కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ శాఖ లసమావేశం….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం నర్సింహులపల్లి. మల్లాపూర్ గ్రామంలో. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ శాఖల పార్టీల సమావేశం ఏర్పాటు చేస్తూ ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలు గురించి అవగాహన కల్పిస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన స్థానిక అభ్యర్థులని గెలిపించుకోవాలని ప్రచారం చేస్తూ ప్రభుత్వం వచ్చిన 18 నెలల లోపే. ప్రభుత్వం ఇచ్చిన ఆర్ గ్యారంటీలే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి. ఇందులో ఇందిరమ్మ ఇండ్లు కానీ. సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ. రైతు రుణమాఫీ కానీ. మహిళలకు పావలా వడ్డీ.10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ తో పాటు 18 నెలలలో ప్రభుత్వం చేసిన ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను. అందించారని వివరిస్తూ ప్రజలకు. అవగాహన చేయడం జరిగింది. అందుకే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని. అభివృద్ధిలో ముందు ఉంచుతూ. గత ప్రభుత్వాలు చేసిన అప్పులను తీర్చుకుంటూ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలను అభివృద్ధిలో ముందు ఉంచుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి. జిల్లా కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి. మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ల భరత్ గౌడ్. జిల్లా సీనియర్ నాయకులు ఆఖరి బాలరాజు.మల్లేష్ యాదవ్. ఎడ్ల తిరుపతి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాల ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు