ఆలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జిఎస్సార్..

ఆలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జిఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల మండలం కేంద్రంలో భక్తుల ఆధ్యాత్మిక ఆకాంక్షలను నెరవేర్చే దిశగా శ్రీ శివ రామాంజనేయ స్వామి నూతన ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆలయ నిర్మాణం గ్రామ ప్రజల ఐక్యతకు, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఆలయానికి 30 లక్షల రూపాయల నిధులు మంజూరి చేయిస్తానని హమీ ఇచ్చారు.దేవాలయ అభివృద్ధికి తాము సంపూర్ణ సహకారం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీరామాంజనేయ ఆలయం భూమి పూజ…

శ్రీరామాంజనేయ ఆలయం భూమి పూజ

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి

టేకుమట్ల మండల కేంద్రంలో నిర్మించబడనున్న శ్రీరామాంజనేయ ఆలయం ఆలయ భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి హాజరై వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య భూమి పూజలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కీర్తీ రెడ్డి మాట్లాడుతూ దేవాలయాలు కేవలం ఆరాధన స్థలాలు మాత్రమే కాకుండా మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలని తెలిపారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆలయాలు కేంద్ర బిందువులుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఆలయ నిర్మాణానికి గ్రామ ప్రజలు అందిస్తున్న సహకారం అభినందనీయం అని, త్వరలోనే నిర్మాణ పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చదువు రామచంద్ర రెడ్డి మండల అధ్యక్షులు గుర్రపు నాగరాజు గౌడ్
మాజీ మండల అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ జిల్లా కోరసురేందర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి బండారి సమ్మయ్య సుబ్బక్కపల్లె సర్పంచ్ బొడ్డు రాజేందర్ చాటకూల్ల తిరుపతి మేకల వీరారెడ్డి పంజాల కుమార్ శ్రీపతి శివ నూనెటి అరుణ్ కుమార్ బండపల్లి ఉపసర్పంచ్ ఆర్ అశోక్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించిన వేముల మహేందర్ గౌడ్ దంపతులు

*ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న వేముల మహేందర్ గౌడ్ దంపతులు*

మొగులపల్లి నేటి ధాత్రి

హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు వేముల మహేందర్ గౌడ్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఆ దంపతులు స్వామివారికి మొక్కులను సమర్పించారు. అనంతరం స్వామివారి సేవలో పరితపించారు. అనంతరం వేముల మహేందర్ గౌడ్ దంపతులు మాట్లాడారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతూ..భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్న అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖమ్మ రాష్ట్రంలోని దేవాలయాలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడం..ప్రజలలో ఆధ్యాత్మికతను పెంపొందించడం, రాష్ట్రంలో ప్రజలంతా భక్తి మార్గంలో నడిచేలా చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఆ మల్లికార్జున స్వామి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ, సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో, పాడి పంటలతో కలకాలం వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.

కొడవటంచ ఆలయ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

కొడవటంచ ఆలయ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

రేగొండ మండలం
కొడవటంచ ఆలయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని వివిధ శాఖల అధికారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశించారు బుధవారం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేకి స్వామి వారి తీర్థప్రసాదాలను ఆలయ అర్చకులు అందజేశారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఆలయంలో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని గుత్తేదారులకు సూచించారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించినట్లు పేర్కొన్న ఎమ్మెల్యే, ఈ ఆలయం గ్రామ ప్రజల ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందాలన్నారు. పనుల్లో జాప్యం లేకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పునః ప్రతిష్టాపన మహోత్సవంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version