సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా పూర్తి బాధ్యతలు చేపట్టిన గరిమా అగర్వాల్
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)
రాజన్న సిరిసిల్ల జిల్లాకు పూర్తిస్థాయి జిల్లా కలెక్టర్‌గా 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి గరీమా అగ్రవాల్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గరీమా అగ్రవాల్ ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌గా (స్థానిక సంస్థలు) విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్‌గా కూడా అదనపు బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించారు.ఇన్ఛార్జ్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో జిల్లాలోని పరిపాలనా వ్యవస్థపై, ప్రజా సమస్యలపై ఆమె మంచి పట్టు సాధించారు.జిల్లా యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న ఆమె పనితీరును గుర్తించిన ప్రభుత్వం, ఆమెను పూర్తిస్థాయి కలెక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.గరీమా అగ్రవాల్ నియామకం పట్ల జిల్లా అధికారులు మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టడం ద్వారా జిల్లా అభివృద్ధి పనులు మరింత వేగవంతం కానున్నాయి.
