· మార్చి 31 నాటికి మెట్రో ఫేజ్`1 స్వాధీనం
· మెట్రో రెండోదశ పనులకు కేంద్రానికి డీపీఆర్ సమర్పణ
· రూ.722 కోట్లతో మంజీరా నీటి సరఫరా పథకం ఆధునికీకరణ
· జీహెచఎంసీ పరిధిలో 300కి.మి. రోడ్లకు మరమ్మతులు
· మెట్రో విస్తరణ పనుల ఖర్చు చెరి సగం భరించనున్న కేంద్రం, రాష్ట్రం
· కోకాపేటలో నియోపోలిస్ రిజర్వాయర్
· హెచఎండీఏ పరిధి మరో నాలుగు గ్రామాలకు విస్తరణ
· మెట్రోను ఎయిర్‌పోర్టు, ఫ్యూచర్ సిటీ వరకు విస్తరణకు ప్రణాళికలు
హైదరాబాద్, నేటిధాత్రి:
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతత్వంలోని తెలంగాణ మంత్రివర్గం తాజాగా కొన్ని అభివద్ధి ప్రాజె క్టులను ఆమోదించింది. వీటిల్లో హైదరాబాద్ మెట్రో ఫేజ్`1 స్వాధీనంతో పాటు, ఫేజ్`2 పనులు వేగిరం చేయడం కూడా వుండటం విశేషం. ఈ సేకరణ ప్రక్రియకు సుమారు రూ.15వేల కోట్లు అవసరం కానుంది. ఇందులో కంపెనీ చెల్లించాల్సిన అప్పు కూడా వుంది. ఇవికాకుండా రూ.722 కోట్లు ఖర్చయ్యే మంజీరా నీటిసరఫరా పథకం ఆధునికీకరణ, రూ.282కోట్ల విలువైనఉస్మాన్సాగర్ పైప్లైన్ల అప్‌గ్రే డింగ్లతో పాటు జీహెచఎంసీ పరిధిలో 300 కిలోమీటర్ల రోడ్లను రూ.3145కోట్ల వ్యయంతో Âరెండోదశ సమగ్ర మరమ్మతు పనులు చేపట్టే ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
162.5 కిలోమీటర్ల పొడవున్న రెండోదశ మెట్రో పనుల విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్రం తుది అనుమతి కోసం ప్రభుత్వం సమర్పించింది. ఫేజ్‘2ఎ కింద 76.4 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ చేపడతారు. ఇందులో 36.6 కిలోమీటర్ల విమానాశ్రయ కనెక్టివిటీ (నాగోల్ నుంచి ఆర్జీఐఏ), పాతబస్తీని అనుసంధానించడంతో పాటు పటాన్చెరు, హయత్‌నగర్‌ల వరకు విస్తరణ ప్రతి పాదనలు కూడా ఇందులో వున్నాయి. ఫేజ్‘2బి కింద 86.1 కిలోమీటర్ల పొడవున్న ఫ్యూచర్‌సిటీ, షామీర్పేట్ విస్తరణ ప్రతిపాదనలు కూడా వున్నాయి. అంతేకాకుండా ఈ ఏడాది మార్చి 31 నాటికి ఎల్ అండ్ టి నుంచి పూర్తిగా మెట్రోను స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదనను కూడా మంత్రిమండలి ఆమోదించింది. మెట్రో విస్తరణ పనుల ఖర్చును 50:50 ని ష్పత్తి లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడతాయి. మంజీర ఫేజ్‘1,2 పథకాలను మరింత ఆధునికీకరించేందుకోసం రూ.722 కోట్లు మంజూరుకు కూడా కేబినెట్ ఓకే చెప్పింది. ప్రస్తుతం వున్న పైప్లైన్లు 1960 నుంచి 1980 మధ్యకాలంలో వేసినవి. ఉస్మాన్సాగర్నుంచి తాగునీటి సరఫ రా పైప్లైన్లను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం రూ.282కోట్లు కేటాయించింది. దీనివల్ల నీటి సరఫరాలో 30శాతం వర కు పంపిణీ నష్టాలను నివారించవచ్చు. ఇక మూసీనది పునరుద్ధరణ పథకం కింద మల్లన్నసాగర్ 2,3 దశల ఎత్తిపోతల పథకాలకోసం ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. దీనిద్వారా ముసీనది పునరుద్ధరణతో పాటు, జంటనగరాలకు తాగునీటిని సరఫరా చేయవ చ్చు. ఇక కోకాపేటలో నియోపోలిస్ రిజర్వాయర్ నిమిత్తం భూమిని ప్రభుత్వం కేటాయించింది.నియోపోలిస్ అభివద్ధికోసం ఈ రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. నగర పరిధిలో రోడ్ల విస్తరణ ప్రాజెక్టులకోసం రక్షణశాఖ నుంచి సేకరించనున్న 42 ఎకరాలకు ప్రతి గా 153 ఎకరాల భూమిని రక్షణ మంత్రిత్వశాఖకు బదలాయించడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటితో పాటు హెచఎండీఏ పరిధిని నాలుగు గ్రామాల పరిధికి విస్తరించనున్నారు. ఈ గ్రామాలు వరుసగా చిట్టిగూడ, యావ పూర్, టేకులపల్లి, ఎక్తల. కాగా జీహెచఎంసీ పరిధిలోని 300 కిలో మీటర్ల రోడ్ల అప్‌గ్రేడ్ మరియు నిర్వహణకోసం రూ.3145 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దే లక్ష్యంతో చేపట్టిన “తెలంగాణ రైజింగ్ `2047” విజన్‌లో భాగంగా ప్రభుత్వం ఈ మెట్రో, నీటి ప్రాజెక్టులకు అ త్యంత ప్రాధాన్యతనిచిచ్చింది. ఈ ప్రాజెక్టులకోసం పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి…రాష్ట్ర జీడీపీనిపెంచే రీతిలో పెట్టుబడులు పెద్దఎత్తున ఆకర్షించేందుకు ఉపయోగపడగలదన్నది ప్రభుత్వ ఉద్దే శం. ఈ మౌలిక సదుపాయాల విస్తరణ వల్ల 2026లో హైదరాబాద్ జీడీపీ 7% నుంచి 8% వరకు పెరిగే అవకాశమున్నదని అంచనా. నగరానికి నిరంతర కనెక్టివిటీ వుండటం వల్లనే, ఫా ర్చూన్ 500 కంపెనీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) హైదరాబాద్‌ను తమ పెట్టుబడు లకు ఎంచుకున్నాయి. ఇప్పటికే నగరంలో 355 జీసీసీలు పనిచేస్తుండటం గమనార్హం. నీరు, రోడ్డు ప్రాజెక్టుల ఆధునికీకరణ వల్ల, ఫార్మా సిటీ, ఐటీ కారిడార్ల నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గనుంది. ఆవిధంగా రాష్ట్రం గ్లోబల్ తయారీ హబ్‌గా రూపొందడానికి మార్గం సుగమమవుతుంది.
మెట్రో ఫేజ్`2 కారిడార్ల పనులు ప్రారంభానికి ముందే, ఈ ప్రాంతంలో ఆస్తుల విలువ 10% నుంచి 25% వరకు పెరగనున్నాయి. మెట్రోను ఫ్యూచర్‌సిటీ, ఎయిర్‌పోర్టుల వరకు విస్తరించ డం వల్ల నగర అభివద్ధి శంషాబాద్, మహేశ్వరం ప్రాంతాలకు విస్తరించగలదు. ఫలితంగా ప్ర స్తుతం నగరంపై పడుతున్న ఒత్తిడినుంచి ఉపశమనం లభించగలదు. అంతేకాదు మెట్రో విస్తరణ వల్ల రెసిడెన్షిల్ కాంప్లెక్స్‌ల కోసం 2026లో పదిశాతం డిమాండ్ పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంతేకాదు 5లక్షలమంది ప్రజలు ఇక మెట్రో ప్రయాణం చేయడం వల్ల, నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా, వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాల పరి మాణం కూడా గణనీయంగా తగ్గుముఖంపడుతుంది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు పాతబస్తీలో మెట్రో విస్తరణ కొనసాగించనుంది. నిజానికి ఈ విస్తరణకోసం 2025లోనే ప్ర త్యేక ఇంజినీరింగ్ నైపుణ్యతో ఈ ప్రాంతంలోని 103 వారసత్వ, మతపరమైన కట్టడాలకు ఎటువంటి నష్టం వాటిల్లని రీతిలో డిజైన్ తయారుచేశారు. ప్యూచర్ సిటీకి 40 కిలోమీటర్ల మేర విస్తరించే మెట్రో రైల్వే లైన్ నిర్మాణాన్ని 18 కిలోమీటర్ల మేర రోడ్డుపై చేపట్టనున్నారు. 300 అడుగల గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు పక్కనే దీని నిర్మాణం కొనసాగడం విశేషం. ఫ్యూచర్ సిటీనే, ముచ్చర్ల ఏఐ సిటీ అని కూడా వ్యవహరిస్తున్నారు. మొత్తం 30వేల ఎకరాల్లో పూర్తిగా కర్బన ఉద్గార రహితం గా దీన్ని నిర్మించనున్నారు. మెట్రో విస్తరణ వల్ల వేలాది మందికి ప్రత్యక్ష ఉద్యోగాల కల్పనతో పాటు మరో 5.6లక్షల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది. మెట్రో ఫేజ్‘2 నిర్మాణాన్ని దశýవారీ గా 2028 `30 మధ్యకాలం నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా పాతబస్తీకి విస్తరణ 2028 `29 నాటికి, ఎయిర్పోర్ట్ కారిడార్‌ను 2029 `30 నాటికి, రాయ్‌దుర్గ్ `కోకా పేట/మియాపూర్‘పటాన్చెరు మార్గాలను 2030 నాటికి, ఫ్యూచర్ సిటీ లింక్‌ను 2030 త ర్వాత కాలంలో పూర్తిచేయాలన్నది లక్ష్యం. ప్రభుత్వం తలపెట్టిన ఫ్యూచర్‌సిటీని పూర్తిగా కర్బన ఉద్గారాలు లేని స్వచ్ఛమైన రీతిలో అభివద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆవిధంగా దేశం లోనే మొట్టమొదటి గ్రీన్‌సిటీ ఏ ర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కేలా అడుగులుముందుకేస్తున్నది. ముఖ్యంగా ఇక్కడ 3600ల కనెక్టివి టీ సదుపాయం కల్పించనున్నది.
ప్రభుత్వం చేపట్టే గోదావరి తాగునీటి ప్రాజెక్టు ఫేజ్ 2,3 కింద మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమయత్సాగర్లకు నీటిని ఎత్తిపోస్తుంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.7వేల కోట్లు. దీని వల్ల జంటనగరాలకు, ఫ్యూచర్ సిటీకి 24/7 గంటలు తాగునీటి సరఫరా సాధ్యం కాగలదు. రూ.8వేల కోట్ల వ్యయంతో 140 కిలోమీటర్ల మేర రింగ్ మెయిన్ పైప్‌లైన్ నిర్మాణాన్ని ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ చేపట్టనున్నారు. కష్ణా, గోదావరి, మంజీర నదుల నీటి సరఫరాను ఇంటర్ కనెక్ట్ చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో నీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు. అంతేకా దు ఫ్యూచర్ సిటీలో స్పాంజ్ పార్క్‌ల నిర్మాణం చేపట్టడం ద్వారా వర్షపు నీటిని సహజంగా భూ మిలో ఇంకిపోయేలా చేస్తున్నారు. దీనివల్ల నీటి నిలిచి వుండటం వంటి సమస్యలు ఉత్పన్నం కావు. రోడ్లు, నీటి సదుపాయాలను భవిష్యత్తులో నిర్మించబోయే ఏఐ సిటీకి అనుగుణంగా ప్రభు త్వం ఏర్పాటు చేయనుంది. ఇక ఫ్యూచర్ సిటీకి సమీపంలో వుండే కొండాపూర్, మహేశ్వరం, తుక్కుగూడ, షాద్‌నగర్ ప్రాంతాలు గ్రోత్ హాట్స్పాట్లుగా అభివద్ధి చెందనున్నాయి. ఈ అభివద్ధి వల్ల రీజినల్ రింగ్‌రోడ్డు ప్రాంతంలో రాబోయే ఐదేళ్ల కాలంలో మౌలిక సదుపాయాల కల్పన బాగా విస్తరిస్తుంది కనుక భూముల విలువలు కూడా బాగా పెరుగుతాయని అంచనా. అంతేకాదు ఫ్యూచర్ సిటీ ప్రణాళిక కారణంగా 2026 మధ్య నాటికి 25వేల ఉద్యోగాల సష్టి జరుగు తుందని కూడా ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్, తయారీ రంగాల్లో ఉద్యో గావకాశాలు పెరుగనున్నాయి. ముంబయి హైవే (సదాశివపేట/జహీరాబాద్), శ్రీశైలం హైవే (ఫ్యూచర్ సిటీ) బెల్ట్‌లను దీర్ఘకాలంలో గ్రోత్ కారిడార్లుగా అభివద్ధి పరచనున్నారు.
