిజీ సందీప్ బాల్ రెడ్డి రామ్ రెడ్డి రమేష్ రావు విక్కీ యాదవ్ తదితరులు ఉన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version