‘వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం’. 

‘వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం’. 

దేవరకద్ర /నేటి ధాత్రి.

 

 

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్ యార్డ్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను మద్దతు ధరతో కొనుగోలు చేసి, వారి అకౌంట్లలో డబ్బులు వేస్తామన్నారు. సన్నాలు పండించిన రైతులకు మద్దతు ధరతో పాటు.. రూ.500 బోనస్‌ వస్తుందని అన్నారు.
అనంతరం చిన్న రాజమూర్ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన చిన్న రాజమూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్ర గొల్ల ప్రేమ్ కుమార్ యాదవ్ తల్లి భౌతిక దేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను.!

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్.

 

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని వెంకటేశ్వర్ల పల్లి చైతన్య గ్రామైక్య సంఘం,చౌటుపర్తి శ్రీ ఆంజనేయ గ్రామైక్య సంఘం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా లకు ధాన్యాన్ని తరలించి,ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.దీనివల్ల 500 రూపాయల బోనస్ కూడా రైతులకు చేకూరుతుందన్నారు.రైతుల ఆర్థిక అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.మద్దతు ధర క్వింటాలుకు ‘ఎ ‘ గ్రేడ్ రకం రూ. 2320.సాధారణ రకానికి ధర 2300‌. ఉందన్నారు.ఈ కార్యక్రమం లో ఏవో జైసింగ్,ఏపిఎం రమాదేవి,కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షు డు బుర్ర దేవేందర్ గౌడ్, సమన్వయ కమిటీ సభ్యులు పెద్దబోయిన రవీందర్ యాదవ్,ఈర్ల చిన్ని, బొల్లె బిక్షపతి,పిఏసిఎస్ సెంటర్ ఇంచార్జ్ పెండ్యాల మహేందర్ రెడ్డి,సీఈవో చోటా మియా, టాప్ ఆపరేటర్ పెగడ ఓం ప్రకాష్,సిసి కుమారస్వామి, మహిళా సంఘం సభ్యులు హరిత,స్వరూప,నవ్య శ్రీ, లక్ష్మి,మాధవి,ప్రసన్న,హైమ, రమ్య,తిరుమల,రైతులు తదితరులు పాల్గొన్నారు.

గర్భిణీలు,బాలింతలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి

గర్భిణీలు,బాలింతలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి

తొర్రూరు(డివిజన్) నేటి ధాత్రి

 


Pregnant women

గర్భిణీలు బాలింతలు పిల్లలు అంగన్వాడి కేంద్రాలలో ప్రభుత్వం పంపిణీ చేసే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అమర్ సింగ్ తండా, కర్రె బిక్యా తండా, చౌల తండా అంగన్వాడి సెంటర్లలో చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పోషకాహారం తీసుకోవడం వల్లే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్న రాగి జావా, పల్లి పట్టి, నువ్వుల లడ్డు, జొన్న లడ్డు, చిరుధాన్యాలతో లడ్డు, బెల్లంతో తయారు చేసిన పరమాన్నం, పుట్నాలు, వేరుశనగ పల్లీల పొడి, మునగాకు కారం పొడి మొదలగు పదార్థాలు,పోషక విలువలు గల ఆహార పదార్థాలు ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మడిపల్లి హెల్త్ సూపర్వైజర్ జిఎల్. మేరీ, అంగన్వాడి టీచర్లు జె కమలాదేవి, వి.భారతి, చంద్రకళ, సీత, ఏఎన్ఎం ఉమా,శారద, ఆశా కార్యకర్తలు స్వరూప,కరుణ, ఆయా శారద, స్థానికులు పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం.

అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలం రసూల్ పల్లి అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం శుక్రవారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆర్. కవిత మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు కోవాల్సిన పోషకాహారం గురించి పిల్లలకు అందించాల్సిన పౌష్టికాహారం గురించి వివరించారు.గర్భిణీ స్త్రీలలో రక్తహీనత రాకుండా ఉండాలంటే తాజా కూరగాయలు,పండ్లు ఆకుకూరలు,చిరుధాన్యాలు,పాలు సమృద్ధిగా తీసుకోవాలని సూచించారు.ప్రతి ఒక్కరు కూడా ఆకుకూరలు చిరు ధాన్యాలను వాడడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని తెలియజేశారు.పిల్లలకి బయట జంక్ ఫుడ్ పెట్టొద్దని ఇంట్లో తయారుచేసిన పౌష్టికాహారం మాత్రమే పెట్టాలని సూచించడం జరిగింది.ఇందులో భాగంగా అక్షరాభ్యాసం,సీమంతం కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ నిర్మల,ఆయా,గర్భిణీలు బాలింతలు,పిల్లల తల్లి తండ్రులు,ఇతరులు పాల్గొనడం జరిగింది.                           

సన్న బియ్యం భోజనం చేసిన కాంగ్రెస్ మహిళలు.

చేనేత కార్మికుడి ఇంటిలో సన్న బియ్యం భోజనం చేసిన కాంగ్రెస్ మహిళలు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో బి.వై నగర్ లోని చేనేత కార్మికుడి ఇంటిలో సన్న బియ్యం భోజనం చేసిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి మరియు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత -నలినీకాంత్ మాట్లాడుతు గత ప్రభుత్వహయాంలో దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంతన్న హయాంలో పేద, ప్రజలందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగినది.

నేడు సిరిసిల్ల జిల్లాలోని మహిళలందరూ కూడా వాళ్ల పిల్లలకి వాళ్ళ కుటుంబ సభ్యుల అందరికీ కూడా కడుపునిండా భోజనం తింటున్నారని పేద ప్రజలందరి కళ్ళలో సంతోషం వ్యక్తం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు మడుపు శ్రీదేవి, మరియు జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోడం అరుణ, జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ సామల రోజా సుధ, సిరిసిల్ల మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి కాజా పాల్గొన్నారు.

రాజీవ్ నగర్ మాజీ కౌన్సిలర్ ఔదార్యం.

రాజీవ్ నగర్ మాజీ కౌన్సిలర్ ఔదార్యం.

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

 

వివరాల్లోకి వెళితే రాజీవ్ నగర్ లో గత కొన్ని ఏళ్లుగా పైప్ లైన్ విదులు నిర్వహిస్తున్న కాదాసు దేవయ్య గత పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.

Distributed rice.

 

అలాగే నిరుపేద కుటుంబానికి చెందిన గాజుల ప్రకాష్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాదపడుతు పది రోజుల క్రితం మృతి చెందాడు.ఇరు కుటుంబాలని పరామర్శించిన వార్డు తాజా మాజీ కౌన్సిలర్ ఒగ్గు ఉమా రాజేశం గారు ఇరు కుటుంబాల కు 50 kg చొప్పున బియ్యం పంపిణీ చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పచ్చునూరి శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు తీగల ప్రవీణ్, పార్టీ నాయకులు గొరిట్యాల శ్రీకాంత్,సట్కూరి చిట్టిబాబు, నక్క సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

పేదలందరికీ సన్నబియ్యం అందించడమే.!

పేదలందరికీ సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యం…
– దేశంలోనే సన్న బియ్యం అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ
– కాంగ్రెస్ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు మొగుళ్ళపల్లి

నేటి ధాత్రి. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాష్టకంగా: చేపట్టిన ఉచిత సన్నబియ్యం పథకాన్ని మొగుళ్లపల్లి మండలపరిధిలోని పాత ఇ స్సీ పేట గ్రామంలో జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు డీలర్ బొచ్చు లక్ష్మి లబ్ధిదారులకు స్వయంగా బియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా తక్కల్లపల్లి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేదవాడీ ఇంటికి సన్నబియ్యం చేరాలన్న గొప్ప సంకల్పంతో చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఉగాది, రంజాన్ పండుగల శుభసందర్భంగా దారిద్రరేఖకు దిగువనున్న పేదవారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. పేదవారికి పట్టెడన్నం పెట్టాలన్న గొప్ప ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని 2కోట్ల 61లక్షల మందికి పేదలకు తలకు ఆరు కిలోల సన్నబియ్యం అందజేస్తున్నామని తెలిపారు. అందుకు 10600 కోట్లు కేటాయించింది అయినప్పటికీ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. .పేదలు దొడ్డు బియ్యం తినలేకపోవడం వలన పీడీఎస్ బియ్యాన్ని మిల్లర్లు, దళారులు రీ సైక్లింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి పేదవారి ఇంట ప్రతిరోజూ పండుగ జరగాలన్న ఆలోచనతో, పేద వారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించాం.
దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచింది. ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది. రైతుల శ్రమ ఎక్కడికీ పోదు. ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల మేరకు రుణమాఫీ చేశాం. 7,625 కోట్ల మేరకు రైతు భరోసా చెల్లించాం. రైతు భరోసా 10 వేల నుంచి 12 వేలకు పెంచిన గొప్ప ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. సన్నవడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని రైతులను ప్రోత్సాహకాలు అందిస్తున్న గొప్ప ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సన్న బియ్యం పంపిణీ.

సన్న బియ్యం పంపిణీ. 

నిజాంపేట, నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు ఆధ్వర్యంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ఈపథకం ద్వారా రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలకు పోషకాహారాన్ని అందించడమే ఈపథకం యొక్క ఉద్దేశమన్నారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మా గౌడ్ ,రహీం, రజిని, పోచవ్వ, బాలవ్వ తదితరులు పాల్గొన్నారు

రేషన్ దుకాణాలకు సన్న బియ్యం పంపిణ చెయాలి. 

రేషన్ దుకాణాలకు సన్న బియ్యం పంపిణ చెయాలి. 

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి .

వనపర్తి నేటిదాత్రి :

 

శుక్రవారం, హైదరాబాద్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్న బియ్యం సరఫరాపై తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు దొడ్డు బియ్యం తినడం ఆపేశారని, దీన్ని గమనించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న సోనామసూరీ బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. సన్న బియ్యం సరఫరా పంపిణీ విజయవంతం అవుతుందని, 84 శాతం జనాభా ఆహార భద్రతకు సుస్థిరత ఏర్పడిందన్నారు.
రేషన్ దుకాణాలకు సన్న బియ్యం సరఫరా రవాణాను వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. రవాణా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి, సన్న బియ్యం రవాణాపై కలెక్టర్ లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు,కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు నిరు పేదలతో కలిసి ప్రభుత్వం సరఫరా చేస్తోన్న సన్న బియ్యంతో భోజనం చేయాలని మంత్రి సూచించారు అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ప్రారంభించామని, దీనికి కృషి చేసిన అధికారులకు,సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సన్న బియ్యం పంపిణీ కారణంగా రేషన్ దుకాణాల వద్ద ఒకేసారి డిమాండ్ పెరిగిపోతున్నందున బియ్యం రవాణాను వేగవంతం చేయాలని, రేషన్ దుకాణాల వద్ద అవసరమైన మేర బియ్యం అందుబాటులో ఉండాలని సూచించారు. సంచుల కొరత ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకు రావాలని, సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
సన్న బియ్యం పంపిణీపై ప్రభుత్వ చిత్తశుద్ధి చాటేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.నూతన ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు .కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలకు వేగంగా సన్న బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. సన్న బియ్యం రవాణాను, నూతన ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలన్నా. రు సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల డిఎం జగన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం.!

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం. చౌకగా ప్రభుత్వ సన్నబియ్యం పేదలకు పంపిణి

ఎస్సి సేల్ మండల అధ్యక్షులు ఓనపాకల ప్రసాద్

మొగులపల్లి ఏప్రిల్ 4 నేటి ధాత్రి

మండలంలోని ములకలపల్లి గ్రామంలోని చౌక ధరల దుకాణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాలతో. కాంగ్రెస్ పార్టీ మొగులపల్లి మండల కమిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఓనపాకల ప్రసాద్. రేషన్ షాపులో అర్హులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. చౌక ధరల దుకాణం నుండి చౌకగా పేదల ఇండ్లకు చేరిన సంపన్నుల సన్నబియ్యమని ఓనపాకాల ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో. చౌక ధరల దుకాణం ద్వారా నాసిరకం దొడ్డు బియ్యం సరఫరా జరిగేదని ఆ బియ్యాన్ని ప్రజలు ఎవరు కూడా తినేవారు కాదని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల ద్వారా సన్న వడ్లను కొనుగోలు చేసి క్వింటాకు 500 బోనస్ ఇవ్వడంతో పాటు రేషన్ కార్డు దారులు అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని అన్నారు ముఖ్యమంత్రి అన్న మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రైతుల వద్ద సన్న ధాన్యాన్ని 500 బోనస్ చెల్లించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర ఆడించి రాష్ట్రంలోని చౌక దరల దుకాణం ద్వారా అర్హులైన వారికి 6 కిలోల చొప్పున1.81.686 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతినెల ప్రభుత్వం ద్వారా సరఫరా జరగనుందని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి సన్న బియ్యం పంపిణీ చేస్తుందని రేషన్ డీలర్లు పౌరసరఫరాల రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో. సన్న బియ్యం సంక్షేమ పథకాన్ని విజయవంతం చేయాలని అధికారులను వేడుకున్నారు. సన్న బియ్యం పంపిణిలో డీలర్లతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

రేషన్ షాప్ లో సన్నబియ్యం పంపిణి.

రేషన్ షాప్ లో సన్నబియ్యం పంపిణి

గంగారం, నేటిధాత్రి:

 

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పునుగోండ్ల గ్రామం లో డీలర్ ఒక కొత్త ప్రచారం చేస్తున్నాడు రేషన్ షాప్ లో సన్నబియ్యం వచ్చాయని సాయంత్రం సమయంలో గ్రామం లో డప్పు సాటింపు చేపించి మరి బియ్యం పంపిణి చేస్తున్నారు ప్రజలు ఉదయమే రేషన్ షాపు కు వస్తున్నారని రేషన్ కార్డు లబ్ధిదారులందరికి సన్నబియ్యం పంపిణి చేయడం జరుగుతుందని..
అన్నారు,,,,

సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయం.

పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయం:ఎమ్మెల్యే కడియం
దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం
చిల్పూర్(జనగాం)నేటి ధాత్రి

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఓ చారిత్రాత్మక నిర్ణయం అని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.చిల్పూర్ మండలంలోని శ్రీపతి పెళ్లి, మల్కాపూర్, చిన్న పెండ్యాల గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై రేషన్ కార్డుదారులకు శుక్రవారం సన్న బియ్యం పంపిణీ చేసి కార్యక్రమం ప్రారంభించారు.అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఈ సందర్భంగా మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని దళారులకు అమ్ముకోవద్దని సూచించారు.రాష్ట్రంలో పెద్దవాళ్లు, పేదవాళ్లు అనే తేడా లేకుండా అందరూ ఒకే రకమైన అన్నం తినాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.

Sanna Rice

 

ఆనాడు 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి ఎన్టీ రామారావు ఎలా గుర్తుండిపోయారో ఈ రోజు సన్న బియ్యం పంపిణీ చెస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా అదే స్థాయిలో గుర్తిండిపోతుందని అన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన దొడ్డు బియ్యం అక్రమ మార్గల్లో రాష్ట్రం దాటి, దేశం దాటి పోతున్న నేపథ్యంలో ప్రభుత్వం అందించే బియ్యం పేదల కడుపు నింపాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి ఒక్కరికీ 6కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసిందని అన్నారు.సన్న బియ్యం పంపిణీ లో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పంపిణీ జరగాలని ప్రభుత్వం అందించే సన్న బియ్యంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వచ్చే వర్షాకాలంలోపు మల్లన్న గండి లిఫ్ట్ పనులను పూర్తి చేసి చిల్పూర్ మండలానికి సాగునీరు అందించే బాధ్యతనాదని హామీ ఇచ్చారు.నియోజకవర్గ అభివృద్ధిని గత పాలకులు పట్టించుకోలేదని అన్నారు. తాను ఎమ్మెల్యే గా ఎన్నికైన నాటి నుండి ప్రతీ రోజు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నాని వెల్లడించారు.ఎన్నికల సమయం లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాలువల వెంట తిరుగుతూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ కాలువల నిర్మాణం, పూడికతీత, చెట్ల తొలగింపు వంటి పనులను వేగవంతం చేసి పంటలకు సాగు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. మరో ఏడాది కాలంలో నియోజకవర్గం లోని ప్రతీ ఎకరానికి సాగు నీరు అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్దే నా ఏకైక ఎజెండా అని, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే వరకు విశ్రమించనని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు,నాయకులు,మండల రేషన్ డీలర్లు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల 9వ వార్డు రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణి.

సిరిసిల్ల 9వ వార్డు రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణి

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణం 9వ వార్డు (సర్ధాపూర్, జెగ్గరావుపల్లె) లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి గారు గంభీరావుపేట ప్రశాంత్ గౌడ్ గారు.

 

Ration shop.

బాలకీస్టాయ్య, యాదయ్యా,రాజనర్సు,కనకయ్య,రాములు,ఉపేందర్, షాధుల్, అంజయ్య, తిరుపతి, మోఫిక్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పారు..

పంటల కోతలు వాయిదా వేసుకోవాలి.

పంటల కోతలు వాయిదా వేసుకోవాలి.

మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం.

నర్సంపేట ఏ.డీ.ఏ దామోదర్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

Crop harvesting should be postponed.

వాతావరణంలో వచ్చిన మార్పులు నేపథ్యంలో మొక్కజొన్న, ఎండుమిర్చి, ఇతర పంటల కోతల నిర్వహణ పనులను వాయిదా వేసుకోవాలని నర్సంపేట డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కే. దామోదర్ రెడ్డి రైతులను కోరారు. ఈ సందర్భంగా ఏడిఏ మాట్లాడుతూ అకస్మాత్తుగా వచ్చిన వాతావరణ మార్పుల్లో మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

 

వరంగల్ జిల్లా పరిధి పలు ప్రాంతాలతో పాటు నర్సంపేట డివిజన్ లోని 6 మండలాలకు మూడు రోజులపాటు వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.కోత దశలో ఉన్న మొక్కజొన్న,ఎండుమిర్చి, ఇతర పంటల కోత మరొక రెండు రోజుల పాటు వాయిదా వేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.ఇప్పటికే కోసిన మొక్కజొన్న,ఎండుమిర్చి పంట ఇతర ఉత్పత్తుల పట్ల అప్రమత్తమై ఇళ్లల్లో జాగ్రత్తగా తడవకుండా భద్రపరచుకోవాలని అన్నారు.ఒకవేళ కల్లాలలో ఉన్నచో వాటినిటార్పాలిన్లతో తగువిధంగా భద్రపరచుకొనుటకు పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకోవాలని ఏటియ దామోదర్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు.

సన్న బియ్యం పంపిణిని ప్రారంభం.

సన్న బియ్యం పంపిణిని ప్రారంభం

గంగారం, నేటిదాత్రి:

 

గంగారం మండలం కోమట్ల గూడెం గ్రామంలోని రేషన్ దుకాణంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ఈపథకం ద్వారా రైతుల కష్టానికి సన్న వడ్ల కు క్వింటకు 500 రూపాయల బోనస్ కల్పిస్తూ వారికీ గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలకు పోషకాహారాన్ని అందించడమే ఈపథకం యొక్క ఉద్దేశమన్నారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఈసం రమ, కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు మంకిడి విజయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు,మహిళా లు తదితరులు పాల్గొన్నారు…

సన్న బియ్యం పంపిణిని ప్రారంభించిన AMC చైర్మన్.

సన్న బియ్యం పంపిణిని ప్రారంభించిన ఏఎంసి చైర్మన్

రామడుగు, నేటిదాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని రేషన్ దుకాణంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గోపాల్రావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఎఏంసి చైర్మన్ మాట్లాడుతూ ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ఈపథకం ద్వారా రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలకు పోషకాహారాన్ని అందించడమే ఈపథకం యొక్క ఉద్దేశమన్నారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ పిండి సత్యం, రేషన్ డీలర్ నార్ల మంగ రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

పేదలకు సన్న బియ్యం పంపిణి.

పేదలకు సన్న బియ్యం పంపిణి

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

Distribution of fine rice to the poor

బిజనేపల్లి మండలం కేంద్రం, మంగనూర్ గ్రామంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గురువారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తీసుకొస్తున్నామన్నారు. అందులో భాగంగా, ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది” అని తెలిపారు. రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలు ఆకలికి గురికాకుండా పోషకాహారాన్ని అందించడమే ఈ పథక ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు. ఈ పథక ఫలాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు..

లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం సజావుగా అమలవ్వాలని, బియ్యం పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలను సహించేది లేదని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ పథకం విజయవంతంగా అమలుకావడానికి ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. ఎమ్మెల్యే గ్రామ ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సన్న బియ్యం పంపిణీ విప్లవాత్మక మార్పు…

సన్న బియ్యం పంపిణీ విప్లవాత్మక మార్పు…

కాంగ్రెస్ నాయకులు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

ప్రభుత్వ చౌకధర దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం విప్లవాత్మక మార్పు అని కాంగ్రెస్ నాయకులు అన్నారు.గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7,8,10 చౌకధర దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం కళ, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, రఘునాథ్ రెడ్డి, అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య లు ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. పేదలు,ధనికులు అనే తేడా లేకుండా అందరూ ఒక్కటేనని భావంతో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయడం ప్రజాపాలన ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇస్తున్న అన్ని సరుకుల పంపిణీని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎత్తివేసి దొడ్డు బియ్యం మాత్రమే పంపిణీ చేసి పేదల పట్ల పక్షపాత వైఖరి ధోరణి అవలంబించిందని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పొలం సత్యం, పనాసరాజు, మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, శ్యాం గౌడ్, శ్రీనివాస్ గౌడ్ ,సత్యం, చంద్రయ్య, పుల్లూరి కళ్యాణ్, మహిళా నాయకురాలు పుష్ప తదితరులు పాల్గొన్నారు.

పేదలకు పౌష్టిక ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.

పేదలకు పౌష్టిక ఆహారం
అందించడమే ప్రభుత్వ లక్ష్యం

నాగర్ కర్నూల్ / నేటి ధాత్రి

 

 

రాష్ట్రంలోని పేద ప్రజలకు సన్న బియ్యం అందుబాటులో ఉండాలి పేదలకు పౌష్టిగా ఆహారం అందాలని వచ్చే నాలుగు సంవత్సరాలు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇది ప్రజా ప్రభుత్వం పేద ప్రజల మేలు కోరే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలకు సన్నబియ్యం పంపిణీ ఈ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు,18వ వార్డు, 8వ వార్డులలో ఏర్పాటు చేసిన సన్న బియ్యం పంపిణీ పథకం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పేదలకు సన్నబియ్యం పంపిణీలు చేసిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉగాది కానుకగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభించారు శ్రీమంతుల తరహాలో సన్నబియ్యం పేదలకు కూడా అందాలని దేశంలో ఎక్కడా లేని విధంగాతెలంగాణ రాష్ట్రంలో సీఎం సన్న బియ్యం పంపిణి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసమే చేస్తుందని అందుకే వారి ఆకలి తీర్చేందుకు ఈ పథకాన్ని తేవడం జరిగింది.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

నిన్న కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న వరి పంటలు.

నిన్న కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన బిజెపి శ్రేణులు
– రైతులను ఆదుకోవాలని ఎమ్మార్వో కు వినతి పత్రం
చందుర్తి, నేటిధాత్రి 

 

heavy rain.

నిన్న కురిసిన భారీ ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి దెబ్బ తిన్న పంటలను బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ ఆధ్వర్యంలో పరిశీలించి ఎమ్మార్వో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నియోజకవర్గ కన్వీనర్ నాయకులు మార్తా సత్తయ్య మాట్లాడుతూ మండలంలో పలు గ్రామాల్లో నిన్న కురిసిన చేతికంది పంట దాదాపు 60% నష్టం వాటిల్లిందని, గత ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ పసల్ బీమా యోజన స్కీం ని ఇక్కడ అమలు చేయకపోవడం బాధాకరమని, ఫసల్ బీమా యోజన ఉంటే నష్టం జరిగిన రైతులకు ఇన్సూరెన్స్ అందేదని, ఇప్పటికైనా ఫసల్ బీమా యోజన అమలు చేయాలని, తక్షణమే ఈ ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని వ్యవసాయ అధికారులను వ్యవసాయ క్షేత్రం లోకి పంపించి పంట నష్టం అంచనా వేసి ఎకరాకు 50,000వేల రూపాయలు నష్టపరిహారం అందించాలని మార్త సత్తయ్య అన్నారు, ఈ పంట నష్టం పర్యవేక్షణలో బిజెపి మండల అధ్యక్షులు మొకిలి విజేందర్, ప్రధాన కార్యదర్శులు పెరుక గంగరాజు, మర్రి మల్లేషం, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మూడపెళ్లి ముఖేష్ , మనోహర్ రెడ్డి , బొరగాయ తిరుపతి , లింగాల రాజన్న, నిరటి శేకర్, హనుమయ్య చారి, చింతకుంట గంగాధర్, సిరికొండ తిరుపతి, మట్కామ్ మల్లేశం, పాటి సుధాకర్, కూతురు మహేందర్ రెడ్డి, అల్లం శేఖర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version