సిఎస్ఆర్ నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వెయిటింగ్ హాల్ ప్రారంభించిన..

సిఎస్ఆర్ నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వెయిటింగ్ హాల్ ప్రారంభించిన డెక్కన్ టోల్ వేస్ లిమిటెడ్

◆:- రీజినల్ హెడ్ వినీష్ కుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాలలోని జాతీయ రహదారి-65 మహారాష్ట్ర/కర్ణాటక సరిహద్దు నుండి సంగారెడ్డి వరకూ డెక్కన్ టోల్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ రాయితీదారుగా ఉంది ఇది సేకురా హైవేస్ లిమిటెడ్ యొక్క గ్రూప్ కంపెనీ ఈ గ్రూప్ తన సిఎస్ఆర్ చొరవల ద్వారా సానుకూల సామాజిక ప్రభావాన్ని చూపడానికి కట్టుబడి ఉంది
సోమవారం ఉదయం మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొత్తగా నిర్మించిన వెయిటింగ్ హాల్‌ను డెక్కన్ టోల్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ వినీష్ కుమార్ రీజినల్ హెడ్ ప్రాజెక్ట్ హెడ్ రాజేష్ విచారే డాక్టర్ సంధ్యా రాణి(మునిపల్లి మెడికల్ ఆఫీసర్)ఓపిడి నూతన గదులను ప్రారంభించారు
ఈ సందర్భంగా రీజినల్ హెడ్ వినీష్ కుమార్ మాట్లాడుతూ ఈ ఓపిడి వెయిటింగ్ హాల్ రోగి సంరక్షణ మరియు మొత్తం ఆసుపత్రి అనుభవాన్ని మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు అందరికీ అందుబాటులో ఉండే మరియు గౌరవప్రదమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము
కొత్తగా ప్రారంభించబడిన వెయిటింగ్ హాల్ ప్రతికూల వాతావరణంలో సంప్రదింపులు మరియు వైద్య సేవల కోసం ఎదురుచూసే వారికి మరింత సౌకర్యవంతమైన విశాలమైన మరియు రోగులకు అనుకూలమైన వాతావరణాన్ని అందించడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది
ఈ కార్యక్రమంలో డెక్కన్ టోల్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది మునిపల్లి మెడికల్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

వర్షాలు… బీ కేర్ ఫుల్….!

వర్షాలు… బీ కేర్ ఫుల్….!

◆:- ముంచుకొస్తున్న అంటువ్యాధుల ముప్పు,

◆:- దోమల, ఈగల వ్యాప్తిని అరికట్టాలి

◆:- పరిసర ప్రాంతాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.

◆:- మురికి నీరు నిల్వలేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

◆:- రోడ్డు పక్కన ఉండే తినుబండారాలతో అంటువ్యాధుల వ్యాప్తి

◆:- సంబంధితశాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలి.

◆:- ప్రజలకు అవగాహన. సూచనలు, సలహాలు ఇవ్వాలి

◆:- అంటువ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-28T113308.851.wav?_=1

జహీరాబాద్ నేటి ధాత్రి:

వర్షాకాలం వచ్చిందంటేనే అంటూ వ్యాధుల ప్రభావం అధికమవుతుంది. గత వారం రోజుల నుండి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు మరింత త్వరగా వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణ కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకొని సంబంధిత శాఖలు సమన్వయంతో ఆరోగ్య శాఖ అమలు చేస్తున్న కార్యచ రణ పై ప్రజలకు అవగాహన, సలహాలు, తగు సూచనలు ఇచ్చి అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకే అవకాశం అధికంగా ఉంటుంది. నిల్వ ఉండే నీరు, కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రత వల్ల దోమలు, ఈగలు, కీటకాలు, పందులు తదితర జంతువుల ద్వారా టైయిపాద్, కలరా, చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ, మెదడువాపు, విష జ్వరాలు, పైలేరియా, విరో చనాలు తదితర వంటి అంటూ వ్యాధులు వ్యాప్తిస్తాయి. అలాగే రోడ్డు పక్కన విక్రయించే చిరుతిండ్లు పానీపూ రితో అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది. అంతేకా కుండా బహిరంగ మల, మూత్ర విసర్జనతో అంటువ్యా ధులు సోకుతాయని అలాగే పదార్థాలు, ద్రవాలపై వాలిన కీటకాలతో వ్యాధులు త్వరగా వ్యాప్తిస్తాయి. ప్రధానంగా వ్యక్తిగత పరిసరాల అపరిశుభ్రత అంటు వ్యాధుల వ్యాప్తికి దోహదపడతాయి.వాతావరణంలో వస్తున్న మార్పులతో జనాలు విష జ్వరాలకు గురవుతున్నారు. ఉష్ణోగ్రతలో వస్తున్న మార్పులు ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపు తున్నాయి. దీనికి తోడు లోపించిన పారిశుధ్యం ప్రధాన కారణంగా మారింది. రోడ్లపైనే మురికి నీరు నిల్వ ఉండడంతో దోమలు, ఈగలు వృద్ధి చెందడం అంటు వ్యాధులు వ్యాప్తి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అదే విధంగా వైద్యశాఖ ముందు జాగ్రత్తలతో జ్వరాలను నియంత్రించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన చెందడంతో అవసరం ఎంతైనా ఉంది.

సీజనల్ వ్యాధులు,

గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో డ్రైనేజీ లలో పేరుకుపోయిన పూడికతతో రోడ్లపైనే మురికి నీరు నిలుస్తుంది. దీంతో దోమలు వ్యాప్తి చెంది ప్రజలు వైరల్ వ్యాధుల భారీనా పడే ప్రమాదం ఉంది. తలనొప్పి, గొంతు నొప్పి, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, విష జ్వరాలు, డెంగ్యూ, బోధకాలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

అధికారులు సమన్వయంతో పని చేయాలి.

గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాల ప్రభావంతో అంటువ్యాధులు సోకే అవ అవకాశం ఉన్నందున సంబంధిత శాఖ అధికారులు సమన్వ యంతో పనిచేసి అంటువ్యాధులు నివారణ అరికట్టేం దుకు పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకొని సంబంధిత శాఖల సమన్వయంతో సమీక్ష సమావేశం నిర్వహించి అంటువ్యాధుల నివారణకు తీసుకోవల సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంటూ వ్యాధులు సోకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రోగాలు వ్యాపించకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. కాచి వడబోసిన నీటిని తాగాలి. రోడ్డు పక్కన అమ్మే తినుబండారాలు తినకూడదు. వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించి పరిస రాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నీటి నిల్వ ఉండకుండా చూసుకొని ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఏదైనా వ్యాధి సోకిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్సలు చేయించుకోవాలి.

పరిశుభ్రతను పాటించాలి..

వర్షాకాలంలో చాలా రకాల వ్యాధులు పొంచి ఉంటాయి. ముఖ్యంగా పరిశుభ్రతను పాటించకపోవడం వలన ఈ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి. నివాస ప్రాంతాలను, పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఆహారం తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం, కాచి చల్లార్చిన నీటిని తాగడం, ఆహార పదార్థాలపై మూతలను ఎల్లప్పుడూ పెట్టి ఉంచడం వంటివి చేయాలి. బయటి ఆహార పదార్థాలను తినకపోవడం చాలా ఉత్తమం. ఆహార పదార్ధాలపై ఈగలు వాలకుండా, చూసుకోవడంతో పాటు వేడి పదార్ధాలను
మాత్రమే తినాలి. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. అస్వస్థకు గురైన వెంటనే సమీప వైద్యుడిని సంప్రదించాలి. వర్షాకాలంలో వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.

డాక్టర్ రమ్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఝరాసంగం.

చెత్తడబ్బాలో శిశువు మృతదేహం..

చెత్తడబ్బాలో శిశువు మృతదేహం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలోని క్యాంటీన్ ముందు చెత్తడబ్బాలో శిశువు మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. రెండు రోజుల క్రితం పుట్టిన మగ శిశువును శుక్రవారం రాత్రి ఇద్దరు మహిళలు చెత్త డబ్బాలో పడేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. శిశువు చనిపోయిన తర్వాత పడేశారా లేక బ్రతికుండగానే వదిలించుకున్నారా అనే కోణంలో జహీరాబాద్ పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అమర హాస్పిటల్ లో మెగా మెడికల్ చెకప్..

టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అమర హాస్పిటల్ లో మెగా మెడికల్ చెకప్

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 26:

ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్) సిబ్బందికి అమర హాస్పిటల్ లో శనివారం మెగా మెడికల్ చెకప్ ప్రారంభమయ్యింది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్త ఉత్తర్వులు మేరకు, టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు గారి పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ లోని పోలీసులు, అటవీ శాఖ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్ సిబ్బందికి పూర్తి స్థాయి మెడికల్ చెకప్ లు చేపట్టారు. శనివారం ప్రారంభమైన ఈ కార్యక్రమానికి టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ గౌరినేని రమాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారుఈ సందర్భంగా

ఎస్పీ పీ శ్రీనివాస్ మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి వార్షిక మెడికల్ చెకప్ చేయడానికి ఈ ఏడాది అమర హాస్పిటల్ ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది యావన్మందికి రెండు రోజులు పాటు మెడికల్ చెకప్ చేస్తున్నారని తెలిపారు. అమర ఎండీ రమాదేవి మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్ల తనకు ప్రత్యేక గౌరవం ఉందని అన్నారు. పుష్ప సినిమాలో ఉన్నది సినిమా హీరో అయితే, రియల్ హీరోలు టాస్క్ ఫోర్స్ సిబ్బందే నని కొనియాడారు. మున్ముందు అవసరమైన ఇతర చికిత్సలు కూడా అందజేస్తామని చెప్పారు. అమర చైర్మన్ డాక్టర్ గౌరినేని ప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యం గా ఉండటమే జీవితంలో నిజమైన విజయం సాధించడమని తెలిపారు. మెడికల్ చెకప్ లో భాగంగా రక్త పరీక్షలు, బీపీ, ఈసీజీ లాంటి టెస్ట్ లు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు జి. బాలిరెడ్డి. వీ. శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్, ఆర్ఐలు కృపానంద, సాయి గిరిధర్, సీఐ సురేష్ కుమార్, ఎస్ఐ రఫీ, ఇంకా ఆర్ఎస్ఐలు, ఇతర సిబ్బందితో పాటు హాస్పిటల్ జీఎం ఆనంద్, సీఈఓ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కుక్క,పాము,తేలు కాటు మందులను అందుబాటులో ఉంచాలి…

కుక్క,పాము,తేలు కాటు మందులను అందుబాటులో ఉంచాలి…

వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి…

వైద్యులు స్థానికంగా ఉండి వైద్యం అందించాలి…

సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహనా కల్పించాలి…

అన్ని రకాల రక్త పరీక్షలు పి హెచ్ సి లోనిర్వహించాలి…

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి…

నేటి ధాత్రి -గార్ల:-

కుక్క,పాము,తేలు కాటు మందులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని తద్వారా సకాలంలో వైద్యం సహాయం ప్రాణాలను కాపాడుతుందని ప్రగతిశీల యువజన సంఘం పివైయల్ రాష్ట్ర నాయకులు సిహెచ్ గణేష్ అన్నారు.ప్రభుత్వ వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలని,సీజనల్ వ్యాధులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ పివైఎల్ ఆధ్వర్యంలో శనివారం ముల్కనూర్ పిహెచ్ సి ఎదుట నిరసన తెలిపారు.అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వైద్యాధికారి డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ కు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు.వ్యవసాయ పనులు ముమ్మరంగా ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు విష సర్పాల ప్రమాదం పొంచి ఉన్నదని అందుకు అవసరమైన వ్యాక్సిన్ లను అందుబాటులో ఉంచాలని,దోమతెరలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో వైద్యుల సమక్షంలో హెల్త్ క్యాంపులు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేయాలని కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో పివైఎల్ మండల అధ్యక్ష,కార్యదర్శులు కూసిని బాబురావు, గుడిచుట్టూ శంకర్, కొండల్, రమేష్, కొండల్ రావు, మాన్య, సక్రు తదితరులు పాల్గొన్నారు.

ఆసుపత్రి ఆవరణలో రోగులపై కొండ ముచ్చుల దాడి..

ఆసుపత్రి ఆవరణలో రోగులపై కొండ ముచ్చుల దాడి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T123430.605.wav?_=2

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం మధ్యాహ్నం కొండ ముచ్చులు దాడి చేసి గాయపరిచినట్లు బాధితులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి, రోగులకు రక్షణ కల్పించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రిలో భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు.

గండ్ర పరామర్శ….

గండ్ర పరామర్శ….
.
* మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మొగుళ్ళపల్లి మండలం,పోతుగల్లు గ్రామ వాస్తవ్యులు మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు రేణుకుంట్ల మొగిలి బైపాస్ సర్జరీ ఆపరేషన్ చేయించుకొనిఇంటి వద్ద కోలుకుంటున్న వారిని. ఆప్యాయంగా పలకరించి ఆరోగ్యం బాగా చూసుకోవాలని తెలిపారు
* ఆకినపల్లి గ్రామ వాస్తవ్యులు చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బండి సుదర్శన్ గౌడ్ పెద్ద కుమారుడు కీ.శే బండి కిరణ్ మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిమనోధైర్యం కలిపించారు
వారి వెంట మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య మాజీ సర్పంచ్ నైనకంటి ప్రభాకర్ మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ లో భారీ వర్షం.

జహీరాబాద్ లో భారీ వర్షం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో గత రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. దీనివల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక వర్షాల వల్ల ఇండ్లలోకి నీరు సైతం వస్తున్నాయి. అంతేగాక రోజువారి పనులు చేసుకునే వారికి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఉద్యోగస్తులు సైతం సమయానికి వెళ్లలేకపోతున్నారు. ఎక్కువ శాతం పాఠశాలలు సెలవులను ప్రకటించాయి. ఈ వర్షాకాలం సీజన్లో ఇంత భారీ వానలు పడడం ఇదే మొదటిసారి. ఈ భారీ వర్షాల్లో ప్రయాణికులు తగిన జాగ్రత్తలు పాటించాలి.

ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో వైద్య శిబిరం..

ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో వైద్య శిబిరం

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి 60 మంది విద్యార్థులను పరీక్షించి మందులు పంపిణి చేయడం జరిగిందని తెలిపారు. అదేవిదంగా హాస్టల్ లో ఉన్న వంటశాల, స్టోర్రూమ్, డైనింగ్ హల్ మరియు పరిసరాలు పరిశీలించండం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ లక్ష్మి ప్రసన్న.పల్లె దవాఖాన సిబ్బంది సిరి, సూపెర్వైసోర్ కృష్ణ,సుదర్శన్, ఆచార్యలు,ఝాన్సీ,ఆశాలు తదితరులు పాల్గొన్నారు.

పడకేసిన పారిశుద్ధ్యం..

పడకేసిన పారిశుద్ధ్యం..

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-94.wav?_=3

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: అసలే వర్షాకాలం.. కొత్త కొత్త రోగాలతో ప్రజలు ఇబ్బందిపడుతున్న సమయంలో జహీరాబాద్ పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసింది. ఆర్టీసీ కాలనీలోని ఆర్ఎల్ఆర్ స్కూల్ వెనకాల మురుగునీరు ఇళ్ల మధ్యలో చేరి పందులు నివాసాల ముందు స్వైరవిహారం చేస్తున్నాయి. వీటికి తోడు దోమలు మురికిపై వాలి తినే ఆహారపదార్థాలపై వాలితే ప్రజలు రోగాల బారినపడే అవకాశముంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

డయాలసిస్ లో బెస్ట్.. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి దక్కిన అరుదైన గౌరవం!

డయాలసిస్ లో బెస్ట్.. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి దక్కిన అరుదైన గౌరవం!

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-92.wav?_=4

జహీరాబాద్ నేటి ధాత్రి:

డయాలసిస్ సేవల కోసం వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్న జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి అరుదైన గౌరవం దక్కింది. జాతీయస్థాయిలో ప్రతి ఏటా నిర్వహించే “బెస్ట్ సెంటర్ అవార్డ్స్” విభాగంలో ఉత్తమ డయాలసిస్ సెంటర్ అవార్డును ఈ ఆసుపత్రికి వరించింది. ఇందులో రోజుకు సగటున 30 మంది పేషంట్లకు డయాలసిస్ చికిత్సలు అక్కడి వైద్యులు అందజేస్తున్నారు. వీరి ఉత్తమ సేవలకు గాను ఈ అవార్డు దక్కడం పట్ల జిల్లా ఇన్చార్జి వైద్యాధికారిని డాక్టర్ గాయత్రి, డీ.సీ.హెచ్.ఎస్ డాక్టర్ సంగారెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు.

మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు సేవలు.

జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో 2018లో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు సుమారు 600 మంది వరకు ఈ సెంటర్లో చికిత్స పొందారు. ప్రస్తుతం 65 మందికి ఇక్కడ డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. ఈ సెంటర్లో ప్రస్తుతం 10 బెడ్స్ ఉండగా రోజుకు 30 మందికి మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు డయాలసిస్ వైద్య సేవలను ఇక్కడి సిబ్బంది కొనసాగిస్తున్నారు.

ఆపరేషన్ థియేటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే.

ఆపరేషన్ థియేటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

హర్షం వ్యక్తం చేసిన మారుమూల ప్రాంత ప్రజలు

నేటి ధాత్రి చర్ల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం మారుమూల ప్రాంతమైన చర్లలో నూతనంగా ఏర్పాటైన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆపరేషన్ థియేటర్ అందుబాటులోకి వచ్చింది నేటి నుండి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అందుబాటులోకి వచ్చాయి గతంలో ట్యూబెక్టమీ ఆపరేషన్ కోసం ప్రజలు అరవై కిలోమీటర్ల దూరం వెళ్లి భద్రాచలం ఆసుపత్రికి వెళ్లేవారు ఇప్పుడు చర్ల లో ట్యూబెక్టమీ సేవలు అందుబాటులోకి రావడంతో చర్ల పరిసర ప్రాంతాల్లోని మహిళలకు చాలా మేలు చేసినట్టయింది
నాడు చర్ల లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొయ్యూరు కి తరలించగా చర్ల గ్రామానికి చెందిన ప్రజలు పర్యటనకి వచ్చిన అప్పటి కలెక్టర్ అనుదీప్ ని కలిసి చర్ల మండల కేంద్రంలో హాస్పటల్ ఉండవలసిన ఆవశ్యత గురించి తెలిపారు వెంటనే కలెక్టర్ ఈ ప్రాంతంలో సిహెచ్ సి హాస్పిటల్ ఏర్పరిచారు నేడు ఈ హాస్పిటల్ కు అన్ని రకాల వైద్య సేవలు ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో డి సి హెచ్ ఎస్ డాక్టర్ రవిబాబు భద్రాచలం ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ రామకృష్ణ చర్ల సిహెచ్సి సి హాస్పటల్ డాక్టర్స్ సిబ్బంది చర్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు

రేగొండ పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

రేగొండ పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-79.wav?_=5

భూపాలపల్లి నేటిధాత్రి

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పల్లెలల్లో దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలో ఎన్ హెచ్ ఎం నిధులు రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన(ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత ప్రజలు పల్లె దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక్కడ పనిచేసే డాక్టర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలను అందించి ప్రజల మన్ననలను పొందాలని అన్నారు. నియోజకవర్గంలోని పల్లెలల్లో మరిన్ని దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..
గాంధీయ మార్గాన్ని ఆచరిస్తూ, నిరాడంబరతో పయనిస్తూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు అనునిత్యం శ్రమిస్తున్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ మాజీ అధ్యక్షురాలు, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జన్మదినం ఈ సందర్భంగా రేగొండలో మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేకు కోసి, వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతీయ నాయకురాలుగా ఉన్న మీనాక్షి నటరాజన్ హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, సింప్లిసిటీగా ఉంటుందన్నారు. ఆమె సాధారణ రీతిలో పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడం జరుగుతుందని, అటు ఢిల్లీకి వెళ్ళినా, ఇటు హైదరాబాద్ కు వచ్చినా ఫ్లైట్ లో కాకుండా రైలులో ప్రయాణం చేస్తుందని అన్నారు. 2029 లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఏకైక లక్ష్యంగా మీనాక్షి నటరాజన్ అహర్నిశలు పనిచేస్తుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. వారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎమ్మెల్యే వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి.

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి

చిట్యాల ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయిన సరోజన

వైద్యులపై చట్టపురమైన చర్య తీసుకోవాలని

సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ కార్యదర్శి మారపల్లి మల్లేష్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-54.wav?_=6

భూపాలపల్లి నేటిధాత్రి

సరోజన అనే మహిళ చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి లోబీవీ తో రావడం జరిగింది వచ్చిన తర్వాత అంబులెన్స్ లో తీసుకొచ్చినటువంటి ఈ పి టి 12 గంటల సుమారులో ఆక్సిజన్ పెట్టినాడు ఆక్సిజన్ పెట్టిన వెంటనే డమెల్ మనీ పేలింది…..

CPI ML Liberation Secretary Marapalli Mallesh

ఈపీటి వెంటనే తొందరగా బయటికి వచ్చినాడు ఏం జరిగిందని చెప్పేసి పేషెంట్లు అంత నిద్ర లేచారు అప్పటికి సరోజన అరుస్తూనే ఉంది అమ్మా అయ్యాను పేషెంట్ వచ్చి అరగంట ఆయన అప్పటివరకు డాక్టర్ గాని సిస్టర్స్ గాని సెక్యూరిటీ సిబ్బంది గానీ వార్డు భాయ్ వచ్చిన పరిస్థితి కానరాలేదు క్షణమైతే చనిపోతుంది అప్పుడు అందరు వచ్చినారు వచ్చేసరికి ఆమె చనిపోయింది అప్పుడు వచ్చి ఆక్సిజన్ కొడితే అప్పటికే ఆమె చనిపోయింది నేను చేసే ప్రయత్నం చేశాను అంటున్న డ్యూటీ డాక్టర్ వాస్తవంగా రాత్రి 12 కాకముందుకే ఎక్కడి వాళ్ళు అక్కడ పడుకున్నారు వార్డు బాయ్ లేసింది లేదు సెక్యూరిటీని లేపింది లేదు సెక్యూరిటీ సిస్టర్ ను లేపింది లేదు సిస్టర్ డాక్టర్ను లేపింది లేదు ఈ సమయంలో అర్ధగంట గడిచిపోయింది ప్రాణాలు కాపాడతారని వస్తే నిర్లక్ష్యం మూలంగా ప్రాణాలు పోయినవి తక్షణమే ఇన్చార్జి సూపర్ డెంట్ సస్పెండ్ చేయాలి నిర్లక్ష్యం వహించిన వీళ్ళందరూ పైన చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏ పేషెంట్ వచ్చిన వంద పడకలకు పో గాంధీ హాస్పిటల్ వరంగల్ పో అని రెఫర్ చేస్తా ఉన్నారు ఇక్కడ తగ్గాల్సిన రోగాన్ని అక్కడికి పొమ్మని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు వచ్చిన తర్వాత సిస్టర్ గ్లూకోజ్ పెడతా ఉంది డాక్టర్ మాత్రం గంట తర్వాత వచ్చి కూడా చూడలేని పరిస్థితి అమ్మ ఎప్పుడు వస్తాడు అని అడిగితే తాత వస్తాడని అంటున్నారు నిర్లక్ష్య సమాధానం ఉద్యోగం మీద బాధ్యత లేకపోకుండా నిర్లక్ష్యంగా ఉండడం వల్లే హాస్పిటల్ దివాలా తీస్తోంది గతంలో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఎంతో అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి చిట్యాల ఈరోజు దివాలా తీయడానికి కారణం పాలకులే నిర్లక్ష్యం మూలంగా నిండుపానం బలైపోయింది 9 గంటల వరకు డ్యూటీ లో ఉన్నారు తొమ్మిదిన్నరకే అందరు పడుకున్నారు వాస్తవానికి నైట్ డ్యూటీ అంటే రాత్రంతా మేలుకొని ఉండాలి కానీ అందుకు విరుద్ధంగా డ్యూటీ చేస్తున్నారు తమ ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసమే తప్ప బాధ్యతతో పనిచేసిన దాఖలు లేవు తక్షణమే హాస్పిటల్ పైదృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ని పోలీసులకు డిమాండ్ చేస్తున్నాం

వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు..

వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు.. ఈ లక్షణాలు కనిపిస్తే జర జాగ్రత్త!!

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-36.wav?_=7

వర్షాకాలం పూర్తిగా రానప్పటికీ దాని ప్రభావం కనబడుతోంది. అప్పుడప్పుడూ కురుస్తున్న వానలకు దోమల బెడద పెరుగుతోంది. దీనికి తోడు వాతావరణ మార్పులు, తేమ, నీటి కాలుష్యం వంటివి సాధారణ జ్వరాలకు, వైరల్ ఫీవర్లకు దారితీస్తున్నాయి. దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు సైతం వ్యాపించే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ సీజన్‌లో ఏయే వ్యాధులు వస్తాయి? లక్షణాలేమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

డెంగ్యూ జ్వరం:-

వర్షాల తర్వాత సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. ఏడిస్ ఈజిప్టి దోమ కాటు ద్వారా ఈ వైరల్ ఫీవర్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఇక లక్షణాల విషయానికి వస్తే అధిక జ్వరం (104°F వరకు), తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పి వేధిస్తాయి. అలాగే చర్మంపై దద్దుర్లు, అలసట, వాంతులు, కడుపు నొప్పి వంటివి కూడా కొందరిలో సంభవిస్తాయి. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, వైద్య నిపుణుల సలహాలు పాటించాలి.

మలేరియా:-

ప్లాస్మోడియం పరాన్నజీవి, ఆడ అనాఫిలిస్ దోమ కాటు ద్వారా ఇది వస్తుంది. చలి, జ్వరం, వణుకు, చలి దశ తర్వాత వేడిగా అనిపించడం, తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, కొన్నిసార్లు వాంతులు, కామెర్లు కూడా మలేరియా లక్షణాల్లో భాగంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సింప్టమ్స్ కనిపించగానే డాక్టర్లను సంప్రదించాలి. నిర్ధారిత పరీక్షల తర్వాత చికిత్స అందిస్తారు.

వైరల్ ఫీవర్ (ఫ్లూ లేదా ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు):-

ఇన్‌ఫ్లుయెంజా లేదా ఇతర వైరస్‌ల ద్వారా కూడా వైరల్ జ్వరాలు వస్తుంటాయి. తేలికపాటి నుంచి మధ్యస్థ జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ముక్కు కారడం, బాడీ పెయిన్స్, అలసట ఈ జ్వరాల ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. వీటిని గుర్తించగానే వైరల్ PCR టెస్ట్ చేయించుకోవాలి. వైద్య నిపుణులను సంప్రదించి, వారి సలహాలు పాటించాలి.

టైఫాయిడ్ (ఎంటరిక్ ఫీవర్):-

సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా, కలుషిత నీరు లేదా కలుషిత ఆహారం ద్వారా ఈ జ్వరం వస్తుంది. చిన్నగా ప్రారంభమై ఒక్కసారిగా అధిక జ్వరం రావడం, ఉదయం తక్కువగా ఉండి సాయంత్రం లేదా రాత్రిళ్లు అధికం కావడం జరుగుతుంది. బలహీనత, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, మలబద్ధకం లేదా విరేచనాలు కూడా టైఫాయిడ్ లక్షణాల్లో భాగమే. కాబట్టి ఈ సింప్టమ్స్ గుర్తిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలంటున్నారు నిపుణులు.

చికున్‌గున్యా:-

చికున్‌గున్యా వైరస్, ఏడిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. అధిక జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పి (దీని వల్లే ‘చికున్‌గున్యా’ అనే పేరు వచ్చింది), చర్మంపై దద్దుర్లు, అలసట వంటివి దీని ప్రధాన లక్షణాలు రక్త పరీక్షల ద్వారా దీనిని నిర్ధారిస్తారు. కాబట్టి లక్షణాలు గుర్తించగానే దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.

లెప్టోస్పిరోసిస్:-

లెప్టోస్పిరా బ్యాక్టీరియా, కలుషిత నీటితో సంపర్కం ద్వారా నీటిలో వృద్ధి చెంది జన సమూహాలకు వ్యాపిస్తుంది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, కళ్లు ఎర్రబడడం, కామెర్లు వంటివి దీని ప్రధాన లక్షణాలు. తీవ్రమైన సందర్భాల్లో కాలేయం, మూత్రపిండాల సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. రక్తం లేదా యూరిన్ టెస్ట్ (MAT లేదా PCR) ద్వారా దీనిని నిర్ధారిస్తారు. కాబట్టి వైద్య నిపుణులను సంప్రదించ సూచనలు పాటించాలి.

జాగ్రత్తలు:-

సీజనల్ వ్యాధులు సాధారణంగా దోమకాటు, కలుషిత నీరు, అపరిశుభ్రత వల్ల వస్తుంటాయి. కాబట్టి దోమల నివారణ, వాటి నుంచి సంరక్షణ ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు. దోమ తెరలు ఉపయోగించడం, ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం చేయాలి. సాయంత్రం వేళల్లో పూర్తి చేతులు, కాళ్లను కప్పి ఉంచే దుస్తులు ధరించండం మంచిది. దీంతోపాటు వర్షాకాలంలో నీరు భూగర్భంలోకి ఇంకడంవల్ల, డ్రైనేజీల లీకేజీ కారణంగా నల్లా నీళ్లు కూడా కలుషితం అవుతుంటాయి. కాబట్టి ఈ సీజన్‌లో మరిగించిన లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగాలంటున్నారు నిపుణులు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. పరిశుభ్రత పాటించాలి. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వైద్య నిపుణులను సంప్రదించాలి.

వివరణ:-

పరిసరాల పరిశుభ్రత:

పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, దోమలు, ఇతర క్రిములు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు.

చేతులు కడుక్కోవడం:

చేతులు తరచుగా శుభ్రంగా కడుక్కోవడం వల్ల సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందకుండా ఉంటాయి.

లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి:

జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

నీటిని మరిగించి తాగాలి:

నీటిని మరిగించి తాగడం ద్వారా సూక్ష్మక్రిములు నశిస్తాయి.

పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగి తినాలి:

పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగి తినడం ద్వారా క్రిములు శరీరంలోకి చేరకుండా నివారించవచ్చు.

ఝరాసంగం మండల ప్రభుత్వ వైద్య అధికారి రమ్య

ఉదయం చేసే ఈ తప్పులు ..!

 

ఉదయం చేసే ఈ తప్పులు మీ మొత్తం రోజును నాశనం చేస్తాయి.!

 

ఉదయం సానుకూలంగా ఉంటే రోజంతా బాగుంటుంది. అయితే, మీరు ఉదయం చేసే ఈ తప్పులు మీ మొత్తం రోజును నాశనం చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మన రోజంతా ఎలా ఉంటుందనేది మన ఉదయం దినచర్యపై ఆధారపడి ఉంటుంది. రోజు సానుకూలతతో ప్రారంభమైతే, రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. అదేవిధంగా, మన ఉదయపు అలవాట్లు కొన్ని రోజంతా నాశనం చేస్తాయి. మీ రోజు కూడా సానుకూలంగా ప్రారంభించి రోజంతా బాగుండాలని మీరు కోరుకుంటున్నారా? అయితే, మీరు ఈ కొన్ని అలవాట్లను వదులుకోవాలి. ఎందుకంటే ఇవి మీ రోజును నాశనం చేస్తాయి. కాబట్టి, ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం..

నిద్ర లేవగానే ఫోన్ చెక్ చేసుకోవడం:

చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చెక్ చేసుకునే అలవాటు ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, వారి రోజు ఫోన్ తో ప్రారంభమవుతుంది. కాబట్టి, మీరు ఉదయం నిద్ర లేవగానే మీ ఫోన్ చెక్ చేసుకోకూడదు. ఇది మీ మెదడుపై భారాన్ని పెంచుతుంది. దీనివల్ల మీరు మీ పనిపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది. మరో విషయం ఏమిటంటే, మీరు ఉదయం నిద్ర లేవగానే మీ మొబైల్ చెక్ చేసి చెడు వార్తలు చూస్తే, మీ రోజంతా నాశనం అవుతుంది. కాబట్టి, ఈ అలవాటును వదులుకోండి.

అల్పాహారం తినకపోవడం:

చాలా మంది కళాశాల లేదా ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లడం వల్ల అల్పాహారం మానేస్తారు. ఉదయం తినకుండా ఆకలితో ఉండటం హానికరం. ఇది మెదడు శక్తిని తగ్గిస్తుంది. ఇది మీ ఏకాగ్రత, మానసిక స్థితి రెండింటినీ ప్రభావితం చేస్తుంది.

నీరు తాగకపోవడం:

ఉదయం నీరు తాగడం అలవాటు చేసుకోండి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగాలి. ఉదయం నీరు తాగడం వల్ల మెదడు కణాలు చాలా చురుగ్గా ఉంటాయి.

 

ఆలస్యంగా నిద్రలేవడం:

ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం కూడా మంచిది కాదు. మీరు రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా ఉండాలనుకుంటే, ఉదయాన్నే నిద్రలేవడం అలవాటు చేసుకోండి.

వర్షాకాలం.. ఈ కూరగాయలు తినే ముందు..!

 

వర్షాకాలం.. ఈ కూరగాయలు తినే ముందు 100 సార్లు ఆలోచించండి..!

 

వర్షాకాలంలో ఈ కూరగాయలు తినే ముందు 100 సార్లు ఆలోచించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఏ కూరగాయల గురించి వారు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

కూరగాయలు ప్రయోజనకరంగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాటిలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకుంటే, అనేక వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. అయితే, వర్షాకాలంలో ఈ కూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏ కూరగాయల గురించి వారు హెచ్చరిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

కాలీఫ్లవర్‌

వర్షాకాలంలో కాలీఫ్లవర్ తినడం మంచిది కాదు, ఎందుకంటే తేమ కారణంగా బ్యాక్టీరియా, పురుగులు పెరిగే అవకాశం ఉంది. కాలీఫ్లవర్‌లో తేమ ఎక్కువగా ఉండటం వలన, అది త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. కడుపు ఇన్ఫెక్షన్లకు కూడా కారణం కావచ్చు.

వంకాయ

వంకాయలలో కూడా టేప్‌వార్మ్ కనిపించే అవకాశం ఉంది. కోసేటప్పుడు పురుగులు కనిపిస్తే, మొత్తం వంకాయను పారవేయాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని పురుగులు వంట తర్వాత కూడా జీవించగలవు, వీటిని తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. దాని లార్వా మెదడులోకి ప్రవేశిస్తే, అది ప్రాణాంతక పరిణామాలను కలిగిస్తుంది.

బీరకాయ

బీరకాయ వర్షాకాలంలో సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఫైబర్ పరంగా గొప్ప కూరగాయ. కానీ వర్షాకాలంలో ఇది కీటకాలతో ఉంటుంది. దానిలో ఉండే పురుగులు చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ పురుగులను తింటే, అవి శరీరంలోకి ప్రవేశించి మెదడుకు చేరుతాయి. ఇవి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.

క్యాబేజీ

క్యాబేజీ పొరల మధ్య టేప్‌వార్మ్‌లు దాక్కునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులు చాలా వేగంగా పెరుగుతాయి. వాటిని శుభ్రం చేసి సరిగ్గా ఉడికించకపోతే, వాటి గుడ్లు జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించి శరీరం లోపలికి, మెదడులోకి కూడా చేరుతాయి. మీరు తినాలని అనుకుంటే క్యాబేజీని ఉపయోగించే ముందు నీటిలో మరిగించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

 

క్యాప్సికమ్

క్యాప్సికమ్ లోపలి భాగంలో టేప్‌వార్మ్‌లు ఉండవచ్చు. సరిగ్గా కడగకపోతే, టేప్‌వార్మ్ గుడ్లు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి కమిషనర్ రాజలింగు.

Mandamarri Municipal Commissioner Rajalingu

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి – కమిషనర్ రాజలింగు

మందమర్రి నేటి ధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-29.wav?_=8

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మందమర్రి మున్సిపల్ కమిషనర్ రాజలింగు అన్నారు. శుక్రవారం రోజు మున్సిపాలిటీ పరిధిలోని ఊరు రామకృష్ణాపూర్ లో మున్సిపల్ సిబ్బందితో కలిసి పిచ్చి మొక్కలను తొలగించడం, కాలువల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయడం వంటి పనులు చేపట్టారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, “సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉన్న ఈ కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. రోడ్లపై చెత్త వేయకుండా జాగ్రత్తలు పాటించాలి,” అని సూచించారు. ప్రజల భాగస్వామ్యం ఉండే వినూత్న శుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

కళ్యాణికని సింగరేణి ఉన్నత పాఠశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు..

కళ్యాణికని సింగరేణి ఉన్నత పాఠశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు

మందమర్రి నేటి ధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-27.wav?_=9

ఈరోజు మందమర్రి ఏరియా హాస్పిటల్, సింగరేణి ఆధ్వర్యంలో సింగరేణి ఉన్నత పాఠశాల, కళ్యాణికని యందు ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Medical examinations

ఈ పరీక్షలలో భాగంగా విద్యార్థుల ఆరోగ్య స్థితిని పరిశీలించి, వారికి రక్తంలోని హీమోగ్లోబిన్ స్థాయి, శారీరక బలహీనత తదితర విషయాలపై పరీక్షలు చేపట్టారు. పరీక్షల అనంతరం, బ్లడ్ తక్కువగా ఉన్న విద్యార్థులను గుర్తించి, వారికీ అవసరమైన ఔషధాలు, విటమిన్ టాబ్లెట్లు పంపిణీ చేశారు.

Medical examinations

ఈ కార్యక్రమం విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడేలా, ముందస్తు వైద్య జాగ్రత్తలతో కూడినదిగా ఏర్పాటుచేయబడింది. పిల్లల ఆరోగ్యం పట్ల సింగరేణి సంస్థ చూపుతున్న చొరవకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యాపక వర్గం, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

న్యాల్కల్ KGBV హాస్టల్లో విద్యార్థినులకు అస్వస్థత.

న్యాల్కల్ KGBV హాస్టల్లో విద్యార్థినులకు అస్వస్థత

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-22.wav?_=10

న్యాల్ కల్ లో కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ లో ఐదుగురికి విద్యార్థులు అస్వస్థతకు గురి . విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. జహిరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సంగారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం పంపించారు . విద్యార్థుల ఆరోగ్యం క్షేమంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో జరిగిన విద్యార్థులకి మళ్లీ అస్వస్థత గురి కావడం చర్చనీ అంశం . వర్షాకాలం పరిశుభ్రత లోపించిందా ఆహారం లోపమా తెలియాల్సిందే. జిల్లా అధికారులు పర్యవేక్షణ లోపించింది .

Nyalkal KGBV hostel.

వెంటనే తహసిల్దార్ ప్రభులు మండల గిర్ధవర్ శ్యామ్ రావు హాస్టల్ లో పరిస్థితులను పరిశీలించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version