వర్షాలు… బీ కేర్ ఫుల్….!
◆:- ముంచుకొస్తున్న అంటువ్యాధుల ముప్పు,
◆:- దోమల, ఈగల వ్యాప్తిని అరికట్టాలి
◆:- పరిసర ప్రాంతాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
◆:- మురికి నీరు నిల్వలేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
◆:- రోడ్డు పక్కన ఉండే తినుబండారాలతో అంటువ్యాధుల వ్యాప్తి
◆:- సంబంధితశాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలి.
◆:- ప్రజలకు అవగాహన. సూచనలు, సలహాలు ఇవ్వాలి
◆:- అంటువ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
వర్షాకాలం వచ్చిందంటేనే అంటూ వ్యాధుల ప్రభావం అధికమవుతుంది. గత వారం రోజుల నుండి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు మరింత త్వరగా వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణ కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకొని సంబంధిత శాఖలు సమన్వయంతో ఆరోగ్య శాఖ అమలు చేస్తున్న కార్యచ రణ పై ప్రజలకు అవగాహన, సలహాలు, తగు సూచనలు ఇచ్చి అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకే అవకాశం అధికంగా ఉంటుంది. నిల్వ ఉండే నీరు, కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రత వల్ల దోమలు, ఈగలు, కీటకాలు, పందులు తదితర జంతువుల ద్వారా టైయిపాద్, కలరా, చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ, మెదడువాపు, విష జ్వరాలు, పైలేరియా, విరో చనాలు తదితర వంటి అంటూ వ్యాధులు వ్యాప్తిస్తాయి. అలాగే రోడ్డు పక్కన విక్రయించే చిరుతిండ్లు పానీపూ రితో అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది. అంతేకా కుండా బహిరంగ మల, మూత్ర విసర్జనతో అంటువ్యా ధులు సోకుతాయని అలాగే పదార్థాలు, ద్రవాలపై వాలిన కీటకాలతో వ్యాధులు త్వరగా వ్యాప్తిస్తాయి. ప్రధానంగా వ్యక్తిగత పరిసరాల అపరిశుభ్రత అంటు వ్యాధుల వ్యాప్తికి దోహదపడతాయి.వాతావరణంలో వస్తున్న మార్పులతో జనాలు విష జ్వరాలకు గురవుతున్నారు. ఉష్ణోగ్రతలో వస్తున్న మార్పులు ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపు తున్నాయి. దీనికి తోడు లోపించిన పారిశుధ్యం ప్రధాన కారణంగా మారింది. రోడ్లపైనే మురికి నీరు నిల్వ ఉండడంతో దోమలు, ఈగలు వృద్ధి చెందడం అంటు వ్యాధులు వ్యాప్తి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అదే విధంగా వైద్యశాఖ ముందు జాగ్రత్తలతో జ్వరాలను నియంత్రించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన చెందడంతో అవసరం ఎంతైనా ఉంది.
సీజనల్ వ్యాధులు,
గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో డ్రైనేజీ లలో పేరుకుపోయిన పూడికతతో రోడ్లపైనే మురికి నీరు నిలుస్తుంది. దీంతో దోమలు వ్యాప్తి చెంది ప్రజలు వైరల్ వ్యాధుల భారీనా పడే ప్రమాదం ఉంది. తలనొప్పి, గొంతు నొప్పి, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, విష జ్వరాలు, డెంగ్యూ, బోధకాలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
అధికారులు సమన్వయంతో పని చేయాలి.
గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాల ప్రభావంతో అంటువ్యాధులు సోకే అవ అవకాశం ఉన్నందున సంబంధిత శాఖ అధికారులు సమన్వ యంతో పనిచేసి అంటువ్యాధులు నివారణ అరికట్టేం దుకు పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకొని సంబంధిత శాఖల సమన్వయంతో సమీక్ష సమావేశం నిర్వహించి అంటువ్యాధుల నివారణకు తీసుకోవల సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంటూ వ్యాధులు సోకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రోగాలు వ్యాపించకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. కాచి వడబోసిన నీటిని తాగాలి. రోడ్డు పక్కన అమ్మే తినుబండారాలు తినకూడదు. వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించి పరిస రాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నీటి నిల్వ ఉండకుండా చూసుకొని ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఏదైనా వ్యాధి సోకిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్సలు చేయించుకోవాలి.
పరిశుభ్రతను పాటించాలి..
వర్షాకాలంలో చాలా రకాల వ్యాధులు పొంచి ఉంటాయి. ముఖ్యంగా పరిశుభ్రతను పాటించకపోవడం వలన ఈ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి. నివాస ప్రాంతాలను, పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఆహారం తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం, కాచి చల్లార్చిన నీటిని తాగడం, ఆహార పదార్థాలపై మూతలను ఎల్లప్పుడూ పెట్టి ఉంచడం వంటివి చేయాలి. బయటి ఆహార పదార్థాలను తినకపోవడం చాలా ఉత్తమం. ఆహార పదార్ధాలపై ఈగలు వాలకుండా, చూసుకోవడంతో పాటు వేడి పదార్ధాలను
మాత్రమే తినాలి. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. అస్వస్థకు గురైన వెంటనే సమీప వైద్యుడిని సంప్రదించాలి. వర్షాకాలంలో వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.
డాక్టర్ రమ్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఝరాసంగం.