పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి – కమిషనర్ రాజలింగు
మందమర్రి నేటి ధాత్రి
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మందమర్రి మున్సిపల్ కమిషనర్ రాజలింగు అన్నారు. శుక్రవారం రోజు మున్సిపాలిటీ పరిధిలోని ఊరు రామకృష్ణాపూర్ లో మున్సిపల్ సిబ్బందితో కలిసి పిచ్చి మొక్కలను తొలగించడం, కాలువల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయడం వంటి పనులు చేపట్టారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, “సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉన్న ఈ కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. రోడ్లపై చెత్త వేయకుండా జాగ్రత్తలు పాటించాలి,” అని సూచించారు. ప్రజల భాగస్వామ్యం ఉండే వినూత్న శుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.