ఘనంగా టీజీఈ చైర్మన్,టీఎన్జీవో కేంద్ర సంఘం…

ఘనంగా టీజీఈ చైర్మన్,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా టిజిఈ జేఏసీ చైర్మన్,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలు మంచిర్యాల టీఎన్జీవో కార్యాలయంలో బుధవారం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ఉద్యోగుల సమస్యలు సాధించడానికి ఉద్యోగులందరూ టిజిఇ జేఏసీ చైర్మన్,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ కి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్నం మల్లయ్య,అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాబురావు, ఉపాధ్యక్షులు కేజియా రాణి,రామ్ కుమార్ సంయుక్త కార్యదర్శి,రవి కిరణ్ మంచిర్యాల యూనిటీ అధ్యక్షులు,నాగుల గోపాల్ బెల్లంపల్లి యూనిటీ అధ్యక్షులు,వెంకటేష్ సభ్యులు రోశయ్య తదితరులు పాల్గొన్నారు.

రజక సంఘానికి భూమి పూజ…

రజక సంఘానికి భూమి పూజ

నేటి ధాత్రి కథలాపూర్

కథలాపూర్ మండలంలోని దులూరు గ్రామంలో బుధవారం రోజున రజక సంఘ నూతన భవన నిర్మాణానికి సంఘ సభ్యులు భూమిపూజ చేసారు.రజక సంఘానికి పార్లమెంట్ సభ్యులు MP లాడ్స్ నుండి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు 3 లక్షల రూపాయలు మంజూరు చేసారని తెలిపారు ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, సహకారాన్ని అందించిన వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చెన్నమనేని వికాస్ రావు లకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్యాల మారుతి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వర్రావు,నరెడ్ల రవి,కాసోజీ ప్రతాప్,లక్ష్మి నర్సయ్య,రాజేష్,జెలందర్,మీన్ రెడ్డి, రాజారెడ్డి,వెంకటేష్,శ్రీమాన్,శ్రీకాంత్, రాజు,గంగారాం పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-8-1.wav?_=1

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది

బిఆర్ఎస్ సేన రాష్ట్ర అధ్యక్షులు
వెంగని మనోహర్

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని ప్రెస్ క్లబ్ లో బిఆర్ఎస్ సేన రాష్ట్ర అధ్యక్షులు వెంగని మనోహర్ మాట్లాడతూ.. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి పాదయాత్రలో కులగణన 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసినదే, కానీ నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుల గణన అనే పేరుతో బీసీ బిడ్డలను మోసం చేస్తూ గద్దెన ఎక్కి కూర్చొని నేడు బీసీలకు విద్యా, వైద్యం, ఉపాధి కల్పనలో వెనుక అడుగు వేసేలా చూస్తుందని అంతేకాకుండా ఏదో ఒక బీసీ కుల గణన అని రాష్ట్రవ్యాప్తంగా చిన్న సర్వే చేపట్టి, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరియు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రెండు ఒక్కటై బీసీలను మోసం చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో శీలం స్వామి, నందగిరి భాస్కర్ గౌడ్,
మెరుగు తిరుపతి, నెమలికొండ భాస్కర్, కురుమని ప్రశాంత్, బొట్టుకు అజయ్,పీట్ల విన్న బాబు, అమర కొండ కృష్ణ, తదితర బిఆర్ఎస్ నాయకులు, పలు కార్యకర్తలు పాల్గొన్నారు.

సిపిఐ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీ లోకి భారీ చేరికలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2-2.wav?_=2

సిపిఐ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీ లోకి భారీ చేరికలు

నేటిధాత్రి చర్ల

 

చర్ల మండలంలోని మామిడి గూడెం సిపిఐ శాఖ కార్యదర్శి ఇర్పా రామారావు బెస్త కోత్తురు సిపిఐ శాఖ కార్యదర్శి మునిగేలా రామారావు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరినారు కెసిఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాయని మళ్ళీ రాష్టంలో గులాబీ జెండా ఎగరాలని స్టానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తామని పలువురు అన్నారు


మామిడి గూడెం లో ఇరప అబ్బాస్ కారం నర్సింహారావు కారం జోగా రావు బెస్త కొత్తూరు లో జీడిగుంట్ల సతీష్ దొడ్డి మల్లయ్య మునిగేలా సతీష్ మునిగేల పద్మ సైదా భద్రకేళి తదితరులు ఈ రోజు
బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మండల కో కన్వీనర్ ఐనవోలు పవన్ కుమార్ సీనియర్ నాయకులు తెల్లం లక్ష్మి నారాయణ సమక్షంలో చేరారు


ఈ కార్యక్రమం లోభద్రాచలం మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ చర్ల మండల పార్టీ కో కన్వీనర్ పవన్ కుమార్ మాజీ ఎంపీటీసీ కుంజా నాగేశ్వరావు మాజీ సర్పంచ్ కారం కన్నారావు ఎస్కె సాధిక్ తదితరులు ఉన్నారు

క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-06T130153.632-1.wav?_=3

క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలం ఏడాకులపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రె కంటి శంకరమ్మ అనే మహిళ బుధవారం ఉదయం ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలినట్లు తెలిసింది. ప్రమాదంలో శంకరమ్మ తో పాటు ఆమె కుమారులు ప్రభు, విట్టల్ లకు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో క్షతగాత్రులను జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ,విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు నాయకులతో కలిసి ఆసుపత్రి కి చేరుకుని , ప్రమాద వివరాలు కుటుంబ సభ్యులను ,గ్రామస్తులను అడిగి తెలుసుకునారు డాక్టర్ ల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు అంబులెన్స్ లలో జిల్లా ఆసుపత్రి కి తరలించారు ,ఎమ్మెల్యే డాక్టర్ లతో మాట్లాడుతూ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అన్నారు,త్వరగా కోలుకుంటారు అని అధైర్యపడొద్దు అని,అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని తెలిపారు* ….
అనంతరం ఆసుపత్రి లో అనారోగ్యంతో బాధపడుతున్నవారితో మాట్లాడుతూ వారికి అందుతున్న చికిత్స వివరాల్ని అడిగి తెలుసుకున్నారు.మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు మరియు సిబ్బంది సూచించారు .ఎమ్మెల్యే గారితో పాటుగా ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి సర్పంచ్ లు శ్రీనివాస్ రెడ్డి, ప్రభు పటేల్ ,నాయకులు నరేష్ రెడ్డి ,శంకర్,నవీన్ తదితరులు ఉన్నారు..

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరిన ఎమ్మెల్యే

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-06T114519.415.wav?_=4

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

కవర్గాలబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని మరియు నియోనికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు గత ప్రభుత్వం లో నియోజకవర్గంలోని నిరుపేదలకు అర్హులైన 660 మంది లబ్దిదారులకు లాటరీ సిస్టం ద్వారా ఎంపిక చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించడం జరిగింది డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు వెంటనే అందించాలని & నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నిష్పాతపక్షంగా ఉండాలని,అర్హులైన వారందరికీ పార్టీలకు అతీతంగా అందజేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య గారికి వినతిపత్రం అందజేసిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు ఎమ్మెల్యే గారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, పాక్స్ చైర్మన్ మచ్చెందర్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్, మాజి సర్పంచ్ చిన్న రెడ్డి తదితరులు ఉన్నారు..

డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ..

డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి.

భూపాలపల్లి నేటిధాత్రి

రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందించకుండా డైవర్షన్ పాలిటిక్స్ ను చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని నిబద్ధతతో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు నిరుపయోగంగా సముద్రంలోకి వెళుతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలనే దృక్పథంతో నిర్మించారని గత పాలకులు ఎవరు ప్రజల ప్రయోజనాన్ని గుర్తించలేదని తెలిపారు.సర్దార్ కాటన్ ధవలేశ్వరం ప్రాజెక్టు సంవత్సరాల తరబడి నిర్మాణం చేశారు కానీ అయిన పైన కూడా కమీషనర్లు ఎంక్వయిరీ చేసి అనేక ఇబ్బందులకు గురిచేసినారు గత ప్రభుత్వాలు అని వారు అన్నారు ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేయాలని విద్యా వైద్యం రంగాలలో అధిక ప్రాధాన్యతనిస్తూ మహాత్మ జ్యోతిరావు పూలే కస్తూరిబా ఆశ్రమ పాఠశాలలో మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు అందించడంలో అధికారులు విఫలమయ్యారు ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి అని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కటకం జనార్ధన్ పినిశెట్టి రాజిరెడ్డి సేగ్గం వెంకట్రాణి సిద్దు కల్లెపు రఘుపతిరావు గండ్ర హరీష్ రెడ్డి మేకల సంపత్ కుమార్ యాదవ్ కవిత జుమ్మలాల్ శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీ లోకి భారీ చేరికలు…

సిపిఐ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీ లోకి భారీ చేరికలు

నేటిధాత్రి చర్ల

చర్ల మండలంలోని మామిడి గూడెం సిపిఐ శాఖ కార్యదర్శి ఇర్పా రామారావు బెస్త కోత్తురు సిపిఐ శాఖ కార్యదర్శి మునిగేలా రామారావు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరినారు కెసిఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాయని మళ్ళీ రాష్టంలో గులాబీ జెండా ఎగరాలని స్టానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తామని పలువురు అన్నారు
మామిడి గూడెం లో ఇరప అబ్బాస్ కారం నర్సింహారావు కారం జోగా రావు బెస్త కొత్తూరు లో జీడిగుంట్ల సతీష్ దొడ్డి మల్లయ్య మునిగేలా సతీష్ మునిగేల పద్మ సైదా భద్రకేళి తదితరులు ఈ రోజు
బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మండల కో కన్వీనర్ ఐనవోలు పవన్ కుమార్ సీనియర్ నాయకులు తెల్లం లక్ష్మి నారాయణ సమక్షంలో చేరారు
ఈ కార్యక్రమం లోభద్రాచలం మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ చర్ల మండల పార్టీ కో కన్వీనర్ పవన్ కుమార్ మాజీ ఎంపీటీసీ కుంజా నాగేశ్వరావు మాజీ సర్పంచ్ కారం కన్నారావు ఎస్కె సాధిక్ తదితరులు ఉన్నారు

కోరికిశాల కస్తూర్బా పాఠశాలను సందర్శించిన…

కోరికిశాల కస్తూర్బా పాఠశాలను సందర్శించిన ఏఐఎస్ఎఫ్ బృందం

ఎస్ఓ ను తక్షణమే సస్పెండ్ చేయాలి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోత్కు ప్రవీణ్ కుమార్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగులపల్లి మండల కేంద్రంలోని కొరికిశాల కస్తూర్బా పాఠశాలను ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్తుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఎస్ఓ, వర్కర్ల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థకు గురై ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు.
గతంలో విద్యార్థులు పలుసార్లు భోజనం బాగాలేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని ఎస్ఓ దృష్టికి తీసుకువచ్చిన ఏం మాత్రం పట్టించుకోకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని తెలిపారు మరలా ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తక్షణమే బాధ్యత వహించి అన్ని కస్తూర్బా పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టలను ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు పర్యటించాలని కోరారు.
కస్తూర్బా పాఠశాల విద్యార్థులను అడిగి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది అని అన్నారు. వారి సమస్యలపై పోరాటాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్, జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల ప్రవీణ్ దొంతర బోయిన అజయ్ రాజేష్ పవన్ రత్న రమాకాంత్ కన్నురి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కస్తూర్భా గాంధీ విద్యాలయంను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర..

కస్తూర్భా గాంధీ విద్యాలయంను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

అస్వస్థతకు గురైన వారి యొక్క ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు.

ఇంతటి నిర్లక్ష్యానికి కారణమైన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్.

నాణ్యత లేని కూరగాయలు, ఫుడ్ తో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం.

:- మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్ళపల్లి మండలం, కొరికిశాల గ్రామంలోని కస్తూర్భా గాంధీ విద్యాలయం లో పురుగుల అన్నం తిని వాంతులు, వీరేచనాలు, కడుపునొప్పితో దాదాపు 31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన్నారు.
విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి నేడు బిఆర్ఎస్ నాయకులతో కలిసి కస్తూర్భా గాంధీ విద్యాలయంను సందర్శించి, విద్యార్థుల సమస్యను అడిగి తెలుసుకున్నారు.
ఏదైనా సమస్య ఉంటే నాకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వండి అని తన ఫోన్ నెంబర్ ఇచ్చారు.
ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ…
విద్యార్థులు తినే ఆహారాన్ని విషంగా మార్చేస్తున్నారు.
కస్తూర్భా గాంధీ కళాశాలలో కలుషితమైన ఆహారం తిని 31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన్నారు.
ఈ సంఘటన ఉదయమే జరిగింది కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికి విద్యార్థుల పరిస్థితి విషమించటంతో మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రాలకు తరలించి వారికీ చికిత్స అందించడం జరిగింది.
నేను గత శుక్రవారం రోజున ఇదే కస్తూర్భా స్కూల్ సందర్శించడం జరిగింది.
ఆ రోజు కుళ్ళిపోయిన కూరగాయలు, సొరకాయలు ఇవన్నీ కూడా బాగాలేవు వాళ్లకు మెనూ ప్రకారం పెట్టాల్సినటువంటి కూడా ఫుడ్ పెట్టడం లేదు, పప్పు ఒక చెంచా,ఉల్లిగడ్డ పులుసు చేసి పెట్టడం జరిగింది. చాలామంది విద్యార్థులు చాలా తక్కువ కూర తక్కువ కలుపుకుని తింటా ఉన్నారు. కొంచెం ఎక్కువ వీళ్లకు క్వాంటిటీ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది.ఆ రోజు మండలానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ఏఈ ఈ స్కూల్ కి స్పెషల్ ఆఫీసర్ గా ఇక్కడకు రావడం జరిగింది, వారికీ కూడా విషయం చెప్పడం జరిగింది. ఆయన కూడా విద్యార్థులను కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని విషయాలను తెలుసుకొని, పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి, విద్యావ్యవస్థ సక్రమంగా నడిచేలా మీరు స్పెషలాఫీసర్ దృష్టి పెట్టాలి.

రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంత నిర్లక్ష్యంగా ఉందనడానికి నిన్నోక్కటే రోజు మూడు స్కూల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటనలు. మొన్నటి రోజున విద్యార్థులు రోడ్డెక్కి నడుచుకుంటూ పోయి కలెక్టర్ కార్యాలయం పోయి తమ సమస్యలు చెప్పుకునే స్థితిని చూస్తే మరి ప్రభుత్వానికి పూర్తిగా నిర్లక్ష్య ధోరణి కనపడతా ఉన్నది.

మేము కూడా బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా ఈ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వానికి తెలిసేలా ఎక్స్పోజ్ చేసి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం కొరకు కార్యక్రమాన్ని మేము చేస్తే ఇక్కడ ఉండేటువంటి నాయకులు మేము కమిట్మెంట్ తో చేస్తా ఉంటే మాపై విమర్శలు చేస్తున్నారు. నేను రాకుండా మీరు ఈ సమస్యలు రాకుండా చూసుకుంటే మిమ్మల్ని ప్రజలు అభినందిస్తారు.

ఈ రోజు విమర్శలు చేయడం వల్ల సమస్య నుంచి తప్పించుకోలేరని, ఈరోజు మీకు అర్థమైంది.

కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉండేటువంటి విద్యా వ్యవస్థ అదే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ రెండు కూడా నిర్లక్ష్య ధోరణి లో ఉన్నాయి. మరీ జిల్లా జనరల్ అసుపత్రిలోని కింది స్టాప్ అంతా కూడా మరి రాజకీయ ప్రమేయం తోటి నియమించబడ్డాయి. కాబట్టి అక్కడ ఎవరు కూడా సరిగా కో ఆపరేట్ చేయడం లేదు ఇక్కడ వంట వండే వాళ్ళలో ఏదో నిర్లక్ష్యం ఉందని చెప్పి మరి ఇక్కడ ప్రిన్సిపాల్ గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వెంటనే ప్రిన్సిపాల్ సస్పెండ్ చేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునఃరావృత్తి కాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిని చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం.

విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా ఇక్కడ జరుగుతున్నట్టువంటి పరిణామాలను మీ పిల్లలు ఉన్నారు కాబట్టి వారి ద్వారా తెలుసుకుని మీరు ఇక్కడ మా దృష్టికి తీసుకురావాలని, ఎందుకంటే పిల్లలు చెప్పడానికి భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మేము ఉంటాము, మాకు ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయో అని భయపడుతున్నారు.
కాబట్టి మీరే పిల్లలు నుంచి సమాచారం సేకరించి మా దృష్టి తీసుకెళ్తే తప్పకుండా వీటిని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తెలియజేస్తూ.
ఇప్పటికైనా స్పెషల్ కమిటీ నియమించి కనీసం వారంలో ఒకరోజు సర్ప్రైజ్ విజిట్ చేసి ఫుడ్ క్వాలిటీ ఎట్లుంది, ఎంత క్వాంటిటీ ఇస్తా ఉన్నారు, ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నది అనే విషయాలపై దృష్టి పెట్టాలనికోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ సర్పంచులు బి ఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కొండేటి శ్రీధర్

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-13-1.wav?_=5

ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కొండేటి శ్రీధర్

వర్దన్నపేట (నేటిధాత్రి):

బీజేపీ మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా, ఇంటింటికి బీజేపీ, ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు అనే కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం లో ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఎస్ సీ మోర్చా అధ్యక్షులు వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం లో గడప గడపకు బీజేపీ పాలనను చేరావేస్తున్న కొండేటి శ్రీధర్ ఈ కార్యక్రమం లో వర్థన్నపేట మండల స్థానిక ఎన్నికల కన్వీనర్ రాయపురపు కుమారస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి సత్యం, ఇల్లంద ఎంపీటీసీ ఒకటవ స్థానానికి ప్రబారి పెద్దూరి రాజకుమార్, మాజీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చీపురు వెంకటస్వామి, సీనియర్ నాయకులు కొట్టూరి రవి, మల్లె పాక దూడయ్య, యువ మోర్చా మండల అధ్యక్షులు పెందోట మహంత్, బూత్ అధ్యక్షులు సంతోష్,తాటికాయల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ జిల్లా నాయకులు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ జిల్లా నాయకులు.

చిట్యాల, నేటి ధాత్రి :

చిట్యాల మండలం తిరుమలాపూర్* గ్రామానికి చెందిన పెండ్లి రవి ఇటీవల మరణించగా నేడు వారి నివాసాలకు వెళ్లి పెండ్లి రవి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం* అందజేశారు.అదే గ్రామానికి చెందిన కంచు చంద్రమ్మ* ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం* అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు గజ్జి రవి, యూత్ అధ్యక్షుడు రాంబాబు, చిట్యాల టౌన్ యూత్ అధ్యక్షులు అల్లం రాజు, కొత్తపల్లి రాము గోపగాని శివకృష్ణ, గోల్కొండ మహేష్, ఎలగొండ చిరంజీవి, గోపగాని వెంకటేశ్వర్లు, నీరటి నారాయణ, నాగిరెడ్డి శంకర్, కంచు తిరుపతి, గొర్రెటి ఓదెలు, గద్దల తిరుపతి, జన్నె జనార్ధన్, కలవేన ప్రవీణ్, నగరపు సాయి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ప్రాజెక్ట్ కాళేశ్వరం.

తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ప్రాజెక్ట్ కాళేశ్వరం

కాళేశ్వరం ప్రాజెక్టు పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి

కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు అది

కాంగ్రెస్ పార్టీ కమిషన్ రిపోర్ట్

పిసి గోష్ రిపోర్ట్ తప్పులతడక

కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి ,డోర్నకల్ మాజీ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ ఫైర్

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కేంద్రమైన మరిపెడ మండల కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు గెస్ట్ హౌస్ లో నవీన్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి,డోర్నకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని సమాజంలో బదనాం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు, అది కాళేశ్వరం కమీషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ కమిషన్ గా పని చేస్తుందన్నారు, పీసీ ఘోష్ కాంగ్రెస్ కార్యకర్తలాగ పనిచేసి కాంగ్రెస్ లీడర్లు మాట్లాడిన విషయాలనే రిపోర్టులో పొందు పరిచాడు అన్నారు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో కట్టిన తెలంగాణ ప్రజల వరప్రదాయని ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, లక్ష ఎకరాలకు తాగు,సాగునీరు ఇచ్చె ప్రాజెక్టు ను ఎండ బెట్టే కుట్రకు తెర లేపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు,తెలంగాణ రైతాంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు, రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వర్షాలు లేక పంటలు ఎండుతుంటే కనీసం రైతులకు సాగు నీరు ఇవ్వాలన్న సోయి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ముఖ్యంగా రైతులను ఆగం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి రైతుల గొస తగులుతుందన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కప్పి పుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న దురదృష్టపు పాలన అన్నారు,కేసీఆర్ ను తెలంగాణ సమాజంలో తక్కువ చేయాలని తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ముద్రను చెరిపేయాలని ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందన్నారు ,కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాల రైతులు రెండు కార్లు పంటలు పండి రైతులు సంతోషం వ్యక్తం చేసే వారు అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక కాళేశ్వరం ద్వారా వచ్చే నీటిని రాకుండా చేసి రైతులను ఆగం చేస్తుందన్నారు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 420 హామీల ను ఎప్పుడు అమలు చేస్తారన్నారు,ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అన్నారు,రైతులకు 100శాతం ఋణ మాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక చేతులెత్తేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు,
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అధికారంలో కి వచ్చి బీసీలను మభ్య పెట్టే విధంగా డిల్లీ లో ధర్నా లు అంటూ నాటకాలు ఆడుతున్నారన్నారు,మహిళలకు 2500 ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇచ్చిన దిక్కులేదు గాని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాడట ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వo, వికలాంగులు 6000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి వికలాంగులను మోసం చేసింది అన్నారు,బిఆర్ఎస్ కార్యకర్తలు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే ఆరోపణలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మూల్యం తప్పదు అన్నారు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తెలంగాణ ప్రభుత్వం వస్తుందని రైతులు,నిరుద్యోగ విద్యార్థులు, మహిళలు అందరు ఎదురుచూస్తున్నారని, ముఖ్యంగా రైతులు ఈ ప్రభుత్వం పోయి కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు,మాజీ ఎంపీపీ గడ్డం వెంకన్న,గాదె అశోక్ రెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తేజావత్ రవీందర్,కాలు నాయక్,కొమ్ము చంద్రశేఖర్, మాజీ ఎంపిటిసి కొమ్ము నరేష్,బిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు రేఖ వెంకటేశ్వర్లు, వెంకన్న,సీనియర్ నాయకులు బాలాజీ నాయక్,గండి మహేష్ గౌడ్,గంధసిరి కృష్ణ,దుస్స నరసయ్య, అజ్మీర రెడ్డి, మండలంలోని వివిధ గ్రామాల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సైకిళ్ల పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-05T161018.043-1.wav?_=6

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సైకిళ్ల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి దాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక జడ్పీహెచ్ఎస్ స్కూల్లో. తంగళ్ళపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వెర్న్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో స్కూలు విద్యార్థిని విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన పురస్కరించుకొని మోడీ గిఫ్ట్ గా జడ్పిహెచ్ఎస్ స్కూల్ లోని విద్యార్థిని విద్యార్థులకు సైకిలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే కింది స్థాయి నుంచి వచ్చి భారతీయ జనతా పార్టీలో ఎన్నో పదవులు పొంది కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు బండి సంజయ్ కుమార్ బాటలో విద్యార్థిని విద్యార్థులు తమ భవిష్యత్తులో ఆయన ఆదర్శంగా తీసుకొని. చదువుతోపాటు ఆటపాటలతో. ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. ప్రధానోపాధ్యాయులు చిలుముల శంకర్ స్వామి. ఎంఈఓ. రాజు నాయక్. వెంకటస్వామి. బిజెపి ప్రధాన బిజెపి మండల ప్రధాన కార్యదర్శిఇటుకల రాజేందర్. వినయ్ యాదవ్. ఉపాధ్యక్షులు రెడ్డి మల్ల ఆశీర్వాద్. కోడం భవిత. సిలివేరి ప్రశాంత్. కలికోట చరణ్. ఇటికల మహేందర్. జలపతి. కృష్ణ. నందగిరి నవీన్. నులికొండ శ్రీనివాస్. అమరగుండ రాజు.. గోనపల్లి శ్రీనివాస్. రేగుల రాజు. బాల మల్లేశం. కట్ట తిరుపతి తదితరులు పాల్గొన్నారు

కాశీబుగ్గలో మాజీ ఎమ్మేల్యే నన్నపనేని పుట్టినరోజు వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-05T155207.278.wav?_=7

కాశీబుగ్గలో మాజీ ఎమ్మేల్యే నన్నపనేని పుట్టినరోజు వేడుకలు

నేటిధాత్రి, కాశీబుగ్గ.

వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ జన్మదిన సందర్భంగా కాశిబుగ్గ జంక్షన్లో 19వ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు చిలువేరు పవన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నన్నపనేని జన్మదిసం సందర్భంగా మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి చేతుల మీదుగా భారీ కేకు కట్ చేసి పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కంచ సంపత్, గోరంటల మనోహర్, 20వ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు ఎండి ఇక్బాల్, బూషిపాక రవి, పెండ్యాల సోను, బానోత్ కిరణ్ నాయక్, పుల్లా రమేష్, జక్కీ అశోక్, కలివేలు శేషు, వేముల జయ సాయి, దేవరకొండ చంద్రమోహన్, మంతెన అమ్రేష్, చిమ్మని గోపి, క్యాతం రంజిత్, బిల్లా శివ, చెన్నూరి కిషోర్, చిమ్మని శివ సంతోష్, చింత కింది రాజకుమార్, నోముల అభిలాష్, హరి శంకర్, జెక్కి యుగంధర్, నాసం హరీష్, భాగ్యలక్ష్మి, ఒంటెల కరుణ, దేవిక, శరత్, పులి చేరి సదానందం, బిఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

రాబోయే “ఎన్నికల్లో”, కాబోయే “కార్పొరేటర్లెవరు”..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-05T125609.607-1.wav?_=8

రాబోయే “ఎన్నికల్లో”, కాబోయే “కార్పొరేటర్లెవరు”..

నేటిధాత్రి, వరంగల్ తూర్పు.

తెలంగాణ రాజకీయంలో కొత్తపుంతలు తొక్కుతున్న తూర్పు వర్గపోరు…

వరంగల్ రాజకీయాల్లో “కాశీబుగ్గ” రాజకీయాలు వేరయ్యా..? ఆ నలుగురు ఒకటే…?

తూర్పులో “కాశీబుగ్గ” తో పాటు.., “కరీమాబాద్” కూడా అర్థం కానీ రాజకీయమే..!

“దేశాయిపేట” నుండి మొదలు పెడితే.., “కొత్తవాడ” వరకు ప్రజలు ఒకే విధంగా తీర్పు ఇవ్వరనేది నిజమేనా…?

“శివనగర్” అసలే ప్రత్యేకం..? “గిర్మాజీపేట” లో ఈసారి మార్పు తప్పదా? “మండిబజార్” మర్మం అందరికి తెలుసు..!

లేబర్ కాలనీ, అబ్బనికుంట ఒకే విధంగా ఉంటుందా? చింతల్ ప్రాంతం కూడ కొంత చింత పడాల్సిందేనా?

“మట్వాడ” పీఠం కొందరికే తెలుసు?, “పిన్నవారి స్ట్రీట్, చౌరస్తా” వారికే సొంతం?

“ఖిలావరంగల్ కోట” లో కింగ్ లు మారేనా?.. “ఉర్సు”, “రంగశాయిపేట” సైతం మార్పు వచ్చేనా..?

వరంగల్ తూర్పు నియోజకవర్గ రాజకీయంలో ఉన్న డివిజన్ల వారిగా ప్రస్తుత “కార్పొరేటర్ల” గెలుపు.., ఓటమిలపై.. స్పెషల్ స్టోరీలు..

శత్రువుకి శత్రువు, మిత్రుడు.. అన్నట్లు సాగుతుంది తూర్పు రాజకీయాలు..?

ఎవరి “పాచికలు” వారికే నమ్మకం? చివరికి “కార్యకర్తలే” అపనమ్మకం?

డివిజన్ వారిగా పని తీరు?.. ప్రజల మెప్పు ఎవరికి? కాబోయే కార్పొరేటర్ ఎవరు?

మీ “నేటిధాత్రి” లో…..

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ శాఖ లసమావేశం….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-05T122230.511.wav?_=9

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ శాఖ లసమావేశం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం నర్సింహులపల్లి. మల్లాపూర్ గ్రామంలో. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ శాఖల పార్టీల సమావేశం ఏర్పాటు చేస్తూ ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలు గురించి అవగాహన కల్పిస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన స్థానిక అభ్యర్థులని గెలిపించుకోవాలని ప్రచారం చేస్తూ ప్రభుత్వం వచ్చిన 18 నెలల లోపే. ప్రభుత్వం ఇచ్చిన ఆర్ గ్యారంటీలే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి. ఇందులో ఇందిరమ్మ ఇండ్లు కానీ. సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ. రైతు రుణమాఫీ కానీ. మహిళలకు పావలా వడ్డీ.10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ తో పాటు 18 నెలలలో ప్రభుత్వం చేసిన ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను. అందించారని వివరిస్తూ ప్రజలకు. అవగాహన చేయడం జరిగింది. అందుకే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని. అభివృద్ధిలో ముందు ఉంచుతూ. గత ప్రభుత్వాలు చేసిన అప్పులను తీర్చుకుంటూ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలను అభివృద్ధిలో ముందు ఉంచుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి. జిల్లా కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి. మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ల భరత్ గౌడ్. జిల్లా సీనియర్ నాయకులు ఆఖరి బాలరాజు.మల్లేష్ యాదవ్. ఎడ్ల తిరుపతి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాల ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఆదివాసుల హక్కులను పరిరక్షించాలి…

ఆదివాసుల హక్కులను పరిరక్షించాలి…

సమిష్టి జీవన పద్ధతులు, సహజీవనం,పారదర్శకతకు నిలువెత్తు సాక్షులు ఆదివాసులు…

ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులపై జరుగుతున్న దాడులను ఆపాలి…

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి…

అడవి సంరక్షణ సవరణ బిల్లును వ్యతిరేకించాలి…

నేటి ధాత్రి-గార్ల:-

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-05T115349.870.wav?_=10

దశాబ్దాల కాలంలో అన్ని దేశాలు పరస్పర సహకారంతో మానవ హక్కులు, పర్యావరణం, విద్య, ఆరోగ్యం, సంస్కృతి, సాంప్రదాయాలు, సామాజిక ఆర్థిక రంగాల్లో ప్రగతి సాధించడానికి కృషి చేయాలని నిర్ణయించినప్పటికీ దేశవ్యాప్తంగా నేడు దీనికి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆల్ ఇండియా తెలంగాణ ట్రైబల్ రాష్ట్ర ఫోరం నాయకులు జి. సక్రు అన్నారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి పోరాట దినోత్సవం సందర్భంగా మంగళవారం చిన్నకిష్టాపురం, సత్యనారాయణపురం, గుంపెళ్ళగూడెం గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సక్రు మాట్లాడుతూ, ఈశాన్యభారతంలో,మధ్య భారతంలో సామ్రాజ్యవాద రూపంలో ఉన్న పాలకులు ఆదివాసులపై యుద్ధం ప్రకటించారని,భారతదేశ మూలవాసులైన ఆదివాసీలను అంతమొందించే చర్యలను చేపట్టారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యవాద విధానంపై విల్లు ఎక్కుపెట్టిన బీర్ షా ముండా, కొమురం భీమ్, రాంజీ గోండుల పోరాటాల ఫలితంగా నాడు రాజ్యాంగంలో ఐదు మరియు ఆరవ షెడ్యూల్ ఏర్పాటు అయితే నేడు ఈ చట్టాల ఊసే లేదని వీటిని నిర్వీర్యం చేయడానికి పాలకులు కొత్త చట్టాలను తీసుకువచ్చారని ఆయన అన్నారు.కేంద్ర ప్రభుత్వం మణిపూర్ లో గిరిజన తెగల మధ్య విద్వేషాగ్ని రాజేషి అంతులేని అరాచకాలు కొనసాగిస్తుందని ఆయన అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా పోడు సాగు దారులు అందరికీ పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.మన చట్టాలను తూట్లు పొడుస్తూ బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన ఆదివాసి వ్యతిరేక చర్యలను వ్యతిరేకించాలని ఇందులో భాగంగా ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ను వాడవాడనా, గ్రామ,గ్రామాన జరపాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కవిత,ఇందిరా, భారతి, వెంకన్న,సైదులు, సాంబయ్య,ధర్మయ్య,రాధా తదితరులు పాల్గొన్నారు.

ముంపు సమస్యల సమయాత్తం కావాలి..

ముంపు సమస్యల సమయాత్తం కావాలి

రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్

*ముంపు నివారణ కోసం వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు,
జిడబ్ల్యూఎంసీ కమిషనర్ లతో సమీక్షా*

అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో గ్రేటర్ నగరంలోని ప్రధాన నాలలను పరిశీలించిన స్పెషల్ సీఎస్

 

వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి:

వర్షాకాలంలో తలెత్తే ముంపు సమస్యలను ఎదుర్కొనేందుకు
అధికారులు ప్రణాళికాబద్ధంగా సమాయాత్తం కావాలని రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు.

Flood problems need time to end.

సోమవారం జిడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో అరవింద్ కుమార్ వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, స్నేహ శబరిష్, జిడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి లతో కలసి గ్రేటర్ వరంగల్ నగరంలో
వర్షాకాలంలో వరదల ముంపు నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు ప్రణాళికల్లో భాగంగా, వరద ముంపు ప్రాంతాలను గుర్తించడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండటం వంటి అంశాలపై కూలంకషంగా సమీక్షించి సమర్ధవంతంగా నిర్వహించుటకు అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ మాట్లాడుతూ గతంలో వరద ముంపు సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలన్నారు.వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని,ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలన్నారు.అందుకుగాను ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.సకాలంలో స్పందించకపోతే చిన్నసమస్య కూడా పెద్ద విపత్తుగా మారే అవకాశం ఉంటుందని అరవింద్ కుమార్ అధికారులను హెచ్చరించారు.అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నగరంలోని ప్రధాన నాలల స్థితిగతులు, పూడికతీత పై సమీక్షిస్తూ వరద నీరు నిలువకుండా నాలాల్లోకి పంపేలా ముందస్తుగా పనులు చేయాలని తెలిపారు.బయటి నుంచి వచ్చే వరద నీటిని దారి మళ్లించేలా చూడాలని, జిల్లాలో బల్దియా ఆధ్వర్యంలో నిర్వహించబడే డిఆర్ఎఫ్,జిల్లా అగ్నిమాపక శాఖ,ఎస్డిఆర్ఎఫ్ బృందాలు భారీ వర్షాలవల్ల నష్టం జరగకుండా ముంపు నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు.రాష్ట్ర స్థాయిలో 6 ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని అత్యవసత్యవసర పరిస్థితుల్లో ఈ బృందాలను వినియోగించుకోవాలని అన్నారు.

Flood problems need time to end.

దీంతో పాటుగా ఆపద మిత్ర వాలంటీర్ల సేవలు కూడా ఉపయోగించుకోవాలన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా, సైరన్ ద్వారా నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. పునరావాస కేంద్రాలను ముందుగానే సిద్దం చేసుకోవాలన్నారు.గ్రేటర్ వరంగల్ లోని 66 డివిజన్ల కార్పొరేటర్లు, ఆధికారులతో వాట్స్అప్ గ్రూప్ ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు చేపట్టాలని తెలిపారు.సీజన్ వ్యాధులు ప్రబలే నేపథ్యంలో ముఖ్యంగా తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.ఎన్డిఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ దామోదర్ సింగ్ మాట్లాడుతూ ముందస్తుగా వరద నివారణ ప్రణాళికలను చేసుకొన్నచో సునాయసంగా వరదనుండి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవచ్చునని అన్నారు.వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ వర్షాకాలంలో తక్షణ చర్యలకు అవసరమైన సిబ్బంది, వాహనాలు, డ్రైనేజీ పరికరాలు సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందుగానే సమర్థవంతమైన ప్రణాళికతో ఉన్నట్లు తెలిపారు.

Flood problems need time to end.

సత్వర సహయార్ధం జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1800 425 3424 ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలో డి.ఆర్ ఎఫ్ బృందాలతో పాటు ఆపద మిత్ర వాలంటీర్ల సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో తాగునీటి కలిషితం కాకుండా ప్రత్యేక చొరవ తీసుకునున్నట్లు, అన్ని చెరువుల ఎఫ్టిఎల్ మ్యాప్పింగ్ చేస్తున్నట్లు తెలిపారు.హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ లో గల 193 లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధవహించి ఎప్పటికప్పుడు సానిటేషన్ నిర్వహణతో పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టుటకు అప్రమత్తంగా ఉంచడం జరిగిందన్నారు.ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అసిస్టెంట్ ఇంజనీర్, సానిటరీ ఇన్స్పెక్టర్, కార్మికులతో ప్రత్యేక బృందాలను నియమించడం జరిగిందన్నారు.బల్దియా కమిషనర్ చాహాత్ బాజ్ పాయి మాట్లాడుతూ కార్పొరేషన్ కు చెందిన సమాచారాన్ని అందజేయడానికి నగర వ్యాప్తం గా 5 ప్రాంతాల్లో వేరియబుల్ మెసేజ్ డిస్ప్లే బోర్డ్ సమాచారాన్ని ప్రదర్శిస్తూ ప్రజలకు అప్రమత్తం చేయడం జరుగుతున్నదని,బల్దియా ప్రధాన కార్యాలయం లో టోల్ ఫ్రీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 1980 ఫోన్ నెం :9701999645, వాట్స్ అప్ నెం: 9701999676 ద్వారావర్షానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్న సత్వరమే సహాయం అందించనున్నట్లు తెలిపారు.ప్రజలకు పబ్లిక్ అనౌన్స్ మెంట్ ద్వారా కూడా సమాచారం అందిస్తూ ఐసిసిసి ద్వారా ఎప్పటికపుడు వర్షపాత తీవ్రత ను గుర్తిస్తూ క్షేత్ర స్తాయి లో ఉండే అధికారులకు సమాచారం అందజేసి పరిష్కరించేలా చూస్తున్నట్లు,100 కార్యాచరణలో భాగంగా సిడిఏంఏ సూచించినట్లు డ్రైన్ లకు మెష్ లు ఏర్పాటు చేస్తూ లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికపుడు డీ వాటరింగ్ , శానిటేషన్ కు సంబంధించి డ్రైన్ లలో ఎప్పటికపుడు చెత్త తొలగింపు ప్రక్రియ భారీ వర్షాలు కురిసే క్రమంలో ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించి వారికి బెడ్ షీట్లు ఆహారం అందించేలా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ అన్నారు.శిథిల భవనాలకు నోటీసులు జారీ, వారిని తక్షణమే ఖాళీ చేయించడం జరుగుతున్నదని అన్నారు.అనంతరం ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి నయీమ్ నగర్ నాలా, రాజాజీ నగర్ కల్వర్టు, ప్రెసిడెంట్ పాఠశాల నుండి నయీమ్ నగర్ వరకు రిటర్నింగ్ నిర్మించిన రిటైనింగ్ వాల్, జవహర్ నగర్, సమ్మయ్య నగర్, భద్రకాళి చెరువు ఎఫ్ టి ఎల్ లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సమావేశంలో అదనపు కమిషనర్ జోనా,ఉప కమిషనర్లు రవిందర్, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, ఎలక్ట్రిక్, డిఆర్ ఎఫ్, టౌన్ ప్లానింగ్, స్మార్ట్ సిటీ విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వర్షాకాలంలో.. రైతులకు ఊరట.

వర్షాకాలంలో.. రైతులకు ఊరట.

షీట్ షెడ్ నిర్మాణానికి రూ.175 కోట్లు నిధులు మంజూరు.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.

జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, గాల్వాలూమ్ షీట్ రూఫింగ్‌తో కూడిన కవర్‌డ్ షెడ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.75 కోట్ల నిధులను ఈరోజు మంజూరు చేసింది. ఈ నిధుల మంజూరుకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రత్యేక కృషి చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ నూతన కవర్ షెడ్ నిర్మాణం ద్వారా రైతులకు వర్షాలు, ఎండల సమయంలో కూడా మద్దతు ధరపై ధాన్యం అమ్మే అవకాశాలు మెరుగవుతాయని మార్కెట్ యార్డ్ సిబ్బంది తెలిపారు. మార్కెట్ యార్డ్ పరిధిలో వృద్ధి చెందుతున్న వ్యవసాయ లావాదేవీలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణం కీలకంగా మారనుంది.
ఈ సందర్భంగా AMC చైర్ పర్సన్ తంగేళ్ల జ్యోతి అల్వాల్, కార్యవర్గం సభ్యులు,రైతులు, మార్కెట్ యార్డ్ ఉద్యోగులు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version