మెగ్నీషియం లోపంతో ప్రాణాలకే ముప్పు..!

మెగ్నీషియం లోపంతో ప్రాణాలకే ముప్పు..! ఈ లక్షణాలు కనిపిస్తే బీ అలర్ట్..!

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు ఇలా ప్రతిదీ అవసరమే. ఏ ఒక్కటి లోపించినా శరీర విధులకు ఆటంకం కలిగి అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా మెగ్నీషియం లోపం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ కింది సంకేతాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే చికిత్స తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు కచ్చితంగా శరీరానికి అందాల్సిందే. విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు ఇలా ప్రతిదీ అవసరమే. ఏ ఒక్కటి లోపించినా శరీర విధులకు ఆటంకం కలిగి అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా మెగ్నీషియం లోపం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇది శరీరానికి అవసరమయ్యే ఖనిజాల్లో అత్యంత ప్రధానమైనది. ఏకంగా 300 విధుల్లో శరీరానికి తోడ్పడుతుంది. మన ఒంట్లో శక్తి ఉత్పత్తికి, పెరుగుదల సహా అనేక ఇతర క్రియలకు అత్యంత ముఖ్యమైనది.

ప్రతిరోజూ ఆహారంలో తగినంత మెగ్నీషియం తీసుకోని వారిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు. అత్యంత సర్వసాధారణంగా కనిపించే ఈ సంకేతాలను పట్టించుకోకపోతే మూల్యంగా ప్రాణాన్నే చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఏఏ లక్షణాల ద్వారా మెగ్నీషియం లోపాన్ని గుర్తించవచ్చో ఇప్పుడు చూద్దాం.

కండరాల తిమ్మిరి

శరీరంలో మెగ్నీషియం తగ్గితే కనిపించే మొట్టమొదటి సంకేతం కండరాల తిమ్మిర్లు. కాళ్ళలో తరచుగా కండరాల తిమ్మిర్లు, నొప్పులు ఉంటే మెగ్నీషియం లోపించిందని అర్థం. కండరాల పనితీరులో మెగ్నీషియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది లోపిస్తే కండరాలు అసాధారణంగా సంకోచిస్తాయి. నరాల పనితీరు దెబ్బతింటుంది.

అలసట, బలహీనత

విశ్రాంతి తర్వాత కూడా అసాధారణంగా అలసిపోయినట్లు అనిపిస్తుంటే తక్కువ మెగ్నీషియం స్థాయిలకు సంకేతం కావచ్చు. ఈ ఖనిజం శక్తికి ముఖ్యమైనది. ఇది లోపిస్తే కణాల్లోని శక్తి తగ్గుతుంది. అందుకే అలసట, బలహీనత వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

క్రమరహిత హృదయ స్పందన

మెగ్నీషియం గుండె కండరాల పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ హృదయ స్పందనను నిర్వహించడానికి సహాయపడుతుంది. మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు గుండె దడ, క్రమరహిత హృదయ స్పందనలు (అరిథ్మియా) లేదా ఛాతీ బిగుతుకు కారణమవుతుంది.

జలదరింపు

చేతులు, కాళ్ళు లేదా ముఖంలో జలదరింపు అనుభూతులు లేదా తిమ్మిరి మెగ్నీషియం లోపానికి సంకేతాలు. ఇలాంటివారిలో నరాల సరిగా పనిచేయవు. నరాల సాధారణ పనితీరుకు అంతరాయం కలుగుతుంది. ఎందుకంటే, మెగ్నీషియం నరాల సంకేతాలను నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

చాక్లెట్ లేదా ఉప్పు

మీకు తరచుగా చాక్లెట్ లేదా ఉప్పు తినాలనే కోరికలు కలుగుతుంటే ఒంట్లో తక్కువ మెగ్నీషియం ఉందని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ ఖనిజాలకు గొప్ప మూలం. మెగ్నీషియం అసమతుల్యతను భర్తీ చేసుకునేందుకు మీ శరీరం ఉప్పు లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని కోరుకోవచ్చు.

ఉచిత వైద్య శిభిరని ప్రారంభించిన..

ఉచిత వైద్య శిభిరని ప్రారంభించిన హనుమంతరావు పటేల్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రముఖ హోలీస్టిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఝరాసంగం మండల కేంద్రంలోఉచిత వైద్య శిభిరం నిర్వహించడం జరిగింది లింగాయత్ సత్రం, టెంపుల్ రోడ్ నిర్వహించిన ఉచిత శిబిరాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హనుమంతరావు పటేల్ ప్రారంభించారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్, ఆప్థోమలాజీ, ఇంటర్నల్ మెడిసిన్ తో పాటు ఈసిజీ,ఆర్థో,కంటి,బిపి,డయాభైటిక్ షుగర్ తదితర పరీక్షలు వచ్చిన రోగులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రజలను అవసరమైన టెస్టులు మందులు ఉచితంగా అందించడం జరిగింది. గ్రామస్తులు ఆయా గ్రామస్తులను ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!

అంతర్గత అవయవాలు దెబ్బతిన్నప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. అయితే, ఈ లక్షణాలు, మీ శరీరంలో కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. ఎందుకంటే..

 మన శరీరం దాని లోపల జరిగే ప్రతి మార్పు గురించి మనకు సమాచారాన్ని అందిస్తుంది. మనం దానిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంతర్గత అవయవాలు దెబ్బతిన్నప్పుడు శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు. కాబట్టి, ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శరీరంలో వాపు, అలసట, బలహీనత అనేవి మీ అంతర్గత అవయవాలు అనారోగ్యానికి గురవుతాయని హెచ్చరించే కొన్ని లక్షణాలు. మూత్రంలో అధిక నురుగు, తరచుగా మూత్రవిసర్జన, మూత్ర పరిమాణంలో తీవ్రమైన మార్పులు మొదలైనవి మూత్రపిండాల సమస్యలను సూచించే కొన్ని లక్షణాలు.

ఇది మాత్రమే కాదు.. మీ కాళ్ళు, చీలమండలు, పాదాలు, ముఖం, కళ్ళ చుట్టూ వాపు కనిపించడం ప్రారంభిస్తే మీ మూత్రపిండాలలో ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోండి. దీనితో పాటు శ్వాస ఆడకపోవడం, ఆకలి లేకపోవడం, రక్తపోటు పెరగడం, శరీరంలో తేలికపాటి దురద వంటి లక్షణాలు కనిపిస్తే ఇది మీ మూత్రపిండాలలో సమస్యకు ప్రత్యక్ష సూచన అని గుర్తుంచుకోండి.

బరువు పెరగడం లేదా తగ్గడం, కడుపులో గ్యాస్, ఎల్లప్పుడూ ఆమ్లత్వం వంటి సమస్యలు మొదలైనవి మీ ప్రేగుల ఆరోగ్యం క్షీణిస్తోందని సూచించే కొన్ని లక్షణాలు. ఇది మాత్రమే కాదు, మీరు మళ్లీ మళ్లీ తినాలని భావిస్తుంటే ఒత్తిడికి గురవుతుంటే ఇవి ప్రేగులలోని రుగ్మత లక్షణాలు కూడా కావచ్చు. ఈ లక్షణాలను తెలుసుకుని వాటికి చికిత్స తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మున్సిపల్ సిబ్బందికి సీజనల్ మరియు హెల్త్ కిట్స్ పంపిణీ.

మున్సిపల్ సిబ్బందికి సీజనల్ మరియు హెల్త్ కిట్స్ పంపిణీ

.వర్షాకాలంలో 16వ డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచాలి.

సుంకరి మనిషా శివకుమార్.
16వ డివిజన్ కార్పొరేటర్

కాశిబుగ్గ నేటిధాత్రి.

వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధి 16వ డివిజన్ లోని పారిశుద్య పనులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి స్థానిక 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ సీజనల్ మరియు హెల్త్ కిట్స్ అందచేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నిరంతం డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతగానో శ్రమిస్తున్న సిబ్బంది అనారోగ్య ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు కార్పొరేషన్ హెల్త్ కిట్స్ అందించడం ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.అదే విధంగా వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ కిట్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపాలిటీ సిబ్బంది కార్పొరేటర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ జవాన్ లు సిబ్బంది పాల్గొన్నారు.

లాదెళ్ల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం .

https://youtu.be/EC5Z8gibvKc?si=55Iebk-pbIpN8u87
లాదెళ్ల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం 
52మందికి రక్త,మూత్ర పరీక్షలు నిర్వహించి ఉచిత మందుల పంపిణీ 
పరకాల నేటిధాత్రి 
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ ఆధ్వర్యంలో మంగళవారం పరకాల నియోజకవర్గ పరిధి దామెర మండలంలోని లాదెళ్ల గ్రామంలో రూరల్ హెల్త్ సెంటర్ లో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా బిపి.ల్,షుగర్,రక్త  పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు.ఈ సందర్బంగా చైర్మన్,పాలకవర్గం మాట్లాడుతూ లాదెళ్ల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించి 52 మందికి ఉచితంగా మందులు పంపిణి చేయడం జరిగిందని తెలిపారు.సీజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.ఈ ఆరోగ్య శిబిరంలో రెడ్ క్రాస్ డాక్టర్లు డాక్టర్.కిషన్ రావు,డాక్టర్.మొహమ్మద్ తయార్ మసూద్,రెడ్ క్రాస్ సిబ్బంది గుల్లెపెల్లి శివకుమార్,గంగాధర్,సతీష్, శ్రీకాంత్,నర్సింహ చారి,కిట్స్, జి.వర్షిత్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

సి ఆర్ నగర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ.

సి ఆర్ నగర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపాలిటీ పరిధిలోని సి ఆర్ నగర్ లో భూపాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. వార్డు ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అనంతరం
సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించారు
ఈ కార్యక్రమంలో డాక్టర్ శారద, వి బృందా. శ్రీదేవి ఏఎన్.ఎంలు రమ, కరుణ,ఆశ వర్కర్లు స్వరూప,అరుణ తదితరులు పాల్గొన్నారు.

అయినా.. పన్ను ప్రయోజనాలున్నాయ్‌..

 

అయినా.. పన్ను ప్రయోజనాలున్నాయ్‌

ఏ వ్యక్తికైనా ఆరోగ్య బీమా తప్పనిసరి. దేశంలో హెల్త్‌కేర్‌ వ్యయాలు ఏటా 14ు వంతున పెరుగుతున్నాయని అంచనా. అయితే వయోవృద్ధులు లేదా సీనియర్‌ సిటిజన్లు పెరుగుతున్న వయసు, ముందు నుంచి ఉన్న వ్యాధుల కారణంగా…

ఆరోగ్య బీమా లేదా..?

ఏ వ్యక్తికైనా ఆరోగ్య బీమా తప్పనిసరి. దేశంలో హెల్త్‌కేర్‌ వ్యయాలు ఏటా 14ు వంతున పెరుగుతున్నాయని అంచనా. అయితే వయోవృద్ధులు లేదా సీనియర్‌ సిటిజన్లు పెరుగుతున్న వయసు, ముందు నుంచి ఉన్న వ్యాధుల కారణంగా అందుబాటు ప్రీమియంలలో ఆరోగ్య బీమా పొందలేక పోతున్నారు. ఈ కారణంగా ఆస్పత్రి, వైద్య పరీక్షలు, డాక్టర్‌ కన్సల్టేషన్‌ వ్యయాలన్నీ తాము పొదుపు చేసుకున్న సొమ్ము నుంచే చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి అంశాలన్నీ దృష్టిలో ఉంచుకునే ఆదాయపు పన్ను చట్టం 80డి సెక్షన్‌.. 60 సంవత్సరాల వయసు పైబడిన వారందరికీ ఆరోగ్య సంబంధిత వ్యయాలపై కొన్ని రాయితీలు అందిస్తోంది. పాత ఆదాయపు పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయోజనాలు పరిమితం. దీని కింద ఆరోగ్య బీమా పాలసీ లేకపోయినా సీనియర్‌ సిటిజన్లు ఆరోగ్య సంబంధిత వ్యయాలపై పన్ను మినహాయింపులు కోరవచ్చు.
80డి సెక్షన్‌ ఏమిటి?

పన్ను చెల్లింపుదారుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ సెక్షన్‌ ఆరోగ్య బీమా లేదా ఆరోగ్య సంబంధిత వ్యయాలపై రాయితీలు, మినహాయింపులు అందిస్తుంది. తద్వారా పన్ను చెల్లింపు మొత్తం ఆదా చేస్తుంది.

  • ఈ సెక్షన్‌ కింద పన్ను చెల్లింపుదారు తనతో పాటుగా కుటుంబ సభ్యుల (భార్య లేదా భర్త, తనపై ఆధారపడిన సంతానం) ఆరోగ్య సంరక్షణకు చేసిన వ్యయాలపై లేదా ఆరోగ్య బీమా ప్రీమియంపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
  • దీనికి తోడు వయోవృద్ధులైన తల్లిదండ్రుల కోసం చేసిన ఆరోగ్య సంబంధిత వ్యయాలు, ఆరోగ్య బీమా ప్రీమియంపై మరో రూ.25,000 పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేయవచ్చు.
  • అలాగే ప్రీమియం చెల్లిస్తున్న వ్యక్తి (స్వయంగా లేదా కుటుంబ సభ్యుల కోసం) సీనియర్‌ సిటిజన్‌ అయినట్టయితే ఈ మినహాయింపు పరిమితి గరిష్ఠంగా రూ.50,000 వరకు ఉంటుంది. అంటే మీరు సీనియర్‌ సిటిజన్‌ అయి ఉండి మీ కోసం, మీ తల్లిదండ్రుల కోసం కూడా ప్రీమియం చెల్లిస్తున్నట్టయితే రూ.1 లక్ష వరకు ఆదాయపు పన్ను మినహాయింపునకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.
  • ప్రివెంటివ్‌ హెల్త్‌ చెకప్‌ చెల్లింపుల (గరిష్ఠంగా రూ.5,000) కోసం చేసే వ్యయాలైతే నగదు రూపంలో చెల్లించవచ్చు. మిగతా వ్యయాలేవైనా నగదేతర రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది.

బీమా కవరేజీ లేని వారి మాటేమిటి?

ఆరోగ్య బీమా కవరేజీ లేని సీనియర్‌ సిటిజన్లకు కూడా ఈ సెక్షన్‌ రాయితీలు కల్పిస్తోంది. అలాంటి వారు వైద్య వ్యయాలపై ఏడాదికి గరిష్ఠంగా రూ.50,000 వరకు మినహాయింపులు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ వ్యయాలను మీ పిల్లలు భరించినట్టయితే వారు కూడా పన్ను మినహాయింపులు పొందేందుకు అర్హులవుతారు. కేవలం 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మాత్రమే ఈ ప్రయోజనాలు పరిమితం అన్న విషయం గుర్తుంచుకోవాలి. అంతే కాదు…నూతన, సరళీకృత ఆదాయపు పన్ను విధానం ఎంచుకున్న వారికి ఇది వర్తించదు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డాక్టర్ రవీంద్ర నాయక్

గణపురం నేటి ధాత్రి

గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డాక్టర్ రవీంద్రా నాయక్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆకస్మిక తనిఖీ చేశారుడైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నాయక్ ని భూపాలపల్లి జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు బూరుగు రవి కలిశారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నాయక్ ని సన్మానించినారు
రాష్ట్రంలో ఉన్న హెల్త్ అసిస్టెంట్ అందరినీ ఫార్మసిస్టులను ల్యాబ్ టెక్నీషియన్లను రెగ్యులర్ అయిన వారందరినీ సర్వీస్ రెగ్యులరైజేషన్ గురించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ
రెగ్యులర్ చేయాలని
సకాలంలో జీతాలు ఇవ్వాలని వారిని కోరడం జరిగింది మెమోరండం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు బూరుగు రవి టీఎన్జీవో జిల్లా కార్యదర్శి దశరధ రామారావు మురళీధర్ రెడ్డి టి సత్యనారాయణ శ్రీదేవి జమాలుద్దీన్ హెల్త్ అసిస్టెంట్లు కాపర్తి రాజు పరమేశ్వర్ గోపి సుధీర్ సతీష్ వేణు ల్యాబ్ టెక్నీషియన్ రజిత పాల్గొన్నారు

రాత్రి పూట డిన్నర్ చేశాక వాకింగ్ చేస్తే..

రాత్రి పూట డిన్నర్ చేశాక వాకింగ్ చేస్తే.. ఎన్నో అద్భుతమైన ఫలితాలు..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాల‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే వ్యాయామం అంటే మ‌రీ క‌ష్ట‌ప‌డి జిమ్‌ల‌లో క‌స‌ర‌త్తులు చేయాల్సిన ప‌నిలేదు. రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు సాధార‌ణ వాకింగ్ చేసినా చాలు. ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉద‌యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల రోజంతా మెట‌బాలిజం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది క్యాల‌రీల‌ను క‌రిగిస్తూనే ఉంటుంది. క‌నుక‌నే ఉద‌యం వ్యాయామం చేయాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే కేవ‌లం ఉద‌యం మాత్ర‌మే కాదు.. రాత్రి పూట భోజ‌నం అనంత‌రం కూడా వాకింగ్ చేయాలి. దీంతో మ‌రింత ఎక్కువ ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు. రాత్రి పూట డిన్న‌ర్ చేసిన అనంతరం వాకింగ్ చేయ‌డం ఎన్నో మంచి ఫలితాల‌ను ఇస్తుంద‌ని వారు అంటున్నారు.

అధిక బ‌రువు, షుగ‌ర్ లెవ‌ల్స్‌..

Walking after dinner

రాత్రి పూట భోజ‌నం చేసిన అనంతరం క‌నీసం 10 నిమిషాల పాటు తేలిక‌పాటి న‌డ‌క కొన‌సాగించాలి. రాత్రి పూట మ‌న మెట‌బాలిజం త‌గ్గుతుంది. కానీ వాకింగ్ చేస్తే మెట‌బాలిజంను పెంచుకోవ‌చ్చు. దీంతో రాత్రి మ‌నం నిద్రించినా కూడా మ‌న శ‌రీరం క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేస్తూనే ఉంటుంది. ఫ‌లితంగా మ‌నం నిద్ర‌లో ఉన్నా కూడా మ‌న శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు క‌చ్చితంగా రాత్రి పూట డిన్న‌ర్ త‌రువాత వాకింగ్ చేస్తే ఎన్నో మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక రాత్రి పూట భోజ‌నం అనంత‌రం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్‌న అదుపులో ఉంచుకోవ‌చ్చు. ఒక అధ్య‌య‌నం ప్ర‌కారం రాత్రి డిన్న‌ర్ త‌రువాత వాకింగ్ చేసేవారి ఫాస్టింగ్ షుగ‌ర్ లెవ‌ల్స్ చాలా వ‌ర‌కు త‌గ్గాయ‌ని తేల్చారు. క‌నుక డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఫాస్టింగ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకునేందుకు గాను రాత్రి పూట డిన్న‌ర్ చేసిన అనంత‌రం వాకింగ్ చేయాలి. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఇది ఎంత‌గానో మేలు చేసే విష‌యం.

ప్రపంచ జనాభా దినోత్సవం ఘనంగా.!

ప్రపంచ జనాభా దినోత్సవం ఘనంగా జరుపుకున్న వైద్యాధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఆరోగ్య కేంద్రమైన బిలాల్పూర్ లో ప్రాథమిక కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవం కార్యక్రమం సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.అందులో భాగంగా డాక్టర్ నరేందర్ సూపర్వైజర్ శోభారాణి ల్యాబ్ టెక్నీషియన్ వసంతరావు ఫార్మసిస్ట్ ఆదిల్ అలీ స్టాఫ్ నర్స్ సోనీ పాండు తదితరులు మరియు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.

డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో బట్టిగూడెం గ్రామంలో ఆరోగ్య .

డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో బట్టిగూడెం గ్రామంలో ఆరోగ్య శిబిరం

నేటి ధాత్రి చర్ల

సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల వలస ఆదివాసి గిరిజన గ్రామమైన బట్టిగూడెం గ్రామంలో డాక్టర్ నగేష్ హెల్త్ క్యాంపు నిర్వహించినారు రోగులకు మందులు ఇచ్చారు అనంతరం ప్రతి ఇంటిని పరిశీలన చేసి గ్రామానికి వచ్చే వారు చతిస్గడ్ నుంచి వచ్చే వారి నుండి రక్తనమూనాలను సేకరించాలని వారి నుండి మలేరియా మనకు సోకే అవకాశం ఉన్నoదున జాగ్రత వహించాలని మరియు పరిసరాలు పరిశుభ్రత పాటించాలని నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని దోమ తెరలు వినియోగించు కోవాలని పరిశుభ్రమైన మంచి నీరును తీసుకోవాలని నీటి నిల్వలలో యాంటి లార్వా టేమిఫోస్ వేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో సత్యనారాయణపురం ప్రాథమిక వైద్యశాల సిబ్బంది
టీ బాబురావు హెచ్ ఈ ఓ
కే తిరుపతమ్మ యమ్ పి హెచ్ యస్టి వేణు హెల్త్ అసిస్టెంట్
కే విజయక్ష్మి యమ్ పి హెచ్ ఏ కే తిరుపతమ్మ ఆశా కార్యకర్త తదితరులు పాల్గొన్నారు

సీజనల్ పై అప్రమత్తత అవసరం.

సీజనల్ పై అప్రమత్తత అవసరం…

డెంగ్యూ ప్రభలకుండా జాగ్రత్తలు పాటించాలి…

దోమ తెరలను ఉపయోగించాలి…

దోమలను తగ్గించడానికి, దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను వదిలించుకోవాలి…

పారిశుద్ధ్య నిర్వహణ పనులను సక్రమంగా చేపట్టాలి…

నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల 

వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లో వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో శానిటేషన్ పక్కాగా నిర్వహించాలి. అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా వసతులు కల్పించాలి. ఔషధ నిల్వలను సరిపడా అందుబాటులో ఉండేలా చర్యలు పాటించాలి. సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యాధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలి.డెంగ్యూ జ్వరం అనేది బాధాకరమైన, బలహీనపరిచే దోమల ద్వారా సంక్రమించే వ్యాధి, మరియు రెండవసారి డెంగ్యూ వైరస్ సోకిన వ్యక్తులు తీవ్రమైన వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదం చాలా ఎక్కువ. డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు అధిక జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాలు మరియు కీళ్ల నొప్పులు. కొన్ని తీవ్రమైన కేసులు రక్తస్రావం మరియు షాక్‌కు దారితీస్తాయి, ఇది ప్రాణాంతకమవుతుంది.

 

 

డెంగ్యూ జ్వరం నాలుగు దగ్గరి సంబంధం ఉన్న డెంగ్యూ వైరస్‌లలో ఏదైనా ఒక దాని వల్ల వస్తుంది. ఈ వైరస్‌లు వెస్ట్ నైల్ ఇన్ఫెక్షన్ మరియు ఎల్లో ఫీవర్‌కి కారణమయ్యే వైరస్‌లకు సంబంధించినవి.సోకిన వ్యక్తి చుట్టూ ఉండటం ద్వారా డెంగ్యూ జ్వరం పొందలేరు. బదులుగా, డెంగ్యూ జ్వరం దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది. సోకిన దోమ మరొక వ్యక్తిని కుట్టినప్పుడు, వైరస్ ఆ వ్యక్తి రక్తప్రవాహంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. డెంగ్యూ జ్వరం నుండి కోలుకున్న తర్వాత, సోకిన వైరస్‌కు దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి ఉంటుంది – కానీ ఇతర మూడు డెంగ్యూ జ్వరం వైరస్ రకాలకు కాదు. భవిష్యత్తులో ఇతర మూడు రకాల వైరస్‌ల ద్వారా మళ్లీ సోకవచ్చని దీని అర్థం. రెండవ, మూడవ లేదా నాల్గవ సారి డెంగ్యూ జ్వరం ఉంటే, తీవ్రమైన డెంగ్యూ జ్వరం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.డెంగ్యూ లక్షణాలు, సాధారణంగా సంక్రమణ తర్వాత నాలుగు నుండి ఆరు రోజుల నుండి ప్రారంభమవుతాయి మరియు 10 రోజుల వరకు ఉంటాయి.డెంగ్యూ వచ్చిన వారికీ ఆకస్మిక అధిక జ్వరం (105 డిగ్రీలు), తీవ్రమైన తలనొప్పి,కళ్ళు వెనుక నొప్పి,తీవ్రమైన ఉమ్మడి మరియు కండరాల నొప్పి

 

అలసట,వికారం,వాంతులు అవుతున్నాయి.అతిసారం,చర్మంపై దద్దుర్లు, ఇది జ్వరం ప్రారంభమైన రెండు నుండి ఐదు రోజుల తర్వాత కనిపిస్తుంది.తేలికపాటి రక్తస్రావం (ముక్కు రక్తస్రావం, చిగుళ్ళలో రక్తస్రావం లేదా సులభంగా గాయాలు వంటివి.కొన్నిసార్లు, డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు తేలికపాటివి మరియు ఫ్లూ లేదా ఇతర వైరల్ సంక్రమణ లక్షణాలు కావచ్చు. చిన్నపిల్లలు మరియు మునుపెన్నడూ ఇన్ఫెక్షన్ లేని వ్యక్తులు పెద్ద పిల్లలు మరియు పెద్దల కంటే తేలికపాటి కేసులను కలిగి ఉంటారు. అయినప్పటికీ, వారు తీవ్రమైన సమస్యలను అభివృద్ధి చేయవచ్చు. డెంగ్యూ హెమరేజిక్ జ్వరం, అధిక జ్వరం, శోషరస మరియు రక్త నాళాలు దెబ్బతినడం, ముక్కు మరియు చిగుళ్ళ నుండి రక్తస్రావం, కాలేయం పెద్దదిగా మారడం మరియు రక్త ప్రసరణ వ్యవస్థ వైఫల్యం వంటి అరుదైన సమస్యలు ఇందులో ఉన్నాయి.

 

 

 

 

లక్షణాలు భారీ రక్తస్రావం, షాక్ మరియు మరణంగా మారవచ్చు. దీన్నే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ (డి ఎస్ ఎస్ )అంటారు.బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్న వ్యక్తులు మరియు రెండవ లేదా పదేపదే డెంగ్యూ ఇన్ఫెక్షన్లు ఉన్న వ్యక్తులు డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్‌ను అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు.మీ రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు మరియు లీకేజీ అయినప్పుడు తీవ్రమైన డెంగ్యూ వస్తుంది. మరియు మీ రక్తప్రవాహంలో గడ్డకట్టే కణాల సంఖ్య (ప్లేట్‌లెట్స్) తగ్గింది. ఇది స్ట్రోక్, అంతర్గత రక్తస్రావం, అవయవ వైఫల్యం మరియు మరణానికి కూడా దారితీస్తుంది.తీవ్రమైన డెంగ్యూ జ్వరం యొక్క హెచ్చరిక సంకేతాలు, ఇది త్వరగా అభివృద్ధి చెందగల ప్రాణాంతక అత్యవసర పరిస్థితి.

 

 

 

 

హెచ్చరిక సంకేతాలు సాధారణంగా మీ జ్వరం తగ్గిన తర్వాత ఒకటి లేదా రెండు రోజులు ప్రారంభమవుతాయి మరియు క్రింది సంకేతాలు మరియు లక్షణాలను కలిగి ఉండవచ్చు.తీవ్రమైన కడుపు నొప్పి,తరచుగా వాంతులు,చిగుళ్ళు లేదా ముక్కు నుండి రక్తస్రావం,మూత్రం, మలం లేదా వాంతిలో రక్తం,చర్మం కింద రక్తస్రావం, ఇది గాయం లాగా ఉండవచ్చు.శ్వాస ఆడకపోవడం (కష్టం లేదా వేగవంతమైన శ్వాస),అలసిపోయాను,చిరాకు లేదా చంచలత్వం.ఇటీవల డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ప్రాంతాన్ని సందర్శించినట్లయితే. మీకు జ్వరం వచ్చినప్పుడు మరియు పైన పేర్కొన్న హెచ్చరిక లక్షణాలు ఏవైనా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

 

డెంగ్యూ జ్వరాన్ని నివారించడానికి ఉత్తమ మార్గం సోకిన దోమల నుండి కాటును నివారించడం. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి,ఇంటి లోపల కూడా దోమ తెరలను ఉపయోగించండి.బయట ఉన్నప్పుడు, పొడవాటి చేతుల చొక్కా మరియు పొడవాటి ప్యాంటును సాక్స్‌లో ఉంచి ధరించాలి.అందుబాటులో ఉంటే, ఇంట్లో ఎయిర్ కండిషనింగ్ ఉపయోగించాలి.విండో మరియు డోర్ స్క్రీన్‌లు సురక్షితంగా మరియు రంధ్రాలు లేకుండా ఉన్నాయని నిర్ధారించుకోవాలి.నిద్రపోయే ప్రదేశంలో స్క్రీన్ లేదా ఎయిర్ కండిషన్ చేయకపోతే, దోమతెరను ఉపయోగించాలి. డెంగ్యూ లక్షణాలు ఉంటే, వైద్యుడిని సంప్రదించాలి.

 

 

 

దోమల జనాభాను తగ్గించడానికి, దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను వదిలించుకోండి. బహిరంగ పక్షి స్నానాలు మరియు పెంపుడు జంతువుల నీటి వంటలలో నీటిని క్రమం తప్పకుండా మార్చండి, బకెట్ల నుండి నిలిచిపోయిన నీటిని ఖాళీ చేయాలి. దోమలు రాకుండా ఫాగింగ్ చేయాలి. వర్షాకాలంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. డెంగ్యూ పూర్తి నియంత్రణలో ఉండేలా చూసుకోవాలని ప్రజలు,ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

గుడ్లకర్తి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

గుడ్లకర్తి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
మొగుళ్లపల్లినేటి ధాత్రి


మొగుళ్లపల్లి మండలం గుండ్ల కర్తి గ్రామంలో మండల ప్రభుత్వ వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో ,డాక్టర్ యాస్మిని గారి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని గురువారం రోజున నిర్వహించినారు. గ్రామంలో46 మందికి వైద్య పరీక్షలు చేసి, జరపీడుతులకు రక్త నమూనాలు ఒకటి తీసి ల్యాబ్ కు పంపినారు .ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి డాక్టర్ గారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ,సిజను వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నివాస గృహాల చుట్టూ నీరు నిలవకుండా జాగ్రత్త వహించాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, ఏఎన్ఎం సులోచన పంచాయతీ సెక్రెటరీ మౌనిక ఆశా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

డాక్టర్ శ్రీధర్ డాక్టర్ సచిన్ నేతృత్వంలో వెంకట చెరువు

డాక్టర్ శ్రీధర్ డాక్టర్ సచిన్ నేతృత్వంలో వెంకట చెరువు గ్రామంలో ఆరోగ్య శిబిరం

నేటి ధాత్రి చర్ల

చర్ల మండలంలోని వెంకట చెరువు గ్రామంలో డాక్టర్ శ్రీధర్ డాక్టర్ సచిన్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ ఆరోగ్య శిబిరంలో 34 మంది రోగులను పరీక్షించారు
అనంతరం గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీలను బాలింతలను సందర్శించి తగు జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది
డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో గల గ్రామాలలో మరి ముఖ్యంగా మలేరియా వంటి వ్యాధులు విజృంభించే అవకాశం అధికంగా ఉన్నది కనుక ఆశకార్యకర్తలు ఆరోగ్య సిబ్బంది గ్రామాన్ని తరచూ సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించాలి అని అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతున్నట్లతే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చే విధంగా ప్రజలను ప్రోత్సహించాలని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మొబైల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సచిన్ హెల్త్ సూపర్వైజర్ రాంప్రసాద్ హెల్త్ అసిస్టెంట్ కొండ్రు నరసింహ మొబైల్ స్టాప్ నర్స్ దీక్షిత పాల్గొన్నారు

8 గంటల కన్నా ఎక్కువగా కూర్చొని పనిచేస్తున్నారా? జాగ్రత్త..

8 గంటల కన్నా ఎక్కువగా కూర్చొని పనిచేస్తున్నారా? జాగ్రత్త..

 

చాలా మంది ఆఫీసులో గంటల తరబడి కుర్చీలపై కూర్చుని స్క్రీన్‌ను చూస్తూ ఉంటారు. అయితే, ఇలా ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల మన ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 

నేటి డిజిటల్ ప్రపంచంలో చాలా మంది ఉద్యోగులు రోజంతా కూర్చొని పనిచేస్తున్నారు. అయితే, అదే పనిగా ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తే ప్రాణాలకే పెను ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు కూడా రోజంతా కూర్చుని పనిచేసే వారే అయితే మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. లేదంటే అనేక వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అయితే, 8 గంటల కన్నా ఎక్కువగా కూర్చొని పనిచేస్తే ఏ వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

 

గుండె జబ్బులు

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. అదే పనిగా కూర్చోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కేలరీలు బర్న్ కావు. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. ఊబకాయం క్రమంగా మధుమేహం, గుండె జబ్బుల వంటి వ్యాధులకు కారణమవుతుంది. రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటును పెంచుతుంది. వెన్నునొప్పి, కండరాలపై ఒత్తిడి పడుతుంది. ఇది దీర్ఘకాలిక నొప్పికి దారితీస్తుంది.

మానసిక ఆరోగ్యంపై ప్రభావం

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ పెరుగుతుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఎండార్ఫిన్ హార్మోన్ల స్రావం తగ్గుతుంది. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీనితో పాటు, నిద్రపై కూడా ప్రభావం చూపుతుంది. అలసట, చిరాకును పెంచుతుంది.

 

ఈ ప్రమాదం ఎందుకు పెరుగుతోంది?

కంప్యూటర్లు, మొబైల్స్, టీవీ ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల శారీరక కార్యకలాపాలు తగ్గాయి. వర్షాకాలం వంటి సీజన్లలో బయటకు వెళ్లడం మరింత తగ్గుతుంది. పిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఈ జీవనశైలికి అలవాటు పడుతున్నారు. అయితే, ఈ జీవనశైలి క్రమంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మానసిక ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది.

ఏం చేయాలి?

ప్రతి 30-40 నిమిషాలకు లేచి 2-3 నిమిషాలు నడవండి. ప్రతిరోజూ 30 నిమిషాలు వాకింగ్ చేయండి. మీ వెన్నెముకకు మద్దతు ఇచ్చే కుర్చీలో నిటారుగా కూర్చోండి. తగినంత నీరు తాగండి. ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోండి. ఈ చిన్న మార్పులు మీరు ఆరోగ్యంగా, చురుకుగా ఉండటానికి సహాయపడతాయి.

వర్షాకాలంలో పాలకూర రసం తాగితే..!

వర్షాకాలంలో పాలకూర రసం తాగితే ఏమవుతుందో తెలుసా..

వర్షాకాలంలో అనేక వ్యాధులు చుట్టుముడుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వర్షాకాలంలో పాలకూర రసం తాగితే..వర్షాకాలంలో అనేక వ్యాధులు చుట్టుముడుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వర్షాకాలంలో పాలకూర రసం తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఘనంగా ప్రపంచ మెకానిక్ డే దినోత్సవం.

ఘనంగా ప్రపంచ మెకానిక్ డే దినోత్సవం

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

 

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ప్రపంచ మెకానిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జూలై 3న జరుపుకుంటారు. మందమర్రి పాత బస్టాండ్ ప్రాంతంలో మెకానిక్ యూనియన్ సభ్యులందరూ కలిసి జెండా ఎగరవేసి మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మందమర్రి యూనియన్ అధ్యక్షుడు చిరుత మల్లేష్, యూనియన్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఆయన మాట్లాడుతూ..ఈ రోజున, వాహనాలు, యంత్రాలు మరియు ఇతర సాంకేతిక పరికరాలను సరిచేయడంలో నిర్వహించడంలో నైపుణ్యం కలిగిన మెకానిక్ల కృషిని, ప్రాముఖ్యతను గుర్తిస్తారు. ఆ మెకానిక్స్ డేను జరుపుకోవడం యొక్క ప్రాముఖ్యత మెకానిక్ల పాత్రను గుర్తించడం.
వాహనాలు,యంత్రాలు సజావుగా పనిచేయడానికి మెకానిక్ల కృషి ఎంతో అవసరం.ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెకానిక్ల కృషిని గుర్తించి,అభినందించడానికి ఈ రోజున జరుపుకోవడం జరుగుతుందని మెకానిక్స్ రోజు అనేది సాంకేతిక పరిజ్ఞానం మెకానికల్ నైపుణ్యాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
సమాజానికి సేవనందించే విధంగా
మెకానిక్ సేవలు మన జీవితాలను సులభతరం చేస్తాయిని మన కృషి లేకుండా మనం వాహనాలను లేదా ఇతర యంత్రాలను సరిగ్గా ఉపయోగించలేముని
ఈరోజు మెకానిక్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుదాంఆని మన జీవితాలను సులభతరం చేయడానికి చేసే కృషిని గుర్తుంచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎర్రోజు బ్రహ్మం, ప్రధాన కార్యదర్శి ముత్యం పల్లి భాస్కర్, మర్రి రాము,మెరుగు కిషన్,కస్తూరి సత్యం, కుమార్,ఓ శ్రీనివాస్, తుమ్మల శ్రీనివాస్,సురేష్, మున్నా,ఓదెలు,శ్రీను, జగదీష్,శంకర్,తదితరులు పాల్గొన్నారు.

సిటీ సెంటర్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ ప్రారంభించిన.

సిటీ సెంటర్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

◆ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ.సురేష్‌కుమార్ శెట్కార్,

◆ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి

◆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

 

జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంకటి శుక్లవర్ధన్‌రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ సెంటర్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్‌ను జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ.సురేష్‌కుమార్ శెట్కార్,రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.

గిరిధర్‌రెడ్డి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹ సిద్దం.ఉజ్వల్‌రెడ్డి ప్రారంభించారు.

ఇట్టి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ టీ జీఐడీసీ చైర్మన్ మహ్మద్ తన్వీర్,సీడీసీచైర్మన్ ముబీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్,కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాల అధ్యక్షులు పట్లోల్ల రాంలింగారెడ్డి,శ్రీనివాస్‌రెడ్డి, కండెం.

 

Congress leaders

 

 

 

నర్సింహులు,నర్సింహారెడ్డి,మాజీ జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు రాజశేఖర్,సీనియర్ నాయకులు భీమయ్య,జమిలాలోద్దిన్,అక్తర్ గోరి,జావిద్,జాఫర్‌,అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగిరెడ్డి,సీనియర్ నాయకులు మల్లారెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,అరుణ్ కుమార్,అక్బర్,అశ్విన్ పాటిల్,హర్షవర్ధన్ రెడ్డి,జి.కిరణ్‌కుమార్‌గౌడ్,నథానెయల్,జగదీశ్వర్ రెడ్డి,మల్లికార్జున్,నర్సింహా యాదవ్‌,సునీల్,రాజు,జుబేర్,ఇమామ్‌ పటేల్‌ మరియు తదితరులు పాల్గొన్నారు.

ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం…

ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

 

ఇటీవల అనారోగ్యంతో మరణించిన సీనియర్ పాత్రికేయుడు మునీర్ యాదిలో ఆయన పేరిట రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కేసిఓఏ క్లబ్ లో మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతం అయింది. కరీంనగర్ లోని ప్రముఖ రేని హాస్పిటల్, మంచిర్యాల మేడి లైఫ్, శరత్ మాక్స్ విజన్ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించిన వైద్య శిబిరంలో పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు. వైద్య పరీక్షలో సమస్యలు ఉన్న వారికి ఉచిత మందులు ఇవ్వడంతో పాటు అధిక సమస్యలు ఉన్నవారు ఆరోగ్య శ్రీ కార్డు, లేదా ఇన్సూరెన్స్ ఉన్నవారు తమ యొక్క ఆసుపత్రి యాజమాన్యం వారికి పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రత్యేక వైద్య నిపుణులు సూచించారు. ఈ వైద్య శిబిరంలో షుగర్, బీపీ, ఈసీజీ, 2డిఈకో, కంటి పరీక్షలు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరంలో పట్టణ ఎస్సై రాజశేఖర్, కమిషనర్ గద్దె రాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్,సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లతో పాటు పుర రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

వారంలో రొయ్యలు ఎన్నిసార్లు తినొచ్చు..

వారంలో రొయ్యలు ఎన్నిసార్లు తినొచ్చు..

 

తక్కువ క్యాలరీలతో ఎక్కువ పోషకాలను అందించే ఆహారాల్లో రొయ్యలు ఒకటి..

వంద గ్రాముల రొయ్యల్లో క్యాలరీలు వంద కన్నా తక్కువే ఉంటాయి. .

పైగా ఇరవై గ్రాముల ప్రోటీన్‌ కూడా లభిస్తుంది.

 

 

 

 

రొయ్యల్లో పోషకాలు తెలపండి. వారంలో ఎన్నిసార్లు తినొచ్చు?

తక్కువ క్యాలరీలతో ఎక్కువ పోషకాలను అందించే ఆహారాల్లో రొయ్యలు ఒకటి.

వంద గ్రాముల రొయ్యల్లో క్యాలరీలు వంద కన్నా తక్కువే ఉంటాయి.

పైగా ఇరవై గ్రాముల ప్రోటీన్‌ కూడా లభిస్తుంది. ముఖ్యంగా సముద్రపు రొయ్యల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, అయోడిన్‌, సెలీనియం, ఫాస్ఫరస్‌, జింక్‌, అస్స్టాజాన్టిన్‌ వంటి పోషకాలెన్నో ఉంటాయి.

ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్‌ గుండె, మెదడు, జీర్ణవ్యవస్థల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి.

రొయ్యల్లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

రొయ్యల్లో కొలెస్ట్రాల్‌ కూడా అధికంగా ఉంటుంది.

 

కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకున్నప్పుడు కొంతమందిలో రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది.
కానీ ఈ పరిస్థితి అందరికీ ఉండదు.
అందువలన ఒకవేళ అధిక కొలెస్ట్రాల్‌ సమస్య ఉన్నవారైతే రొయ్యలు తరచూ తీసుకోకపోవడం మంచిది.
రొయ్యల్లో సోడియం కూడా అధికంగానే ఉంటుంది కాబట్టి రక్తపోటు ఉన్న వారు మితంగా తీసుకోవాలి.
ఏ సమస్య లేని వారైతే వారానికి రెండుసార్లు మించకుండా రొయ్యలు తీసుకోవచ్చు.
తక్కువ నూనెతో వండి తీసుకొంటే తక్కువ క్యాలరీలతోనే అధిక పోషకాలు, ఆరోగ్యం పొందవచ్చు.
కొంతమందికి రొయ్యల అలర్జీ ఉంటుంది.
ఆ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి తగిన వైద్యం పొందాలి.

 

ఆకుకూరలన్నింటిలోనూ, ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే వాటిలో పోషకాలు ఎక్కువని విన్నాను, నిజమేనా?

– సుమతి, హైదరాబాద్‌

ఏడాది పొడవునా, అందుబాటు ధరలకే లభించే ఆకుకూరలు మంచి పోషకాలందించే ఆహారం.

ఆకుకూరలన్నింటిలో సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ’సి‘, నియాసిన్‌, విటమిన్‌ ’కె‘ లతో పాటు క్యాల్షియం, ఐరన్‌ లాంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.

ఆకుకూరలు తినే అలవాటు అధిక రక్తపోటును తగ్గించేందుకు, నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది.

 

వీటిలో ఎక్కువగా ఉండే పీచుపదార్థాలు రక్తంలో కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరాయిడ్స్‌ను నియంత్రించేందుకు…

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, పెద్దప్రేగు క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి.

ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం తదితర ఖనిజాలను కలిగి ఉండటం వల్ల ఆకుకూరలు ఎదిగే వయసులో ఉన్న పిల్లలకూ శారీరక శ్రమ చేసేవారికీ కూడా ప్రయోజనకరం.

ఆకుకూరల్లోని ఐరన్‌, ఫోలేట్‌ మహిళల్లో, మరీ ముఖ్యంగా గర్భిణుల్లో రక్తహీనత నివారించడానికి, తగ్గించడానికి అత్యుత్తమంగా పనిచేస్తుంది.

ముదురు ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు కొంచెం అధిక మొత్తంలో ఉంటాయి కానీ ఆకుకూరలేవైనా వివిధ రకాల్లో వివిధ మోతాదుల్లో పోషకాలుంటాయి.

తాజాగా దొరికే వాటిని అవకాశాన్ని బట్టి ఎంచుకుంటే మంచిది.

ఎప్పుడైనా బయటకెళ్ళి రెస్టారెంట్లో తిన్నప్పుడు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా ఎంచుకోవాలి?

– మధుసూదన్‌, విశాఖపట్టణం

 

ఆరోగ్యమైన ఆహారపు అలవాట్లు ఎవరికైనా చాలా మంచిది.

ఎప్పుడైనా రెస్టారెంట్లలో లేదా బయటి ఆహారం తినేప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రుచిని ఆస్వాదిస్తూనే ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు.

బయటి ఆహారంలో కల్తీ పదార్థాలు, నిల్వ పదార్థాలు వాడే అవకాశం ఎక్కువ.

అందుకే నాణ్యతా ప్రమాణాలు సక్రమంగా పాటించే రెస్టారెంట్లలో మాత్రమే తినాలి.

కృత్రిమ రంగులు వాడే పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది.

 

కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో వెళ్ళినప్పుడు ఆర్డర్‌ చేసిన పదార్థాలను అందరూ పంచుకున్నట్టయితే, అన్నింటి రుచి చూస్తూనే మితంగా తినవచ్చు.

బఫెట్‌ భోజనం అయినట్లయితే మీకు నచ్చిన పదార్థాలు నాలుగైదు ఎంచుకొని వాటి వరకే తిని, తిరిగి ఇంట్లో అందుబాటులో ఉండే ఆహారాన్ని తినకుండా ఉంటే క్యాలరీలు కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు..

ఇలా బయటి ఆహారం తినడం అనేది ప్రతీ వారాంతం కాకుండా…

ఏవైనా ప్రత్యేకమైన సందర్భాలకు మాత్రమే పరిమితం చేసుకొంటే ఎటువంటి ఇబ్బందీ ఉండదు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version