ఎండాకాలంలో సేఫ్టీ తప్పనిసరి- పరకాల అగ్నిమాపక అధికారి భద్రయ్య…

ఎండాకాలంలో సేఫ్టీ తప్పనిసరి- పరకాల అగ్నిమాపక అధికారి భద్రయ్య

పరకాల,నేటిధాత్రి

 

ప్రస్తుతం నెలకొంటున్న అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల ఫైర్ ఆఫీసర్ భద్రయ్య సూచించారు.ఎండాకాలంలో చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించడం అత్యవసరమని తెలిపారు.ఎండల కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు పెరుగుతున్నందున,పొలాల్లో లేదా నివాస ప్రాంతాల్లో మంటలు వేయడాన్ని నివారించాలని హెచ్చరించారు.అలాగే విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని గ్యాస్ సిలిండర్ల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.చిన్న తప్పిదాలు కూడా అగ్ని ప్రమాదాలకు కారణమవుతాయని అన్నారు.ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగిన పక్షంలో వెంటనే అత్యవసర సేవల నెంబర్ 8712699306 కు సమాచారం అందించాలని కోరారు.పరకాల పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలు ఈ సూచనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అగ్నిమాపక అధికారి భద్రయ్య తెలిపారు.

ఎండ తీవ్రత నుంచి రక్షణ జాగ్రత్తలు పాటించాలి…

ఎండ తీవ్రత నుంచి రక్షణ జాగ్రత్తలు పాటించాలి

నర్సంపేట సీఐ శ్రీనివాస్ సిబ్బందికి సూచనలు

పోలీస్ సిబ్బందికి చలువ కళ్లజోళ్లు, క్యాప్స్,టవల్స్ పంపిణీ

నర్సంపేట,నేటిధాత్రి:

విధి నిర్వహణలో వేసవికాలంలో ఎండ తీవ్రతకు జాగ్రత్త తీసుకోవాలని నర్సంపేట టౌన్ శ్రీనివాస్ పోలీస్ సిబ్బందికి సూచించారు.నర్సంపేట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేసవిలో బయట పెట్రోలింగ్ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి చలువ కళ్లజోళ్లు, క్యాప్స్, టవల్‌లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో భాగంగా పెట్రోలింగ్ చేసే సమయంలో ఎండ తీవ్రత వల్ల అస్వస్థతకు గురికాకుండా సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వేసవిలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.సిబ్బంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ సీఐకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు గూడా అరుణ్ కుమార్, రవికుమార్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మండుతున్న సూర్యులు….మండుతున్న ఎండలు…

మండుతున్న సూర్యులు….మండుతున్న ఎండలు…

◆-: ఫిబ్రవరిలోనే సుర్రుమంటున్న సూర్యుడు

◆-: 40 డిగ్రీలకు చేరువలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

◆-: రాత్రి పూటా పెరుగుతున్న టెంపరేచర్‌

◆-: అధికమవుతున్న కరెంట్‌ వినియోగం

◆-: వాతావరణ మార్పులతో వ్యాధులకు అవకాశం

◆-: జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభం కాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీల మేర ఎకువగా రికార్డవుతున్నాయి. తేమ శాతం తగ్గడంతో జనం ఉకపోతతో ఇబ్బంది పడుతున్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఈసారి అప్పుడే భానుడు విశ్వరూపం చూపుతున్నాడు. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు ఉకిరిబికిరి చేస్తున్నాయి. మధ్యాహ్నం వేళల్లో భగభగ మండుతున్న ఎండని చూసి ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. ఫిబ్రవరిలోనే ఎండలో ఇలా ఉంటే వచ్చే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేటలో 37 డిగ్రీలు, ఆలేరులో 36.9, బీబీనగర్‌, రామన్నపేటలో 36.6 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37.8 డిగ్రీలకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటి వరకు 20 రోజుల్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. గతేడాది ఫిబ్రవరిలో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే రికార్డ్‌ అయ్యాయి. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. మండే ఎండలకు తోడు గాలిలో తేమ శాతం కూడా పడిపోతున్నది.

మొదలైన ఏసీలు, కూలర్ల వాడకం

జిల్లాలో కరెంట్‌కు డిమాండ్‌ పెరిగిపోయింది. ఎండలు విపరీతంగా కొడుతుండటంతో విరివిగా విద్యుత్‌ను ఉపయోగిస్తున్నారు. గత నెలలో రోజుకు 8 మిలియన్‌ యూనిట్ల కరెంట్‌ వాడగా, ఇటీవల 9 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. ఎండలు, ఉకపోత ధాటికి తాళలేక ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తున్నారు. ఈ నెలాఖరులో 10 మిలియన్‌ యూనిట్లకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సీజనల్‌ వ్యాధులకు ఆసారం..

చలి కాలం పోయి, వేసవి వచ్చేస్తున్నది. దీంతోపాటు సీజనల్‌ వ్యాధులు కూడా దరి చేరే ప్రమాదం ఉంది. జ్వరం, జలుబు, అతిసారం, నీళ్ల వీరేచనాలు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో వచ్చే ఆటలమ్మ(చికెన్‌ పాక్స్‌), కామెర్లు వచ్చే ఆసారం ఉంది. గవద బిళ్లలు, టైఫాయిడ్‌ , పొంగు కూడా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ద్రవ పదార్థాలు తీసుకోవాలి..

ఎండలు ఎకువగా ఉండటంతో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆరు బయట పనిచేసే వారు సూర్యరశ్మి కాపాడుకునేలా జాగ్రత్త పడాలి. తరుచూ నీళ్లు తాగాలి. ఎకువగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు లాంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి. తెలుపు రంగు, లేత రంగులు పలుచని కాటన్‌ వస్త్రాలు ధరించాలి. తలకు వేడి తగలకుండా టోపీ పెట్టుకోవాలి. ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగితే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. చంటిపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు వడగాల్పులకు గురికాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వడదెబ్బకు గురైన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి. కాఫీలు, టీలు అధిక వేడి సమయంలో తీసుకోకూడదు.

పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి

చలి కాలం ముగుస్తున్నది. వేసవి సమీపిస్తున్నది. కాలం మారుతుండటంతో సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. నీరు ఎంత ఎకువ తీసుకుంటే అంత మంచిది. ఎండలో ఎకువగా తిరిగితే డయేరియా రావొచ్చు. చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. రానున్న రోజుల్లో వృద్ధులు వడదెబ్బకు గురికాకుండా చూసుకోవాలి.

– డాక్టర్‌ రమ్య ఝరాసంగం మండల వైద్యాధికారి

ఉపాధి కూలిలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిని :

ఉపాధి కూలిలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిని :

జహీరాబాద్ నేటి ధాత్రి:

కొల్లూరులో ఉపాధి కూలిలకు వైద్య సిబ్బంది మరియు గ్రామ పంచాయితీ పాలకవర్గం అధ్వర్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు మందులు పంపిని చెయ్యడం జరిగింది,ఎండలు తీవ్రత పెరుగుతున్న దృశ్యా ఉపాధి కూలిల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని వైద్య సిబ్బంది మరియు కొల్లూరు గ్రామ పాలకవర్గం అధ్వర్యం ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది మరియు అనారోగ్యం బారినపడకుండా తగు జాగ్రత్తలు వైద్య సిబ్బంధి తెలియచేయడము జరిగినది …ఈ కార్యక్రమములో గ్రామ పాలకవర్గం, వైద్య సిబ్బంధి మరియు గ్రామ పెద్దలు పాలుగొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version